Reactions:

Post a Comment

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. ఇప్పటి దాకా అయితే తింగరి మాటలు, గాలి మేడలు, లీకుల తోనే సరిపోయింది. ఇప్పటికయినా మాటలు ఆపి పని చేయాలి. He should learn to under promise and over deliver. ఇప్పుడున్న పరిస్థితుల్లో అండర్ ప్రామిస్ చేసినా జనాలు భరిస్తారు కానీ లేని ఆశలు కల్పించి ఉసోరుమనిపిస్తె మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ లో దెబ్బ గారెంటీ. అది తనకే కాదు ఆంద్ర ప్రదేశ్ కి కూడా మంచిది కాదు.

  ReplyDelete
 3. ఇదేం ప్రశ్న ఆయన ఏకంగా తొమ్మిదేళ్లు పరిపాలన చేస్తె వందరోజులకు కుదించడం. తొమ్మిదేళ్ల పాలనలో లేని కొత్త దనం వందరోజుల్లొ వస్తుందనుకోవడం వారి వారి భ్రమ కావచ్చు! కాకపోతె కొత్తరకం జిమ్మిక్కులుంటాయేమో!

  ReplyDelete
  Replies
  1. గతంలో 9 ఏండ్ల పాలనకీ ఇప్పటి 100 రోజుల పాలనకీ ఏమైనా మార్పులున్నాయా? అనేది చూడవచ్చు. హైటెక్ నుంది లోటెక్ కి వచ్చాడా? లేదా? అదే విజనరీ పిచ్చితో ఉన్నాడా అనేది చూడవచ్చు.

   Delete
  2. విజన్ అనేది పిచ్చి కాదండి. ఇంతకు ముందు పరిపాలనలో కొన్ని లోపాలు (ఉదాహరణకి ఎక్కువగా హైదరాబాద్ మీద ఫోకస్ చేయడం) లాంటివి ఉన్నా, అన్ని వ్యవస్థలని ప్రక్షాళన చేసి కొత్త ఆలోచనలతో ముందు నడిపాడు చంద్రబాబు. కానీ ప్రజలు ఫ్రీ కె వోట్ వేశారు. అయిన వాళ్లకి అడ్డంగా దోచి పెడితే YSR ని నమ్ముకున్నోల్లని చూసుకునే నాయకుడన్నారు. రాష్ట్ర ఖజానా అభివృద్ది కి వాడకుండా వర్గాలకి ఫ్రీ గా ఇచ్చి ఖాళీ చేస్తే మహా నాయకుడన్నారు. అదే చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటే తిరస్కరించారు. అదీ మన ప్రజల మైండ్ సెట్. కాబట్టి ఇప్పుడు తను చేస్తున్న వాటికి ప్రజలు కూడా కారణమే. ఇప్పుడితే చంద్రబాబు తన పాత పంథాని పూర్తిగా వదిలేసినట్టు కనబడుతోంది. ఎప్పుడైతే వ్యక్తిగత పథకాలు కాకుండా రాష్ట్ర అభివృద్దికి తోడ్పడే పథకాలకి ప్రజలు మెచ్చి ప్రభుత్వం వెన్నంటి ఉంటారో అప్పుడే ఏదైనా చేయడం సాధ్యం అవుతుంది.

   Delete
  3. శ్రీ గారు,

   సాధారణ స్తితికి ఎక్కువ లేదా తక్కువగా మనిషి ప్రవర్తన ఉంటే పిచ్చి అంటాము. బాబుకు విజన్ అంటే పిచ్చి ఎక్కువేననేది నా అభిప్రాయం. ఆ పిచ్చి పట్ల డెడికేషన్ గా కూడా వర్క్ చేస్తాడు. ఓ రకంగా పని రాక్షసుడే. అయితే అది ప్రజానీకానికి మంచిదా? కాదా? అనేది చూడాలి.

   వ్యవసాయం దండుగ. ఏ ఇజమూ లేదు టూరిజమే అనే పీక్ స్టేజికి బాబు పిచ్చ ఒకప్పుడు చేరుకుందనేది చరిత్ర. ఇప్పుడు పొలం పిలుస్తోందంటున్నాడు. రైతులకు ఐపేడ్ లు ఇస్తామనీ అంటున్నాడు. ముందు ప్రజలను చైతన్యపరచి ఆ తరువాత టెక్నాలజీని వాడుకోవాలి. వీటిమధ్య సమన్వయం సాధించకుంటే మంచిది. బురద గుంటను దాటేందుకు రాయి వేసుకుని దాటాకే బ్రిడ్జిలగురించి ఆలోచించాలి. ప్రజల చైతన్యాన్ని బట్టి తక్షణ కార్యక్రమాలు , ప్రజల మేలు కోసం దీర్ఘకాలిక విజన్ లు ఉండాలి.

   ఓ కార్పొరేట్ కంపెనీ నడిపేవాడికి ఉండే విజన్ వాడి స్వంతం. కానీ పరిపాలన అనేది వివిధ స్థాయీ భేదాలున్న ప్రజా సమూహం యొక్క అవసరాలను తీర్చడం. ఇక్కడ సంక్షేమాన్ని ఆల్ ఫ్రీగా మార్చినది అధికారంలోకి రాలేమన్న అభద్రత, విశ్వాసలేమి , అధికారం లేకపోతే బ్రతకలేని వైఖరి, ప్రజాసేవ అంటే కేవలం అధికారం ద్వారానే చేయగలమనుకునే అమాయకత్వం .... ఇలా చాలా కారణాలున్నాయి. ఇవన్నీ వదిలేసి ప్రజలను తప్పు బట్టడం సరికాదు.

   నిజమే మీరన్నట్లు ప్రజల చైతన్యంతో వ్యవహరించడం లేదు. అలా అని ప్రజలను వదిలేయలేం. వారిపై కక్ష గట్టలేము. ప్రజల చైతన్యం పెంచుకోరనడం తప్పు. వారిని చైతన్యపరచేలా అవగాహన కలిగేలా చేయాలి. చంద్రబాబును నమ్మే రెండోసారి ప్రజలు బ్రహ్మ రధం పట్టారు. ఆ తరువాత ప్రపంచబేంకుకు జీతగాడిగా మారడం - కరువు - చిరంజీవి ఓట్ల చీలిక వంటి అనేక కారణాలతో బాబు ఓడాడనేది నిజం. అంటే బాబుని కూడా ప్రజలు బాగానే ఆదరించారు. నెత్తినపెట్టుకున్న ప్రజలే అవసరమనుకుంటే ఎన్.టీ.ఆర్ ని, ఇందిరాగాంధీని ఓడించారు.

   ప్రజలను ఓటర్లుగా కాక పౌరులుగా గుర్తించాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలని ఎల్లప్పుడూ స్పృహలో ఉండాలి. ఇది దీర్ఘకాలికమైనా అదే శాశ్వతమైనది. పవర్ పాలిటిక్స్ కి అది పట్టదు. గెలిచినప్పుడు ప్రజావిజయం ఓడినప్పుడు ప్రజల మైండ్‌సెట్ మారాలనడం పరిపాటయింది. మారాల్సింది రాజకీయనేతల మైండ్ సెట్. పెంచాల్సినది ప్రజల చైతన్యం.

   Delete
  4. కొండల రావు గారూ, గుడ్ కామెంట్స్.
   ఇంతకు ముందు వ్యవసాయం దండగ అనడం ప్రతిపక్షం ప్రాపగాండా. ఇప్పటి కంటే మొదటి సారి బాగా చేసాడని నా అభిప్రాయం. ఇప్పుడు చేతల కంటే మాటలే ఎక్కువ కనబడుతున్నాయి. ఇక ఐపాడ్ గురించి బాగా చెప్పారు. అసలు చంద్రబాబు అనే కాదు మంత్రులు కూడా మాటలు కోటలు దాటిస్తున్నారు.వీళ్ళ మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అందరికీ కూడు, గూడు, నీళ్ళు, విద్య, వైద్యం చూసిన తరువాత ఐపాడ్ ల గురించి మాట్లాడితే బాగుంటుంది.

   Delete
  5. ధన్యవాదాలు శ్రీ గారు. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు కామెంట్ విషయంలో ప్రతిపక్షాల ప్రాపగాండా ఎక్కువే అనేది నిజమే. ఆ అవకాశం ఇచ్చింది మాత్రం బాబే. బాబుకు వ్యవసాయంపై తగినంత శ్రద్ధ లేనిదీ నిజమే. ప్రపంచబేంకు షరతుల మేరకే విద్యుత్ చార్జీల విషయంలో అవసరానికి మించి మొండిగా వ్యవహరించి ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నాడు.

   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల మాటలు కోటలు దాటుతున్న మాట వాస్తవం. వాస్త్వ పరిస్తితులను ప్రజలకు వివరించగలిగినవారే ఎక్కువ కాలం ప్రజాభిమానం చూరగొంటారు.

   Delete
 4. వంద రోజుల్లొ ఎవరూ సాధించేది ఏమీ ఉండదు.
  పైగా కొత్త రాష్ట్రం అన్ని జీరో నుంచి మొదలుపెట్టాలి.
  కాని ఇంకా వాగ్దానాల రోజుల్లోనే ఉండడం బాగోలేదు. చిన్నగానైనా చేతలు మొదలవ్వాలి.
  అయినా బాబుపై అందరికీ నమ్మకం ఉంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top