----------------------------------------------
ప్రశ్న సంఖ్య : 51

ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

Name:Marxist-Leninist 
E-Mail:deleted  
Subject:ఎంత చదివామన్నది ముఖ్యమా, ఏమి అర్థం చేసుకున్నామన్నది ముఖ్యమా? 
Message:
చాలా మంది అనుకుంటారు \"ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా చెప్పరు, ప్రైవేత్ పాఠశాలల్లో బాగా చెపుతారు\" అని. నిజానికి కొన్ని ప్రైవేత్ పాఠశాలల్లో ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలల్లో కంటే దారుణంగా ఉన్నాయి. మా పెద్దమ్మ గారి మనవడు మూడేళ్ళుగా ప్రైవేత్ పాఠశాలలోనే చదువుతున్నాడు. ఈ ఏడాది వాడికి స్కూల్ మార్చారు కూడా. అయినా వాడికి ఇంగ్లిష్‌లో capital letters ఎక్కడ వ్రాయాలో, small letters ఎక్కడ వ్రాయాలో తెలియదు. నేను వాడికి అక్షరాలు సరిగా వ్రాయడం నేర్పించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చేసింది. వీడికి ఇంగ్లిష్ నేర్పిన పంతులు ఎవడు అని మా పెద్దమ్మగారిని అడిగాను. వీడికి స్పెలింగ్, ప్రొనన్సియేషన్ నేర్పించకుండా నేరుగా వాక్యాలు చదవడం నేర్పించారని అసలు విషయం చెప్పారు.

మొదట్లో వాడు లేబరోళ్ళ పిల్లల పక్కన ఉండడం వల్ల చదవడం లేదనుకున్నారు. ఒకటో తరగతి పిల్లవానికి ఆర్థిక అసమానతల గురించి ఏమీ తెలియదు. అతడు లేబరోళ్ళ పిల్లల పక్కన కూర్చున్నంతమాత్రాన చదువు మానడం జరగదు. వెయ్యి రూపాయల జీతానికి పదవ తరగతివాళ్ళని ఉపాధ్యాయులుగా పెట్టడం వల్లే ఆ స్కూల్‌లోని పిల్లలకి చదువు సరిగా రాకపోయి ఉండొచ్చు అని నేను అన్నాను. దాంతో మా పెద్దమ్మగారి అభిప్రాయం మారింది.

ప్రైవేత్ పాఠశాలల్లో చదువు బాగా చెపుతారనేది ఒక అపోహ మాత్రమే. ఒక ప్రైవేత్ పాఠశాలని నలుగురైదుగురు యజమానులు కలిసి పెట్టుబడి పెట్టి కడతారు. వీళ్ళందరికీ పంచుకోదగ్గ లాభం రావాలంటే తక్కువ జీతానికి ఉపాధ్యాయులని పెట్టి డబ్బులు మిగుల్చుకోవాలి. అందు కోసం పదో తరగతి లేదా +2 వరకు మాత్రమే చదివినవాళ్ళని కూడా ఉపాధ్యాయులుగా పెట్టేందుకు ఈ స్కూల్‌ల యజమానులు సిద్ధపడతారు. అందుకే ప్రైవేత్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేవు.

కొన్ని ప్రైవేత్ పాఠశాలల్లో లైబ్రరీలు, లేబరేతరీలు ఉండడం వల్ల అక్కడ పిల్లలకి చదువుపై ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. కానీ చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకి మార్కులు వస్తే చాలు, లైబ్రరీ & లేబరేతరీ లాంటివి అనవసరం అని అనుకుంటారు. అందువల్ల చాలా మంది స్కూల్ యజమానులు లైబ్రరీ, లేబరేతరీ లాంటివి పెట్టడానికి ఇష్టపడరు. అటు తల్లితండ్రుల ఆలోచన విధానం, ఇటు స్కూల్ యజమానుల వ్యాపార ధోరణి మారితే గానీ మన దేశంలో చదువులు బాగుపడవు.
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top