ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మరచి ఆరోగ్యం కోసం అనవసర ప్రయాస పడుతున్నాము. మన జీవన విధానం లో మార్పు చేసుకోగలిగితే అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందులో మొలకలు తినడం అనేది చాలా ఉపయోగకరమైనది. ప్రజాశక్తి దినపత్రికలో జీవన డెస్క్ ద్వారా ప్రచురితమయిన ఈ అంశాలను మీకోసం ఇక్కడ పోస్టుగా ఉంచుతున్నాను.

గజిబిజి జీవితాల పుణ్యమా అని ఇప్పుడు ఎక్కువ శాతం మందిలో స్థూలకాయం పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి అన్వేషణ పెరిగింది. అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఆరోగ్య సూత్రాలు పాటించాలన్నప్పుడు మొదట వినపడే మాట, 'మొలకలు తినండి' అనే! ఆ తరువాత పాలు, పళ్లు, కూరగాయలు, వ్యాయామాలు... వగైరా వగైరా. మొలకలతో వంటకాలు, మొలకలతో సలాడ్‌లు చేసుకోవడం, తినడం ఇటీవల పెరిగాయి. మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి. కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు ఆరోగ్యకరమే! కానీ, ఏ విధంగానో తెలుసుకోవాలిగా!

- మొలకల్లో కొవ్వు వుండదు.

- ప్రోటీన్లకు మొలకలు పెట్టింది పేరు.

- సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు తయారు చేసుకోవడానికి మార్గాలే!

- గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం.

- మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ.

- యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం.

- ఫైబర్‌, ఐరన్‌, నియాసిన్‌, కేల్షియమ్‌ -ఇవన్నీ మొలకల్లో పుష్కలం.

- శరీర కణాలకు మొలకలు చాలా మేలు చేస్తాయి.

- కేన్సర్‌ను నిరోధించగల శక్తి మొలకల్లో ఉంది.

- మొలకల్లో లభ్యమయ్యే విటమిన్‌ బి, డి శరీరానికి చాలా అవసరం.

- ఇందులోని ఫాస్పరస్‌ పళ్లకు, ఎముకలకు ఉపయుక్తం.

మొలకలు ప్రకృతి నుండి లభ్యమయ్యేవి. కాబట్టి, ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు. ఆరోగ్యం గ్యారెంటీ! మరిప్పటికే మీలో మొలకలు తినాలనే ఆలోచన మొలకెత్తి ఉంటుందిగా! దాన్ని ఆపకుండా అంకురించనీయండి! 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top