న్యూఢిల్లీ, ఆగష్టు 13 : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న తలపెట్టిన సమగ్ర సర్వేపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర సర్వేపై పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ స్పందించింది. సర్వేపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. సర్వే లక్ష్యం, చట్టబద్దతపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి లేఖ రాశారు.
ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదే అయినప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, ఉమ్మడి రాజధానితో పాటు, ఉమ్మడి గవర్నర్గా ఒక్కరే కొనసాగుతున్నారని ఇటు వంటి పరిస్థితుల్లో కేంద్రం జోక్యం తప్పనిసరి అని ఆయన అన్నారు. భారత దేశంలో ఏ పౌరుడి నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు వచ్చినా దానిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అందులో భాగంగా సమగ్ర సర్వేపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ ఆధారంగా సమగ్ర సర్వేపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తామని అనిల్గోస్వామి తెలిపారు.
(From andhrajyothy daily)
తెలంగాణాపట్ల కేంద్రం అతిగా జోక్యం చేసుకుంటోందా!? తెలంగాణా ప్రభుత్వమే అతిగా ప్రవర్తిస్తోందా!?
కొంత మంది దీని గురించి కేంద్రానికి ఫిర్యాదు చేసిన తరువాతనే కదండీ కేంద్రం నివేదికని అడిగింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు, అందునా అడుగడుగునా అనుమానాలతో, భయాలతో ఉన్న ప్రాంతాలు, ఇప్పటికే తలెత్తిన బోలెడన్ని వివాధాలు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, కేంద్రం జోక్యం .. "అతి జోక్యం" అయితే కాదని నా అభిప్రాయం.
ReplyDelete