------------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

(cartoon from andhrajyothy daily)

కాంగ్రెస్ కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత పొందే హోదా లేదంటూ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే మొత్తం సీట్లలో పదిశాతం అంటే కనీసం 55 సీట్లు అవసరం. ఐతే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 44 స్థానాల్లో మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వొచ్చా లేదా అంటూ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరారు. కాంగ్రెస్‌కు ఆ ఛాన్స్‌ లేదని ముకుల్ రోహత్గీ స్పీకర్‌కు స్పష్టం చేసారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సోనియా తరుపు  కాంగ్రెస్ నేతలు ప్రకటించారు .
Reactions:

Post a Comment

 1. లేదు, సాంకేతికంగా అటార్నీ జనరల్ చెప్పింది కరక్టే! వ్యకిగతం గా కూడా నేను యెట్టి పరిస్థితుల్లోను ఆ పార్టీకి ఆ స్థానం దక్కకూడదని బలంగా కోరుకుంటున్నాను!

  ReplyDelete
  Replies
  1. అసలు ప్రతిపక్షమే వద్దా!? కాంగ్రెస్‌కు వదా!? హరి గారు :))

   Delete
  2. అసలు ప్రతిపక్షం లేకపోవదం అంటూ ఉందదు కదా.అధికార పక్షం లో చేరని పార్టీ లన్నీ సాంకేతికం గానే ప్రతిపక్ష పార్తీలు అవుతాయి కదా.గాంక్రెసు తను పరిపాలించిన విధానికి శిక్ష అనుభవిస్తున్నది.అది నాకు మహదానందాన్ని కలగ జేస్తున్నది :-)

   Delete
 2. ఈ విషయంలో రూల్స్ స్పృష్టంగా లేవా?
  ఎందుకింత కన్‌ఫ్యూజన్?

  ReplyDelete
 3. రాజ్యాంగం ప్రకారం పది శాతం కన్నా సీట్లు తక్కువ వస్తే అపోజిషన్ లీడరు పదవి ఇవ్వవలసిన అవసరం అధికార పార్టీకి లేదు. కాని అధికార పార్టీ ఇవ్వదలిస్తే ప్రతిపక్షానికి ఆ పదవి ఇవ్వవచ్చు. అప్పుడు అది అడుక్కునేదే తప్ప కోట్లాది తీసుకో గలిగింది కాదు.

  ఇక్కడ గమనించ వలసినది ఏమంటే కాంగ్రెస్ పార్టీకి ఏక మొత్తంగా పదిశాతం సీట్లు రాకపోయినా ఆ పార్టీ అలయన్సుకి పదిశాతం కన్నా ఎక్కువే సీట్లు వచ్చాయి. అలయన్సులతో అధికార పగ్గాలే చేపడుతున్నపుడు అలయన్సుకు ప్రతిపక్ష పీటం ఎందుకు ఇవ్వకూడదు? అని కాంగ్రెస్ వాదన. దీనిపై కోర్టు తీర్పు చెప్పాల్సి వుందని అనుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. చూద్దాం కోర్టు ఏమి తీర్పు చెపుతుందో?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top