----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

విద్వేషం చాలించి వివేకం చూపాలి!


‘ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయి. వాటి సంగతి చూడాలి. హైదరాబాద్‌లో అరవై వేల వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటి సంగతి తేల్చాలి. భూముల కబ్జా అంతు తేల్చేద్దాం’ వంటి ప్రకటనలతో తనను కేంద్రం కట్టడి చేసే పరిస్థితిని కేసీఆర్‌ కొనితెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణతోపాటు శాంతిభద్రతల వ్యవస్థను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులకు ముఖ్యమంత్రి పరోక్షంగా కారకుడు.

దేశంలోని మూడు రాష్ర్టాలలో నిరంతర విద్యుత్‌ సరఫరాచేసే పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వెంటనే చంద్రబాబు సైలెంట్‌గా రంగంలోకి దిగి కేంద్ర విద్యుత్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌తో మంతనాలు జరిపి ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయించుకున్నారు. వాస్తవానికి ఏపీతో పోల్చితే తెలంగాణలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమి చేయాలి? కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి తెలంగాణను ఎంపిక చేసేలా కృషి చేయాలి కదా!

రాజకీయాలు ఒకప్పుడు విధానాలు, సిద్ధాంతాల ప్రాతిపదికగా నడిచేవి. తర్వాత కొంత కాలానికి సంక్షేమ పథకాల పేరిట రాజకీయ పార్టీలు పోటీపడ్డాయి. ఇటీవలి కాలంలో ఉచిత పథకాలు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు తెలుగునాట ఉచితాలు కూడా కాదని సెంటిమెంట్‌ పేరిట రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పట్లో అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం సుసాధ్యం కావడంతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు, విద్యావంతులు ఆనందంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన పోరాటమే కారణమని నమ్ముతున్న ప్రజలు ఆయనను ఆరాధిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుని ఉండకపోతే కేసీఆర్‌ ఎంతకాలం పోరాటం చేసినా తెలంగాణ వచ్చి ఉండేది కాదు. అదిగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ అని కేసీఆర్‌ ఎన్నో డెడ్‌లైన్‌లను ప్రకటించారు. కేంద్రం నుంచి తనకు సంకేతాలు వచ్చాయని చెప్పుకొనేవారు. కానీ ఆయన చెప్పిన గడువుల్లో తెలంగాణ ఏర్పడలేదు. చివరకు కేసీఆర్‌ కూడా ఊహించని విధంగా తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. అయినా తెలంగాణ ఏర్పాటు క్రెడిట్‌ కేసీఆర్‌కు మాత్రమే దక్కింది. ఫలితంగా తాజా ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఆయనకే అధికారం అప్పగించారు. అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఏర్పడింది గానీ, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాత్రం తెలంగాణకు నష్టంచేసే విధంగా ఉంటున్నాయి. సెంటిమెంట్‌ ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ సమాజానికి మేలు చేస్తున్నదా? కీడు చేస్తున్నదా అని విద్యావంతులు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వ నిర్ణయాలను ఆక్షేపించే వారిని తెలంగాణ వ్యతిరేకులుగానో, ‘ఆంధ్రోళ్లు’ అని నిందించో ప్రస్తుతానికి పబ్బం గడుపుకోవచ్చు గానీ దీర్ఘకాలంలో జరిగే నష్టం మాట ఏమిటి? ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల జరుగుతున్న నష్టాన్ని గురించి ప్రజలకు వివరించవలసిన బాధ్యత తెలంగాణ మేధావులపై ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడితే మనల్ని ఏమైనా అనుకుంటారేమో అని బిడియపడటం వల్ల తెలంగాణకు నష్టం చేసినవారవుతారు. తెలంగాణ సాధనలో చేయి చేయి కలిపి ముందుకు నడిచినవాళ్లు, తెలంగాణ అభివృద్ధిలో తమకు కూడా భాగస్వామ్యం ఉందని భావించకుండా మౌనంగా ఉంటే భావి తరాలకు అన్యాయం చేసినవారవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాయలో పడి ఆయన చర్యలన్నింటినీ స్వాగతిస్తున్నవారు వాటివల్ల జరగబోతున్న అనర్థాన్ని గుర్తించకపోవడం విచారకరం. కనీస ప్రజాస్వామిక లక్షణాలను కూడా అలవర్చుకోకుండా అహంకారంగా, నియంత వలె వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ వాస్తవాన్ని తెలంగాణ సమాజం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. సెంటిమెంట్‌ను కవచంగా చేసుకుని మీడియాను, ప్రతిపక్షాలను భయపెట్టి లొంగదీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయ ప్రయోజనం చేకూరవచ్చు గానీ తెలంగాణ సమాజానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ముఖ్యమంత్రి చర్యలను తప్పుబట్టడం అంటే తెలంగాణ సెంటిమెంట్‌ను వ్యతిరేకించడం కాదన్న వాస్తవాన్ని కేసీఆర్‌ అభిమానులు గ్రహించాలి. ఆంధ్ర వ్యతిరేకతను నూరిపోయడం వల్ల విద్వేషాలు పెరుగుతాయే గానీ సమస్యలు పరిష్కారం కావు కదా! ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్‌ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదం కావడానికి కారణం ఏమిటి? వాటివల్ల సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? పెరుగుతున్నాయా? అన్నది తెలంగాణ సమాజం భావోద్వేగాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. విభజన బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు ఆమోదించిన అంశాలను కూడా వివాదాస్పదం చేయడం వల్ల సాధారణ ప్రజలకు చేకూరే ప్రయోజనం ఏమిటన్నది ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న విధంగా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి కేసీఆర్‌కు అయిదేళ్ల పాటు అధికారం అప్పగిస్తే ఆయనేమో అయిదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో కూడా తనకే అధికారం దక్కడం కోసం వ్యూహ రచన చేసుకుంటున్నారు. అయిదేళ్ల తర్వాత మాట దేవుడెరుగు.. ఈ అయిదేళ్లలో జరగబోతున్న నష్టం మాటేమిటి? సెంటిమెంట్‌ ఉందని కేసీఆర్‌ చర్యలను గుడ్డిగా సమర్థించడమా? లేక హేతుబద్ధంగా ఆలోచించడమా? అన్నది తెలంగాణ సమాజం తేల్చుకోవాలి.

చేయాల్సిందేమిటి.. చేస్తున్నదేమిటి?
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహార శైలి తెలంగాణకు మేలు చేస్తున్నదా? కీడు చేస్తున్నదా? పరిశీలిద్దాం. ముందుగా విద్యుత్‌ సమస్యను తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉంటుందని అందరికీ తెలిసిందే! ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్‌ కష్టాల నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి? కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో వ్యవహరించి పనులు చక్కబెట్టుకోవాలి. కానీ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? పొరుగు రాష్ట్రమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందిస్తూ, తెలంగాణలో విద్యుత్‌ కొరతకు ఆయనే కారణమని ప్రజలను నమ్మించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల లాఠీ దెబ్బలు తిన్న రైతులకు కరెంట్‌ వస్తుందా? పీపీఏల ఉపసంహరణకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొదలైన వివాదాన్ని పెంచుకుంటూ పోతున్నారు. విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మెదక్‌ జిల్లా రైతులు రహదారులు దిగ్బంధం చేయడం, దరిమిలా లాఠీచార్జ్‌ జరగడం తెలిసిందే! ఈ సంఘటన జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలనే ఏపీలో విద్యుత్‌ ప్లాంట్‌లను మరమ్మతుల పేరిట మూయించారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. ఈ ఆరోపణ నిజమే అనుకుందాం. తెలంగాణలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలి? ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి ప్లాంట్ల మరమ్మతు పనులను వాయిదా వేసుకోవాలని కోరాలి కదా? తెలంగాణ ప్రభు త్వం నుంచి అటువంటి లేఖ ఏదైనా ఏపీ ప్రభుత్వానికి పంపారా.. లేదే! నిన్నటివరకు కలిసి ఉన్న ఒక ప్రాంతంతో అంత వైరం ఎందుకు? ఏపీలో ఇప్పుడు కరెంట్‌ కోతలు లేవు. తెలంగాణలో కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎగువన వర్షాలు పడి శ్రీశైలం జలాశయానికి నీరు వచ్చి చేరింది కనుక జల విద్యుదుత్పత్తి ప్రారంభమై తెలంగాణలో సమస్య కొంతవరకైనా పరిష్కారం అయింది గానీ, లేని పక్షంలో పరిస్థితి ఏమిటి? ప్రజ లకు ఉపయోగపడే విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారు- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా వ్యవహరిస్తున్నారు? చంద్రబాబు కూడా రాజకీయంగా బలపడ టానికే ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకోసం ఆయన ఎంచు కున్న మార్గం వేరు. కేసీఆర్‌ మాత్రం ప్రజలకు ఉపయోగపడే మార్గాన్ని కాకుండా సెంటిమెంట్‌ను ఎంచుకున్నారు. దేశంలోని మూడు రాష్ర్టాలలో నిరంతర విద్యుత్‌ సరఫరాచేసే పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఆ వెంటనే చంద్రబాబు సైలెంట్‌గా రంగంలోకి దిగి కేంద్ర విద్యుత్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌తో మంతనాలు జరిపి ఆంధ్ర ప్రదేశ్‌ను ఎంపిక చేయించుకున్నారు. వాస్తవానికి ఏపీతో పోల్చితే తెలంగాణలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమి చేయాలి? కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి తెలంగాణను ఎంపిక చేసేలా కృషి చేయాలి కదా! ‘నేను ఏమిటి? ఒకరి దగ్గరకు వెళ్లడం ఏమిటి? కేంద్రాన్ని యాచించడం ఏమిటి? తెలంగాణ అనే స్వతంత్ర రాజ్యానికి నేను రాజుని! ఎవరైనా నా దగ్గరకు రావలసిందే’ అన్న విధంగా కేసీఆర్‌ వ్యవహ రించడం వల్ల నష్టపోతున్నది తెలంగాణ ప్రజలు కాదా? చంద్రబాబును నిందించడం వల్ల విద్యుత్‌ సమస్య పరిష్కారం అవుతుందా? కరెంట్‌ కోసం తెలంగాణ రైతాంగం అల్లాడుతుంటే కేసీఆర్‌ ఒక్కసారైనా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారా? కేంద్ర మంత్రిని కలిసి సహాయం చేయమని కోరారా? లేదే! సమస్య ముదిరినప్పుడల్లా అక్కడ కొంటున్నాం... ఇక్కడ కొంటున్నాం అని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటనలు రావడం మినహా ఫలితం ఉంటోందా? రెండు నెలలకే మమ్మల్ని విమర్శిస్తారా అని అంటున్నారు గానీ, అలా విమర్శించవలసిన పరిస్థితిని ‘కేసీఆర్‌ అండ్‌ కో’నే తెచ్చుకుంటోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు చెప్పారు. తర్వాత అది ఏమైందో తెలియదు గానీ దక్షిణాది గ్రిడ్‌ నుంచి రెండు వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ‘‘ఏ రాష్ట్రం నుంచి కొంటారు? అమ్మడానికి ఎవరి వద్ద మిగులు విద్యుత్‌ ఉంది? అయినా ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి ప్రక టనలు చేస్తున్నారు గానీ దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఏపీతో ఎందుకు గొడవ పడుతున్నారు? నిన్నటివరకు కలిసి పనిచేసిన అధికారులే కదా! పరస్పరం మాట్లాడుకుని ఏపీ నుంచి కొంత విద్యుత్‌ తీసుకోవచ్చు కదా’... అని తెలంగాణకు చెందిన ఒక అధికారిని ప్రశ్నించగా ‘‘ఏమి చెప్పమంటారు? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానిం చారు. ఇంతకీ అసలేం జరుగుతోందంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద జరుగుతున్న సమావేశాలలో పరిస్థితిని వివరించడానికి అధికారులు ఎవరైనా సాహసిస్తే ముఖ్యమంత్రి వారి నోరు మూయిస్తున్నారు. ‘‘నేను చెప్పింది వినండి అంతే’’ అని కేసీఆర్‌ హుంకరిస్తున్నారట! దీంతో వివిధ సమీక్షా సమావేశాలలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులెవ్వరూ నోరు మెదపడం లేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన సీనియర్‌ అధికారులు సైతం కేసీఆర్‌ వ్యవహార శైలితో అవాక్కవుతున్నారు. ప్రభుత్వంలో ఏమి జరుగు తుందో మంత్రులకు తెలియదు. అధికారులకు అంతకంటే తెలి యదు. ఆలోచన వచ్చిందే తడవుగా తన మనసులోని మాటను ప్రకటన రూపంలో కేసీఆర్‌ జారీ చేయిస్తున్నారు. ప్రారంభంలో కేసీఆర్‌ చిత్తశుద్ధిని కొనియాడినవారు సైతం ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రకటనల తీరు చూసి పునరాలోచనలో పడుతున్నారు. ‘‘కరీంనగర్‌ పట్టణాన్ని న్యూయార్క్‌, లండన్‌లా తీర్చిదిద్దుతామని కేసీఆర్‌ చేసిన ప్రకటన విన్న తర్వాత మా ముఖ్యమంత్రిపై ఇంత కాలం ఉన్న నమ్మకం పోతోంది. ఆయన నాన్‌ సీరియస్‌ అన్న భావన కలుగుతోంది’’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వ్యాఖ్యా నించారు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అధికారులకు వాయిస్‌ ఉండేది కాదని సదరుఅధికారి గుర్తుచేశారు.

వరుస దెబ్బలు తగులుతున్నా..
ఆలోచన లేకుండా సెంటిమెంట్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విషయమే తీసుకోండి. చట్టంతో పనిలేదన్నట్టుగా ఆయన వ్యవహరించడంతో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయినా సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేదన్నట్టుగా కేసీఆర్‌ ఇప్పటికీ వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. ఉమ్మడిగానే కౌన్సెలింగ్‌ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఈనెల 11న సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం భీష్మించుకోవడం వల్ల నష్టపోయేది తెలంగాణ విద్యార్థులు కాదా? రేపు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయదని గ్యారంటీ ఉందా? ‘‘తెలంగాణ ప్రభుత్వం మనసులో ఏదో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్టుగా ఉంది’’ అని సుప్రీంకోర్టు మొన్ననే వ్యాఖ్యానించింది. స్థానికత విషయంలో కూడా ముఖ్యమంత్రి వైఖరి అభ్యంతరకరంగానే ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానికతను నిర్ధారించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టంచేసినా కేసీఆర్‌ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. 1956 తర్వాత హైదరాబాద్‌ వచ్చి స్థిరపడిన ఆంధ్రావాళ్లు వెళ్లిపోవాలన్న ఆకాంక్షను తెలంగాణ సమాజంలో కలిగించడంలో కేసీఆర్‌ సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా ఉద్యోగులు ఈ విషయంలో ముఖ్యమంత్రికి మద్దతుగా ఉన్నారు. ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోతే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ‘కేసీఆర్‌ అండ్‌ కో’ ప్రచారం చేయడం వల్ల వాటిని ప్రజలు నమ్ముతున్నారు. అయితే తెలంగాణ విద్యార్థులు ఈ విషయంలో ఆశాభంగం చెందకూడదని ఆశిద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో రిజిష్టర్‌ అయిన వాహనాల నంబర్‌ ప్లేట్లను మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో కూడా వివాదాస్పదమైంది. ‘‘ఏ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నారని’’ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ వేసిన ప్రశ్నకు ప్రభుత్వ న్యాయవాది సమాధానం చెప్పలేకపోయారు. ప్రాథమికంగానే నిర్ణయం తీసుకున్నామనీ, అమలుకు ఒత్తిడి తేవడం లేదని కోర్టుకు సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకూడదని తెలిసి కూడా ఇటువంటి జీవో జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటి? ప్రస్తుతం ఉన్న నంబర్‌ ప్లేట్లను మార్చి ‘టీఎస్‌’ అన్న అక్షరాలు చేర్చడం వల్ల ప్రజలపై అంతో ఇంతో ఆర్థిక భారం పడటమే తప్ప వారి కడుపు నిండుతుందా? అయితే తెలంగాణ రాష్ట్రం అన్న భావన ప్రజల్లో కల్పించి, తెలంగాణ కోసం ముఖ్యమంత్రి ఏదో చేస్తున్నారన్న అభిప్రాయం కలిగించడానికి మాత్రమే ఇటువంటి చర్యలు ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఉభయ రాష్ర్టాల మధ్య నడిచే వాహనాలపై పన్నులు వేయకూడదని గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసినా, ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించాలని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యను కూడా హైకోర్టు తప్పుబట్టి నిలిపి వేసింది. తెలంగాణ సెంటిమెంట్‌ పేరిట ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడటం వల్ల తెలంగాణ సమాజానికి కలిగే మేలు ఏమిటో కేసీఆర్‌ మాత్రమే చెప్పాలి. తెలంగాణలో అంతులేని మిగులు బడ్జెట్‌ ఉందన్న భ్రమలతో, కేంద్రంతో నాకేమిటి సంబంధం అన్న ధోరణిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో మొదలుపెట్టి స్థానికత వరకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంతిమంగా ఆయనతో పాటు తెలంగాణ రాష్ర్టానికి నష్టం చేస్తున్నాయి. విభజన చట్టంతో నిమిత్తం లేకుండా వ్యవహరించడం వల్ల కేంద్ర ప్రభుత్వం కార్యరంగంలోకి దిగింది. ఉభయ రాష్ర్టాలు ఒక అవగాహనకు వచ్చి పంచుకోవలసిన ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సొంతం చేసుకోవడం ఏమిటి? ‘ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయి. వాటి సంగతి చూడాలి. హైదరాబాద్‌లో అరవై వేల వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటి సంగతి తేల్చాలి. భూముల కబ్జా అంతు తేల్చేద్దాం’ వంటి ప్రకటనలతో తనను కేంద్రం కట్టడి చేసే పరిస్థితిని కేసీఆర్‌ కొనితెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణతోపాటు శాంతిభద్రతల వ్యవస్థను గవర్నర్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులకు ముఖ్యమంత్రి పరోక్షంగా కారకుడు. శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్‌ పర్యవేక్షణలో ఉంచాలని విభజన చట్టంలోనే ఉన్నప్పటికీ, కేసీఆర్‌ చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత కట్టడి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శాంతిభద్రతల అంశాన్ని కేంద్రం తీసుకోవడం మామూలుగా అయితే ఆక్షేపణీయమే. అయితే ఈ అంశాన్ని విభజన బిల్లులో పెట్టినప్పుడు సభలోనే ఉన్న కేసీఆర్‌ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయి ఇప్పుడు అన్యాయం, అక్రమం అనడం ఏమిటి? కేంద్రంలో ఏమి జరుగుతున్నదో తెలుసుకునే వ్యవస్థను కూడా కేసీఆర్‌ ఏర్పాటు చేసుకోలేదు. గవర్నర్‌కు శాంతిభద్రతలపై అధికారాలు దఖలు పర్చాలన్న నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరిం చుకున్నట్టు తమకు సమాచారం వచ్చిందని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించిన రెండు రోజులకే కేంద్రం నుంచి ఉత్తర్వులు రావడంతో, తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి నిశ్శబ్దంగా కేంద్రంలో తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. కేంద్రం సహ కారం లేనిదే పూట గడవదని తెలిసినందునే ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును సందర్భం వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేసీఆర్‌ ధోరణి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రధానమంత్రి అంటే నాకో లెక్కా అన్నట్టుగా వ్యవహరిస్తే నష్టం ఎవరికి? నరేంద్ర మోదీ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయనతో గొడవ పెట్టుకోరు. తనను తాను మోనార్క్‌గా భావించే కేసీఆర్‌ మాత్రం కేంద్రంతో సున్నం పెట్టుకుని తెలంగాణ రాష్ర్టానికి కష్టాలు తెచ్చిపెడుతున్నారు. చంద్రబాబును బూచిగా చూపించి తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందవచ్చును గానీ దీర్ఘకాలంలో సమస్యలు పరిష్కారం కాక తెలంగాణ నష్టపోతుంది. అప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటే కేసీఆర్‌ పరిస్థితి ఏమిటి? కరెంట్‌ సమస్యనే తీసుకుందాం. కేంద్రం సహకారం లేకుండా విద్యుత్‌ గండం నుంచి తెలంగాణ రాష్ట్రం గట్టెక్కగలదా? సమస్యలన్నింటికీ కాంగ్రెస్‌- భారతీయ జనతా పార్టీ, చంద్రబాబులే కారణమని ఎంత కాలం నిందించగలరు? ప్రజలు అధికారం ఇచ్చింది సమస్యలు పరిష్కరించడానికే గానీ ఇతరులను నిందిస్తూ కాలక్షేపం చేయ డానికి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వ్యవహార శైలి మార్చు కోని పక్షంలో తెలంగాణ రాష్ట్రం మున్ముందు మరిన్ని కష్టాలను చవిచూడవలసి వస్తుంది. తన చర్యలను ఎత్తిచూపే మీడియా తెలంగాణలో ఉండకూడదన్న ఉద్దేశంతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానెల్‌ను రెండు నెలలుగా తెలంగాణలో నిషేధించడం అంతిమంగా ఎక్కడకు దారితీసింది? ఈ చర్యతో తనకు సంబంధం లేదని కేసీఆర్‌ తెలివిగా చెబుతుండవచ్చు గానీ, కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అంతకంటే తెలివిగా.. ‘‘అయితే మేం తీసుకోబోయే చర్యల వల్ల మీరు (కేసీఆర్‌) బాధపడరని భావిస్తున్నా’’నంటూ వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్‌’, ‘టీవీ 9’ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయించినప్పుడే, ‘అన్యాయాలను సరిదిద్ది న్యాయం చేయడానికి అనేక వ్యవస్థలను ఏర్పాటుచేసుకున్న గొప్ప దేశం మనది’ అని నేను వ్యాఖ్యానించాను. ఇప్పుడు పార్లమెంట్‌ సాక్షిగా దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంఎస్‌ఓలు దోషులుగా నిలబడేలా కేసీఆర్‌ చేశారు. ఈ వాస్తవాన్ని తెలంగాణలోని ఎంఎస్‌ఓలు గ్రహించడం అవసరం. రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారితే అంతిమంగా నష్టపోయేది ఎంఎస్‌ఓలు మాత్రమే! ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజాస్వామిక లక్షణాలు అలవర్చుకుంటారని ఆశిద్దాం. తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతూ ఎంతో కాలం పబ్బం గడపలేరు. ఎన్నికల హామీల అమలుకు ప్రజలు గతంలో వలె ఎంతో కాలం వేచిచూసే పరిస్థితి ఇప్పుడు లేదు. రుణ మాఫీ విషయంలో ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులు తక్షణం అమలుకు చర్యలు తీసుకోని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనల అమలుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలో, ఎక్కడ నుంచి సమకూరుతాయో తెలియదు. ఇదే విషయాన్ని ఆర్థిక శాఖకు చెందిన ఒక అధికారిని ప్రశ్నించగా ‘‘మాకు మాత్రం ఏమి తెలుసు. ఆయన మమ్మల్ని అడిగితే కదా?’’ అని బదులిచ్చారు. తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తే ప్రజలు హర్షిస్తారు గానీ, ఎక్కువ మాట్లాడి తక్కువ చేస్తే అభాసుపాలవడమే మిగులుతుంది. కేసీఆర్‌ ఇప్పటి కైనా అటు కేంద్రంతో ఇటు ఏపీతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ఆపి స్నేహ హస్తం చాచగలిగితే తెలంగాణలో కొన్ని సమస్యలైనా పరిష్కారమవుతాయి. మూడేళ్లలో తెలంగాణలో రైతులకు 24 గంటలపాటు విద్యుత్‌ ఇస్తామంటూ అసాధ్యపు హామీలు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటి? మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు అమలులో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే తెలంగాణకు ఎన్ని వేల మెగావాట్ల విద్యుత్‌ కావాలో ఎవరైనా అంచనా వేశారా? కేవలం సెంటిమెంట్‌ ఆధారంగా ప్రజలను ఎంతో కాలం రంజింపచేయలేరు.. మభ్యపెట్టలేరు. తమ కష్టాలు తీరని పక్షంలో ఇవ్వాళ దేవుడని కీర్తించిన నోళ్లే రేపు దెయ్యమని తిట్టిపోస్తాయి. జరిగిందేదో జరిగింది. ఇకనైనా కేసీఆర్‌ విజ్ఞతతో వ్యవహరించడం ఆయనకే కాదు, తెలంగాణ రాష్ర్టానికి కూడా మంచిది!
(from andhrajyothy daily)

Reactions:

Post a Comment

 1. "తమ కష్టాలు తీరని పక్షంలో ఇవ్వాళ దేవుడని కీర్తించిన నోళ్లే రేపు దెయ్యమని తిట్టిపోస్తాయి"

  శుభం, మీకు కావాల్సింది అదేనేమో వారీ. ఎట్లాగూ రేప్పొద్దున కెసిఆర్ దయ్యమని పబ్లిక్ అంటరు కదా మీరు తొందర పడి ఇయ్యాల్నే లొల్లి చెయ్యడం ఎందుకునుల్లా?

  ReplyDelete
 2. కొండల రావు గారు,

  ఈ పోస్ట్ ను నా మిత్రులు కొందరు పోస్ట్ చేసారు. అందులో ఇద్దరు నన్ను టాగ్ చేసారు, అందులో ఒకాయన నా అభిప్రాయం(?) తెలుపమని రెండో సారి కామెంట్స్ లో టాగ్ చేసాడు. వారి కోసం ఈ కింది అభిప్రాయం రాసాను కాని అక్కడ పోస్ట్ చేస్తే ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని అనిపించలేదు, ఇంతలో మీ టపా చూసి, నేను రాసింది ఇక్కడ పోస్ట్ చేస్తే ఆరోగ్యకరమైన చర్చ జరిగే అవకాశం ఉంది అని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.


  నా అభిప్రాయం.
  ఆర్కే/ఆంధ్ర జ్యోతి వారి పలుకులను సీరియస్ గా తీసుకోవాలంటే నమస్తే తెలంగాణాలో కూడా ఇటువంటివి రోజు వస్తాయి, వాటికి ఉన్న విలువనే వీటికి కూడా ఉంటాయి, అంతకు మించి మరేమీ ఉండదు. వీటిని పట్టించుకుంటే వాటిని కూడా పట్టించుకోవాలి. రెంటి మద్య ఉన్న తేడ ఒక్కటే, నమస్తే వారు ఓపెన్ గా చెప్పేస్తారు, ఈ ఆంధ్ర జ్యోతి లాంటి వారు తెలివిగా బయట పడకుండా చెపుతారు.

  ట్యాంక్‌బండ్‌పై పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయి. వాటి సంగతి చూడాలి. హైదరాబాద్‌లో అరవై వేల వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటి సంగతి తేల్చాలి. భూముల కబ్జా అంతు తేల్చేద్దాం

  చాలా తెలివిగా రెండు వేర్వేరు విషయాలను కలిపెసాడు. హైదరాబాదులో కబ్జా సంగతి తేల్చేస్తాం అంటే కేంద్రమ్ వారికి వచ్చిన కష్టం ఏముంది? సరే, గవర్నర్ కు శాంత్రి భద్రతలు అప్పజెప్పితే తెలంగాణా ప్రభుత్వం చేతిల కబ్జాల నిర్మూలన కార్యక్రమం ఆగిపోతుందా? ఏమిటి సంబంధం?

  ఆ వెంటనే చంద్రబాబు సైలెంట్‌గా రంగంలోకి దిగి కేంద్ర

  ఇది చంద్ర బాబును ప్రమోట్ చెయ్యటానికే తెచ్చిన ప్రస్తావన, అందుకే వ్యాసం లో రెండు మూడు సార్లు ప్రస్తావించాడు. చంద్ర బాబు విజయాలను చెప్పుకోవాలని వారికి అనిపిస్తే ఇద్దరి ముఖ్యమంత్రుల విజయాలను బేరీజు వేసి చూపిస్తే అందరికి ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా? అతి త్వరలో స్వయంగా మిగులు విధ్యుత్ కల రాష్ట్రంగా కాబోయే ఆంధ్ర ప్రదేశ్ ను కేంద్రం ఆ పథకంలో చేర్చితే అదొక పెద్ద విజయం అని నేను అనుకోను. తెలంగాణా లాంటి అధిక విధ్యుత్ లోటు కల రాష్ట్రానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ కల్పించే పథకంలో చోటు దొరకటం చాలా కష్టం. ఎందుకంటే కేంద్ర కూడా రేపు చెప్పుకోవాలిగా ఈ పథకం కింద ఎన్ని రాష్ట్రాలను ఉద్దరించారో అని (తమ ప్రయత్నం పెద్దగా లేకున్ననూ). పథకంలో తెలంగాణా లాంటి అధిక లోటు విధ్యుత్ కల రాష్ట్రాలు ఉంటె ఈ పథకం విజయవంతమ్ చెయ్యటం వారికి కష్టమే కదా?

  వాస్తవానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయం తీసుకుని ఉండకపోతే కేసీఆర్‌ ఎంతకాలం పోరాటం చేసినా తెలంగాణ వచ్చి ఉండేది కాదు.

  ఇక్కడే జనాలకు చిరాకు వేసేది. తెలంగాణా పోరాటం కెసిఆర్ ఒక్కడే చేసాడా? అత్యధిక ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ ఉద్యమం(లేదా తెరాసా) 2009 వరకు ఏ పరిస్తితులలో ఉన్నదో ఎవరికీ తెలియదు? సోనియా గాంధి నిర్ణయం తీసుకోని ఉండక పొతే అనే రాతనే అభ్యంతర కరం. ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రు గారు నిర్ణయం తీసుకోకపోయి ఉంటె వంద మంది పొట్టి శ్రీ రాముళ్ళు ప్రాణ త్యాగం చేసినా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు అంటే ఆయా ప్రాంత ప్రజలకు కోపం రాదా? వారి పోరాటాలను తక్కువ చేసి చూపించటం కాదా? ఏం పత్రిక ఇది? ఇలాగేనా ఒక ప్రపంచ స్థాయిలో వినబడిన ప్రజా ఉద్యమాన్ని ఇలా తక్కువ చేసి రాసేది?

  ప్రజలకు నీతులు చెపుతూ వారిని తక్కువ చేసి చూపించే కొన్ని రాతలు (ఇటువంటి వ్యాఖ్యలే చాలా బ్లాగుల్లో కూడా చూసాను )
  ...ప్రజలకు వివరించవలసిన బాధ్యత తెలంగాణ మేధావులపై ఉంది. (ఇక్కడ ఈయన మాత్రమె మేధావి అయినట్లు_
  .....బిడియపడటం వల్ల తెలంగాణకు నష్టం చేసినవారవుతారు.
  .....మౌనంగా ఉంటే భావి తరాలకు అన్యాయం చేసినవారవుతారు.
  .....కేసీఆర్‌ మాయలో పడి.......
  ........ఈ వాస్తవాన్ని తెలంగాణ సమాజం ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.......
  .......తెలంగాణ సమాజం భావోద్వేగాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం.....
  .........గుడ్డిగా సమర్థించడమా? లేక హేతుబద్ధంగా ఆలోచించడమా? అన్నది తెలంగాణ సమాజం తేల్చుకోవాలి.


  చాలా విచారించ దగ్గ విషయం ,అత్యదికులైనా తెలంగాణా వ్యేతిరేకులు అభిప్రాయం ఏమిటంటే ఎవరైనా ఒకరు తెలంగాణా వాదానికు మద్దతుగా ఉన్నట్లయితే వారు కెసిఆర్ మద్దతుదారు అని. వారి ఉద్దేశం ప్రకారం తెలంగాణాను అభిమానిస్తూ కెసిఆర్ కు వ్యేతిరేకులు అయిన వారు లేరు అని కాబోలు. కెసిఆర్ ఏది చెపితే దాన్ని తెలంగాణా ప్రజలందరూ గుడ్డిగా నమ్మేస్తారు అని వారి నమ్మకం, అలాంటప్పుడు కెసిఆర్ కు కేవలం బోట బోటి మెజారిటి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం ఉండదు

  ReplyDelete
  Replies
  1. ప్రభుత్వ పరిధిలోని మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా వ్యవహరించకూడదని తెలిసి కూడా ఇటువంటి జీవో జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటి?

   దీనికి ఇంత రాద్దాంతం ఎందుకు? ఎవరి స్టేట్ పేరుపై ఆ స్టేట్ వాహనాల గుర్తిపు సంఖ్యా ఉండాలని కోరుకోవటం కూడా తప్పేనా?

   హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో మొదలుపెట్టి స్థానికత వరకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అంతిమంగా ఆయనతో పాటు తెలంగాణ రాష్ర్టానికి నష్టం చేస్తున్నాయి.

   ఇంకో సారి అక్రమ నిర్మాణాల కూల్చివేత ను మరో సమస్యతో కలిపి కుల్చివేతలు తప్పు అనే భావన కల్పించే ప్రయత్నం.

   కేసీఆర్‌ చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వాన్ని మరింత కట్టడి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది

   అంటే వీరే ఒప్పుకుంటున్నారు, విభజన చట్టంలో ఉన్న దాని కంటే "మరింత కట్టడి" చేసే ప్రయత్నం కేంద్ర చేస్తుంది అని. హమ్మయ్య ..... అది ఒప్పుకున్నందుకు సంతోషం.

   అయితే ఈ అంశాన్ని విభజన బిల్లులో పెట్టినప్పుడు సభలోనే ఉన్న కేసీఆర్‌ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయి ఇప్పుడు అన్యాయం, అక్రమం అనడం ఏమిటి?

   ఈయనే చెప్పాడు కదా, విభజన చట్టలో లేనిదానికంటే మరింత కట్టడి చేస్తున్నారు అని, మరి అప్పుడు కూడా అడగోద్దా?

   కేంద్రం సహ కారం లేనిదే పూట గడవదని తెలిసినందునే ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును సందర్భం వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు

   మరి అదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఎలా పూట గడిచింది? అదే పని గతంలో వారు చేసినప్పుడు అది తెలుగు వారి ఆత్మగౌరవం, మరి ఇప్పుడు? బాగుందయ్యా కృష్ణం :)

   నరేంద్ర మోదీ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయనతో గొడవ పెట్టుకోరు.

   మోడీ నైజం అంటే ఏంటి? నియంత అనా? కెసిఆర్ మీద కోపం తో రాష్ట్రాన్ని తోక్కేస్తారానా? అదేంటో క్లియర్ గా చెపితే అప్పుడు మికుండేది. ఇలా చెప్పటం అంటే ఇండైరేక్ట్ గా బెదిరించి తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు లోను చెయ్యటమే. పత్రికలూ చెయ్యాల్సిన పనేనా ఇది?

   కేంద్రం సహకారం లేకుండా విద్యుత్‌ గండం నుంచి తెలంగాణ రాష్ట్రం గట్టెక్కగలదా?

   ఇన్ని రోజులు ఆంధ్ర ప్రదేశ్ ఎలా గట్టెక్కింది మరి?

   రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారితే అంతిమంగా నష్టపోయేది ఎంఎస్‌ఓలు మాత్రమే!

   ఇలాంటి నీతి నేను ఒకటి చెప్పనా ... "రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారితే అంతిమంగా నష్టపోయేది మీడియా సంస్థలు మాత్రమే!"

   ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానెల్‌ను రెండు నెలలుగా తెలంగాణలో నిషేధించడం అంతిమంగా ఎక్కడకు దారితీసింది?

   అదండీ అసలు విషయం. ఇప్పటికి పాయింటుకు వచ్చాడు.
   ఎక్కడికి దారి తీసింది? లోని ఉక్రోషం బయట పెట్టుకోవటానికి ఇలాంటి వ్యాసాలూ రాయటానికి దారి తీసింది, నా లాంటి వాడికి చదువుకొని నవ్వుకోవటానికి పనికొచ్చింది :-))

   ఇంకా రాయాలని ఉంది కాని...... సమాప్తం.

   Delete
  2. ఇంకొకటి మరిచిపోయా

   నరేంద్ర మోదీ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయనతో గొడవ పెట్టుకోరు.

   "కెసిఆర్ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయనతో గొడవ పెట్టుకోరు" అని నేను ఆర్కేగారికి సలహా ఇస్తే ఎలా ఉంటుందంటారు?

   హహ .... ఉచిత సలహాలతో వచ్చిన సమస్యే ఇది, రెండు వైపులా పదునుగా ఉంటుంది !!

   Delete
  3. "నరేంద్ర మోదీ నైజం తెలిసిన వారెవ్వరూ ఆయనతో గొడవ పెట్టుకోరు"

   గల్లీలలో పోరగాండ్లు "మై మరద్ నహీ మేరా భాయి మరద్ హై. ఉస్కే సాత్ నక్కొ లడో" అన్నట్టు ఉంది!

   Delete
  4. "తన చర్యలను ఎత్తిచూపే మీడియా తెలంగాణలో ఉండకూడదన్న ఉద్దేశంతో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ చానెల్ను రెండు నెలలుగా తెలంగాణలో నిషేధించడం అంతిమంగా ఎక్కడకు దారితీసింది? ఈ చర్యతో తనకు సంబంధం లేదని కేసీఆర్ తెలివిగా చెబుతుండవచ్చు గానీ, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అంతకంటే తెలివిగా.. ‘‘అయితే మేం తీసుకోబోయే చర్యల వల్ల మీరు (కేసీఆర్) బాధపడరని భావిస్తున్నా’’నంటూ వ్యాఖ్యానించారు. ‘ఏబీఎన్’, ‘టీవీ 9’ చానెళ్ల ప్రసారాలను నిలిపివేయించినప్పుడే, ‘అన్యాయాలను సరిదిద్ది న్యాయం చేయడానికి అనేక వ్యవస్థలను ఏర్పాటుచేసుకున్న గొప్ప దేశం మనది’ అని నేను వ్యాఖ్యానించాను. ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎంఎస్ఓలు దోషులుగా నిలబడేలా కేసీఆర్ చేశారు. ఈ వాస్తవాన్ని తెలంగాణలోని ఎంఎస్ఓలు గ్రహించడం అవసరం"

   ఎంఎస్ఓలు సంఘం అధినేత కులదీప్ సాహనీ భాజపా నాయకులు. ఆ విషయం పాపం వేమూరి వారికి తెలిసినట్టు లేదు. తెలిసి ఉంటె ఎంచక్కా ఎంఎస్ఓ నాయకుడు కులదీప్ సాహనీ గారి "సైకిల్" గాలి జవదేకర్ లాంటి తన పార్టీ నాయకులతోనే పంక్చర్ చేయించిన కెసిఆర్ కుయుక్తుల గురించి ఇంకెంత రాసేవారే.

   Delete
 3. అన్నిచోట్ల తెలంగాణా మేధావుల స్పందన కనపడుతున్నది. ఆంధ్రా మేధావుల స్పందన ఎక్కడ?

  ReplyDelete
 4. పైన కిరణ్ కుమార్ గారి విశ్లేషణ చూస్తె ఆంధ్ర వ్యతిరేకతను కెసిఆర్ నూరి పోస్తున్నడా, తెలంగాణా వ్యతిరేకతను రాధాకృష్ణ నూరిపోస్తున్నడా అన్న విషయం అర్థమవుతూనే వుంది.

  ఇక పొతే ఒకవైపు తన చానెల్ ను తెలంగాణా మొత్తం ఎమేస్వోలు బాన్ చేసినా, టిఆర్పి రేటింగు పాతాళానికి పడిపోతున్నా, పేపర్ సర్క్యులేషన్ దిగజారుతున్నా కూడా ఇంతటి అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటువంటి నిరాధారిత దాడులకు ఈయన ఎందుకు ఒడిగడుతున్నాడు? అపారమైన నష్టాలను తట్టుకోవడం రాధాకృష్ణకు సాధ్యమేనా? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి చంద్రబాబే నని, పచ్చ డబ్బు బలంతో నాటకాన్ని ఆడిస్తున్నాడని తెలుస్తూనే వుంది.

  నమస్తే తెలంగాణా ఎవరి పేపరో అందరికీ తెలుసు. అందుకే దానిలో వచ్చె వార్తలను ఆ విధంగానే తీసుకుంటారు. కాని నిష్పాక్షికత ముసుగు తొడుక్కున్న ఆంధ్రజ్యోతిలో ఇటువంటి వ్యాసం వచ్చింది కాబట్టి ఇంత చర్చ నడుస్తుంది. ఒక వేళ ఈ పేపరు తెలుగుదేశం ప్రత్యక్షంగా నడిపిస్తున్న పేపరు అయితే దీని గురించి చర్చ జరిగేదే కాదు. అందుకనే రాధాకృష్ణ ముసుగు చంద్రబాబుకు అవసరం. ఆ ముసుగు తీసిన మరుక్షణం ఆ పేపర్ లో వచ్చిన వ్యాఖ్యానాలను ఎవరూ పట్టించుకోరు.

  ఒకప్పుడు కమ్యునిస్టు రష్యా రంగు రంగుల 'సోవియట్ భూమి' పత్రికను కేవలం పావలాకే అమ్మేది. ఎందుకంటే దాని అసలు ఉద్దేశం కమ్యూనిజాన్ని ప్రచారం చేసుకోవడం తప్ప వ్యాపారమో, లాభాలో కాదు. ఆంధ్రజ్యోతి పరిస్థితి కూడా దాదాపు అదే. దాని అసలు ఉద్దేశం చంద్రబాబును ప్రొజెక్ట్ చేయడం, కెసిఆర్ ను తెగనాడడం, వీలయినంత తొందరగా తెలుగుదేశం పార్టీని కుర్చీలో కూర్చోబెట్టడం. అందుకనే ఎన్ని నష్టాలు వచ్చినా దాని పధ్ధతి మారదు.

  కాబట్టి వార్తలు కాకుండా ఇటువంటి పత్రికలో వచ్చిన వ్యాఖ్యానాలపై చర్చ పెట్టడం అనవసరం.

  ReplyDelete
 5. మేధావులకు తెలంగాణా ఆంధ్రా అని తేడా ఏమిటో రాధాకృష్ణ మిడిమిడి జ్ఞానం + అహంకారం కాకుంటే. మేధావి అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి క్షేమం కోరుకునేవాడే అని నా అభిప్రాయం.

  కిరణ్ కుమార్ గారు మీ అభిప్రాయాలు వివరణలు బాగున్నాయి. అందుకే చాలా విషయాలు నేను వ్రాయడం లేదు. విద్యుత్ పీ.పీ.ఏ లపై నేడు ఆంధ్రా సర్కార్ కు మొట్టికాయలు వేసిన వార్త ఆ పేపర్ లోనే చూశాను.

  కే.సీ.ఆర్ హుంకరిస్తే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణా ప్రజలపట్ల బాధ్యత లేదా? తెలంగాణా కే.సీ.ఆర్ అబ్బసొత్తేమీ కాదు కదా? ఇతనికి కే.సీ.ఆర్ పై కోపం ఉంటే డైరెక్టుగా కే.సీ.ఆర్ వెకిలి చేష్టలేమైనా ఉంటే వాటిపై తన అభిప్రాయాలను బాహాటంగా భావ ప్రకటన చేయవచ్చు. తన వెకిలితనాన్ని అతితెలివైన అసలు నైజాన్ని రాధాకృష్ణ బయటపెట్టుకున్నాడు.

  ఆంధ్రజ్యోతి ఎం.డీ కి తెలంగాణా ప్రజలపై లేదా అసలు ప్రజలపై ప్రేమ ఉంటే ఇరు రాష్ట్రాపాలనలో లోపాలపై ఆర్టికల్స్ వ్రాయవచ్చు. ఇతని గోల్ కేంద్రంలో బీ.జే.పీ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం అధికారంలో ఉండడం ఆంధ్రజ్యోతిని అడ్డం పెట్టుకుని తన వ్యాపారాన్ని విస్తరించుకోవడం.

  తెలంగాణాలో విద్యుత్ సమస్యపై రాధాకృష్ణ చెప్పే పరిష్కారం ఏమిటి? ఆంధ్రా సర్కార్ కక్ష సాధింపు లేదా? కే.సీ.ఆర్ పై కోపం ఉంటే లేదా కే.సీ.ఆర్ ని ఎదుర్కోవాలంటే తెలంగాణా ప్రజలపట్ల జాతీయ పార్టీ అని రెండు కళ్లు అని ఇద్దరు బిడ్డలనీ కుళ్లు మాటలు చెప్పే చంద్రబాబు ఏమి చేస్తున్నాడో వ్రాశాడా? అలా చేసి లేదా బాబుతో చేయించి కే.సీ.ఆర్ అహంకారి అయినా బాబు తెలంగాణా కు ఎంత మేలు చేస్తున్నాడో చూశారా? అని ప్రచారం చేసుకోవచ్చుగా? అలా చేసేలా ఆంధ్రా మేధావులకి పిలుపుని ఇవ్వవచ్చుగా? ఇక్కడ నేను ఆంధ్రామేధావులంటూ వాడింది కేవలం రాధాకృష్ణకు సమాధానంగా మాత్రమేనని విజ్ఞప్తి.

  శ్రీకాంత్ చారి గారి పోలిక నాకు అభ్యంతరకరంగా ఉంది. సోవియట్ భూమి పావలాకు అమ్మినా సోవియట్ యూనియన్ అనేక సందర్భాలలో భారత్ కు సహాయం చేసినా దాని గోల్ వేరు. కమ్యూనిజం సిద్ధాంతపరంగా వ్యతిరేకించడం వేరు. వారు వ్యక్తులుగా రాధాకృష్ణలా పెట్టుబడిదారుల పత్రిక కాదు. అదో వ్యవస్థ. ఆంధ్రజ్యోతిలాంతి చీప్‌ట్రిక్స్ కావవి. బహిరంగ వ్యవహారమే. దానిని అంగీకరించాలా? వద్దా? లోపాలు లేవా? అనేది వేరు విషయం. పోలిక బాగాలేదనేది మాత్రమే ఇక్కడ నేను చెప్పదలచుకున్నది.

  తెలంగాణాలో కే.సీ.ఆర్ భజనపరులైనా, ఆంధ్రాలో బాబు భజనపరులైనా ఎవరు ఇలాంటి తెలుగుప్రజలమధ్య విషం నింపే ప్రయత్నం చేసినా మనం చర్చించాలనే అభిప్రాయంతోనే ఇక్కడ ప్రశ్నగా ఉంచాను. నేను చెప్పదలచుకున్న చాలా విషయాలు క్రీణ్‌కుమార్ గారే వ్రాశారు.

  రాధాకృష్ణ వ్యాసం మొత్తం చదివితే అతనేసమస్యకు ఏమి పరిష్కారం చెప్పలేదనీ అక్షరమక్షరం విషం కక్కడానికి, కే.సీ.ఆర్ పై తన కోపాన్ని వెళ్లగక్కడానికీ, చంద్రబాబును ప్రమోట్ చేసుకోవడానికీ తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఇలా నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారికంటే వెకిలిగా అనిపించినా బహిరంగంగా బయటపడే కే.సీ.ఆర్ కొన్ని విషయాలలో బెటర్.

  ReplyDelete
  Replies
  1. కొండలరావు గారు,

   సోవియట్ భూమి పోలిక సరిగా లేదన్న మీ వ్యాఖ్యతో ఏకిభవిస్తున్నాను. సోవియట్ యూనియన్‌లో జరుగుతున్న అభివృద్ధి గురించి మిగతా ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో కూడిన సోవియట్ భూమికి, స్వార్థ చింతనతో, పక్కరాష్ట్రపు నల్ల నిధుల ఊతంతో, పత్రికా స్వేచ్చ ముసుగులో పచ్చ పాత్రికేయం (Yellow Journalism) నెఱపే పత్రికకి ఎలాంటి సారూప్యత లేదు.

   Delete
  2. శ్రీకాంత్ చారి గారు,Thank you.

   Delete
 6. నాకు "అల్పుడెపుడు బల్కు ఆడంబరముగాను" వేమన పద్యం గుర్తొస్తున్నది. వేమన సీమాంధ్రవాడు కనుక అలా అనటం రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణను అణగదొక్కటమూ కావచ్చు. అదాయన ప్రారబ్ధం. ఏదెలా ఉన్నా ఉద్యమం (దాన్ని ఉన్మాదం అనొచ్చు) సందర్భంగా తె.వాదులు పలికిన ఆడంబరాలే తమ మెడకు చుట్టుకుని ఈ రకంగా గింజుకునే పరిస్థితి కల్పించింది.

  కొండలరావు గారూ, మీకో సూటి ప్రశ్న. ఉమ్మడి రాష్ట్ర అప్పులను జనాభా ప్రాతిపదికన పంచినప్పుడు అన్నీ అలానే పంచాలి కదా. విద్యుత్‌కి మాత్రం వినియోగం ప్రాతిపదిక ఏ న్యాయం కింద?!

  ReplyDelete
  Replies
  1. మీరు వేమన గురించి పలికింది అల్పత్వంగానా? ఆడంబరంగానా? ఓసారి చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి. ఇప్పటి సంకుచిత నేతలను విమర్శించడానికి వేమన లాంటి తత్వవేత్తను ఇలా లాగడం బాగాలేదని నా అభిప్రాయం.

   అసలు రాష్ట్ర విభజనే ఓ భజన కార్యక్రమంలా బీ.జే.పీ - కాంగ్రెస్ ల కుమ్మక్కులతో , జగన్ - చంద్రబాబుల కుయుక్తులతో హడావిడిగా అన్యాయంగా జరిగింది. రాష్ట్ర విభజన అనేది సమస్యలకు పరిష్కారం కాదు. అనేక తప్పుల తడకగా ఉన్నదానిలో ఏది న్యాయం? ఏది అన్యాయం అనేది నన్ను సూటిగా అడిగి ఏమి లాభం అచంగ గారు?

   నా సమాధానం అయితే ఒప్పందం జరిగినదానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లఘించందనే. కే.సీ.ఆర్ ని టార్గెట్ చేయలేక అతనిపై వ్యతిరేకత కోసం తెలంగాణాలో విద్యుత్ సమస్యను ఇంకా పెంచాలనేది ఇక్కడ కనిపిస్తున్నది. కే.సీ.ఆర్ కోసం తెలంగాణాను ఇబ్బంది పెట్టడం సరయినదా? కే.సీ.ఆర్ ప్రాధేయపడితేనే నరేంద్రమోడీ తెలంగాణా ప్రజల కరెంట్ కష్టాలు పట్టించుకుంటాడా? లేకుంటే పట్టించుకోడా? రెండు రాష్ట్రాలలో పార్టీ ఉన్నందున చంద్రబాబుకు తెలంగాణా విద్యుత్ సమస్యపై బాధ్యత లేదా?

   నీరు, విద్యుత్, బొగ్గు , గేస్ .... ఇలాంటి వనరులను జాతీయ విధానం ఉండాలి తప్ప ప్రాంతీయ హక్కులు కాదు.

   Delete
  2. కొండలరావు గారూ, మిమ్మల్ని అడక్క మరెవర్ని అడగమన్నారు? ఈ బ్లాగు మీది, నడుపుతున్నది మీరు. మీకో అభిప్రాయం ఉంటుంది కదా. తెలుసుకుందామని. మీకు తెలియయకపోయినా, అసలే అభిప్రాయమూ లేకపోయినా లేదూ మీ అభిప్రాయం చెప్పదలచుకోకపోయినా అది వేరు కథ. మిమ్మల్ని అడగటంలో లాభనష్టాల ప్రసక్తే లేదు. చెప్పదలచుకుంటే అభిప్రాయం చెప్పండి లేదా చెప్పనని చెప్పండి.

   పోతే తెలంగాణ విద్యుత్ సమస్యపై చంద్రబాబుకు బాధ్యత ఉంటే ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్‌కు, ఆంధ్రప్రదేశ్ జనాభాకూ తెలంగాణ విద్యుత్ సమస్యతో ఏం సంబంధం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన విద్యుత్ మీద తొలి హక్కు ఆంధ్రులదే. మిగులు ఉంటేనే ఇచ్చేది. అదికూడా చెప్పిన రేటుకి కొనుక్కుంటేనే!

   నీరు, విద్యుత్, బొగ్గు, గ్యాస్ లాంటికి జాతీయ విధానం ఉండాలంటున్న మీకు 'స్థానికత'పై కూడా ఒక జాతీయ విధానం ఉండాలని ఎప్పుడూ అనిపించలేదా?

   విభజన ఎలా జరిగిందన్నది అప్రస్తుతం. విభజన జరిగిపోయిందన్నది వాస్తవం. ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి తెలంగాణకు ఉండాల్సిన అవసరమేమీ లేదా?

   ఇక్కడ రాధాకృష్ణకి ప్రశ్నించటంలో వ్యక్తిగత ఎజెండా ఉంటే ఉండొచ్చు కానీ అతనడిగిన ప్రశ్నలో విషయం లేదా? అసలిప్పుడు రాధాకృష్ణ తెలంగాణవాడా ఆంధ్రావాడా? ఇదే సమస్య మీకూ వస్తుందనుకుంటా కదా రావు గారూ?

   ఇరవైనాలుగ్గంటలూ బీద అరుపులూ, బెదిరింపూలూ తెలంగాణకు పనికిరావు. ఇచ్చిపుచ్చుకుంటే ఇద్దరికీ సుఖం. లేదంటారా ఒకసారి తెగతెంపులంటూ అయిపోయాక ఇక తెలంగాణ ఎంత గింజుకున్నా ప్రయోజనం శూన్యం!

   Delete
  3. నేను సమాధానం చెప్పాననే అనుకుంటున్నాను అచంగ గారు. మీరు నన్ను అడిగినందుకు కాదు నేనన్నది. విభజనే అన్యాయంగా జరిగిపోయాక ఇప్పుడు నన్నడిగినా, నేను చెప్పినా ప్రయోజనం లేదు. నా సమాధానం కావాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని అన్నింటా ఇచ్చి పుచ్చుకునే ధోరణి రావాలి. బహుశా రెండు రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలోకి వస్తే తప్ప అదీ జాతీయ పార్టీ అయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదేమోననిపిస్తుంది. ఇది కేవలం నా అంచనా మాత్రమే. కొంత కాలమయితే తప్ప పూర్తిగా చెప్పలేము.

   మీరన్నారే విభజన జరిగిపోయిందని. దాని ప్రకారమే విభజన చట్టంలో ఉన్నదాని ప్రకారమే విద్యుత్ పంపకాలు చేయమంటున్నాను. ఆ చట్టంలో లోపాలతో ఇరు ప్రాంతాలకూ నష్టం జరిగేవి ఉంటే ఉదాహరణకు హైదరాబాద్ లో శాంతి భద్రతలు , విద్యుత్ పంపకాలు వంటి వాటిలో లోపాలుంటే ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు కూర్చుంటే మంచిది. కే.సీ.ఆర్ పొగరుగా వ్యవహరిస్తుంటే, బాబు నక్కజిత్తులమారితనంతో వ్యవహరిస్తున్నాడు. కేంద్రం అండ ఉంది కదా అని తెలంగాణాకు అన్యాయం చేయించి ఆ నెపం కే.సీ.ఆర్ మీదకు తోసేస్తే అది అంతిమంగా తెలంగాణా ప్రజలకు నష్టం కలిగిస్తుంది. రాధాకృష్ణలాంటివారు తెలివిగా అవి కనపడకుండా అలా చేయడం గొప్పయినట్లు ఎవడబ్బ సొమ్ము ఎవడికి పెడుతున్నారనో మోడీతో సఖ్యతగా(?) ఉంటేనే పనులవుతాయి లేకుంటే కావన్నట్లు బెదిరింపులు చేయడం గర్హనీయం. ప్రజల శ్రమతోనే ప్రభుత్వాలకు నిధులు వస్తాయి. వాటిని ప్రజా అవసరాలకి వినియోగించడం బుద్ది ఉన్నవాడు చేయాల్సిన పని. ఎవడో బ్రతిమిలాడితే ఇంకెవడో చేయడానికి అది ఎవరి తాత ముత్తాతల సొమ్ము కాదు కదా? అడుక్కోవడానికి అదేమైనా బిచ్చమా? పోరాడి సాధించుకోవడంలో తప్పు లేదు. ఆ విషయంలో కే.సీ.ఆర్ రాజీ పడాల్సిన అవసరం గానీ రాధా కృష్ణ చెప్పినట్లు దేబిరించాల్సిన అవసరం కానేఅ లేదు. ఇప్పుడు ఆయన చెపుతున్న నరెంద్రమోడీ గుజరాత్‌ని కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అభ్వృద్ధి చేశారు కదా? అప్పుడు మోడీ ఎవరిని దేబిరించలేదనే అనుకుంటున్నాను.

   స్థానికత పై జాతీయ విధానం ఉండాలని ఇదే బ్లాగులో నా వాదన వినిపించాను మీరు చూడలేదేమో. కే.సీ.ఆర్ తుగ్లక్ ల వ్యవహరిస్తున్నారని మొదటిగా చెప్పింది నేనే. ఇప్పటికీ ఆ విషయంలో నా అభిప్రాయం అదే.

   రాధాకృష్ణ వ్యక్తిగత ఎజెండాతోనే ఇది వ్రాశాడు. అయితే ఇందులో ప్రజా సమస్యలున్నాయి. కేంద్రం వ్యవహారం ఇమిడి ఉన్నది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వాలు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై అభిప్రాయాలున్నాయి. రాధాకృష్ణ తెలంగాణావాడా? ఆంధ్రావాడా? అనేది కాదు. ఆమాటకొస్తే కే.సీ.ఆరే ఆంధ్రావాడు. ఆంధ్రాపాలకులకు తొత్తుగా వ్యవహరించి బాబు పదవి ఇవ్వకపోవడంతో ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన వల్లించే చిలుకపలుకులు, ఆంధ్రా ప్రాంతానికి వ్యతిరేకంగా తెలంగాణా వారిని రెచ్చగొట్టే పిచ్చి ప్రయత్నాలను కూడా తెలంగాణా ప్రజలు సహిస్తారని అనుకోను. కే.సీ.ఆర్ అయినా, రాధాకృష్ణ అయినా ప్రజలను తక్కువ అంచనా వేయడం తప్పే అవుతుంది.

   ఇచ్చిపుచ్చుకుంటే ఇద్దరికీ సుఖం అనేది వాస్తవం. అయితే ఇచ్చిపుచ్చుకోవడమంటే ఇద్దరూ చేయడం కదా? విద్యుత్ ని ఆంధ్రావారే ఇవ్వాలి కదా? ప్రస్తుతానికి. మరమ్మతుల పేరుతో మాయ చేయకూడదు కదా?

   తెలంగాణా ఎవరిని బెదిరిస్తోంది? బీద అరుపులు కూడా అరవడం లేదు. తెగతెంపులు ఎవరితో ఆంధ్రా ప్రజలతోనా? తెలంగాణా - ఆంధ్రా అంటూ ప్రజలమధ్య చిచ్చుపెట్టేవారితోనా? నాయకులు మరీ దిగజారితే ప్రజలే బుద్ధి చెప్తారు. దానికి కొంత సమయం ఉంటుంది కదా?

   Delete
  4. కొండలరావు గారూ, మీరు చెప్పింది బావుంది. అయితే నాకొకటి అర్థంకాలేదు. కాసేపు విభజన చట్టంలో లోపాలున్నాయి అంటున్నారు. మరికాసేపు లోపాలున్నా సరే ఆంధ్ర ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి అంటున్నారు. లోపాలున్న చట్టాన్ని ఆంధ్ర ఎలా నెత్తికెత్తుకోవాలని ఆశిస్తున్నారో నాకైతే అర్థంకావటం లేదు.

   తెలంగాణ ప్రభుత్వం ఎవరిని బెదిరిస్తోందన్నది పిల్లాడినడిగినా టక్కున సమాధానం చెబుతాడు. మీకు తెలియకపోవటం శోచనీయం. తెగతెంపులు ఎవరితో అంటే తెలంగాణ రాజకీయ నాయకులకు ఆంధ్ర ప్రజలకూ. ఇప్పుడు మా రాష్ట్రం మాకుంది. మా ముఖ్యమంత్రి మాకున్నాడు. మా ముఖ్యమంత్రి తెలంగాణకు ఏం చెయ్యాలో వద్దో నిర్ణయించే అధికారం మాకుంది. మాకు అటు పక్కనున్న తమిళనాడెంతో ఇటు పక్కనున్న తెలంగాణా కూడా అంతే. అటువంటప్పుడు మా రాష్ట్రం తెలంగాణకు విద్యుత్ ఎందుకివ్వాలిట?

   ఆంధ్రా ఇస్తూ ఉంటే తెలంగాణ పుచ్చుకుంటూ ఉంటామనటం కుదరని పని. ప్రతీదానికీ పేచీలు పెట్టుకుంటే నష్టపోయేది తెలంగాణే. ఇప్పటికే కోర్టులు చాలా మొట్టికాయలు వేశాయనుకుంటా తెలంగాణ ప్రభుత్వానికి.

   'వినదగునెవ్వరు చెప్పిన' అని శతకకారుని మాట. రాధాకృష్ణ అర్హతలు, అతని వ్యక్తిగత అభీష్టాలూ గుఱించిన విశ్లేషణలు కేవలం పైసాకి పనికిరావు. ఆంధ్ర వ్యతిరేకతను పక్కనబెట్టి ఇచ్చిపుచ్చుకుంటేనే తెలంగాణకు ఆంధ్రకూ మంచిది. లేదంటారా ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లూ అంతే దూరం. వివాదాస్పదం చెయ్యటమనేది అందరికీ వచ్చు కదా!

   ఇవన్నీ ఒకెత్తు. ఉస్మానియాలో అల్లర్లు జరిగినా, తెలంగాణలో మరెక్క ఏం అల్లరి జరిగినా పోలీసులు అదుపు చేస్తే ఇన్నాళ్ళూ అది ఆంధ్రా దోపిడీదారుల అరాచకం. అదే పని తెలంగాణ ప్రభుత్వం చేస్తే సమ్మగా ఉంది కాబోలు ఈ సో కాల్డ్ తె.వాదులకి! చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత!!

   Delete
  5. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ల ను అవమానిస్తున్నారని వార్తలు చదివాను. అటువంటి సంఘటనలు జరిగే కొద్ది తీవ్రం గా నష్ట్టపోయేది వారే. వైద్యంకోసం హైదరాబద్ కి ఎంతో మంది రోగులు దేశ విదేశాల నుంచి వస్తూంటారు. ఆ స్థాయికి చేరటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. వీరి చీప్ బిహేవియర్ భరించే ఓపిక లేక ఆంధ్రా డాక్టర్లు తట్టా బుట్టా సర్దుకొని హైదరాబద్ వీడితే హైదరాబాద్ ఇమేజ్ కి ఎంతో నష్టం. కార్పోరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి కూడా వలస పోవటం మొదలౌతుంది. ఆంధ్రావారు పోతూ పోతూ ఇతర రాష్ట్రాలకు చెందిన మంచి డాక్టర్లను కూడా వెంట పెట్టుకొని పోతారు. ఎంత పెద్ద ఆసుపత్రి అయినా మంచి డాక్టర్లు లేకపోతే ,ఒకసారి పేరు పోతే సత్రాలు గా మార్చుకోవాల్సిందంతె. ఐదాఆరేళ్ల క్రితం అపోలో ఆసుపత్రి కొన్ని టౌన్ ల లో పెద్ద ఆసుపత్రులు నిర్మించి, మంచి డాక్టర్లు దొరకక మూసుకొంది.

   Delete
  6. అచంగ గారూ!

   విభజన చట్టంలో లోపాలవల్ల 2 రాష్ట్రాలకు నష్టాలున్నాయి. వాటిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకుని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్రం సహకారంతో ముందడుగు వేయవచ్చు. అలా కాని పక్షంలో విభజన బిల్లు ప్రకారం ముందుకుపోవడమే తప్ప ఏమి చేస్తారు? నా ఉద్దేశమర్ధమయిందనుకుంటాను. ఈ విషయంలో కూర్చుని చర్చించే స్తితిలో కే.సీ.ఆర్ లేడు. కే.సీ.ఆర్ అలా ఉంటేనే బాగని బాబు అనుకుంటున్నాడని నా అభిప్రాయం.

   మీరు తెలంగాణా వారు బెదిరిస్తున్నారన్నారు. మరోసారి మీ కామెంటు చూడండి. తెలంగాణావారు అనడానికి ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వం అనడానికి చాలా తేడా ఉంటుంది.

   ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇద్దరికీ అవసరమే. లేకుంటే ఇద్దరికీ నష్టమే. ప్రస్తుత ప్రభుత్వాల అధినేతలకు ఈ రెండు రాష్ట్రాలు శాశ్వత రాజ్యాలేమీ కావు. వారు దారిన పడకుంటే తప్పకుండా ప్రజలే బుద్ధి చెపుతారు.

   పక్క రాష్ట్రమైన తమిళనాడు ఎంతో తెలంగాణా అంతే అనేది మీ వ్యక్తిగత అభిప్రాయమే తప్ప ఆంధ్రాప్రజలందరి అభిప్రాయమని నేననుకోవడంలేదు.

   వినదగునెవ్వరు చెప్పిన తరువాత వినిననంతనే వేగపడక అని ఉందనుకుంటాను. రాధాకృష్ణలాంటివారు చెప్పినవాటిలో మంచిమాటలు ఉంటే , మంచి ఉద్దేశం ఉంటే వినొచ్చు. నాకైతే కాగడా వేసి వెతికినా ఒక్క మంచి మాటా కనపడలేదు.

   సోకాల్డ్ తెవాదులు అంటే? బాబు ఎవరినీ అలా చేయించడా? విద్యుత్ ఉద్యమమప్పుడు ఏమి ఘనకార్యం చేశాడో బషీర్బాగ్నడిగితే చెపుతుంది కదా?

   Delete
  7. కొండల రావు గారూ, చట్టంలో లోపాలు ఉంటె గింటే రాజకీయ నాయకులు దాన్ని చర్చల ద్వారా సవరించలేరు.

   మాకు తెలంగాణా ఎంతో తమిళనాడు అంతే అన్న ఆచంగా గారి వ్యాఖ్య యొక్క స్పూర్తి నాకు చాలా నచ్చింది. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ 28 రాష్ట్రాలు అన్నీ సమానమే. ఇష్యూస్ ఆధారంగానే ఎవరితో ఎ వ్యవహారంలో ఉండాలని నిర్ణయించడం ద్వారానే తమ ప్రజలకు మేలు చేయగలరు.

   తమ రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం *మాత్రమె* పని చేయాల్సిన కర్తవ్యం ప్రతి ప్రభుత్వంపై ఉంది. ఎవరూ ఇతర రాష్ట్రాల ప్రజలకు జవాబ్దారీ కారు. చట్టం ఉల్లంఘించడం & దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం చేయనంత వరకు ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు.

   Delete
  8. పార్లమెంటు సభ్యులు రాజకీయనాయకులేగా జై గారు. పార్లమెంటులో చర్చించాల్సింది వీరే గదా? ఉంటే గింటే కాదు. చాలా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ లో శాంతిభద్రతల విషయం తెలంగాణా ప్రభుత్వం చూసుకోలేదా? ప్రత్యేకంగా గవర్నర్ కు ఎందుకు కట్టబెట్టాలి?

   Delete
  9. ఉ. గవర్నరు ప్రత్యెక బాద్యతలు అంశాన్ని తీసుకుందాం.

   1. ఇది లోపం కాదు, కావాలని పెట్టింది
   2. దీన్ని కెసిఆర్ చంద్రబాబు చర్చించుకొని తొలగించలేరు. అవసరమయితే కోర్టుకు వెళ్ళాలే తప్ప చర్చలు సామరస్యం వగైరాల వల్ల ఏమీ ఒరగదు.

   Delete
 7. మేధావి అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి క్షేమం కోరుకునేవాడే అని నా అభిప్రాయం.

  కొండలరావు గారికి, తమరు మేధావి అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి క్షేమం కోరుకునేవాడే అని చెప్పారు. నేను కొంచెం డిఫర్ అవుతున్నాను.

  కేవలం జ్ఞాని మాత్రమే ప్రజలందరి క్షేమం కోరుకుంటాడు. అసాధారణ తెలివితేటలున్న వ్యక్తులను మాత్రమే మేధావులంటాము. అసాధారణ తెలివితేటలున్నంత మాత్రాన ఆ వ్యక్తిలో సంకుచిత ధోరణులు వుండకూడదనేమీ లేదు. కాబట్టి ఈ సోకాల్డ్ మేధావులు తమ తమ ప్రాంతాలకనుగుణంగా తమ తమ వాదనలను తమ కళ్ళద్దాలలోనుండి చూసి వినిపిస్తుంటారు. అందుకే నేను నాణానికి ఒకవైపు వాదనలే వినిపిస్తున్నాయి, రెండవవైపు వాదనలు కూడా వినిపిస్తే బాగుంటుంది అని భావిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పిన అంశం ఆలోచింపజేసేదిగా ఉన్నది. మేధావి జ్ఞాని ఈ రెండింటి మధ్య తేడాని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.

   Delete
 8. *రాష్ట్ర విభజనే ఓ భజన కార్యక్రమంలా బీ.జే.పీ - కాంగ్రెస్ ల కుమ్మక్కులతో *

  కొండలరావు గారు,

  బిజెపి ని కాంగ్రెస్ తో కలిపి నిందించటం సరి అయిన పద్దతి కాదు. తెలంగాణ ఏర్పాటు వలన బిజెపి కి ప్రత్యేకంగా కలిగిన లాభం ఎమిటి? తెలంగాణ బిల్లును బిజెపి అడ్డుకొంటే ఇదే తెలంగాణా వారు ఆ పార్టిని ఎలా నిందించి ఉండేవారో ఊహించుకోండి. రాజ్యసభలో ఎక్కడ అడ్డుకొంట్టుందో అని ఎంత ఆందోళన చెందారో అప్పుడే మరచిపోయారా? తెలంగాణా లో బిజెపి ఎన్నోళ్ల నుంచి ఉన్నా అది పెద్దగా ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిచింది లేదు. కోస్తాలో బిజెపి పార్టి స్థానికం బలహీనం గా కనిపించినా , కేంద్రం లో బిజెపి అధికారం లోకి వచ్చే అవకాశం ఉన్నపుడు రెండు నుంచి నాలుగు యం.పి.సీట్లు గెలుచుకొంది.

  *ఆంధ్రా మేధావుల స్పందన ఎక్కడ? *

  ఆంధ్రా లో మేధావులు లేరు. వ్యాపారులు, ఉద్యోగస్థులు ఉన్నారు. వీరితో పోటి పడి చరిత్రను తవ్వి తీసి వాదించే సామర్థ్యం వారికి లేదు.వారేప్పుడో చేతులెత్తేశారు.వాదిస్తూ సమయం వృథా చేసుకోవద్దని ఇంతక్రితం మర్రిపూడి మహాజోస్ అనే ఆయన సలహా ఇచ్చరు.కొత్తగా బ్లాగులోకి వచ్చిన వారు వ్యాఖ్యలు రాస్తారంతే. సీనియర్ బ్లాగర్లు ఎవ్వరు తెలంగాణా వారితో తలపడరు. ఇప్పుడు వాదన వన్ సైడే.

  ReplyDelete
  Replies
  1. కాంగ్రెస్‌కి తెలంగాణా ఇవ్వడం ఇష్టంలేని రోజుల్లోనే బిజెపి నాయకులు పార్లమెంత్‌లో తెలంగాణా కోసం మాట్లాడారన్నది నిజం కాదా? నువ్వు తెలుగు దేశం మీద అభిమానంతో బిజెపికి సపోర్త్ ఇస్తున్నట్టు ఉన్నావు?

   Delete
  2. "ఆంధ్రా లో మేధావులు లేరు. వ్యాపారులు, ఉద్యోగస్థులు ఉన్నారు"

   తెలంగాణాలో ఉద్యోగస్తులు వ్యాపారాలు ఉన్నారు అలాగే ఆంధ్రలో మేధావులూ ఉన్నారు. అసలు ఉద్యోగం చేసుకునే వారికి మేదోసంపద ఉండదా?

   "వీరితో పోటి పడి చరిత్రను తవ్వి తీసి వాదించే సామర్థ్యం వారికి లేదు"

   పైపై విషయాలను పెట్టుడు మాటలను ఆధారంగా చేసుకొని నలమోతు చక్రవర్తి లాంటి వాళ్ళు తమ దుష్ప్రచారంతో ఎంత ప్రయత్నించినా తెలంగాణా వచ్చింది. తమ లక్ష్యం విఫలం అయ్యాక సదరు పెద్ద మనుషులు పలాయనం చిత్తగించారు.

   Delete
  3. శ్రీరాం గారు,
   విభజన సమయంలో బీ.జే.పీ ద్వంద్వ వైఖరి అవలంబించింది స్పష్టంగా అందరికీ కనిపించింది. ఎలాగూ అధికారంలోకి వస్తున్నాము కనుక ఆ తలనెప్పి తమకెందుకని కాంగ్రెస్ కే విభజన సమస్య వదిలేద్దామనుకున్నారు కానీ బాబు సపోర్ట్ తప్పనిసరి అనుకుని ఉంటే అప్పట్లో తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటిలాగే ఇప్పుడు తెలంగాణాకు మద్దతు ఇవ్వకుండా ఆపి ఉండేదని నా అభిప్రాయం.

   ఇప్పుడు వాదనా వన్‌సైడ్ మనస్తత్వాలతో జరుగుతున్నాయి. రాధాకృష్ణ వాదన బాబు భజన చేయడమనే వన్‌సైడ్ వైఖరే తప్ప తెలంగాణా ప్రజలను మేల్కోల్పడానికో వారికి మేలు చేయడానికో కాదని తేటతెల్లమవుతూనే ఉన్నది. ఇందులో ఆంధ్రాప్రాంతం వారు వాదించడానికేముంటుంది. వారిని ఎలా తప్పు పడతాం? ఇదంతా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని కే.సీ.ఆర్ ఎం.ఎస్.ఓలతో చెప్పించి తెలంగాణాలో ఆపు చేయించాడనే కోపమే. ఆ విషయంలో కే.సీ.ఆర్ వైఖరిని అప్పట్లోనే ఖండించాం కదా? ఏ విషయాన్నైనా ఆ అంశం వరకే చూస్తే ఆంధ్రా - తెలంగాణా అనే సంకుచితత్వం ఉండదని నా అభిప్రాయం.

   Delete
  4. "ఇప్పుడు తెలంగాణాకు మద్దతు ఇవ్వకుండా ఆపి ఉండేదని నా అభిప్రాయం"

   1. భాజపా ఎప్పటినుండో తెలంగాణకు కట్టుబడి ఉంది. దీన్ని మోడీ కాదనలేడు.
   2. మోడీ ప్రభుత్వానికి సొంత బహుమతి ఉండడమే కాక శివసేన, అకాలీ లాంటి దీర్ఘకాల దీర్ఘ ప్రయోజన మిత్రపార్టీల మద్దతు ఉంది. టీడీపీ లేకపోతె భాజపాకు ఎటువంటి నష్టమూ లేదు.

   "ఆంధ్రజ్యోతిని కే.సీ.ఆర్ ఎం.ఎస్.ఓలతో చెప్పించి తెలంగాణాలో ఆపు చేయించాడనే కోపమే"

   ఇందులో కెసిఆర్ ప్రమేయం ఉందనడం కేవలం ఒక ఊహాగానం. రాధాకృష్ణ "ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా ఫోను చేసి" అంటూ రాసాడు కానీ కనీస ఆధారాలు ఇవ్వలేదు. దీన్ని గుడ్డిగా నమ్మడం సరికాదు.

   Delete
  5. ఎమ్మెస్వోల నిర్ణయం వెనుక కే.సీ.ఆర్ హస్తం లేదనడం, దానిని గుడ్డిగా నమ్మడం అని మీరంటుంటే మాత్రం నవ్వొస్తుంది. ఈ విషయంలో ఇంతకంటే వాదించడం దండుగే. ఎందుకంటే కేవలం ఆధారాలు లేవని కొన్నింటిని నమ్మకుండా ఉండలేము. అటువంటివాటిని ఆధారాలతో చర్చించలేము గనుక. ఆ లెక్కన బాబుని, రాధాకృష్ణ పట్ల చాలామంది చేస్తున్నవి ఆధారాలు లేని విమర్శలే అవుతాయి. నా అభిప్రాయం కే.సీ.ఆర్ ని గుడ్డిగా అభిమానించేవారు తప్ప తెలంగాణాలో ఏ.బీ.ఎన్ ప్రసారాల నిలిపివేత వెనుక కే.సీ.ఆర్ లేడని ఎవరూ అనుకోరు.

   BJP తెలంగాణాకు ఎప్పటినుండో కట్టుబడి ఉందని వారూ చెప్తూనే ఉంటారు. బీ.జే.పీ ఆధ్వర్యంలో మిగతా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణా ఎందుకు రాలేదో మీరే చెప్పాలి మరి.

   Delete
  6. కొండలరావు గారు,

   ఆధారాలు లేకుండా నమ్మడమంటే గుడ్డిగా నమ్మడమే. ఎమ్మెస్వోల వెనుక కెసిఆర్ ఉన్నదన్నది మీ బలమైన విశ్వాసం కావచ్చు. కాని ఆధారాలు చూపనంతవరకు అది కేవలం విశ్వాసం మాత్రమే. సత్యం కాజాలదు. ఆధారం అంటే ప్రత్యక్షం కానక్కర లేదు, తార్కికం కూడా కావచ్చు. కాని మీరు ఏ ఆడ్తారం లేకుండానే ఆ ఆరోపణ చేస్తున్నట్టు కనిపిస్తుంది.

   కేసిఆర్ ఆపాలనుకుంటే అసెంబ్లీలో ప్రస్తావించి ఆ తర్వాత ఆపనవసరం లేదు. ప్రత్యక్షంగా ఏమ్మేస్వోల చేతే ఒక నిరసన ప్రకటన చేయించి ఆపించి ఉండొచ్చు. ఏమ్మేస్వోలు గతంలో ఎన్నో సార్లు ఉద్యమంలో భాగంగా అటువంటి బెదిరింపులు చేసారు కూడా.

   అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ అభిశంసించడం ఏమ్మేస్వోలకు ఒక ప్రేరణ కావచ్చు కదా? ఆ ప్రేరణతో వారే ఆ నిర్ణయం తీసుకున్నారని ఎందుకు అనుకోగూడదు?

   ఒకవేళ రాధాకృష్ణ చెబుతున్నట్టు కెసిఆర్ ఏమ్మేస్వోలని బెదిరించగలిగితే, కేంద్రమంత్రి జవదేకర్ ఇంకా ఎక్కువ బెదిరించ గలడు కదా? మరి వారు ఆయన మాట ఎందుకు వినడం లేదు? విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా ఎందుకు పట్టు విడవడం లేదు?

   Delete
  7. @శ్రీకాంత్ చారి
   ఒక ఛానెల్ను ఆపడం అనేది పత్రికా స్వేచ్ఛను హరించడం అవుతుంది. అది తప్పు. మరి తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటొ కాస్త తెలుపగలరా? కనీసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో, శ్రద్దలో పది శాతమన్నా తీసుకున్నట్టు ఏవన్నా ఆధారాలు చూపించగలరా?

   Delete
  8. కొండలరావు గారూ, నేను అడిగింది ఆధారం (basis), రుజువు (proof) కాదు. ఆధారాలు కొన్నయినా లేకుండా ఎవరయినా ఏదయినా అనడాన్ని ఊహాగానం కాక ఇంకేమంటారో చెబితే విని తరించగలను.

   ఏమఎస్వోల నిర్ణయం వెనుక కెసిఆర్ ప్రమేయం ఉందని భాజపా వాళ్ళు కూడా అనలేదు. కులదీప్ సాహ్నీ ఆ పార్టీ వారే అని గుర్తించుకోండి.

   Delete
  9. బీ.జే.పీ ఆధ్వర్యంలో మిగతా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణా ఎందుకు రాలేదో మీరే చెప్పాలి మరి.

   చంద్ర బాబు ఒప్పుకోనందు వల్లే తెలంగాణా ఇవ్వలేక పోయాం అని బాజాపా వారే (అద్వాని?) చెప్పినట్లు నాకు గుర్తు. అప్పట్లో తెదేపా అవసరం వారికి ఎంతగానో ఉంది. అసలు బాజపానే తెలంగాణకు మొదటి నుండి అనుకూలంగా లేకపోతె కాంగ్రేసు తెలంగాణా అంశాన్ని ఎప్పుడో ఆటకేక్కిచ్చేది అని కూడా అనుకోవచ్చు.

   Delete
  10. ఒక ఛానెల్ను ఆపడం అనేది పత్రికా స్వేచ్ఛను హరించడం అవుతుంది.

   ఆ చానల్ వాళ్ళు హై కోర్టుకు వెళ్ళినట్లు, హై కోర్టు వారి కేసు కొట్టి వేసినట్లు ఒక వార్త చదివినల్టు గుర్తు. సోర్స్ దొరికితే ఇక్కడ మళ్ళి ఇస్తాను. కోర్టు కూడా చానల్ వారి కేసు కొట్టేసింది అంటే ఎస్ఏంవో లను పూర్తిగా తప్పు పట్టలేము. ఈ కేసు విషయంలో కేంద్రం అభిపాయం ఏమిటో ఇంత వరకు నేను చదవలేదు(మిస్ అయి ఉంటాను)

   Delete
  11. ఇదిగోండి ఆ వార్తా విషయమై ఒక విడియో దొరికింది https://www.youtube.com/watch?v=a0Fd3J-9pSg

   ఇలా కోర్టుల వలన పని కాకపోవటంతో రాష్ట్రంలో లాభియింగ్ కు అవకాశం లేకపోవటంతో కేంద్రంలో లాబియింగ్ పై ఆంధ్ర జ్యోతి వారు ఆధారపడినట్లున్నారు. ఎస్ఏంవో వారు చెప్పే లీగల్ విషయాలను బట్టి చూస్తే కేంద్ర కూడా నేరుగా ఏమి చెయ్యలేదేమో అని నాకు అనిపిస్తుంది. మరో దారిలో ఇంకేదైనా చేసే అవకాశం కొట్టి పారేయ్యలేము.

   Delete
  12. ఆధారం అంటే ఒకే ఒక్క విషయం చాలు. కనీసం ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా చోద్యం చూస్తుండడం.

   Delete
 9. అసలు ఉద్యోగం చేసుకునే వారికి మేదోసంపద ఉండదా?
  మేధో సంపద ఉంటే ఉండవచ్చు. కాని వాదించే సమయం ఉండకపోవచ్చు.

  ReplyDelete
 10. @kiran kumar k,

  హైకోర్టు వారు కేసును కొట్టివేసింది టెక్నికలు పాయింట్ల మీద. వారెక్కడా ఇది పత్రికా స్వేచ్ఛకి భంగం కాదు అని చెప్పలేదు. వారు చెప్పింది, రిట్ పిటీషన్లు ప్రైవేటు వ్యక్తుల మీద వేయడం చెల్లదు అనేది మొదటి పాయింటు. సదరు చానల్లకు ఎం.ఎస్.వోలకి మధ్య ఎలాంటి ఒప్పందాలు లేవు అన్నది మరొకటి. ఒప్పందాలు వీటికే కాదు చాలా ఛానల్లకు ఉండవు. అయినా ఈరెండూ టార్గెట్ కాబడ్డాయి.

  ఇక తెలంగాణా ప్రజలను, యాసనూ కించపరిస్తే ఊరుకోమని ఎం.ఎస్.వో ల మాట. తమకు ప్రజల ఆమోదం ఉందన్నది వారి వాదన. నా సలహా ఏమిటంటే, వారికి ప్రజల ఆమోదం నిజంగానే ఉంటే ... అలాంటప్పుడు ఆ ఛానెల్లను ప్రసారం చేయండి. ప్రజల ఆమోదం ఉంది కాబట్టి, ప్రజలు ఆయా ఛానెల్లను చూడడం మానుకుంటారు. అంటే, వాటిని నిషేదించే అవకాశం ప్రజలకే ఇవ్వండి, మీరు (ఎం.ఎస్.వో లు) తీసుకోకండి. అంతే కానీ సెన్సార్ చేయడం ఎందుకు? దానికి తోడు టీ.వీ9 వాడు క్షమాపణలు కూడా చెప్పాడు. కేసుకూడా ఒకటి కోర్టులో నడుస్తోంది. తేలితే దోషులకు శిక్ష కూడా పడుతుంది. అలాంటప్పుడు ఈ సెన్సార్ అనేది ఎంత వరకూ అవసరం? ఆంధ్రజ్యోతి కించపరిచినట్లు నేను వినలేదు. వారు ఒక వార్తను తప్పుగా ప్రచురించారని మాత్రమే చదివాను. దానికి మరుసటి ఎడిషన్లో ... ఆ వార్త తప్పని వివరణతో కూడిన ఆర్టికల్ అనేది సరైన చర్య అవుతుంది. అలాంటి డిమాండు వచ్చి ఉంటే అందరూ దాన్ని ఒప్పుకునేవారు. కానీ పనిలో పనిగా దాన్ని కూడా నిషేదించడం ఎంత వరకూ సబబు?

  ఇంకో విషయం, ఇంత జరుగుతున్నా తెలంగాణా ప్రభుత్వం పెద్దన్న తరహాలో వ్యవహరించారా? పత్రికా స్వేచ్ఛకు విలువ ఇచ్చి, వారు దీనికి ఏదో ఒక రాజీ మార్గాన్ని సూచించారా? ఎం.ఎస్.వోలు ఒప్పుకోవడం, ఒప్పుకోక పోవడం తరువాత, కనీసం ఆ దిశగా ఏవన్నా ప్రయత్నాలు చేశారా? అన్నది నా ప్రశ్న. ఈ ధోరణి అనేక సందేహాలకు తావిస్తోంది. గొట్టిముక్కలగారు, కొండల రావు గారిని "ఏ బేసిస్" మీద మీరు కే.సీ.యార్ ను సందేహిస్తున్నారు అని అడిగారు. నాకైతే, ఈ కారణం చాలు అనిపిస్తోంది.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ గారు,

   ప్రస్తుతం చెప్పుకుంటున్న ఆ ఒక్క సంఘటన మాత్రమె ఈ బహిష్కరణకు కారణం కాదు కదా, దానికి ముందు చాలా చరిత్ర ఉంది. ఉడికి ఉడికి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు పొంగింది.

   ఆర్కే టివి9 ల ఎజెండాలు ఏమిటి, అసలు మొదట వారు అలా ఎందుకు చేసారు, నిజంగా అంతర్ఘతంగా అక్కడ ఏమి జరుగుతున్నది, ఎస్ఏంవోల ఎజెండా ఏమిటి అన్నది మీకు, నాకు, అందరికి తెలిసిందే. కాని బయట ఎవ్వరు ఓపెన్ గా మాట్లాడుకోరు. :-)

   అందుకే ఈ టెక్నికల్ పాయింట్స్. కేంద్ర ప్రభుత్వం చేసిన దానిలో ఇంచు ప్రయత్నం కూడా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చెయ్యదు ఎందుకంటే ఇందులో వేలు పెట్టె వారికి, పెట్టని వారికి ఎవరి లాభాలు వారికి ఉన్నాయి. వేలు పెట్టినంత మాత్రానా బాజాపా ప్రభుత్వం మంచిదైపోదు, వేలు పెట్టనంత మాత్రానా తెరాసా ప్రభుత్వం చెడ్డదై పోదు. ఇదే పరిస్తితి బాజాపా పాలిత లేదా బాజాపా మిత్ర పక్ష పాలిత ప్రాంతంలో జరిగితే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నంత ఉత్సాహం ఉంటుందంటారా?

   ప్రసారం చేస్తే చూడాలో లేదో ప్రజలు నిర్ణయించుకుంటారు అని మిరన్నారు, ఇంకో వార్తలో చదివాను ..... వినియోగ దారులు వద్దన్నారు, అవి రాక పోయినా అడగటం లేదు కాబట్టి మేము ప్రసారం చెయ్యట్లేదు అని ఎస్ఏంవోల నాయకుడు అన్నాడు. ఆంద్రప్రదేశ్ వ్యేతిరేకత మూలంగానే(ఒక వేల అనుకుంటే) వారు ఇలా చేస్తున్నారు అనే వాదనకు బలం లేదు, ప్రస్తుతం వస్తున్న తెలుగు చానల్ లలో ఈ రెండు పోను కూడా సుమారు 70-80% చాన్నాళ్ళ యాజమాన్యం ఆంధ్ర ప్రదేశ్ మూలాలు కలిగిన వారే. ఈనాడుతో సహా అవన్నీ ఏ ఆటంకం లేకుండా ప్రసారం అవుతున్నాయి. మా అనలాగ్ సిస్టం కెపాసిటి సుమారు 108 చానళ్ళు మాత్రమె, ప్రతి ఒక్కరు వారి చానళ్ళు ప్రసారం చెయ్యమని ఒత్తిడి చేస్తే మేము ఏమి చెయ్యలేం అని ఎస్ఏంవోలు అంటున్నారు, అదే నిజమైతే అది సెన్సార్ కిందికి రాదు. ఇలా వినియోగ దారులకు నచ్చని చాన్నాళ్ళ ప్రసారాలు తప్పించటం అనేది గతంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కూడా జరిగింది.

   క్షమాపణ చెప్పిన వారు ఎప్పుడు చెప్పారు? ప్రజాగ్రహం కనబడుతున్నా కొన్ని రోజుల పాటు లెక్క చెయ్యలేదు. కేవలం ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చాకే కేసుల భయానికి వెంటనే క్షమాపణ చెప్పారు, అలాంటి క్షమాపణకు విలువ ఉంటుందా?

   పత్రికా స్వేచ్చ అని ఆ వర్గం మీడియా వారు అంటారు, వినియోగ దారులు ఆ చానల్ వద్దంటున్నారు కాబట్టి ఆ చానల్ స్థానంలో మేము మరొక చానల్ ప్రసారం చేస్తున్నాము, మా కెపాసిటి ఇంతే అని వీరు అంటారు.

   అప్పుడు అలా చేసినందుకు సారి(టివి9) అని వీరు అంటారు, మేము ఇంకో చానల్ ప్రసారంకు మాటిచ్చేసాం, మా కెపాసిటి ఇంతే .... వి ఆర్ హెల్ప్ లెస్, సారి .... అని వీళ్ళు అంటారు.

   మేము తప్పుడు వార్తలు వేస్తె కేసులు వెయ్యండి(జ్యోతి) అని వీరు అంటారు, మీ చానళ్ళను మేము ప్రసారం చెయ్యలేము మీరు కూడా కేసులు వేసుకోండి అని వీళ్ళు అంటారు.

   పత్రిక వారికి స్వేచ్చ ఉన్నట్లే అందరికి స్వేచ్చ ఉండటంలో తప్పేముంది? నొప్పి అనేది పత్రికలకు మాత్రమె ఉండే ఫీలింగ్ కాదు కదా.

   తెగే దాకా లాక్కొచ్చిన వారు అనుభవించాల్సిందే అని నా అభిప్రాయం. అది మీడియా వారు అయినా ఎస్ఏంవోలు అయినా, ఇంకెవరు అయినా. కేంద్రంచే బలవంతం చేసి ప్రసారం చేయిస్తే ఎస్ఏంవోలు అవమానంగా తీసుకోని మరొక దారిలో ప్రయత్నించే అవకాశం ఉంది. ఇదంతా వ్యాపారం కాబట్టి, చనాల్ వారే ఎస్ఏంవోతో చర్చలు చేస్తే ఏమైనా పలితం ఉండొచ్చు.

   ఇప్పటికైనా చానళ్లను పునరుద్దరిస్తే బాగుంటుంది అని కూడా నా అభిప్రాయమే. కాని ఆ చాన్నాళ్ళ నడవడిక మారుతుందని మాత్రం నాకు నమ్మకం లేదు.

   Delete
  2. Sri kanth గారు,

   నాకు తెలిసినంత వారకు పత్రికలకు ప్రత్యేక స్వేచ్చ లేవి లేవు. రాజ్యాంగం ప్రకరం మిగతా అందరికి ఎంత స్వేచ్చ వుంటుందో పత్రికలకీ అంతే స్వేచ్చ వుంటుంది. నిజానికి ప్రజలకు ఉన్న సమాచార హక్కును పత్రికలు తమ "స్వేచ్చ"గా అభివర్ణించుకుంటున్నాయి.

   తమకు గల స్వేచ్చను అతిగా ఊహించుకుని ఒక ప్రాంతపు ప్రజలను, వారి ఉద్యమాలను కించపరుస్తూ, వారి ప్రతినిధులను అపహాస్యం చేస్తూ, లేదా నిరాధారపు నిందలు వేస్తూ తమ రహస్య ఎజెండాలను అమలు పరుస్తున్నపుడు, ఎవరో పెద్దన్న పాత్ర వహించి వారికి లేని అధిక స్వేచ్చను రక్షించవలసిన అగత్యం లేదు. నిజంగా వాటికి అటువంటి స్వేచ్చ గనుక వుంటే ఆ పని కోర్టులే ఈ పాటికి చేసి వుండేవి.

   Delete
  3. శ్రీకాంత్ గారూ, ఆంధ్రలో (నాకు తెలిసి, please correct if it is changed now) తెలంగాణా చాన్నెల్లు ప్రసారం కావు. ఒకప్పుడు వీ6 వచ్చేది కానీ తరువాత మూసేశారు. గతంలో కూడా కులదీప్ సాహ్నీ తెలంగాణాలో సాక్షి మూసేశారు. ఆయన ఇప్పుడు జెమినీ మూస్తామని బహిరంగంగా చెప్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వాలు (కిరణ్/బాబు/కెసిఆర్) జవాబు చెప్పాలా?

   ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించాలంటే కొన్ని షరతులు ఉంటాయి. ఇరుపక్షాలు మాట వినే అవకాశం ఉంటేనే మధ్యవర్తికి విలువ. ఒక పక్షం వాళ్ళు ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నప్పుడు వారు మధ్యవర్తిత్వానికి దిగగలరా?

   కనీసం ఈ చాన్నెల్లు ప్రభుత్వాన్ని తమకు న్యాయం చేయమని అడిగారా లేదే. పైగా విజయమో వీరస్వర్గమో అంటూ బీరాలు పోయారు, కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు, కోర్టులకు వెళ్ళారు. అడిగింది అత్తనయితే అమ్మ అన్నం పెడుతుందా?

   Delete
 11. ఈ చర్చ పక్కదారి పడుతుంది అని నాకు తెలుసు, అందుకే ముందరి నుంచీ వ్రాయలేదు!
  ఇక్కడ రాధాకృష్ణ గారు మరచిపోయిన చాలా విషయాలు చర్చకు వచ్చాయి కానీ రాధాకృష్ణ సామధానం చెప్పలేదు అని వ్రాసారు తప్ప వారి దగ్గర ఏమి సమాధానం ఉంది?
  మనకు తెలియని చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి
  ౧. అసలు నిజానికి ఎవరికీ విద్యుత్తు అవసరం?
  ఈ ప్రశ్న నాకు చాల కాలం నుంచీ ఉంది, నిజానికి అసలు చెట్లు ఉండగా AC లు ఉండాలా?
  ౨. ఉత్పత్తి జరుగుతున్నది ప్రభుత్వాల లాభాల గురించా లేకపోతె ప్రజల కోసమా?
  3. అసలు ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది?
  ౪. ప్రకృతి నిధుల మీద ఎవరికీ హక్కు? అక్కడ ప్రజలకా? లేదా అక్కడ ఆ నిధి ఉంది అని కనుగున్న వారికా?
  నిజానికి ఇవి అసలు వాడకూడదు ఎందుకంటే వీటిని నాశనం చేస్తే మనం ప్రజలకు తినడానికి ఆహారం కృత్రిమ పద్దతిలో తయారు చెయ్యాలి!

  ReplyDelete
 12. ఈ బ్లాగులో మంచి చర్చ జరిగింది.
  http://aviiviannee.blogspot.com/2014/08/blog-post.htm

  ReplyDelete
  Replies
  1. ఈ లింకు ఉన్న పోస్టు చూశాను. వారు పోస్టులో వ్రాసిన దానికి ఏమి ఆధారం లేదా అంచనాతో వ్రాశారో అర్ధం కాలేదు. క్రింది కామెంట్లలో జై, శ్రీకాంత్ చారి, శ్యామలీయం , గుండు మధుసూధన్ రావు గార్లను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది? తెలంగాణా ఎందుకు అడుగంటిపోతుందో నాకేమీ వివరణలు కనపడలేదు. కనపడితే తెలంగాణా ప్రభుత్వానికి మనం హెచ్చరికలు చేస్తే తప్పు ఉండదు.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
  3. UG శ్రీరామ్ గారు,
   అక్కడ చర్చ తక్కువ, వ్యక్తిగత దూషణ ఎక్కువగా జరిగిందని నాకనిపించింది.
   రాధాకృష్ణ వేమూరికి ఆయన అజెండా వుంది. చేతిలో పత్రిక వుంది. ఆయనకి సరి అనిపించిందే ఆయన రాస్తాడు.
   ఆయన రాసినదాంట్లో నిజం లేకపోలేదు.
   అసలు ఆయన రాసిన వ్యాసం మొత్తాన్ని మనం వదిలేసి కేవలం ఈ వాక్యం మీద దృష్టి సారిస్తే మంచిది : "ఆంధ్ర వ్యతిరేకతను నూరిపోయడం వల్ల విద్వేషాలు పెరుగుతాయే గానీ సమస్యలు పరిష్కారం కావు కదా!"

   అదే సమయంలో తెలంగాణాకు అక్కడి ప్రజలకు సమస్య తలెత్తే విధం గా ఆంద్ర ప్రభుత్వం వ్యవహరించకూడదు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటేనే మంచిది. ఈ రోజు చాచిన చేయి రేపు ఇచ్చే చేయి అవదని నమ్మకమేంటి?

   Delete
 13. దీనికేమంటారో వేమూరి వారు!

  http://kommineni.info/articles/dailyarticles/content_20140814_14.php?p=1408006277018%5D

  ReplyDelete
 14. నమస్తే తెలంగాణా వీ6 అసెంబ్లీ పాస్ ఇవ్వని ఆంద్ర స్పీకర్

  http://www.telanganatalkies.com/what-is-need-for-namaste-telangana-to-cover-ap-assembly-sessions-kodela

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top