----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

తెలంగాణ ప్రభుత్వం రోజుకో వివాదం రేపుతోంది ఏపీ, తెలంగాణ...ఇండియా-పాకిస్థాన్‌లు కావు అనకాపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు


విశాఖపట్నం, ఆగష్టు 9 : తెలంగాణ ప్రభుత్వం రోజుకో వివాదం రేపుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శనివారం అనకాల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బాబు మాట్లాడుతూ హైదరాబాద్‌లో గవర్నర్‌కు అధికారాలను తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టడం దారుణమన్నారు. గవర్నర్‌కు అధికారాలు విభజన చట్టంలోనే ఉందని బాబు తెలియజేశారు. ఏపీ, తెలంగాణ...ఇండియా- పాకిస్థాన్‌లు కావని, కేంద్రం ఆదేశాలిస్తే మోదీని ఫాసిస్టు అంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విభజనతో హేతుబద్దత లేకపోవడం వల్ల ఇరు రాష్ట్రాలకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. విభజనతో వచ్చిన నష్టాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. కళ్ళ ముందు నిజం కనబడుతూనే ఉందిగా. ఇక ఏకీభవించకపోవడానికి ఏముంది ఇందులో?

  ReplyDelete
 2. అవును కనపడుతూనే వుంది.

  ఏక పక్షంగా పిపియేల రద్దు.
  ఆంధ్రా ముఖ్యమంత్రిని అయినా తెలంగాణలో అధికారంలోకి వచ్చేవరకు ఇక్కడే ఉంటా అనడం.
  కేంద్రంతో కలిసి కుట్రలతో పోలవరం మండలాల ఆక్రమణ
  ఏకపక్షంగా విద్యుత్ జనరేటర్లను మూసివేసి పక్క రాష్ట్ర కరెంటు కోటా నిలిపివేయడం.
  పరిపాలన మానేసి మంత్రులు, ముఖ్యమంత్రి అదేపనిగా కెసిఆర్ పై దాడి చేయడం.
  తమ జేబు మీడియా సంస్థలతో మొదట హేళన ప్రసారాలు చేయించి, తల బొప్పికట్టించుకొని ఇప్పుడు అదే పనిగా దాడులు చేయించడం.
  తాజాగా కేంద్రంతో లాబీయింగు చేసి హైదరాబాదు అధికారాలను దొడ్డిదారిన చేజిక్కించుకుని తమ కబ్జా కోరులను రక్షించుకునే వికృత ప్రయత్నం.

  మేక దాడినుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించడం తోడేలు దృష్టిలో వివాదం చేయడంగానే కనిపిస్తుంది మరి!

  ReplyDelete
 3. ఇండియా పాకిస్తాన్ దేశాలు శత్రువులు కారు. ఒకవేళ అయినా కూడా వివాదాల కోసమే వివాదాలు (dispute for the sake of dispute) రేపడం జరగదు.

  ఇటీవలి కాలంలో ఒబామా కెన్యాలో పుట్టారని లాంటి సత్యదూరమయిన అంశాలు చంద్రబాబు ఉపన్యాసాలలో దొర్లాయి. ఆయన తన ఉపన్యాసాలు రాసే వ్యక్తులను (speech writers) మార్చుకుంటే మంచిది.

  ఇంతకీ గవర్నరు ప్రత్యెక "బాధ్యతలు" అనే అంశానికి చంద్రబాబుకు లేదా ఆంద్ర సర్కారుకు ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. ఇది కేవలం కేంద్రానికి తెలంగాణకు మధ్య పంచాయితి.

  ReplyDelete
 4. చంద్రబాబు వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందన ఇక్కడ చూడండి.

  http://missiontelangana.com/kutrala-babu-javaabulivvu/

  ReplyDelete
 5. ఏపీ, తెలంగాణ...ఇండియా- పాకిస్థాన్‌లు కావని

  మొదటి సారి ఆ ఫెన్స్ గురించి ఇండియా పాకిస్తాన్ అని అన్నాడు, ఆయన అన్నదానికి మీడియాలో చాలా ప్రచారం జరిగింది. ఆ ఫెన్స్ గవర్నర్ GO వలెనే ఏర్పాటు చెయ్యబడింది అని తెలంగాణా ప్రభుత్వం GO చూపిస్తే ఆ వార్తకు ప్రచారం లేదు.

  ఈయన పదే పదే ఇండియా పాకిస్తాన్ అని అనటం విద్వేషాలు పెంచి పోషించటానికే. ఇందులో ఎవరు ఇండియా ఎవరు పాకిస్తాన్ అని ఆయన అంటున్నారో అన్న విషయం ఇరు రాష్ట్రాల ప్రజలందరికి అర్థం అయిన విషయమే.

  ఒక్క సారి ఆలోచించండి, ఇలా 'ఇండియా పాకిస్తాన్' అని కెసిఆర్ అని ఉంటె పరిస్తితి ఎలా ఉండేదో? తెరాసా వారు మొరటు బాష వాడతారు, ఆంధ్ర నాయకులు సౌమ్యమైన బాష వాడతారు కాని విద్వేషాలు రెచ్చగొట్టటంలో వారేమో తక్కువ కాదు.

  ReplyDelete
  Replies
  1. తెలంగాణా యాస తెలంగాణాది దానిని మొరటు అనుకుంటే ఎలా? బువ్వ తిన్నావార అయ్యా? అని అమ్మ ప్రేమతో అడిగితే దానిని అర్ధం చేసుకునే కెపాసిటీ ఉండాలి. భాషతో మెదడు పెరుగుతుందేమో గానీ హృదయం పెరగదు కదా?

   కే.సీ.ఆర్ లాంటి కొందరు మాత్రమే తెలిసి కావాలని రెచ్చగొడుతుంటారు. దీనిని రాజకీయం చేయాలనే తెలుగుదేశం ఎండ్ కంపెనీ ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా కే.సీ.ఆర్ కు తెలుసు కానీ ప్రజలను రీచ్ కావడానికి ప్రస్తుత పరిస్తితులలో కే.సీ.ఆర్ ఎత్తుగడే ఎక్కువ ఫలితం ఇస్తున్నది. ఇవి రెండూ ప్రమాదకరమైనవే. కే.సీ.ఆర్ ది ఎత్తుగడ అయితే చంద్రబాబుది నక్కజిత్తుల వ్యవహారం.

   తెలంగాణా - ఆంధ్రా ప్రజలంతా మంచివారే. ఇరు ప్రాంతాలలోని వివిధ పార్టీల నేతలే వారి స్వప్రయోజనాలకోసం ఇలా రెచ్చగొడుతుంటారు. అయితే ప్రజలని ఎల్లవేళలా సెంటిమెంట్లతో ఈ మెంటల్‌గాళ్లు రెచ్చగొట్టలేరని నా అభిప్రాయం.

   Delete
  2. తెలంగాణా యాస తెలంగాణాది దానిని మొరటు అనుకుంటే ఎలా?

   నేను అన్నది తెలంగాణా యాస మొరటు అని కాదండి, నేను మాట్లాడి అదే కదా :-)

   తెరాసా వారిది మొరటు బాష అని నేను రాసాను, ముఖ్యంగా కెసిఆర్ ది, రాక్షుసులు, పెండ, సన్నాసులు ... లాంటి పదాలు ఈ పార్టి వారు మాత్రమే వాడుతారు కదండీ, తెలంగాణాలో మరో పార్టి వారు ఇంత విరివిగా ఇలా మాట్లాడరు.

   Delete
 6. 8. (1) On and from the appointed day, for the purposes of administration of the
  common capital area,
  the Governor shall have special responsibility for the security of life,
  liberty and property of all those who reside in such area.
  (2) In particular, the responsibility of the Governor shall extend to matters such as law
  and order, internal security and security of vital installations, and management and allocation
  of Government buildings in the common capital area.
  (3) In discharge of the functions, the Governor shall, after consulting the Council of
  Ministers of the State of Telangana, exercise his individual judgment as to the action to be
  taken:
  Provided that if any question arises whether any matter is or is not a matter as
  respects which the Governor is under this sub-section required to act in the exercise of his
  individual judgment, the decision of the Governor in his discretion shall be final, and the
  validity of anything done by the Governor shall not be called in question on the ground that
  he ought or ought not to have acted in the exercise of his individual judgment.
  (4) The Governor shall be assisted by two advisors to be appointed by the Central
  Government.  ఇక్కడ కామన్ కాపిటల్ ఏరియా అంటే ఏంటి? హైదరాబాద్ లో ప్రభుత్వ భవనాలు ఉన్న ప్రాంతమా (అసెంబ్లీ, సెక్రెటరిఎట్ మొదలైనవి)? లేక పూర్తీ హైదరాబాదు ప్రాంతమా? లేక హైదరాబాద్, సికిందరా బాడ్ రెండు కలిపా? లేక GHMC మొత్తమా? GHMC ప్రాంతం అన్నిటి కంటే ఎక్కువ కాబట్టి ప్రస్తుతానికి కామన్ కాపిటల్ ఏరియా అదే అని అనుకుందా. ఇప్పుడు కేంద్రం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో ఏముందో చూద్దాం.

  (4) For the purposes of matters falling under law and order, internal security and security of vital installations as well as the two Police Commissionerates currently operating in the common capital area i.e. the Hyderabad and the Cyberabad and commissionerates, and for the district of Ranga Reddy, the home secretary of the state of Telangana shall brief the Governor on all matters mentioned above as well as those that have special significance and the Governor may convey his views which shall be placed before the appropriate authority. Governor’s advice shall prevail.

  పై పేరాను బట్టి వారు గవర్నర్ కు అప్పగించమని అడుగుతున్నది ఏమిటి ? హైదరాబాద్ (సికిందరాబాద్ తో కలిపి అనుకుంటా), సైబరాబాడ్ మరియు రంగా రెడ్డి జిల్లా మొత్తం. రంగా రెడ్డి జిల్లా ఎందుకు? మొత్తం జిల్లాను కామన్ కాపిటల్ లో భాగం గా ఎందుకు అడుగుతున్నారు? రంగారెడ్డి జిల్లా కూడా అడగటంలో మతలబు ఎవరికైనా అర్థం అవుతుంది ఇదంతా ఎవరి కోసమో. ఇది అన్యాయమే కదా? విభజన చట్టం అలా చేపటం లేదు కదా? రంగా రెడ్డి జిల్లానే ఎందుకు మొత్తం తెలంగాణాను తీసుకోవచ్చు కదా... లోల్.

  చివరికి ఏమి జరిగినా కూడా, ఈ విషయం వలన చంద్ర బాబు మరియు కెసిఆర్ లు రాజకీయంగా వారి వారి రాష్ట్రాలలో బల పడతారు. ప్రజలు బద్ద శత్రువులు అయ్యే అవకాశం మెండు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రికి తెలంగాణా అంతర్గత విషయాల్లో కలిపించుకునే అవసరం లేదు. అలా కల్పించుకున్న్నంత కాలం కోప తాపాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. ఒక్కో సారి వారు వారి సగం సమయం తెలంగాణ గురించే వెచ్చిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. తెలంగాణా సమస్యలను వారి తెలంగాణా శాఖకు వదిలేస్తే బాగుంటుంది.

  ReplyDelete
 7. ఇప్పుడే చూసాను దీన్ని. కెసిఆర్ మోడీ కి రాసిన లేఖను ఇక్కడ చూడొచ్చు. విభజన చట్టంలో గవర్నర్ కు కల్పించిన అధికారాలను కెసిఆర్ కాదనటం లేదు అనేది ఈ లేఖతో స్పష్టం. విభజన చట్టం లేక భారత చట్టంలో లేని వాటిని కూడా కేంద్రం అడగటం పైనే కెసిఆర్ నిరసన వ్యక్తం చేసాడు. మరి ఇంకా సమస్య ఏముంది ఇక్కడ? బాబుకు ఎందుకు నొప్పి?

  http://missiontelangana.com/kcrs-letter-to-pm-modi/

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top