• పెంచినవన్నీ అందజేస్తాం.. రుణమాఫీ త్వరలో అమలు
 • ‘గృహ’ అక్రమార్కులకు జైలే... ఏ పార్టీ వాళ్లున్నా ఉపేక్షించం
 • నేతలకు విద్యార్థులతో స్వాగతంపై నిషేధం
 • పిల్లలను రోడ్లపై నిలబెట్టొద్దు కేసీఆర్‌ ఆదేశం
 • మాఫీతో 19 వేల కోట్ల రుణాలు రద్దు
 • 39 లక్షల కుటుంబాలకు ప్రయోజనం
 • నాలుగేళ్లలో ఇంటింటికీ తాగునీరు
 • దొంగ ఇళ్ల నుంచి నిఽధులూ రికవరీ
 • బోగస్‌ రేషన్‌ కార్డులు దుర్మార్గం
 • గతంలో ఉన్నవి ప్రభుత్వాలా? చందులాల్‌ దర్బార్లా?
 • తెలంగాణలో అధికారులకు రెండేళ్లదాకా బదిలీలుండవ్‌
 • వారంలో ఎర్రజొన్న బకాయిలు..
 • ఆర్మూర్‌ సభలో సీఎం కేసీఆర్‌
 • నిజామాబాద్‌ పర్యటనలో కేసీఆర్‌

గృహ నిర్మాణంలో అక్రమార్కులకు జైలు శిక్ష తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తేల్చి చెప్పారు! అక్రమార్కుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు! ఇళ్లను మింగిన అక్రమార్కుల నుంచి నిధులను రికవరీ చేస్తామని తేల్చి చెప్పారు! దసరా నుంచి దీపావళి మధ్యలో పెంచిన పింఛన్లను అందరికీ అందజేస్తామని, ఈ విషయంలో అనుమానాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు! గతంలో పరిపాలించినవి అసలు ప్రభుత్వాలే కాదని తీవ్రంగా విమర్శించారు!

ఆర్మూర్‌, ఆగస్టు 7: దసరా లేదా దీపావళి లోపు పెంచిన పింఛన్లు అందజేస్తామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ, ఎలాంటి సందేహం వద్దని ఆయన భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన మంచినీటి పథకానికి ముఖ్యమంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దసరా- దీపావళి మధ్య కొత్త కార్డులు అందజేసి పెన్షన్లు ఇస్తాం. బీడీ కార్మికుల సంఖ్యపై సర్వే జరుగుతోంది. సర్వే తర్వాత రూ. 1000 భృతి ఇస్తాం. వికలాంగులకు కూడా దసరా-దీపావళి మధ్యనే రూ.1500 పెన్షన్‌ ఇస్తాం. ఈ విషయంలో అనుమానాలొద్దు’’ అని పేర్కొన్నారు.
రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణాల మాఫీకి రిజర్వు బ్యాంకు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టిందని, వీటిని ఆర్థిక శాఖకు అప్పగించామని చెప్పారు. రుణమాఫీ వల్ల రాష్ట్రంలో 39 లక్షల రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దాదాపు రూ.19వేల కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని, ఇది త్వరలోనే అమలవుతుం దని ప్రకటించారు. ఆర్మూర్‌ ప్రాంత రైతులకు రావాల్సిన రూ.11 కోట్ల ఎర్రజొన్నల బకాయిలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ‘‘అప్పట్లో కరీంనగర్‌లో ఉద్యమ కార్యక్రమంలో ఉన్నాను. ఆర్మూర్‌లో రైతుల మీద పోలీసు కాల్పులు జరిగాయని చెప్పారు. వెంటనే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హుటాహుటిన ఆర్మూర్‌కు వచ్చి పరామర్శించాను. గత ప్రభుత్వం మాటలు చెప్పింది. డబ్బులు రాలేదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే బకాయిలను విడుదల చేస్తమని ఎన్నికల ముందు చెప్పాను. ఆ మాట మీద బకాయిల చెల్లింపులు చేస్తున్నాను. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్మూర్‌, బాల్కొండ, నిజామాబాద్‌రూరల్‌ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌ రైతులకు వారం రోజుల్లో అది కూడా వారి గ్రామాల్లోనే చెక్కులు ఇస్తారు’’ అని సీఎం ప్రకటించారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు.  
సమగ్ర సర్వేకు సహకరించాలి
ఈనెల 19 వతేదీన జరగనున్న సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. అధికారులు ప్రతి గ్రామానికీ వస్తారని వివరాలు రాయించుకోవాలని కేసీఆర్‌ సూచించారు. 15న దళితులకు మూడెకరాల భూపంపిణీ ప్రారంభిస్తున్నామని, హైదరాబాద్‌ నుంచి ఆర్మూర్‌కు బయలు దేరే ముందు ఇదే ఫైల్‌పై సంతకం కూడా చేశానని ఆయన వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు సరిపోనందున రూ.3.5లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వ విధానాల వల్ల పైరవీకారులు ఎనిమిదేసి ఇళ్లు మంజూరు చేయించున్నారు. అక్రమార్కులను చెండాడాలి. సీబీఐ విచారణ జరిగింది. ఆర్మూరు పట్టణంలో పేదల ఇళ్ల నిర్మాణానికి కాలనీ డిజైన్‌ చే సి ఇస్తాం’’ అని అన్నారు.  
విత్తన హబ్‌గా అంకాపూర్‌
 అంకాపూర్‌ గ్రామాన్ని విత్తనహబ్‌గా తయారు చేస్తామని సీఎం అన్నారు. ఇప్పటికే పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలకు విత్తనాలు ఎగుమతి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో విస్తరణ పెరిగినా ఉత్పత్తి పెరగలేదన్నారు. ఉత్పాదక శక్తి పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అంకాపూర్‌ గ్రామాన్ని అన్ని గ్రా మాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గ్రీన్‌హౌజ్‌ కల్టివేషన్‌ పెరగాల్సిన అవసరముందన్నారు. అంకాపూర్‌లో శిక్షణ కార్యక్రమాలకు హాలు, గెస్ట్‌హౌజ్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారిజీవన్‌రెడ్డి అధ్యక్షత వహించగా, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్‌, హనుమంత్‌ షిండే, మహమ్మద్‌షకీల్‌, గణేష్‌గుప్తా, ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ ఎమ్మెల్యే అల్లొల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
విద్యార్థులను రోడ్డు మీదికి తేవద్దు
ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలకడానికి పాఠశాల విద్యార్థులను రోడ్ల మీద నిలబెట్టవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ‘‘స్కూల్‌ పిల్లలను ఎండలో నిలబెట్టవద్దు, మంత్రులు, సీఎంకు స్వాగతం పలకడానికి పిల్లలను రోడ్ల మీద నిలబెడుతున్నారు. దాని వల్ల వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు కూడా అలాగే నిలబెట్టడం నాకు బాధకలిగించింది. ఇకపై ఇటువంటి కార్యక్రమాలకు బడి పిల్లలను రోడ్లపైకి తీసుకురావడాన్ని ఈ రోజు నుంచే నిషేధిస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.
రుణ ప్రణాళిక విడుదల నేడే
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళిక విడుదల కాబోతోంది. రుణమాఫీపై స్పష్టత రాకపోవడం, సీఎం కేసీఆర్‌ తేదీ ఖరారు కాకపోవడం వంటి తదితర కారణాల వల్ల రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఎస్‌ఎల్‌బీసీ సమావేశం శుక్రవారంనాడు ఖరారైంది. దీనికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు.

‘గృహ’ అక్రమార్కులకు జైలే
నిజామాబాద్‌ సమీక్షలో సీఎం కేసీఆర్‌
(ఆంధ్రజ్యోతి, నిజామాబాద్‌) గృహ నిర్మాణశాఖలో జరిగిన అక్రమాల్లో ఎవ రున్న ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని సీఎం చంద్రశేఖరరావు హెచ్చరించారు. గృహనిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బోర్గాం శివారులోని విజయలక్ష్మి  కళ్యాణ మండపంలో  నిజామాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ నిర్మాణశాఖ ద్వారా అక్రమంగా ఇళ్లు పొందిన వారి నుంచి ఆ నిధులను రికవరీ చేయిస్తానని, అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని చెప్పారు. ఈ అక్రమాల్లో ఏ పార్టీ నేతలు ఉన్నా.. చివరకు అధికార పార్టీ నేతలున్నా వారిని జైలు పంపిస్తామని హెచ్చరించారు. అవసరమైతే గృహ నిర్మాణ సంస్థను రద్దు చేసి, పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. గృహ నిర్మాణశాఖలో జరిగిన అక్రమాలపై సీబీసీఐడి చేత విచారణ జరిపిస్తానని అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల ఇళ్లు కట్టినట్టు లెక్కలు చెబతున్నారని, 200 గ్రామాల్లో ఇళ్లు కట్టినట్టు లెక్కలు చూపుతుండగా ఆయాగ్రామాల్లో ఆ ఇళ్లు లేవని వివరించారు. 2008-09 సంవత్సరంలో గృహ నిర్మాణ శాఖకు 5,5,00 కోట్ల రూపాయలు మంజూరు చేశారనీ, ఒక్కొక్కరు 10 నుంచి 20 ఇళ్లు మంజూరు చేయించుకున్నారని తెలిపారు.  కొత్త రాష్ట్రంలో అధికారులు కొత్త ఆలోచనలతో ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు.
కుటుంబాల కంటే రేషన్‌కార్డులు ఎక్కువ
రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉండగా 91 లక్షల రేషన్‌కార్డులున్నాయనీ, అందులో 74 లక్షల మందికి తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయని సీఎం తెలిపారు. కుటుంబాల కంటే రేషన్‌కార్డులు అధికంగా ఉండడం దుర్మార్గమన్నారు. ‘గతంలో పని చేసినవి ప్రభుత్వాలా ..! చందులాల్‌ దర్బార్లా!’ అని ప్రశ్నించారు. గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు  సంబంధించిన రూ. 1300 కోట్లను ఇప్పుడు చెల్లించాలనడం హాస్యాస్పదమని  అన్నారు.  ఇప్పడు మరో రూ. 3 వేల కోట్లను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలంటున్నారనీ, ఇందులో 2 వేల కోట్ల రూపాయల వరకు అనర్హులకు చేరే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రజాధనాన్ని దొంగల పాలు చేయదల్చుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టానికి 116 ఐఏ ఎస్‌ అధికారులు అవసరమని.. ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారనీ, ఐఏఎస్‌ అధికారుల పంపకాలపై ప్రధానమంత్రికి లేఖ రాశామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తామా, తెలంగాణ రాష్ట్రంలో ఉంటామా అనే సందిగ్ధతతో అధికారులూ ఉన్నారనీ, దానికితోడు ఒక్కో అధికారికి మూడు, నాలుగు శాఖలు ఉండ డడం వలన పనులు వేగంగా జరగడంలేదని అం గీకరించారు. ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను అధికారులు గౌరవించాలనీ, ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ పెద్దదనీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ స్థాయి అధికారి కూడా ఎమ్మెల్యే వస్తే లేచి రిసీవ్‌ చేసుకోవలని చెప్పారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా అధికారులను గౌరవించాలన్నారు. పనులు పెండింగ్‌లో ఉంటే గతం లో మాదిరిగా అధికారులపై నెట్టేసే పద్ధతికి స్వస్తి పలకాలనీ, ఆ పనులు పెండింగ్‌లో ఉండడంలో అధికారుల బాధ్యత ఎంత ఉందో.. ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా అంతే ఉంటుందని తెలిపారు.  గతంలో ఎవరికి కోపం వచ్చినా అధికారులను బదిలీ చేసేవారనీ, ఇప్పుడు అలా కాకుండా అధికారులకు రెండేళ్ల వరకు బదిలీ చేయబోమని చెప్పారు. సింగరేణిలో ఉన్న కేంద్రం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనీ, 65 వేల మంది ఉద్యోగులకు అన్నం పెడుతున్న సింగరేణిని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతామని చెప్పా రు. సింగరేణికి భవిష్యత్‌లో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. ఈ నెల 19న నిర్వహించే సమగ్ర సర్వేపై విస్తృతం గా ప్రచారం చేయాలని కేసీఆర్‌ అధికారులను ఆ దేశించారు. ఆ రోజు ప్రజలు సర్వేలో పాల్గొనాలనీ, సర్వేలో పాల్గొంటేనే వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ప్రకటించారు. సర్వేలో లేనివారు జనాభాలో లేని కిందే లెక్క అని ఆయన చెప్పారు.
రైతుల భూములు లాక్కోం..
తెలంగాణలో పరిశ్రమలు పెట్టేందుకు రైతుల భూములను తీసుకోబోమని సీఎం కేసీఆర్‌ చెప్పా రు. తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల బీడు భూములున్నాయని, వాటిని పరిశ్రమలకు కేటాయిస్తామని వివరించారు. రాష్ట్రంలో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనీ, అందులో అధికార పార్టీ వారు ఉన్నా  వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గానికి 1.30 కోట్ల  మొక్కలు నాటాలని నిర్ణయించామనీ, రోడ్లపై వెళ్తుంటే పార్కుల్లో వెళ్లిన అనుభూతి కలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అభివృద్ధి పనుల టెండర్లలో ఏ నాయకులు జోక్యం చేసుకోవద్దని చెప్పారు.
నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో స్మృతివనాలను ఏర్పాటు చేయాలనీ, ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కార్యాలయ ఆదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ చైర్మన్‌ దాపేదారు రాజు, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్‌షకీల్‌, గంపగోవర్ధన్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంతుషిండే, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, టీడీపీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్‌, మే యర్‌ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.
from andhrayothy daily
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేరాలు-ఘోరాలు పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top