----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

పొన్నాల, కిషన్‌రెడ్డిలపై టీ. మంత్రి కేటీఆర్ ఫైర్

హైదరాబాద్, ఆగష్టు 13 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఉనికిని కాపాడుకోడానికే టీ. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య లేఖలు రాస్తున్నారని ఆయన ఎదురుదాడికి దిగారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి విభజన చట్టం చదవకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నిర్ణయాలనే బీజేపీ అమలు చేస్తుందని చెబుతున్నప్పుడు ఇక ఎన్డీయే ప్రభుత్వం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు.

బుధవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శరవేగంగా ముందుకు దూసుకుపోతుంటే ఈ రకమైన అవాకులు చెవాకులు పేలడం పొన్నాలకు ఏ రకమైన విజ్ఞత ఉందో ఆలోచించుకోవాలని అన్నారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారంట ఏమని రాస్తారు? హైదరాబాద్‌ను వేరేవాళ్ల చేతిలో పెట్టమని రాస్తారా? అని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీ తప్పు చేసిందని మాట్లాడుతున్నారు, ఆమె తప్పు చేస్తే ఎన్డీయే ప్రభుత్వం సరిచేయాలని చెప్పమనండి అని కేటీఆర్ సూచించారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడకొట్టి తప్పు చేసింది. మళ్ళి రెండు రాష్ట్రాలని కలిపి, ఎన్డియా ప్రభుత్వం తప్పు ని సరి దిద్దాలి

  ReplyDelete
  Replies
  1. నిజమే. ఆ తప్పు వీలైతే సరిదిద్దాలి. అలా కాని పక్షములో, బిల్లు పాసయినప్పుడు అసలు చర్చే జరగకుండా పార్లమెంటు తలుపులు మూసి, ప్రసారాలు ఆపి పాస్ చేశారు. ఒకవేల రెండు రాష్ట్రాలు కలపడం వీలు కాని పక్షములో, బిల్లు రద్దు చేసి .. ఈసారైనా అన్నీ చర్చించి, అందరి ఆమోదం పొందిన తరువాత విభజన చేయాలి.

   Delete
  2. విడగొట్టింది సోనియా ఒక్కతే కాదుగా! బీ.జే.పీ సంపూర్ణ మద్దతుతోనే కదా? అలాంటప్పుడు విభజన అంశం గురించి మాట్లాడాలంటే ఇద్దరి తప్పులు మాట్లాడాలి. తాము చేసిన తప్పుని బీ.జే.పీ వారు ఎలా ఒప్పుకుంటారు. కాంగ్రెస్‌తో కలిపి తప్పు చేశామని అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌ని విడగొట్టామని లెంపలేసుకుని ఆ తప్పు దిద్దుకుని మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ని ఒక్కటిగా చేయాలి. ఆ పని చేసే అవకాశం ఇప్పుడు మోడీకి ఉన్నది. మద్దతు విషయం కూడా సంపూర్ణమే. మరి అంత ధైర్యం బీ.జే.పీ చేస్తుందా? చెయ్యనే చెయ్యదు. ఎందుకంటే బీ.జే.పీ ఎజెండాలలో చిన్న రాష్ట్రాలుండాలి. కేంద్రం బలంగానూ రాష్ట్రాలు బలహీనంగానూ ఉండాలి.

   Delete
  3. @Sri kanth garu, చీకటి బిల్లుని రద్దు చేసి మళ్లీ మంచిగా చర్చించే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం మంచిదే.

   Delete
  4. కొండలరావ్ గారూ,

   అంధ్ర ప్రదేశ్, తెలంగాణా గా విడిపోవడం ఎప్పుడో జరిగిపోయింది. తరువాత పార్లమెంటులో జరిగింది ఒక తప్పని తంతు మాత్రమే. కాబట్టి, నాకు మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలు కలవాలన్న కోరిక లేదు. పైనేదో మాటవరసకు (వాదన కొరకు) అన్నానంతే. కాకపోతే, బిల్లును సమగ్రంగా చర్చించి, అన్నింట్లో ఇరువురికీ వీలైనంత న్యాయం జరిగేలా సవరిస్తే బావుంటుంది. అసలు అదే జరుగుంటే, ఇప్పుడీ వాదులాటలు, గొడవలు ఉండేవి కావు. కానీ, ప్రస్తుత ఇవేవీ జరిగే పనులు కావు.ఇవన్నీ మన ఆశలు మాత్రమే( దురాశ అని కూడా అనొచ్చనుకుంటా :-) )

   ఎదురయ్యే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటూ పోవడమొక్కటే నాకు ప్రస్తుతం ఉత్తమ మార్గంగా కనపడుతోంది. కానీ, ఇరు రాష్ట్రాల నాయకత్వాలు అందుకు సుముఖంగా లేవు. అదే మన దురదృష్టం.

   Delete
  5. ఒకప్పటి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం విడిపోయిందని అనడం సాంకేతికంగా మాత్రమె కరెక్ట్. తెలంగాణా రాష్ట్రం అవతరించింది అనడం సరి అయిన పదప్రయోగం.

   తెలంగాణా అవతరణలో సోనియా, సుష్మా తదితరులు కొంత పాత్ర పోషించారు. వారి పేర్లే తీసుకొని క్రెడిట్/పాపం అంటూ వాదించడం tail wagging the dog లాంటిది. ప్రజల అభీష్టం మేరకే తెలంగాణా ఏర్పడిందనే వాస్తవాన్ని గుర్తించెంత వరకు ఆంధ్రులు ఈ అనవసర స్వయంకృత చక్రవ్యూహం నుండి బయట పడలేరు.

   Delete
 2. అంత ధైర్యం బీ.జే.పీ చేస్తుందా? చెయ్యనే చెయ్యదు. ఎందుకంటే బీ.జే.పీ ఎజెండాలలో చిన్న రాష్ట్రాలుండాలి. కేంద్రం బలంగానూ రాష్ట్రాలు బలహీనంగానూ ఉండాలి.
  కొండల రావు గారు,
  మీరు పదే పదే బిజెపి ని కాంగ్రెస్ తో పోలుస్తూ తప్పుపట్టటం బాగాలేదు. బిజెపి ని మళ్లి విమర్శిస్ద్దాము. వారిని తప్పు పట్టే ముందు, ఏకం కావటానికి తెలంగాణ వారు సిద్దమో కాదో తేల్చుకోండి. ఒకవేళ తెలంగాణ వారు సిద్దమైన ఆంధ్రావారు ఇప్పుడు ఏకం కావటానికి సిద్దం కాకపోవచ్చు కూడాను . ఒక సారి అయిపోయిన దాని గురించి రివర్స్ చేసి పొందేది ఎమి లేదు. ప్రతిరోజు ఒకే అంశం పై అటు ఇటు కొంచెం మార్చి జరిగే చర్చలు ఆసక్తి కోల్పోతాయి.ప్రస్తుతానికి కేంద్రం లో ఏ పార్టి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు, దేశానికి బిజెపినే గతి. ఆ పార్టిని తెలకపల్లి రవి గారిలా 1960 మైండ్ సెట్ తో విమర్సిస్తే ఎవరు వినిపించుకోరు. మీరు నా వ్యఖ్యకి బదులిస్తే తిరిగి బదులివ్వటం సాధ్యపడదు. ఆఫీసులో పని చేస్తూ కామేంట్లను వివరంగా విశదీకరిస్తూ రాయటం అన్నిరోజులు అయ్యేపని కాదు. గమనించ గలరు.

  ReplyDelete
  Replies
  1. ఎవరో బాధపడతారని వాస్తవాలను విమర్శించకుండా ఉండలేము శ్రీరాం గారు. మీకు బీ.జే.పీ అంటే అభిమానం ఉండొచ్చు. ఆ పార్టీ చేసే తప్పులను విమర్శించకుండా ఎలా ఉండగలం?

   ఇప్పటికీ తెలంగాణాలో సమైక్యవాదులు - ఆంధ్రాలో విభజన వాదులూ ఉన్నారు. ఇప్పుడెవరు తేల్చుకున్నా ఉపయోగం లేదు. వాదనలకు మాత్రమే ఇవి పనికి వస్తాయి. అంతక్రితం అన్ని గొంతులూ ఏకమయినందున తెలంగాణా ఇవ్వలేదు. బుడ్డోడిని ప్రధానిని చేద్దామన్న ఓ గారాల తల్లి కోరిక మేరకు తెలంగాణా ఏర్పడింది. తమ చేతికి తుప్పు వదిలిందిలే అని బీ.జే.పీ వారు సహకరించారు. వెంకయ్య - సుష్మాలా ఓవరేక్షన్ సాక్షిగా విభజన భజన ఓ తంతుగా పూర్తయింది. నాకు తెలిసి లగడపాటి రాజగోపాల్ లాంటి ఒకరిద్దరు తప్ప సీ.పీ.ఎం తో సహా అన్ని పార్టీలు విభజనకు సహకరించాయి.

   తెలకపల్లి రవిగారి మైండ్‌సెట్ ఏమిటో నాకర్ధం కాలేదు. నా మైండ్ నాకుంది. దాని ఆలోచన అది చేస్తుంది. మీరు ఒక్క కామెంట్ వ్రాయకపోయినా ఎవరికీ నష్టం ఉండదు. ఎవరికోసమో ఎవరూ అభిప్రాయాలు మార్చుకోరు. మార్చుకోవాల్సిన అవసరమూ లేదు.

   Delete
  2. ఇప్పుడిక ఈ రెండు రాష్ట్రాల్నీ కలపాలనే పేరాసల్ని వొదులుకోండి?!అది కుదిరే పని కాదు.అలాగే తెలంగాణా ప్రజలంతా ముక్తకంఠంతో విభజన కోరుకున్నారనే మూర్ఖపు వాదనలూ చెయ్యొద్దు.మామూలు ప్రజలు యెప్పుడూ వోటర్లుగానే వున్నారు.వోటు వెయ్యడం, ఇంటికి పోవడం, మరుసటి రోజు నుంచి గానుగెద్దు జీవితం గడపటం తప్ప ఇంకేమీ తెలియని కోటాను కోట్ల మందికి అనవసరంగా లేని తెలివి తేటలు ఆపాదించకండి!

   యెక్కదయినా మంచి వాదనా పటిమ వుండి గట్టిగా తమ వాదన వినిపించి యెదటివాళ్ళని మెప్పించ గలిగిన వాళ్ళు మిగిలిన జనాన్ని ప్రభావితం చెయ్యగలరు.వుద్యమాల కయినా ఒక వుద్దేశం కోసం పుట్టిన రాజకీయ పార్టీ లో నైనా వీళ్ళదే హవా!వీళ్లాలో మేధావులూ వుండొచ్చు, మూర్ఖులూ వుండొచ్చు,సజ్జనులూ వుండొచ్చు, దుర్జనులూ వుండొచ్చు.

   కేసీఆర్ మొదటి ప్లాను, ప్రలల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రజల నుంచి విభజనకి విపరీతమయిన మదద్దతు తెచ్చుకుని చూపిద్దామనే. కానీ యెన్నిసార్లు మాటిమాటికీ రాజీనామలతో అస్తమానం వుప యెన్నికలు తీసుకొచ్చినా ప్రజల్లో ఆ వూపు రాలేదు సరి కదా, వుద్యమం బలంగా వుందని అనుకున్నప్పుడే ఆ పార్టీకి ధరావతులు కూడా గల్లంతయినాయి, కనక విభజనకి తెలంగాణా ప్రజలంతా ఆమోదించారనే మాట వొట్టిది.

   సజావయిన పధ్ధతిలో సాధించుకోగలిగిన ధీమాయే వుంటే విలీనం అనే వంకర ప్రతిపాదన యెందుకు చేస్తాడు?వూరికే తెలంగాణా ప్రజలందరూ సమర్ధిస్తున్నారని గొప్పలు పోకండి, ప్రజల్లో చాలా అనుమానాలు వుండటం చేతనే వూహించిన దాని కన్నా సీట్లు బాగా తగ్గి నీరసమయిన ఫలితమే వొచ్చింది.అది వొళ్ళు దగ్గిర పెట్టుకుని ప్రవర్తించమని ప్రజలు చేస్తున్న హెచ్చరిక,తెలుసా?

   కానీ ప్రజలందరూ వొప్పుకోలేదు గదా అని యెంతకాలం సన్నాయి నొక్కులు నొక్కుతాం?కొందరయినా తప్పని సరిగా మాకు వేరే రాష్ట్రం కావా లన్నారు, మిగిలిన వాళ్ళు కనీసం వొద్దు మాకు వేరే రాష్ట్రం అక్కర్లేదని అనలేదుగా!తెలంగాణాలో ఈ రకంగా మాట చెల్లుబడి వున్నవాళ్ళంతా కోరుకున్నారు, సాధించుకున్నారు, ఇంత గొదవ చేసి ఇన్ని దశాబ్దాలు పోరాడి ఇప్పుడు సరదా కయినా సరే మళ్ళీ కలవాలని వాళ్లనుకోరు. అయినా ఇప్పుడు ఆలోచించి చూస్తే జరిగిన విభజన తెలంగాణా కన్నా ఆంధ్రాకే అనుకూలంగా మారింది?! తెలంగానాకి కేవలం తెలంగాణాయే వొచ్చి, ఆంధ్రాకి కంద్రంలో పట్టు వుండటం దగ్గిర్నుంచి సారవంతమయిన భూములూ, అపారమయిన సహజ సంపదలూ, ఇన్నాళ్ళూ పట్టించుకోని రేవు పట్నాలూ వూరిస్తూ కనబడుతున్నాయి, ఆంధ్రావాళ్ళు కూడా కలవదానికి వొప్పుకోరు.

   నాకయితే ఇంకా విభజన బిల్లుని అతిగా పట్టించుకుని వూరేగటం అనవసరం అనిపిస్తున్నది.అసలు ఆఖరి నెల రోజుల్లో మొదలెట్టి విభజనని అంత దరిద్రంగా చేసిన గాంక్రెసు తనే హతమారి పోయినప్పుడు, ఆ బిల్లు లో తప్పులు వున్నాయని అందరూ వొప్పుకుంటున్నప్పుదు మార్చి ఆ తప్ప్పుల్ని సరి చెయ్యవచ్చు.కాంగ్రెసు పరపరా రాసి పారేసింది మార్చదానికి వీల్లేని అపౌరుషేయం లాంటి పవిత్ర గ్రంధమా?!తమ సొంత అస్తిత్వన్ని నిరూపించుకోవాలని కోరుకుని రాష్ట్రం తెచ్చుకున్నవాళ్ళకి అరకొర అధికారాలిచ్చి మూతి కట్టెయ్యదం అన్యాయం, ఆ అన్యాయాన్ని సరి దిద్దాల్సిందే!

   Delete
  3. సూరనేని గారు,

   తెరాస విజయాలు, వోట్ల శాతాన్ని బట్టి తెలంగాణాలోని ప్రత్యెక వాదాన్ని లెక్కించడం సరియైన పధ్ధతి కాదు.

   1. తెలంగాణలో కెసిఆర్ ఒక్కడే కాదు, దాదాపు అన్ని పార్టీలు ప్రత్యేక వాదమే చేశాయి. ఒక పార్టీ మీమీ ఇస్తామంది. ఇంకో పార్టీ గెలిస్తే మేమే ఇస్తామంది. ఇంకోటి మేమే లేఖ ఇచ్చామని చెప్పుకుంది. మరోటి ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి హక్కు వుందని నొక్కి వక్కానించింది. ఇలా ప్రజలను వీలయినంతగా సందిగ్ధతకు గురి జేశాయి.

   2. తెలంగాణలో సమైక్యవాదంతో ఎన్నడూ ఏపార్టీ పోటీ చేయలేదు. చివరికి సిపియం కూడా మా భుజం పై తుప్పకి పెట్టి కాల్చకండి అని ప్రాధేయపడే పరిస్థితి. అటువంటప్పుడు ఎపార్తీకి వచ్చిన వోట్లను సమైక్య వోట్లుగా భావించాలి?

   3. నిజానికి సీమాంధ్రలోనే విభజన వాదులను గెలిపించారు. తెలంగాణా ఇస్తాం, తెస్తాం, లేకుంటే చస్తాం అన్న కాంగ్రెస్ ని 2004లో, 2009లో... లేఖ ఇచ్చాం అని చెప్పుకున్న తెదేపాను 2014లో.

   Delete

 3. *మీరు ఒక్క కామెంట్ వ్రాయకపోయినా ఎవరికీ నష్టం ఉండదు*

  మీరు చెప్పింది నిజమేనండి. మీ ప్రజా బ్లాగు లేకపోయినా, ఇక్కడచర్చలు జరగపోయినా ఎవరికి నష్టం అయితే ఎమి లేదు కదా! మరి మీరెందుకు ఇంత సమయం వెచ్చిస్తున్నట్లో!

  ReplyDelete
  Replies
  1. మీరేకదా నాకు సమయముండదు. నేను బదులిస్త తిరిగి కామెంట్లు వ్రాయనన్నారు. మళ్లీ నన్నడగడం దేనికి? ప్రజ బ్లాగు వల్ల ఏ ఉపయోగం లేదని నేననుకోవడం లేదు. అలా అయితే మీరు వచ్చి చర్చలలో పాల్గొనరు. ఉపయోగం లేదనుకునేవారు దూరంగానే ఉంటారు. నేనెవరినీ కించపరచవద్దంటాను తప్ప విమర్శించవద్దనను. బీ.జే.పీని విమర్శించవద్దనడం నా భావప్రకటనా స్వేచ్చను అడ్డుకోవడమేనని మీరు గుర్తించాలి. నేను విమర్శిస్తే మీరు అభిమానించడం మానుకుంటారా? లేదు కదా? అలాంటప్పుడు నాకు ఎవరితోనో పోలిక అంటగట్టి వ్యాఖ్యానించడం నాకు అభ్యంతరకరమనిపించే మీకలా సమాధానం చెప్పాను.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
 4. మీరేకదా నాకు సమయముండదు. నేను బదులిస్త తిరిగి కామెంట్లు వ్రాయనన్నారు
  అందులో తప్పేమి లేదు. ఇక్కడ జరిగే వివరణలకు ఒక్కొక్కరు ఎంత రాస్తున్నారో చూడండి. మీరు తిరిగి ఒక ప్రశ్న వేస్తే దానిని బట్టి సమాధానం ఇవ్వవలసి వస్తుంది. దానికి సమాధానాలు ఇవ్వటానికి సమయం నాకు నిన్న లేదు. ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వకపోతే వ్యాఖ్యలు చర్చలో పాల్గొనేవారికి, చదివే వారికి వేరే అభిప్రాయం కలుగుతుంది.

  తెలంగాణ విషయం లో అన్ని పార్టిలకి వారి లెక్క వారికుంది. అయితే కాంగ్రెస్ పార్టి నూటికి నూరు శాతం లాభం ఆశించి (ఇస్తే ఎక్కువ యం.పి. సీట్లు గెలుస్తామన్న ఉద్దేశంతో) నిర్ణయం తీసుకొన్నారు. బిజెపి ది పార్టి స్టాండ్ అంతే. వీటి రెండిటి మధ్య ఎంతో తేడా ఉంది. పార్టి మేనిఫెస్టొలో ఎన్నో రాసుకోంటారు. అవన్ని అప్పటికప్పుడు అమలు చేయ్వలసిన అవసం లేదు. పెద్దగా లాభం లేకపోయినా ప్రజల మనో భావాలకనుగుణంగా బిజెపి పార్టి ముందుకెళ్లింది. అధికారంలోకి వస్తే ఈ తలనొప్పి మనకెందుకని కాంగ్రెస్ పార్టి విభజన చేస్తూంటె వంత పలికింది అనటం అవివేకం. ఎన్నో ఏళ్ల నుంచి కొంచెం బలంగా ఉన్న తెలంగాణలో, ఈ నిరణయం వలన బిజెపి భావుకొనిందెంత. ఆ పార్టి బలంగా లేనట్లు కనిపించినా ఆంధ్రలో యంపి సీట్లు గెలుచుకొంది. తెలంగాణ అడుకొని ఉంటే బిజెపి ఆంధ్రలో ఇంకా ఎక్కువ సీట్లు గెలిచినా గెలిచి ఉండవచ్చు. అయినా వారా పని చేయలేదు. పూర్తిస్థాయి లాభం ఆశించి నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ తో సరి సమానంగా బిజెపి ని ప్రస్థావించటం హాస్యాస్పదం.

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయాన్ని నేను తప్పు పట్టాల్సిన పని లేదు. నా అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మీరు ప్రశ్నించకూడదు. మీరనుకున్నంతగా నాకు బీ.జే.పీ పై వ్యతిరేకతలేమీ లేవు. అంత హడావిడిగా ఆగమాగమా బిల్లు పెట్టినప్పుడు దానికి బీ.జే.పీ సహకరించాల్సిన అవసరం లేదు. ఎత్తుగడగానే ఓ తలనెప్పిని కాంగ్రెస్ మెడకే వదిలేలా బీ.జే.పీ పావులు కదిపింది తప్ప బాధ్యతగా వ్యవహరించలేదనేదే నా అభిప్రాయం. ఇది విమర్శే తప్ప బీ.జే.పీ పై కావాలని దుష్ప్రచారం కాదు కదా? బీ.జే.పీ పాత్ర ఉన్న ప్రతి సందర్భంలో నా అభిప్రాయం మేరకు వ్యాఖ్యలొస్తాయే తప్ప కావాలని లెక్కలేసుకుని బీ.జే.పీని విమర్శిస్తున్నాని, విమర్శించాలని నేననుకోవడం లేదు. అంత సీను - అవసరం ప్రజ అనే చిన్న బ్లాగుకు ఉంటుందని నేననుకోను.

   Delete
  2. ఆంధ్రలో బిజెపి పార్టి ప్రభావం పరిమితమైనది. ఆ పార్టికి గురించి మద్దతు గా మాట్లాడిన ఒరిగేది ఎమి ఉండదు. కొన్ని కమ్యునిస్ట్ పార్టిలు కూడా తెలంగాణాకు మద్దతు పలికాయి. కాని రాసేటప్పుడు మీరు బిజెపి, కాంగ్రెస్ రాసి వదిలేస్తారు? కమ్యునిస్ట్ లను ఎందుకు ప్రస్థావించరు? ఎందుకంటే మనలో చాలా మందికి అధీకారం లో ఉన్న,అనుభవించిన పార్టిల మీద ఒకవిధమైన జెలసి. వాళ్లు అహంకారంతో,స్వార్థం తో నిర్ణయాలను తీసుకొంటారనే అనుమానం. కనుక వారినే తప్పూపడతాము. మిగతా వారిని వదిలేస్తాము. అధికార పార్టికి మనమే ఓట్లు వేసి గెలిపించి, అన్యాయం చేసిందని అన్ని సందర్భాలలో అనుకోవటం సరి కాదు. ఒక నిర్ణయం వల్ల కొందరికి లాభం కొందరికి నష్టం కలుగుతూంటయి. విమర్శించే వాళ్లు విమర్శించ వచ్చు. కాని దానికి ఒక లిమిట్ ఉంట్టుంది. నిర్ణయం తీసుకోవటమే తప్పనే అంతవరకు వెళ్లకుడదు కదా! 10సం|| పైగా తెలంగాణ అంశాన్ని నాన్ చారు, దానిని ఎన్నికల ముందు వారి లాభానికైనా నిర్ణయంతీసుకోవటం తప్పు లేదని నా అభిప్రాయం. ఆ విషయం పై తాడో పేడో తేల్చటం మంచిదే. నేను చెప్పదలచుకొంది అధికారం లో ఉన్న పార్టిని మొదటి రోజు నుంచ్డి అనుమానంతో చూడటం తగ్గించాలి. వాళ్లు నిర్ణయాలను 5సంవత్సరాల తరువాత ఎన్నికల ముందు సమీక్షించి నచ్చిన పార్టికి ఓటు వేస్తే సరిపోతుంది.

   Delete
  3. కమ్యూనిస్టులని విమర్శించవద్దని నేనలేదు. బహుశా పాత ప్రశ్నలలో కమ్యూనిస్టులపైనా, కమ్యూనిజం పైనా వచ్చినన్ని విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు మరొకదానిపై రాలేదు. ఇప్పటికీ ఆ తరహా ప్రశ్నలున్నప్పుడు ఆ రకమైన దాడి రెడీగా ఉంటుంది. అందులో సద్విమర్శలుంటాయి. దాడి కూడా ఉంటుంది. అసభ్యంగానో , ఉచిత సలహాలిచ్చేవో తప్ప నేనెప్పుడు ఎవరిని విమర్శించొద్దని చెప్పలేదు. ఆ హక్కు మనకు లేదంటున్నాను. కమ్యూనిస్టులేకాదు పార్లమెంటులో చాలా మిగిలిన పార్టీలున్నాయి. వాటన్నింటినీ ప్రస్తావించడానికి ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్ - బీ.జే.పీ లను ప్రస్థావించడానికీ తేడా ఉంటుంది కదా? మీరు గమనించారో లేదో నేను ఇక్కడ లిస్టులో టీ.ఆర్.ఎస్ ను చేర్చలేదు. ఎందుకంటే మొన్నటిదాకా టీ.ఆర్.ఎస్ ఉద్యమపార్టీ. ఆ పార్టీ ఏకైక లక్ష్యం తెలంగాణా సాధన. కనుక తెలంగాణా సాధన విషయంలో ఆ పార్టీపై విమర్శలు చేసి ప్రయోజనముండదు.

   అధికారంలో ఉన్న వారిని అడుగడుగునా అనుమానించినా తప్పు లేదు. అనవసర రాద్ధాంతం చేస్తే తప్పు. ఇది నా అభిప్రాయం. 5 సంవత్సరాల తరువాత ప్రజా తీర్పు ఎలాగూ ఉంటుంది కదా? ఈ లోగా వారినేమీ ప్రశ్నించకుండా ఉండాల్నా? అలా ఉంటే ప్రభుత్వాలు నియంతృత్వంగా మారిపోవా?

   ఇకపోతే మీరు కామ్యూనిస్టులపై విమర్శలను ప్రశ్నలుగా పంపించండి. ప్రజలో పబ్లిష్ చేయకపోతే అప్పుడు ఆక్షేపించండి తప్ప నాకున్న భావప్రకటనా స్వేచ్చపై అవసరానికిమించిన సూచనలు చేయడం మాత్రం భావ్యం కాదు.

   Delete
  4. కొండల రావు గారు,
   ఎదైనా ఒక పని క్రమం తప్పకుండా చేస్తూంటే ఎన్నో సమస్యలు వస్తాయి. మీరేదో సమాజానికి ఉపయోగపడుతుందని ఆశించి చేసే పనికి వీలైతే ప్రోత్సహిస్తానే గాని,అదే పని గా వారిలో లోపాలు వెతుకుతూ, నిరుత్సాహ పరచే ఉద్దేశం నాకు లేదండి.

   Delete
  5. శ్రీ రాం గారు, నేను మిమ్ములని అర్ధం చేసుకోవడంలోనో, నన్ను మీరు అర్ధం చేసుకోవడం లోనో ఎక్కడో కొద్దిగా మిస్ అండర్శ్టాండింగ్ జరుగుతున్నట్లున్నది. మీరు సమాజానికి ఉపయోగపడే పని అయితే ప్రోత్సహిస్తానన్నందుకు ధన్యవాదాలు. అలాగే చేద్దం సర్.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top