తెలంగాణాలో బలపడేందుకు బీ.జే.పీ ప్రయత్నిస్తోందా!?


తెలంగాణాలో బలపడేందుకు బీ.జే.పీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశంతో పొత్తువల్లే తెలంగాణాకు సహకరించినా తమను ప్రజలు విశ్వసించలేదని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కే.సీ.ఆర్ పై ప్రజలలో అసంతృప్తి వస్తున్నదని దానిని కేష్ చేసుకోవాలంటే తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుంటేనే మంచిదని వారు భావిస్తున్నారు. కే.సీ.ఆర్ ముస్లిములను దగ్గరకు తీసుకోవడంతో పాటు బీ.జే.పీ పైనా తీవ్రంగానే విమర్శలు గుప్పిస్తున్నందున రానున్న రోజులలో TRS ను అడ్డుకోవాలంటే తామే ప్రత్యామ్నయంగా ఎదగాలని బీ.జే.పీ నేతలు అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. TRS కు ప్రత్యామ్నయంగా తెలంగాణాలో తెలుగుదేశం ఎదిగే పరిస్తితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పరిస్తితీ ఇంచుమించు అదేలా ఉన్నది. కమ్యూనిస్టుల సంగతి సరే సరి.  కేంద్రంలో అధికారం చేపట్టినా - మోడీ వేవ్ ఉన్నా ఇంకా తెలంగాణాలో బీ.జే.పీకి అనుకూలంగా పవనాలు వీచడం లేదనే చెప్పాలి. TRS పై ప్రజలలో అనేక అనుమానాలున్నా ఇప్పటికైతే ఇక్కడి ప్రజలు  కే.సీ.ఆర్ ఏదో చేస్తాడనే అనుకుంటున్నారు తప్ప తీవ్ర వ్యతిరేకత అయితే ఇంకా రాలేదనే చెప్పాలి. ఈ నేపధ్యంలో TRS కు ప్రత్యామ్నయంగా ఎదగగలిగే అవకాశాలను ఎందుకు వదులుకోవాలని BJP చూస్తోంది.

తెలంగాణాలో TRS కు ప్రత్యామ్నయంగా BJP ఎదిగే అవకాశం ఉన్నదా? మీ అభిప్రాయం ఏమిటి?
Reactions:

Post a Comment

 1. "TRS కు ప్రత్యామ్నయంగా ఎదగగలిగే అవకాశాలను ఎందుకు వదులుకోవాలని BJP చూస్తోంది." ఈ మాటకు అర్ధమేమిటి ? వదులుకోవాలని చూస్తుందా ? అలా అని ఊహించారా ? ఎవరైనా చెప్పారా ?

  ReplyDelete
 2. 15 ఏళ్ళ తరువాత తెరాస ఓడిపోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కానీ తెలంగాణా ద్రోహి అయిన తెలుగు దేశంతో పొత్తు పెట్టుకున్న భాజపా తెలంగాణలో గెలిస్తే అది ఆత్మహత్యాసదృశ్యమే.

  ReplyDelete
 3. తెలుగుదేశం తెలంగాణాద్రోహి అని తెలంగాణాలో మేథావులు కొందరంటారు. భాజపా, కాంగ్రెసులు రెండు తెలుగుజాతిద్రోహులేనని సీమాంధ్రలో మేథావులు కొందరంటారు.

  ఇటువంటి నేలబారు నిందావాక్యాలవలన ప్రజలలో దురవగాహనలూ దూరాలూ పెంచటం మించి ఎవరూ సాధించేది ఏమీ‌ ఉండదు. నాకు రాజకీయాలమీద వ్యాఖ్యానించాలన్న ఆసక్తి ఏమీ లేదు కాని, రాజకీయాలమీద వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు నిస్ప్రయోజనమైన పదజాలం‌వాడటమూ, అటువంటి అనవసరభావజాలానికి ప్రచారం కల్పించటమూ మానుకోవాలని విజ్ఞప్తి చేయటానికే ఈ రెండు ముక్కలూ వ్రాసాను. ఈ రెండు మాటలూ అనటంలో నాకు ఏ పక్షపాతమూ ప్రయోజనమూ లేదు.

  ReplyDelete
  Replies
  1. కాంగ్రెస్ వైకాప లాంటి పార్టీలు తెలంగాణాను ఒకానొక సమయంలో వ్యతిరేకించాయి. సమయానుకూలంగా తెలంగాణా వారు ఆయా పార్టీలపై పోరాటం చేసారు.

   తెదేపా ప్రరాపాల విషయం వేరే. వారు ఒకప్పుడు మేము తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమంటూ తెగ ప్రచారం చేసారు. తీరా సమయం రాగానే మాట మార్చారు.

   ఈ రెంటినీ ఒకే గాడిలో చూడలేము. ఒకసారి నమ్మకద్రోహం చేసిన టీడీపీని (పీయార్పీ ఇప్పుడు లేదు) మళ్ళీ నమ్మడం మన వేలితో మన కంటితో పొడుచుకోవడమే అవుతుంది.

   Delete
 4. ఎంత కాదనుకున్నా భాజపా కూడా తెలుగు దేశంలాగే రెండు కళ్ళ సిద్ధాంతి కదా!
  https://www.dropbox.com/s/l77z190glvzdxzn/Screenshot_2014-08-20-19-46-27.png

  ReplyDelete
 5. ఒకవేళ తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని బిజెపి అనుకున్తున్నట్టైతే అది ఇప్పటి వరకు ఆ దిశలో అడుగులు వేయక పోగా, తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటున్నది.

  పోలవరం ముంపుగ్రామాలు, ఏ.బీ.ఎన్ ఆంధ్రజ్యోతి వ్యవహారం, హైదరాబాదుపై గవర్నరు పెత్తనం, గురుకుల్ ట్రస్టు భూములు, తాజాగా ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో ఆపార్టీ వారు ప్రవర్తిస్తున్న తీరే అందుకు నిదర్శనం.

  >>> తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకుంటేనే మంచిదని వారు భావిస్తున్నారు.

  అలా తెగదెంపులు చేసుకుంటేనే కాని భావదాస్యం తప్పదని, అప్పుడే సొంత మెదడుతో ఆలోచించ గలమని వారనుకుంటే... అది ఎంత తొందరగా చేస్తే వారికి అంత మంచిది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top