Reactions:

Post a Comment

 1. 1. సమగ్ర సర్వే – తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది ? ప్రజల స్థితిగతులు ఏంటి ? వారికి ఎలాంటి వసతులు కల్పిస్తే ? ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే తెలంగాణ అభివృద్దికి దోహద పడుతుంది అన్న ఆలోచనతో కేసీఆర్ మదిలో మెదిలిని అలోచన సమగ్ర కుటుంబ సర్వే. అదీ ఒకేరోజు. ఇలాంటి ఒక సంచలనాత్మక ఆలోచన కేసీఆర్ కు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో సంచలనం అవుతోంది. భవిష్యత్ లో దానిని దేశమంతా చేసినా ఆశ్చర్యం లేదు.

  2. తెలంగాణ ఉద్యోగులు – తెలంగాణ ఉద్యమంలో కలిసి మెలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు పనిచేయకుండా తప్పించుకుంటారని, ఇక వారు ఆడింది ఆట పాడింది పాట అని అంతా భావించారు. తెలంగాణ ఉద్యోగుల మీద ఆంధ్రా ఉద్యోగులు ఈ మేరకు దుష్ప్రచారం కూడా చేయడం దీనికి ఒక కారణం. అయితే కేసీఆర్ అవినీతిని సహించనని, బాధ్యతలు మరిస్తే వదిలి పెట్టనని స్పష్టం చేసేశారు. ఇక తెలంగాణ ఉద్యోగులు కూడా సమగ్ర సర్వేలో ఉచితంగా పాల్గొని తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని స్ఫష్టం చేశారు.

  3. సీమాంధ్ర ప్రజలు – తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఆంధ్రావారికి ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు కొందరు సీమాంద్ర నేతలు, ఉద్యోగులు ఇబ్బందిగా వాళ్లకు వాళ్లు ఫీలవడం తప్పిస్తే.. సామాన్య ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడిన దాఖలాలు లేవు. కొందరు అక్రమార్కులకు అండగా నిలిచేందుకు ఢిల్లీలో స్థాయిలో ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్ నాం చేశారు.

  4. ఇంజనీరింగ్ కళాశాలలు – కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సారి తెలంగాణలోని 174 ఇంజనీరింగ్ కళాశాలలు నిబంధనలకు అనుగుణంగా లేవని పక్కకుపెట్టారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులకు చెందిన కళాశాలలు ఉన్నా కేసీఆర్ పట్టించుకోలేదు. తెలంగాణలో అసలు అడ్మిషన్లు కాకుండా పోయిన కళాశాల ఒక్కటే ఒక్కటి. ఇదే ఆంధ్రాలో చేస్తో ఎన్నో కళాశాలలలో చేరేందుకు అసలు విద్యార్థులే రాలేదట. నాణ్యత లేని విద్యను ప్రోత్సహించే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

  5. తెలంగాణకు వాటర్ గ్రిడ్ – ఇది కూడా కేసీఆర్ కు వచ్చిన గొప్ప ఆలోచనలలో ఒకటి. తెలంగాణకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న దానికి అప్పుడే ప్రతిపాదనలు చేసి కేంద్రం దీనికి నిధులు అందించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు కేసీఆర్.

  6. మజ్లిస్ పార్టీ – తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మజ్లిస్ తో టీఆర్ఎస్ స్నేహహస్తం కోరుకోవడంతో కేసీఆర్ ను అందరూ అనుమానపు చూపులు చూశారు. కానీ మూడు నెలలు తిరగ్గానే కేసీఆర్ ను కాదని మజ్లిస్ మనలేని పరిస్థితిని కేసీఆర్ సృష్టించారు. హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ మీద ఈ మూడు నెలల కాలంలో అనూహ్యంగా ఆదరణ పెరిగింది.

  7. వినాయక చవితి – నిమజ్జనం – హైదరాబాద్ నగరంలో ఈ సారి వినాయక చవితి పండగకు ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలు ప్రజలను అలరించాయి. ఇక నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడి మీద ఆకాశం నుండి పూలు కురిపించి ఇక్కడి ఉత్సవాలకు జాతీయస్థాయిలో ఆకర్షణ తీసుకువచ్చారు కేసీఆర్.

  8. గోల్కొండ కోటలో స్వాతంత్ర వేడుకలు – గోల్కొండ కోటలో స్వాతంత్ర వేడుకలు చేయాలన్న ఆలోచన ఒకటి వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు విమర్శలు గుప్పించాయి. అయితే ఢిల్లీలో ఎర్రకోట మీద వేడుకలు చేస్తే లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకని ప్రశ్నించి ఆ వాదనను తిప్పికొట్టి వేడుకలు అక్కడే ఘనంగా నిర్వహించారు.

  9. బడ్జెట్ – బడ్జెట్ అంటే ప్రతి ఏడాది ప్రభుత్వం ఓ ప్రహసనంలా చేసే చర్య అన్న దానికి పుల్ స్టాప్ పెట్టేందుకు కేసీఆర్ సిద్దమయ్యాడు. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాయిదా వేసి తెలంగాణ బడ్జెట్ ఉపయోగకరంగా ఉండాలని ప్రత్యేకంగా 14 శాఖలకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయించి మరీ బడ్జెట్ కు రూపుదిద్దుతుండడం విశేషం.

  10. అత్యవసర సమయాలలో స్పందన – హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన సమయంలో గానీ, మెదక్ జిల్లాలో రైలు ఢీ కొట్టిన దుర్ఘటనలో విద్యార్థులు చనిపోయిన విషయంలో గానీ కేసీఆర్ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులను బాధితుల వద్దకు కేసీఆర్ పంపించారు. గాయపడిన వారికి మెరుగయిన చికిత్స ఇప్పించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ విషయంలో ఎక్కడా తేడా రాకుండా ఖచ్చితమయిన చర్యలు తీసుకున్నారు.

  Source: http://madeintg.com/?p=783

  ReplyDelete
 2. సమగ్ర సర్వే సాధ్యమా? చేయగలరా? అనే సందేహాలు, ప్రశ్నలను పటాపంచలు చేస్తూ 99% వివరాలు ఒకే రోజున సేకరించడం అపూర్వం. తెలంగాణ సమాజం సంఘటిత శక్తిని ఆగస్టు 19న జరిగిన సమగ్ర సర్వే చాటి చెప్పింది.


  సంక్షేమ కార్యక్రమాలు

  - ప్రకృతి వైపరీత్యాల నష్టానికి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
  - రైతుల వ్యవసాయ రుణాల మాఫీ
  - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం
  - వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు 1500 పింఛన్,బీడీ కార్మికులకు వెయ్యి భృతి

  - ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను ఎత్తివేత

  సామాజిక న్యాయం

  - దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ
  - మార్కెట్ కమిటీల్లో బీసీ, దళిత, గిరిజనులకు కోటా
  - దళిత, గిరిజన మైనార్టీ యువతులకు వివాహ ఆర్థిక సహాయం
  - మైనార్టీ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు
  - చేనేత, పవర్‌లూం కార్మికులకు రుణమాఫీ
  - క్రిస్టియన్లకు 3 శాతం రిజర్వేషన్లు


  తీసుకున్ననిర్ణయాలు


  - అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయానికి క్యాబినెట్ ఆమోదం.
  - ఉద్యమ సమయంలో నమోదైన కేసుల ఎత్తివేతకు నిర్ణయం.
  - రైతుల వ్యవసాయ రుణాల మాఫీ పథకం.
  - చేనేత పవర్‌లూం కార్మికుల రుణమాఫీ.
  - వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు చెల్లింపునకు నిర్ణయం.
  - వికలాంగులకు 1500, బీడీ కార్మికులకు వెయ్యి భృతి
  - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం.
  - గిరిజన తండాలు, గూడెంలను గ్రామపంచాయతీలుగా నిర్ణయం.
  - ఆదుకునేందుకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరిపించాలని నిర్ణయం.
  - పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం.
  - ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఆమలుకు నిర్ణయం.
  - రాష్ట్రంలో 20 జిల్లాల ఏర్పాటుకు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ
  - గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారికోసం కేరళ తరహా ప్యాకేజీ
  - మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు. వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలివ్వాలని నిర్ణయం.
  - గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం.
  - గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం.
  - ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రాష్ట్రస్థాయి సలహా మండలి ఏర్పాటు
  - చేనేత కార్మికులు, పవర్‌లూమ్ కార్మికులకు రుణాలు మాఫీ
  - చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తీర్మానం తేవాలని నిర్ణయం.
  - క్రిస్టియన్లకు 3 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం. చర్చిల నిర్మాణానికి స్థానికంగానే అనుమతి.

  Source: http://www.heytelangana.in/2014/09/kcr-100-days-report-card.html

  ReplyDelete
 3. ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు


  - గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణ.
  - విజయవంతంగా సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి
  - దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ప్రారంభం.
  - మన ఊరు-మన ప్రణాళిక కింద ప్రజల అభిప్రాయాల సేకరణ.
  - బడ్జెట్ రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ కమిటీ కసరత్తు.
  - బతుకమ్మ, బోనాలకు రాష్ట్ర పండుగ హోదా. అధికారికంగా నిర్వహణ.
  - అధికారికంగా పీవీ జన్మదిన వేడుకల నిర్వహణ
  - అగ్రికల్చరల్ వర్సిటీకి జయశంకర్ పేరు, ప్రారంభం.
  - ప్రకృతి వైపరీత్యాల నష్టానికి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ.
  - ఆటోలు, ట్రాక్టర్ ట్రాలీలపై రవాణా పన్ను ఎత్తివేత జీవో జారీ.
  - ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్.
  - ఎవరెస్టు విజేతలకు నగదు బహుమతులు పంపిణీ.
  - అంతర్జాతీయ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేత.
  - పోలీసు కమిషనరేట్లకు ఆధునిక వాహనాలు పంపిణీ.
  - ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో అవకతవకలపై సీఐడీ విచారణ
  - మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు.
  - ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు.
  - మహిళలపై దాడులు, అత్యాచారాల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ.
  - పరిశ్రమల ఏర్పాటుకు 5 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు.
  - వచ్చే ఏడాదికి 2800 మెగావాట్ల విద్యుత్ ప్రణాళిక.
  - తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ.

  ప్రభుత్వ విధానాలపై నిర్ణయాలు

  - పారదర్శకతకోసం టెండర్లలో సంస్కరణలు తీసుకు రావాలనే నిర్ణయం.
  - సచివాలయంలో కొత్త బిజినెస్ రూల్స్ రూపొందించాలనే నిర్ణయం.
  - తెలంగాణ విద్యార్థులకు ఫాస్ట్ పథకం అమలుకు నిర్ణయం.
  - తెలంగాణ గ్రామాలకు తాగునీటికోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు నిర్ణయం.
  - రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలపై వ్యాట్, నాలా పన్నులను రద్దు నిర్ణయం.
  - సింగిల్ విండోతో కొత్త పారిశ్రామిక విధానం.
  - కోట్లాది మొక్కలతో హరితహారం పథకం.
  - జర్నలిస్టుల సంక్షేమానికి పదికోట్ల రూపాయలతో సంక్షేమ నిధి ఏర్పాటు.
  - ఫార్మా సిటీ, సినిమా సిటీల ఏర్పాటుకు నిర్ణయం.
  - దాశరథి పేరిట అవార్డు, కుమారుడికి ఉద్యోగ కల్పన.
  - మార్కెట్ కమిటీల్లో బీసీ, దళిత, గిరిజనులకు కోటా.
  - దళిత, గిరిజన మైనార్టీ యువతులకు వివాహ ఆర్థిక సహాయం
  - హైదరాబాద్‌లో మాస్టర్ ప్లాన్ అమలుకు నిర్ణయం.
  - మెట్రో రైల్‌ను 200 కిలోమీటర్లకు విస్తరించాలని నిర్ణయం.
  - హైదరాబాద్ నగరాన్ని వైఫై, 4జీ నగరంగా తీర్చిదిద్దాలనే నిర్ణయం.
  - వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాలను సమగ్రాభివృద్ధికి నిర్ణయం.
  - నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో వ్యవసాయ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం.
  - రవీంద్రభారతి అభివృద్ధికి రూ.కోటి
  - కాళోజీ పేరిట వరంగల్‌లో స్టేడియం.

  Source: http://www.heytelangana.in/2014/09/kcr-100-days-report-card.html

  ReplyDelete
 4. పరిపాలనా దక్షుడే. తన విద్వేష రాజకీయాలను ప్రక్కన పెడితే చరిత్ర లో ఒక గొప్ప నాయకుడిగా మిగిలిపోతాడు.

  ReplyDelete
  Replies
  1. అవును బాబు గారు. కే.సీ.ఆర్ అలా మారతాడని ఆశిద్దాం.

   Delete
 5. శ్రీకాంత్ చారి గారు,

  ఖమ్మం ఎస్.బీ.ఐ.టీ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్ధులకు ఫీజు రీ-ఎంబెర్స్మెంట్ క్రింద రావలసిన మొత్తం ఇవ్వలేదని సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు యాజమాన్యం వారు. గేట్ కు అప్లై చేయడానికి సర్టిఫికెట్లు కావాలి? ఇన్ని చేసిన కే.సీ.ఆర్ ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో ఎందుకు ఆటలాడుకుంటోంది. వారికి సర్టిఫికెట్లు కావాలంటే ముందు ఫీజు కట్టి తీసుకోండి కే.సీ.ఆర్ ప్రభుత్వం ఇస్తుందో లేదో మాకు తెలీదు కదా? ఇస్తే తిరిగి ఇస్తామంటున్నారు. అలా కొందరు విద్యార్ధులు ఫీజులు కట్టారు కూడా. ఒక్కరోజులో అద్భుతంగా (?) సర్వే చేయించిన ఘనత వహించిన నేతకు తెలంగాణా బిడ్డలైన విద్యార్ధులతో ఆడుకోవడం బాగుందా?

  కేవలం ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి.

  ReplyDelete
  Replies
  1. కొండలరావు గారు,

   మీరు చెప్తున్నది స్వర్ణభారతి కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్, మదిలపల్లి, ఖమ్మం జిల్లా గురించి అయితే అది బ్యాన్ చేయబడిన ఘనత వచించిన 174 కాలేజీలలో ఒకటి. అందుకే ఆ కాలేజీ వారికి అంత గగుర్పాటు (తమకు ఇక ఫీజు రీ-ఇంబర్స్ మెంటు రాదేమో నని).

   అయినప్పటికీ ఆ విద్యార్థులకు కలిగిన సంకటం నివారించ వలసిందే.

   Delete
  2. శ్రీకాంత్ చారి గారు,
   మీరు చెప్పే కాలేజీ వేరు. అది కూడా వీళ్లదే అనుకుంటాను.నేను చెప్పేది sbit svarnabharathi institute of technology గురించి. మా అమ్మాయి ఆ కాలేజిలోనే చదివింది.

   చివరి సంవత్సరం ఫీ రీ ఎంబెర్స్మెంట్ కొందరికి (52 మంది విద్యార్ధులకు) ఆపారు. సరయిన కారణం ప్రభుత్వం చెప్పడంలేదని అంటున్నారు. ఆంధ్రా - తెలంగాణా సర్వే తేలాక ఇస్తారేమో అంటున్నారు. ఈలోగా డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోమంటున్నారు. కాలేజిలపై చర్యలు తీసుకోదలస్తే విద్యార్ధులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మా కుటుంబమైతే తెలంగాణాలోనే పుట్టాము. కే.సీ.ఆర్ కంటే మాకే తెలంగాణా వారమనడానికి అర్హత ఎక్కువ ఉంది.

   1956 నిబంధనే తప్పు. పైగా కొందరికి మంజూరి చేసి కొందరికి చేయకపోవడం తో యాజమాన్యాలు ముద్ను ఫీజులు కడితే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలాంటి తుగ్లక్ చర్యలు మానుకోవాల్సిన అవసరమైతే కే.సీ.ఆర్ ప్రభుత్వానికి ఉన్నది.

   నేనే కాలేజికి వెళ్లి కనుక్కున్నాను. అక్కడ యాజమాన్యం వారు మాకే 4.95 కోట్లు ఆపారని అంటున్నారు. కే.సీ.ఆర్ ఏమి చేస్తాడో ఎవడికీ తెలీదు. మేమేమీ చేయలేము. మీరైతే ఫీజు కట్టాల్సిందే అంటే సగం ఫీజు కట్టి TC వరకు ఆపి మిగతా సర్టిఫికెట్లు తెచ్చుకున్నాము. అలా కట్టలేనివారి పరిస్తితి దయనీయంగా ఉన్నది. వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top