------------------------------------------------
ప్రశ్న పంపినవారు : తిరుపాలు.
------------------------------------------------

Name:Thirupalu 
E-Mail:deleted 
Subject:current affair, politics 
Message:\'\' ఇంటలెక్సువల్‌ పాపర్టీ రైట్స్‌ \'\'

ఈ హక్కులు న్యాయ మైన వేనా? అయితె ఏ విధంగా?
Reactions:

Post a Comment

 1. ఒక వ్యక్తి మేధో సంపద మీద ఆయనకు హక్కులు ఉండడం న్యాయమె కాదు సమాజినికి కూడా అత్యంత కీలకం.

  ReplyDelete
  Replies
  1. మనిషి మెదడుకు ఆలోచించే శక్తి ఉంటుంది. జ్ఞానం అనేది గతకాలపు మానవ సమాజపు కార్యాచరణను బేస్ చేసుకుని చేసే ఆలోచన. కనుక జ్ఞానం అనేదానిలో మొత్తం సమాజం పాత్ర ఉంటుంది. కనుక జ్ఞానం అనేదానికి రైట్స్ ఉండకూడదు. ఆ జ్ఞానంకోసం అతను శ్రమించినదానికి మాత్రం విలువ చెల్లింపు ఉండాలి. ఏదైనా సమాజపరంగా ఉండాలి తప్ప వ్యక్తుల ఆధిపత్యమనేది సమాజంలో అంతరాలు పెంచడానికి దోహదం చేస్తుంది.

   Delete
  2. కొండల రావు గారు,

   విలువను ఏవిధంగా లెక్కగట్ట గలరు?

   Delete
  3. మీరు చెప్పినది నిజమే అనుకుందాం కొండలరావు గారు, కానీ ఒకడు ఒక కూడికను ౧౦ నిమిషాలలో చేస్తాడు ఇంకొకడు ౨ నిమిషాలలో చేస్తాడు అక్కడ ఎలా శ్రమకు విలువ కట్టాలా లేదా కూడిక తొందరగా ముగించి తరువాత పని వేగంగా జరగడానికి సహకరించినందుకు విలువ కట్టాలా?

   Delete
  4. మొత్తం సమాజంలో ఒక కూడిక చేయడానికి సగటు కాలం లెక్కించి ఆ కూడిక చేసినందుకు ఫలితం ఇవ్వవచ్చు. అలా ఎన్ని కూడికలు చేస్తే అంత విలువ లెక్క కట్టవచ్చు. అప్పుడు అతనికి ఎక్కువ విలువే లభిస్తుంది. ఎక్కువ కూడికలు తక్కువ కాలంలో చేస్తాడు కాబట్టి.

   Delete
  5. కొండలరావు గారు,

   ఉదాహరణకు ఒక ఆఫీసులో పది మంది క్లర్కులు వున్నారనుకుందాం. ఆ పదిమందీ రోజుకు ఎనిమిది గంటలు పనిచేసి పద్దు లెక్కలు తేల్చేవారు అనుకుందాం. అందులో ఒకతను క్యాలిక్యులేటరు కనిపెట్టాడు. దానివల్ల క్లర్కులు ఎనిమిది గంటల పనిని ఒకగంటలోనే చేయగలిగారు. అంటే ఆ ఆఫీసులో రోజుకు 7 x 10 = 70 గంటల పని మిగిలింది. అటువంటి క్యాలిక్యులేటర్లు మరిన్ని తయారు చేసి దేశంలోని అన్ని ఆఫీసుల్లోనూ పెట్టారు. ఆ దేశంలో వెయ్యి ఆఫీసులు ఉన్నయనుకుంటే వాటిలో రోజుకు 70 x 1000 = 70000 ల పనిగంటలు తగ్గింది. సంవత్సరానికి 70000 x 365 = 2,55,50,000 అంటే రెండున్నర కోట్ల పనిగంటలు మిగిలింది. ఆ మిగిలిన గంటల బాపతు మనుషులు వేరొక పని చేయడం ద్వారా దేశానికి వేరొక అదనపు ఉత్పత్తిని అందివ్వ గలిగారు.

   ఇప్పుడు లెక్క వేసి చెప్పండి. పై ఉదాహరణలో క్యాలిక్యులేటరు కనిపెట్టి దీనంతకీ కారణమైనవాడికి ఎంత మొత్తం చెల్లించ వచ్చంటారు?

   Delete
  6. శ్రీకాంత్ చారి గారు, ఒక్క కేలుక్యులేటరే కాదు. ఏ వైజ్ఞానిక అభివృద్ధి అయినా మీరిచ్చిన వివరణ ప్రకారమే ఉత్పాదకతను పెంచుతుంది. బట్ ఎంత సైన్స్ అభివృద్ధి చెందినా దానికి మానవ శ్రమ తోడవకుండా పని జరుగదు.

   కేలుక్యులేటర్ ని ఒక్క మనిషి కనిపెట్టడం జరుగదు. ఆ ప్రాసెస్ కంటే ముందు లెక్కలు కనిపెట్టారనేది గుర్తించాలి. ఆ లెక్కలను వేళ్లతో , కాగితాలపైనా , ఇతర బండ గుర్తులుతో చేసినవి అన్నీ గమనంలో ఉంచుకోవాలి. వీటన్నింటి ఆధారంగానే కేలుక్యులేటర్ కనిపెట్టడం జరిగింది. కేలుక్యులేటర్ని బట్టే కంప్యూటర్ వచ్చింది. ఇలా ఈ ప్రాసే కు అంతు ఉండదు. అలాంటప్పుడు ఆ కేలుక్యులేటర్ కనిపెట్టడానికి ఉన్న చారిత్రక కాలమంతా కలిపి వారందరికీ , ఆ తరువాత కేలుక్యులేటర్ ద్వారా మిగిలిన పనిగంటల ఉత్పత్తిని ఇవ్వాలి. అది సాధ్యమా? కాదు. అలాగే కేలుక్యులేటర్ కనిపెట్టినాయనకే అదంతా ఇవ్వాలా? అదీ సాధ్యం కాదు. ఎందుకంటే అలా అయితే అతనొక్కడే ఆ కేలుక్యులేటర్ని వాడుకోవాలి. అతనికే ఇచ్చేట్లయితే మేమెందుకు పని చేయాలనేది వస్తుంది. అలా అయితే ఆ కేలుక్యులేటర్ ఎందుకు? ఏదైనా సమాజంపరంగానే ఉండాలి తప్ప వ్యక్తిగతంగా కాదు. వ్యక్తి పాత్ర గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. ఉండాలి. ఆ వ్యక్తి శ్రమ కాలాన్ని బట్టి అతనికి ఫలితం ఇవ్వాలి. ప్రతీ వ్యక్తికీ చేతనైన పని - ప్రతీ వ్యక్తికి అవసరమైనంత విశ్రాంతి ఉండాలి. అలాంటి సమాజం ఏర్పడడానికి ఇలాంటి వ్యక్తివాదాన్ని పెంచే సూత్రీకరణలు అడ్డుపడుతుంటాయి. మనసు పొరలను మాయ చేస్తుంటాయి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే మనుషులంతా ఎప్పటికీ ఒక్కటి కాలేరు. నాలెడ్జ్ పరంగా - శక్తి పరంగా . కానీ మనుషులంతా నాలెడ్జ్+ శక్తి మాత్రమే ఆధారం చేసుకుని బ్రతకలేరు. మనుషులు ప్రక్రుతి+ఇతరులపై ఆధారపడి పని చేయాలి. బ్రతకాలి. ఇందులు వ్యక్తి తెలివి అనేది తప్పనిసరిగా ఇమిడి ఉంటుంది. నేను ఉంటుంది. బట్ ఆ నేను మనములో ఒదిగి ఉంటేనే నేను మరింత ఇనుమడిస్తుంది.

   సో మీరు చెప్పిన లెక్క ప్రకారం కేలుక్యులేటర్ కనిపెట్టిన వాడికి సామాజిక సగటు శ్రమకాలం ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. రీసెర్చ్ ఎండ్ డెవలప్మెంటులో ఒక్కోసారి ఫలితం రాకున్నా వారికి ఆ సమయానికి విలువ చెల్లించాల్సిందే. ఎందుకంటే అలా చేయడం వల్ల ఆ ఫలితం రాదు అని తరువాత వారికి తెల్సుతుంది. వారి సమయం వేస్ట్ కాకుండా ఉంటుంది.

   Delete
  7. కొండల రావు గారు,

   మీ సమాధానానికి ధన్యవాదాలు. నిజంగా నాకు సగటు శ్రమ ప్రకారం ఎలా ప్రతిఫలాన్ని గుణించాలో తెలియదు. ఇక్కడికి వచ్చే చాలా మంది ఇతరులకు కూడా తెలియదనే అనుకుంటున్నాను. పై ఉదాహరణలో ఒక్కొక్క సాధారణ క్లర్కు జీతం రూ. 10000లు అయితే, క్యాలికులెటరు కనిపెట్టిన వాడికి ఎంత అదనపు విలువ చెల్లించవచ్చో కూడా దయచేసి వివరించండి.

   Delete
  8. మీరడిగిన ప్రశ్న చాలా లోతైనది మరియు కీలకమైనది. ఇప్పుడున్న వ్యవస్థలో కూడా కనిపెట్టినవాడికంటే పెట్టుబడి పెట్టి రీసెర్చ్ చేయించినవాడికే దాని ఫలితం వస్తుండడం మీకు తెలిసిందే. అలా చూసినప్పుడు కనిపెట్టినవాడికి కాకుండా కనిపెట్టించినవాడికి పేటేంట్ హక్కులు ఇస్తున్నారు. దాని ద్వారా వాడు విపరీత లాభాలు దండుకుంటున్నాడు. కనిపెట్టించేవాడే లేకుంటే కనిపెట్టేవాడి ఆసక్తి అనేది వాడి ఆర్ధిక శక్తిని బట్టి ఉంటుందనేది మీకు తెలుసు. ఇది ఈ వ్యవష్త దౌర్భాగ్యం.

   ఇపుడున్న వ్య్వస్థలో లాభాలు పంచుతున్నప్రకారమైతే మరి కనిపెట్టిన మేధావికే ఆ లాభమంతా ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇవ్వరు. కాకుంటే మిగతా వారితో పోలిస్తే ఎక్కువ మొత్తం జీతాలు లేదా ఇన్సెంటివ్ లు అని ముద్దు ముద్దు పేర్లతో ఇచ్చి లాభాలన్నీ పెట్టుబడిదారులే కొట్టేస్తారు.

   దీనికి పరిష్కారం కేవలం ప్లానుడ్ ఎకానమీ ద్వారా మాత్రమే సాధ్యం. దానిని ఒక్క కామెంట్ లో చెప్పడం నావల్ల కాకపోవచ్చు. కానీ కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను. దేనికైనా ఆధారం భూమి. భూమి ఏ ఒక్కరి సొత్తూ కాదు. భూమిపై జీవరాశులన్నీ బ్రతికే ఏర్పాటు ఉంది. ఏ వస్తువులోనైనా ఉండేవి రెండే రెండు. 1)ప్రక్రుతి పదార్ధం 2) శ్రమ . ప్రక్రుతి పదార్ధము+ శ్రమ = వస్తువు. దీనినెవరూ కాదనలేరు. అయితే ప్రక్రుతిలోని వనరులపై మనిషికి యాజమాన్యం ఉంచడమనేది అసహజమైనది. అదే సందర్భంలో ఎవరి శ్రమకి ఎంత విలువ ఇవ్వాలి? ఏ శ్రమకు ఎక్కువ ఉత్పత్తి వస్తుంది? అనేదీ కీలకమే.

   ఈ లెక్కలు అంటే భూమి మీద మనుషులెందరు? వారికి ఆహారానికి ఎంత భూమిని కేటాయించాలి. ఇతర అవసరాలయిన బట్ట - ఇళ్లు - వాహనాలు మొదలగునై కావాలంటే ఎంత లోహం వెలికి తీయాలి. వ్యాపార పంటలు ఎంత పండించాలి? ఉపాధ్యాయులు ఎంతమంది కావాలి? వైద్యులు ఎందరు కావాలి? రాజ్యం ఉన్నంతవరకూ పోలీసులు - సైన్యం ఎంత కావాలి? దీనిని బట్టి ఎంతమంది ఏయే చదువులు చదవాలి? ఇలాంటివన్నీ ఆయా గణాంకాలా ఆధారంగా ప్రభుత్వమే నిర్వహిస్తే రీసెర్చ్ ఎండ్ డెవలప్మెంట్ కూడా ప్రభుత్వమే నిర్వహించవచ్చు. అప్పుడు ఎవరికి శాస్త్ర రంగంలో ఇంటరెస్ట్ ఉంధో వారిని ఆ రంగంలో చదివించి పని చేయించవచ్చు. ఆయా పని కాలాన్ని బట్టి జీతాలు ఇవ్వ వచ్చు. ఆ పనిలో టేలెంట్ ఎక్కువ ఉన్నవారికి ఇన్సెంటివ్స్ ఇవ్వవచ్చు. అంతే తప్ప ఒకడు కష్టపడితే వారి తరువాత తరాలవారు ఎంత ఎదవలైనా రాయలిటీలు ఇవ్వడం మనిషిని సోమరిపోతును చేయడమే అవుతుంది.

   Delete
 2. @శ్రీకాంత్ చారిAugust 4, 2014 at 5:31 PM గారు, విలువను సామాజిక సగటు శ్రమకాలంతో లెక్క కట్టాలి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top