----------------------------------------------

ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------
ఇంగ్లీషు నేర్చుకోవడానికి- పర్ఫెక్టుగా లేదా బాగా మాట్లాడడానికి ఎన్ని రోజులు పడుతుంది?

ఇందుకోసం ఏ ప్రయత్నం బెటర్?  ఎంత కాలం పడుతుంది?

ఈ విషయంలో పిల్లలకు పెద్దలకు నేర్చుకోవడానికి తేడా ఏమిటి?

ఇది నా కోసం అడిగినది. నాలాగే ఇతరులకూ ఉపయోగపడుతుంది.

 కనుక ఈ విషయంలో మీ అనుభవాలు మరియు తెలిసిన వివరాలు తెలుపగలరు.

ఈ విషయం గురించి తెలిసినవారు వివరాలు తెలుపాలని విజ్ఞప్తి.


Reactions:

Post a Comment

 1. ఇంగ్లిష్ నేర్చుకోవాలంటే వ్యాకరణం & ఫొనాలజీ నేర్చుకోవడం ముఖ్యం. అప్పుడప్పుడూ లైబ్రరీకి వెళ్ళి ఇంగ్లిష్ కథలు చదువుతూ, అందులో ఉపయోగించిన syntax (వాక్య నిర్మాణం)ని గమనిస్తూ ఉండాలి. ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందనేది మన ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది కానీ ఇంత సమయం పడుతుందని ఖచ్చితంగా చెప్పలేము.

  ReplyDelete
 2. కొండలరావుగారూ, మాకు ఆరవతరగతిలో ఇంగ్లీషు బోధనాంశంగా మొదలయ్యింది. ఎనిమిదవ తరగతి లోనికి వచ్చేసరికి ఇంగ్లీషులో వాక్యనిర్మాణం తగినంతగా పట్టుబడింది. అప్పటికే నాకు తెలుగుభాషపైన మంచి పట్టు రావటం కారణంగా ఆంగ్లం త్వరగా అబ్బింది. వ్యాకరణం అనేది చాలా పొడిగా నిస్సారంగా అనిపించే సంగతి. కాబట్టి వ్యాకరణం వెంటబడితే భాషపైన పట్టు రాదు. భాషపైన తగినంత పట్టు దొరికిన పిదపనే వ్యాకరణం దానిని మనం నిర్ధుష్టంగా ప్రయోగించేందుకు సహయం చేస్తుంది. ఏ భాషలోనైనా వ్రాయసభాషా సంభాషణాభాషల మధ్య కొద్దో గొప్పో వ్యత్యాసాలుంటాయి. పదిమందిలో సంభాషించటానికి తగిన సహాయం ముఖ్యంగా సంభాషణకు పూనుకోవటమూ, అటువంటి శైలిలో ఉండే నవలలవంతివి చదవటమూ ద్వారా పొందవచ్చును. గ్రంధాలు మనకి నేర్పేది మరింత ఉదాత్తమైనభాష అన్నది నిజమే‌ కాని వాటిపై ఆధారపడి భాషను నేర్చుకోవటం మరింత కష్టం. ఈ రోజుల్లో పత్రికల్లో వచ్చే తెలుగ ఆంగ్లమూ కూడా ఏమంత గొప్పగా లేవు.

  ReplyDelete
 3. Grammar is must to learn English. The sentence "She loves me more than you" can render two different meanings to a native English speaker. "She loves me more than you love me" or "She loves me more than she loves you". Grammar means native-like speaking ability. We must have grammar for intellegible speech.

  ReplyDelete
 4. Granted, Praveen. But do you kindly realize that a grammar book can 'correct' your language, polish your expression, deepen your understanding of the fabric of the language, but it can not certainly make you speak the language. This is true for English or any other language for that matter. The best way to learn a language is to practice speaking in that language.

  ReplyDelete
 5. చాలామందికి తెలుగు వ్యాకరణం తెలీకపోయినా, తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు. అదే అన్ని భాషలకూ వర్తిస్తుంది. వ్యాకరణానికి బోల్డంత ప్రాముఖ్యత ఇవ్వడం పాతపధ్ధతి. ఇప్పుడు విదేశీభాషలు నెర్పేవారు, నేర్చుకొనేవారు అలాచెయ్యడంలేదు. ఒకవేళ చెయ్యాల్సొచ్చినా కొన్ని వాక్యాలను పరిచయంచేసి, ఆవాక్యాల నిర్మాణాన్ని వివరిస్తున్నారేతప్ప, వ్యాకరణ పుస్తకాలు చదవమని చెప్పడంలేదు. వ్యాకరణం ముఖ్యమే కానీ దాన్ని over-stress చెయ్యడం మంచిదికాదు. ఇంగ్లీషులాంటి dynamic భాషవిషయంలో వ్యాకరణపరంగా లిబరల్గా ఉండటం ఉత్తమం.

  నావరకు నేను పుస్తకాలు చదవడంద్వారా ఇంగ్లీషు నేర్చుకున్నాను. నాకు ఇంగ్లీషు గ్రామర్ మీద పట్టులేదు. వ్యాకరణ పరంగా ఒక తప్పు వాక్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, అది తప్పు అని చెప్పగలను, దాన్ని సరిచెయ్యగలను కానీ అలా సరిచెయ్యడానికి ఏ రూల్ వాడానో చెప్పలేను. As long as it falls in line with anyone of the many(probably morethan a billion!) sentences I had encountered in my reading, I would go ahead with the sentence.

  ఇతర భాషలు నేర్చుకోవడం చిన్నపిల్లలకు సులభం. ఎందుకంటే వారికి ఒక వాక్య నిర్మాణం మనసులో fix అయ్యిఉండదు. ఇంగ్లీషులో చాన్నాళ్ళు నలిగినవాళ్ళు తరువాత ఇతరభాషలు నేర్చుకోవడంలో పడేకష్టాలు నాకు నేనురోజూ గమనిస్తుంటాను. ఇంకో ముఖ్యవిషయం మాతృభాష. ఇంగ్లీషు సంగతేమోగానీ మిగిలిన యూరోపియన్ భాషలు నేర్చుకోవడం ఒక్క భారతీయ భాషైనా మాతృభాషగా కలిగినవారికి వారికి చాలా సులభం. నావరకు నాకు ఇంగ్లీషు, తెలుగుకూడా ఒకేలా అనిపిస్తాయి.

  ReplyDelete
  Replies
  1. A native English speaker need not be trained in the grammar of his own language. A native English speaker could easily distinguish "a water rose", "the water rose", "water roses", "the water roses" and "water the roses". But a non-native English speaker must learn grammar to be proficient in English.

   Delete
  2. No sir!

   Even the native English speaker requires some studying in the grammatics for him to be eligible for the consideration of being considered an elegant Englishman.

   I'm sure the similar sentences (that u have exemplified) exist in Telugu. As a rule, many a things are better inferred from the context.

   (pardon my English)

   Delete
  3. In indefinite sense, you should use "a" and not "the". You should say "a native English speaker" if you do not point a specific man.

   Thus, I've detected a grammatical error even in your comment.

   An illiterate in North America could speak English more intelligibly than a professor in India does.

   Delete
 6. తెలుగు నేర్చుకోవడానికి పట్టే సమయానికి రెట్టింపు గానీ రెండురెట్లు గానీ సమయం తీసుకుంటుంది ఇంగ్లీషుభాష . కారణం- తెలుగులో ప్రతిరోజూ వాడే working vocabulary కంటే ఇంగ్లీషులో వాడే working vocabulary మూణ్ణాలుగు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. తెలుగులో అసమాపక క్రియల ద్వారా వ్యక్తీకరించే భావాల్ని ఇంగ్లీషులో కొన్ని రెడీమేడ్ ఫ్రేజుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఉదాహరణకి- "వాడి అర్హతకి మించిన బహుమానం" అనడానికి A reward in excessof his eligibility. ఇక్కడ in excess of అనేది అలాంటి ఫ్రేజు. ఇలాంటి అన్ని (అవసరమైన) రెడీమేడ్ ఫ్రేజులూ నేర్చుకోవడానికే మన టైమంతా సరిపోతుంది. మామూలుగా మాట్లాడే ఇంగ్లీషుకి పెద్దగా శ్రమ ఆవసరం లేదు. కానీ ఇంగ్లీషులో మేధశ్చర్చలకి మాత్రం అది సరిపోదు.

  వివేకానందస్వామి ఒక సందర్భంలో అన్నారు. రెండుభాషలు నేను చిన్నప్పటినుంచీ అభ్యసిస్తున్నాను. ఎంతకాలం అభ్యసించినా వాటిల్లో నిష్ణాతుణ్ణి కాలేకపోతున్నాను. అవేంటంటే ఒకటి సంస్కృతం, రెండోది ఇంగ్లీషు అని! కనుక ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునేవారు అందులో 100% perfection సాధించాలనే ప్రయత్నం మాత్రం చేయకూడదు. నిజానికి అది మాతృభాషగా గలవారికే అందులో perfection లేదు.

  ReplyDelete
  Replies
  1. కానీ ఇంగ్లిష్ వ్యాకరణం నేర్చుకోవడానికి అంత సమయం పట్టదు, తెలుగులో లేని perfect tenses, articles లాంటివి నేర్చుకున్నా సరే.

   Delete
 7. అసలు విషయం రాయలేదు.

  1. మనల్ని ఎగతాళి చేయకుండా తప్పులు సరిదిద్దే సహృదయులతో రోజూ ఇంగ్లీషులో మాట్లాడుతూండాలి.

  2. మన చుట్టూ ఇంగ్లీషు మాతృభాషగా గల సమాజం లేదు గనుక మొదట్లో అనువాద సంభాషణ పద్ధతిని ఆశ్రయిస్తే తప్పులేదు. అంటే మనసులో తెలుగులో అనుకున్నదాన్ని పైకి ఇంగ్లీషులో చెప్పే ప్రయత్నం అన్నమాట. కొంత పట్టు చిక్కిన తరవాత ఈ పద్ధతిని వదిలిపెట్టి నేరుగా ఇంగ్లీషులోనే sentence form చేసుకుని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.

  3. కొంతకాలం పాటు కొంత అన్వేషక దృక్పథం కూడా అవసరం. అంటే మనం తెలుగులో చేసే ఒక్కో భావవ్యక్తీకరణకీ ఇంగ్లీషులో ఏమంటారో అనే కుతూహలం.

  4. రోజూ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో కనీసం రెండు పుటలైనా క్షుణ్ణంగా చదవాలి. బద్ధకం లేకుండా ఒక నోట్ బుక్ దగ్గర పెట్టుకుని తెలీని/ అర్థం కాని పదాల్నీ, ఇడియమ్స్ నీ, ఫ్రేజెస్ నీ నోట్ చేసుకోవాలి.

  5. చరిత్ర, భూగోళం, రాజనీతిశాస్త్రం లాంటి Arts సబ్జెక్టులకి సంబంధించిన పుస్తకాల్నీ, కొన్ని ఆధునిక నవలల్నీ, కథానికా సంపుటాల్నీ, జనరల్ నాలెడ్జి పుస్తకాల్నీ ఒక పట్టుపట్టాలి. రోజుకు 4 పుటలు చదివినా సుదీర్ఘకాలంలో మన భాషాపటిమకి అది చాలా మేలు చేస్తుంది.

  ReplyDelete
  Replies
  1. మహోజస్ గారు చాలా బాగా చెప్పారు. మొదటి మూడు పాయింట్లతో పూర్తిగా ఏకీభవిస్తాను.

   నాలుగో పాయింటుకు కొంత కొనసాగింపు: హిందూ పేపరులో సంపాదికీయం & చదువరుల లేఖలు చదవడం ద్వారా ఆంగ్ల అధ్యయనం చేయవచ్చు.

   అయిదవ పాయింటుకు చిన్న సవరణ/వివరణ: ఎంచుకున్న అంశాలు/పుస్తకాలు మనకు ఆసక్తి ఉన్న విషయాల గురించి అయినట్టయితే మరీ మంచిది. అలాగే మనం ఇప్పటికే తెలుగులో చదివిన అనువాద గ్రంధాన్ని ఈ తడవ ఆంగ్లంలో చదివితే correlation ఏర్పడుతుంది. ఉ. కొండల రావు గారు కమ్యూనిజం గురించి చదివితే వారు పరిభాష చక్కగా పోల్చుకోగోలరు.

   Delete
  2. జై గారి కామెంటుకు అనుబంధంగా కొండలరావు గారికోసం కొన్ని PDF లింకులు క్రింద ఇస్తున్నాను.

   Anna Karenina by Leo Tolstoy
   Mother by Maxim Gorky
   War and Peace by Leo Tolstoy
   Capital by Karl Marx (Vol 1)

   Delete
 8. ఇంగ్లీషు నేర్చుకోవడానికి సలహాలు సూచనలు అందించిన మిత్రులు ప్రవీణ్,శ్యామలీయం,iconoclast,Marripoodi Mahojas,Jai Gottimukkala, శ్రీకాంత్‌చారి గార్లకు ధన్యవాదములు. నేను వ్యక్తిగత పని వల్ల 2 రోజులుగా ప్రజ వైపు చూడనందున ఆలస్యంగా కామెంటు ఉంచుతున్నందుకు అందరికీ సారీ.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top