• లేచి నిలబడండి ! చాలా సమయం కూర్చునేవారు కొద్ది కాలంలోనే చనిపోయే అవకా శముంది. 
 • శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి రక్తప్రసరణ అవసరం. ధమనులు ఆక్సీజన్‌ అధికంగా ఉండే ఎర్ర రక్తకణాలను శరీరంలోని అవయవాలకు చేరవేస్తాయి. 
 • అసంతృప్తమైన రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలను సిరలు అంటారు. ఇవి నీలి రంగులో ఉంటాయి. 
 • గుండెకు ఆక్సీజన్‌, పోషకాలను అందించే కరొనరి ధమనులు చాలా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ పేరుకోవడం వల్ల ఈ కరొనరి ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఇలా అడ్డంకులు ఏర్పడితే గుండె జబ్బులు వస్తాయని మనకు తెలుసు. 
 • కానీ మనకు తెలియని విషయం ఇంకోటుంది. చాలా సమయం కూర్చీలో కూర్చోవడం, కంప్యూటర్‌ ముందు కూర్చోవడం, టీవీ చూడ్డం వల్ల కూడా ఇలాంటి సమస్యలే వస్తాయని చాలా మందికి తెలియదు. 
 • చాలా సమయం కూర్చోవడం వల్ల ముందుగానే చనిపోయే అవకాశముందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. 
 • మనిషి శరీరం కదలిక కోసం రూపకల్పన చేయబడిన నిర్మాణం అని 2010లో ప్రచురితమైన ఆస్ట్రేలియన్‌ అధ్యయనం తెలిపింది. 
 • రోజుకు ఒక గంట పాటు టీవీ ముందు ఆరేళ్లకు పైగా కూర్చుంటే, ఆ వ్యక్తి మరణించే ప్రమాదం 11 శాతం, గుండె రక్తనాళాల సంబంధ వ్యాధి వచ్చే ప్రమాదం 18 శాతం పెరుగుతుంది. 
 • రోజు వారి పనులు చేయడం అంటే... శరీరం కదలడం, వంచడం, సాగదీయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది, కండరాలు స్వరూపాన్ని కోల్పోవు. 
 • ఈ అధ్యయనం 8,800 మంది 25 ఏళ్లు పైబడిన వారిపై చేశారు. వీరంతగా తమ పేర్లను 1999 నుండి 2000 మధ్యలో నమోదు చేసుకున్నారు. వీరిని 2006వరకు అనుసరించారు. 
 • గుండె రక్తనాళాల వ్యాధి చరిత్ర ఉన్న వారిని కూడా అధ్యయనంలోకి తీసుకున్నారు. రెండు గంటల కన్నా తక్కువ సమయం టీవీ చూసే వారితో పోలిస్తే, రోజూ నాలుగు గంటల కన్నా ఎక్కువ సమయం టీవీ చూసేవారిలో మరణించే ప్రమాదం 46 శాతం, గుండె రక్తనాళాల వ్యాధితో మరణించే ప్రమాదం 80 శాతం పెరుగుతుంది. 
 • ఈ అంశంపై తాజాగా ఒక పెద్ద అధ్యయనం జరిగింది. ఇది 'సాక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ 45 అప్‌ స్టడీ'లో ఒక భాగం. సదరన్‌ హెమిస్పియర్‌లో ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై జరిగి ధీర్ఘకాల అధ్యయనం ఇది. 
 • ఆస్ట్రేలియాలోని 45 ఏళ్లు అంతకు పైబడ్డ 2,22,497 మంది ఎంత సమయం కూర్చుంటున్నారనే దాన్ని పోల్చి చూశారు. చాలా సమయం కూర్చుంటే కొద్ది కాలంలోనే చనిపోతారు. 
 • 4 గంటలకు కంటే తక్కువ సమయం కూర్చునే వారి కంటే, రోజుకు 11 గంటలు కూర్చుంటే వచ్చే మూడేళ్లలో మరణించే ప్రమాదం 40 శాతం ఉంటుంది. 
 • వారానికి ఐదు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం వ్యాయామం చేస్తే మరణించే ప్రమాదం తగ్గుతుంది. 
 • ఎక్కువ సమయం నిల్చోడం, తక్కువ సమయం కూర్చోవడం వల్ల జీవిత కాలం పొడగించుకోవచ్చని అధ్యయనం సందేశమిస్తోంది. 
 • పెద్దవాళ్లు 90 శాతం విశ్రాంతి సమయాన్ని తాము మెరుగవ్వడానికి ఉపయోగిస్తున్నారు. చాలా సమయం కూర్చోవాల్సి వచ్చిన వాళ్లు మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకుని కొద్దిసేపు నడవాలి. 

Reactions:

Post a Comment

 1. mastaru madam garu
  daya unchi takkuva tinte takkuva nidhra kavala?
  teliya jeya galaru
  achutaraosv@gmail.com
  sarachyuth@gmail.com
  prof.s.v.achuta rao

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top