తెలంగాణలో నిజాం పాలన అంతం-వాస్తవాలు

తెలంగాణలో కమ్యూనిస్టుల నాయకత్వంలో పాలన ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతోందనీ, ఆ చైతన్యం ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించివచ్చు అన్న భయం ఏర్పడిన తర్వాతే హైదరాబాద్‌ సంస్థానాన్ని బలప్రయోగాలతో నయినావిలీనం చేసుకోవాలని యూనియన్‌ ప్రభుత్వం నిశ్చయించుకున్నది. 

మధ్యయుగాల నాటి అమానుష, ఆటవిక దుర్మార్గాలతో పరిపాలన సాగించిన నిజాం ప్రభుత్వం కూలిపోయిన రోజు సంతోషదాయకమైంది. సభలు, ఉత్సవాలు జరుపుకొని నిజాం పాలననాటి విధానాలను సమూలంగా తుడిచిపెట్టడానికి పునరంకితం కావాల్సిన రోజు. ఆవిధానాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి సిద్ధపడకపోవడంతో పాటు, ఓటు బ్యాంకు ఎత్తుగడలకు పెద్దపీట వేసిన గత ప్రభుత్వాలు నిజాం పాలన పతనమైన రోజున పండగ జరుపుకోవడానికి ఇష్టపడలేదు. నిజాం ప్రభుత్వాన్ని తాము కూల్చామని భుజాలు చరచుకొనే కాంగ్రెస్‌గానీ, అనంతరం కొంత కాలం అధికారం నెరపిన తెలుగుదేశం పార్టీగాని ఆ వైపు వెళ్లలేదు. ప్రస్తుత టిఆర్‌ఎస్‌దీ అదే ధోరణీ. బిజెపి మాత్రం ఈ రోజును విమోచన దినం గా జరుపుకోనున్నట్లు ప్రకటించింది. నిజాం నవాబు ముస్లిం కనుక ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్నది దాని ఎత్తుగడ. నిజాం నవాబు ముస్లిమే అయినప్పటికీ, ఆయన పాలనకు పునాదులుగా నిల్చిన జమీందా ర్లు, దేశముఖ్‌లు హిందువులేనన్న సంగతి ప్రజలు విస్మరించాలని బిజెపి కోరిక.చివరిరోజు దాకా బీరాలు పలికిన నిజాం పాలన యూనియన్‌ సైన్యం ప్రవేశంతో పేకమేడలా కూలిపోయింది.ఆ పతనానికి నాందీప్రస్తావన చేసింది కమ్యూనిస్టులు. 1948 సెప్టెంబర్‌ 13న యూనియన్‌ సైన్యాలు హైదరాబాదు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నప్పుడుకమ్యూనిస్టులు స్వాగతించారు. తెలంగాణ సాయుధపోరాటాన్ని నడిపిన నాయకుల్లో ప్రముఖుడైన పుచ్చలపల్లి సుందరయ్య తన ఆత్మకథలో ఆనాటి సంగతులను ఇలా ప్రస్తావించారు. 

1948 సెప్టెంబర్‌ 13న కేంద్రం పోలీసు చర్య తీసుకున్నప్పుడు నిజాం పాలనను అంతం చేసే అంశం వరకూ సాయుధ జోక్యాన్ని స్వాగతిస్తూ పిండిప్రోలు నుంచి మేము ఒక సర్క్యులర్‌ ఇచ్చాము. అదే సమయంలో పోలీసు చర్య మాకు వ్యతిరేకంగా మారవచ్చుననే సందేహం వెలిబుచ్చాము. సాయుధదళాలు వెనువెంటనే సైన్యాలతో బహిరంగ ఘర్షణకు దిగకూడదని అందులో సూచించాము. కాకపోతే ఆ అరాచక పరిస్థితిని ఉపయోగించుకొని రజాకార్లపైన నిజాం సాయుధ పోలీసులపైన దాడి చేసి వారి నుంచిసాధ్యమైనన్ని ఆయుధాలు వశపర్చుకోవాలని చెప్పాము. అలా చేయడం ద్వారా ఒక వేళ భారత సైన్యం కనక తుపాకులు మనపైకి ఎక్కుపెడితే ఎదుర్కోవడానికి సిద్ధం కావచ్చునని భావించాము. అంతకు మందు సవివరమైన చర్చ జరిగిన తర్వాతే ఈ పంథా చేపట్టాము. 'పోలీసుచర్య' జరగవచ్చునని కొంచెం మందుగానే ఊహించగలిగాము. వివిధ మార్గాల ద్వారా దానికి లోలోపల సన్నాహాలు చేస్తున్నారని కూడా పసిగట్టాము. పరిస్థితి మరీ ఘోరంగా మారి భారత ప్రభుత్వం సాయుధ విప్లవకారులపై దాడికి దిగితే మా వైఖరి ఎలా వుండాలి అన్న విషయంపై అభిప్రాయ భేదాలు ఎమీ మాలో లేవు గనుక మన మొదటి కోర్కె నిజాం పాలనను కూలదోయడమే. మనం పోలీసు చర్యను వ్యతిరేకించకూడదనే అంశంపై మాకు స్పష్టతవుంది. అలాటి పంథా తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులేమిటో చెబుతాను. మొదటి నుంచి స్వతంత్య్ర భారతదేశంలో విలీనానికి నైజాం అంగీకరించడంలేదు. అందుకే భారత సైన్యం జోక్యంచేసుకొని, నిజాం రాజరికాన్ని తోసివేసి భారతదేశంలో నైజాం సంస్థానాన్ని కలిపివేయాలి అని మేము కోరుతూ వచ్చాము.

కమ్యూనిస్టు పార్టీ ఊహించినట్లుగానే ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించింది. ప్రజా పోరాటానికి జడిసి పారిపోయిన భూస్వాములకు అండగా నిల్చింది. జమిందార్లు.,భూస్వాములు ఖద్దరు వేషాల్లో తిరిగి గ్రామాల్లోకి ప్రవేశించారు. ప్రజలు స్వాధీనం చేసుకొని, పంచుకొన్న భూములను ప్రభుత్వం తిరిగి భూస్వాములకు ఇప్పించింది. భూములను సంరక్షించుకోవడానికి పోరాడిన రైతులపై, కమూనిస్టు పార్టీపై దమనకాండ సాగించారు. రజాకార్లు ఎంతటి అకృత్యాలకు పాల్పడ్డారో, యూనియన్‌ సైన్యం కూడా అంతే అకృత్యాలకు పాల్పడినట్లు చరిత్ర చెప్తోంది. నిజాం నవాబుకు మాత్రం 'రాజప్రముఖ్‌' బిరుదునిచ్చి, రాజభరణాలిచ్చి సత్కరించారు. కాశీంరజ్వీని గృహ నిర్భంధంలో ఉంచి తూతూమంత్రం చేసి శిక్షపడకుండా చేశారు. తెలంగాణ పోరాటానికి మద్దతు నిచ్చిన క్ర్రిష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని ఊళ్లపై, ప్రజలపై కూడా యూనియన్‌ సైన్యం ఆ సమయంలో అమానుషంగా ప్రవర్తించింది. తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిపిన పోరాటానికి అప్పటి జనసంఫ్‌ు, ఆరెస్సెస్‌లకు ఏ సంబంధములేదు. బిజెపి వారు తమకుతామే భుజకీర్తులు పెట్టుకొంటున్నారు. సర్దార్‌ పటేల్‌ వల్ల మాత్రమే హైదరాబాద్‌ విమోచన జరిగిందని,ఆ సర్దార్‌ పటేల్‌ తమవాడని చెప్పుకుంటున్నారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఒక అడుగు ముందుకేసి పటేల్‌ గుజరాతి కనకే అంతటి పనిచేయగలిగాడని తనకు తానే శభాష్‌ చెప్పుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం రాగానే నిజాం ప్రభుత్వంతో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం యధాతధ ఒప్పందం చేసుకొంది. నీ దగ్గరకు రాబోమని భరోసా ఇచ్నింది. యధాతధ ఒప్పందం జరిగినప్పుడు కూడా హోం మంత్రిగా సర్దార్‌పటేల్‌ ఉన్నాడు. ఆ ఒప్పందానికి పటేల్‌కు ఎలాంటి సంబంధంలేదని ఇప్పుడు బిజెపి వాదిస్తే చెల్లదు. మహాత్మాగాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్‌పై నిషేధం విధించడం కూడా హోం మంత్రి పటేల్‌ ద్వారా జరిగింది.నిషేధం నుండి బయటపడటానికి ఆనాడు ఆరెస్సెస్‌ తాము ఇకముందు రాజకీయాల్లో పాల్గొనబోమని, కేవలం ఒక సాంస్కృతిక సంస్థగా ఉంటామని రాతపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత షరా మామూలుగానే హామీని తుంచేశారు. నేడు బిజెపి పూర్తిగా ఆరెస్సెస్‌ ఆదుపాజ్ఞ ల్లోనే పని చేస్తున్నది. తెలంగాణలో కమ్యూనిస్టుల నాయకత్వంలో పాలన ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతోందనీ, ఆ చైతన్యం ఇతర ప్రాంతాల్లోకి కూడా విస్తరించివచ్చు అన్న భయం ఏర్పడిన తర్వాతే హైదరాబాద్‌ సంస్థానాన్ని బలప్రయోగాలతో నయినా విలీనం చేసుకోవాలని యూనియన్‌ ప్రభుత్వం నిశ్చయించుకున్నది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బిజెపి బలం పెంచుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. సెటిల్‌మెంట్లు చేస్తూ, మహిళలపై అత్యాచారాలకు తలపడే స్నేక్‌ గ్యాంగ్‌కు కూడా మతాన్ని ఆపాదించి ప్రయోజనం పొందాలని చూస్తోంది. ఆ గ్యాంగ్‌పై కఠినాతికఠిన చర్యలు తీసుకోవలసిందే.ఈ విషయంలో సస్పెండయిన ఇద్దరు పోలీసు అధికారులు ముస్లింలు కాదన్న సంగతి కూడా దృష్టిలో ఉంచుకోవాలి.నేరస్తులను నేరస్తులుగానే చూడలి కానీ వారిలో కూడా మతం వెతకడం రాజకీయ ప్రయోజనం కోసమే. టెన్నిస్‌లో అంతర్జాతీయంగా ఎన్నో విజయాలను సాధించిన సానియామీర్జాను కూడా వదలిపెట్టలేదు. పాకిస్థాన్‌ క్రీడాకారుణ్ణి పెళ్ళాడిన సానియాను గౌరవించడమేమిటి అని వారి ప్రశ్న. ముస్లిం ఉగ్రవాద సంస్థల పట్ల శాంతి కాముక ప్రజల్లో ఉన్న న్యాయమైన హేయభావాన్ని స్వీయ ప్రయోజనానికి ఉపయోగించుకోవడానికి బిజెపి ఇలాంటి ఎత్తులు వేస్తోంది. అలాగే నిజాం నవాబు పాలనను ముస్లిం పాలనగా మాత్రమే ప్రజలు పరిగణించాలని బిజెపి ఆశిస్తోంది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ముస్లింలు జరిపిన పోరాటాలను అది పరిగణలోకి తీసుకోదు. తన రాజకీయ అవసరాన్ని బట్టి తుర్రేబాజ్‌ ఖాన్‌లాంటి వారిని ప్రస్తావించినా,హైద్రాబాద్‌ కమ్యూనిస్టు పార్టీని స్థాపించి నిజాం నవాబు పాలనపైన పోరాడిన ముస్లింల చరిత్రను అది మరుగు పర్చడానికి చూస్తుంది.హైద్రాబాదులో నిజాం పాలనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్‌ అసోయేషన్‌ స్థాపించిన వారిలో ముస్లింలే కీలక పాత్ర వహించారు. ప్రొఫెసర్‌ ఆలంకుంద్‌మిరి, మగ్దూంమొయిద్దీన్‌,జావెద్‌ రజ్వీ లాంటి ఎందరో ముస్లిం మేధావులు కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ స్థాపనలో ఉన్నారు.దానికి ముందు రజాకార్ల చేతిలో బలైన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌ కూడా ముస్లిమే. తన పత్రికలో నిజాంపాలనను ఏకిపారేస్తున్నందుకు రజాకార్లు ఆయనను హత్య చేశారు. సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ, సోవియట్‌ రష్యా సాధించిన విజయాలతో, స్వాతంత్రో ద్యమంతో ఉత్తేజితులైన ఎంతో మంది ముస్లిం మేధావులు ఉత్తరప్రదేశ్‌ లాంటి ప్రాంతాల నుండి హైదరాబాదుకు వచ్చి ఉర్దూ పత్రికలు నెలకొల్పి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడారు. చైతన్యవంతులైన అలాంటి ముస్లింల పట్ల కూడా నిజాం సర్కార్‌ కర్కశంగానే వ్యవహరించింది. ఆనాటి ఉస్మానాబాద్‌ కలెక్టర్‌ మొహమ్మద్‌ హైదర్‌ లాంటి ముస్లింలు ఎందరో కాశింరజ్వీని వ్యతిరేకించారు. తెలంగాణ సాయుధ పోరాటం ఆరంభదినాల్లో భూస్వాముల దురాగతానికి బలైన బందగీ కూడా ముస్లిమే. కొన్ని రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొనలేదని సాకుతో ఒక ముస్లిం విద్యార్థిపై దాడి చేశారు. అతనిపై దాడి చేసి ఎంఐఎంను బరిలోకి లాగాలన్నది దాడి చేసిన వారి ఉద్దేశ్యం. విద్యార్థుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ఇది ఉపయోగపడ్తుంది. ఇలా ఎక్కడ వీలైతేె అక్కడ విద్వేషాలను సృష్టించి జిహెచ్‌ఎంసితో పాటు ఇతర ఎన్నికలకు ఉపయోగించుకోవాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. మీడియాలో ఒకభాగం కూడా ఇందుకు అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరం.కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు బిజెపితో దోస్తీ చేసిన టిడిపి నాయకులు ప్రభువును మించిన ప్రభుభక్తి చూపెడుతున్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ వైఖరి కూడా సమర్ధనీయంగా లేదు. ఐలమ్మపోరాటమే తనకు స్ఫూర్తి అని ప్రకటించుకొన్న ఆ పార్టీ నిజాం ప్రభుత్వ పతనం రోజును ఎందుకు ప్రభుత్వ కార్యక్రమంగా జరపడం లేదు? అధికారంలోకి రాకముందు సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వపరంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసిన వారు ఎందుకు మౌనం వహించారు. నిజాం నవాబు సమాధి దగ్గరికి వెళ్లి కేసీఆర్‌ ఎందుకు నివాళులు అర్పించినట్లు ఇటు వంటి ప్రశ్నలకు టిఆర్‌ఎస్‌ సమాధానం చెప్పవలసి ఉంది. 
(from prajasakthi daily)
Reactions:

Post a Comment

 1. రాజశేఖరరెడ్డి నిజామ్‌ని పొగిడినప్పుడు ఒక్క సమైక్యవాది కూడా విమర్శించలేదు. ఇప్పుడు కె.సి.ఆర్.ని తిట్టడానికే సెప్తెంబర్ 17ని గుర్తు తెచ్చుకుంటున్నారు. MIM నిజాం బూజుని నమ్ముకునే పార్తీ, వాళ్ళకి తెలంగాణా రావడం ఇష్టం లేదు. ఈ విషయం తెలిసే రాజశేఖరరెడ్డి నిజాం అనుకూల భావజాలాన్ని వ్యాప్తి చేసాడనేది నిజం కాదా?

  ReplyDelete
  Replies
  1. సమైక్యవాదైనా, విభజనవాదైనా నిజాముని పొగడడమనేది దుర్మార్గమే. ఒక్క సమైక్యవాదీ రాజశేఖరరెడ్డిని విమర్శించలేదని ఎవడు చెప్పాడు. రాజశేఖరరెడ్డిని చూసినా, కే.సీ.ఆర్ ని చూసినా భయంతో ఉచ్చలు పోసుకోవాల్సిన అవసరం లేకుంటే కే.సీ.ఆర్ - వై.ఎస్.ఆర్ లు దుర్మార్గంగా నిజాం కీర్తనలు పాడితే వంత పాటలు పాడాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం పైనా అదీ అంతక్రితం సెప్టెంబర్ 17 ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసినవారిని అడుగుతున్న ప్రశ్న. దానికి మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారో అసలర్ధం కావడం లేదు.

   ఇప్పుడు మీరు కే.సీ.ఆర్ కు వంత పాట పాడతారా? ఇప్పుడు అధికారంలో కే.సీ.ఆర్ ఉన్నాడు. అధికారంలోకి రాకముందు చేసిన డిమాండ్ సంగతేంటంటే ఏమాత్రం సిగ్గుపడకుండా, తడుముకోకుండా కమ్యూనిస్టునని చెప్పుకుంటూ ఇలా కామెంట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉన్నది.

   అసలింతకీ కే.సీ.ఆర్ ప్రభుత్వ వైఖరిపైనా, కే.సీ.ఆర్ అధికారంలోకి రాకముందు చేసిన డిమాండ్ పైనా మీ అభిప్రాయమేంటి ప్రవీణ్? మీరు కూడా నిజాం కు నివాళులర్పిస్తారా? అధికారికంగా ప్రభుత్వపరంగా సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని నిర్వహించమంటారా? ఇది సమైక్యవాదులో చనిపోయిన రాజశేఖరరెడ్డో తేల్చాల్సినది కాదు. ప్రస్తుతమైతే కే.సీ.ఆర్ ప్రభుత్వమే చేయాలి. ఇప్పుడు చేయలేదు వచ్చే ఏడాదికైనా చేయాల్సినదే. లేకుంటే బీ.జే.పీ వారారోపిస్తున్నట్లుగా ఎం.ఐ.ఎం ప్రపకం కోసమా? మరో కారణమేదైనా ఉన్నదా? ఎందుకు చేయడం లేదన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి.

   Delete
  2. కొండల రావ్ గారూ.. శాంతించండి.. :-)
   ఇంత తీవ్రమైన కామెంట్ మీరు రాసింది ఇదివరకూ నెను చూడలేదండీ..!!
   బహుషా మీకూ కూడా విసుగొచ్చినట్లుంది.. :-)))

   Delete
 2. కె.సి.ఆర్. కంటే ముందు నిజామ్‌ని పొగిడింది రాజశేఖరరెడ్డి. అది కూడా తెలంగాణాకి వ్యతిరేకంగా ముస్లింలని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో అతను అలా చేసాడు. కె.ఐ.ఆర్.ని చెప్పుతో కొడితే రాజశేఖరరెడ్డికి చెప్పుల దండ వెయ్యాల్సి వస్తుంది. ఈ విషయం సమైక్యవాదులకి తెలియదా లేదా తెలియనట్టు నటిస్తున్నారా?

  ReplyDelete
  Replies
  1. ఎవడినీ చెప్పుతో కొట్టొద్దు. ఎవడికీ చెప్పులదండలు వేయొద్దు గానీ విషయంపై సూటిగా చర్చలు చేయండి.రాజశేఖర రెడ్డి నిజాముని పొగిడితే అది అతగాడ్నడగాలి. లేదా కాంగ్రెస్‌నో , జగన్ కాంగ్రెస్ నో అడగాలి. రాజశేఖర రెడ్డి లేడు. కే.సీ.ఆర్ బ్రతికే ఉన్నాడు. సీ.ఎం గా ఉన్నాడు. కే.సీ.ఆర్ ప్రభుత్వ వైఖరి పై కమ్యూనిస్టునని చెప్పుకునే మీ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అర్ధం పర్ధం లేని వ్యర్ధ వాదన ఎందుకు? సమైక్యవాదులు నిజాముని వ్యతిరేకించవారూ, విభజనవాదులు నిజాముని పొగిడేవారనా మీ అభిప్రాయం? ఇక్కడ నటించడేమిమిటో పిచ్చి పీక్ స్టేజికి వెళ్లినవారిలా మాట్లాడుతున్నారు మీరు. చెప్పగలిగితే చెప్పే దమ్ముంటే మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పండి. ప్రతీదానికీ పాలకుల భజన చేస్తూ ఎదుటివారిని నటిస్తున్నామనాల్సిన పని లేదు.

   Delete
 3. ఇంత కాలం గాడిదలకి పళ్ళు తోమినవాళ్ళకి ఇప్పుడే విమోచన దినం ఎందుకు గుర్తొచ్చిందనేదే నా ప్రశ్న.

  ReplyDelete
  Replies
  1. మీలాంటి విచిత్రవాదులకి తప్ప అందరూ ప్రతీ ఏడాదీ ఈ రోజున ఆ విషయాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అడిగినదానికి తప్ప అడ్డదిడ్డమైన పోలికలు వాదనలు చేయడమెందుకు? ఆ విషయాలు కనపడడం లేదంటే బహుశా మీరే గాడిదలకు - గుర్రాలకు పళ్లు తోమడమో పాలు పితకడమో చేస్తుండవచ్చు.

   Delete
 4. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్‌ 17ను ప్రభుత్వపరంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసిన వారు ఎందుకు మౌనం వహించారు?

  ప్రశ్నలోనే గడబిడ వుంది. వారు ఇంతకు మూడు డిమాండ్ చేశారు కాబట్టి ఇప్పుడు నిర్వహించాలా? లేక నిర్వహించడం సరియైనది కాబట్టి నిర్వహించాలా?

  తెలంగాణావాదులు సెప్టెంబర్‌ 17 ను అధికారికంగా నిర్వహించమని కోరింది నిజమే. కాని ఆ సందర్భంలో జరిగిన JAC భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. విలీనం, విద్రోహం, విమోచనలలో ఏది నిర్వహించాలో ఒక అంగీకారం కుదరలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి.

  ప్రజాశక్తి వారి వ్యాసంలో కూడా స్పష్టత కొరవడింది. వారు సెప్టెంబర్‌ 17 న ఏరకమైన పండగ జరపమంతున్నారో అర్థం కాలేదు.

  ముందు బిజెపి చెప్పే విమోచన సంగతి చూద్దాం:
  సెప్టెంబర్‌ 17 న భారత సైన్యం హైదరాబాదు సంస్థానాన్ని ఆక్రమించింది. ఆక్రమించిన తర్వాత నిజాంకి రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చి 1952 వరకూ ఆయన రాజముద్ర కిందే పరిపాలన సాగేలా చేసింది. రెండు సంవత్సరాలు జనరల్ చౌదరి, రెండు సంవత్సరాలు వెల్లోడి ఉన్నా రాజముద్ర మాత్రం నిజాందే. అటువంటప్పుడు అది విమోచన ఎలా అయింది? నిజాం చేసిన ఆకృత్యాలకు ఆయనకు శిక్ష వేయకుండా అధికార పీఠం ఎలా ఇచ్చారు?

  ఇక విలీనం సంగతి:
  టెక్నికల్ గా సెప్టెంబర్‌ 17 కి ముందు కూడా హైదరాబాదు భారత ప్రభుత్వానికి సామంత రాజ్యమే. భారత ప్రభుత్వ ప్రతినిధి కె ఎం మున్షీ గవర్నరు జరనల్ గా ఉండడమే అందుకు నిదర్శనం. నిజాం చేతిలో అధికారం ఉన్నంత వరకు భారత ప్రభుత్వం కిమ్మనలేదు. ఉత్తర తెలంగాణా మరాట్వాడాలు రజాకార్ల చేతుల్లోకి, దక్షిణ మధ్య తెలంగ్నాలు కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లి పోయి నిజాం దాదాపు అధికారం కోల్పోయిన సందర్భంలో తన సామంతున్ని రక్షించడానికి మాత్రమే భారత సైన్యం ప్రవేశించింది. అందుకు అనుగుణంగానే నిజాంని శిక్షించలేదు, పైగా గౌరవ పురస్కారాలు సమర్పించింది. రజాకర్లతో కలిపి కమ్యూనిస్టు ఉద్యమకారులను కూడా ఊచకోత కోసింది. కమ్యూనిస్టులు వెళ్ళగొట్టిన దొరలను తిరిగి ఊళ్ళల్లో ప్రతిష్టించి వారి భూములు వారికే తిరిగి ఇప్పించింది. దీనిలో ఏం గొప్ప చూసుకుని కమ్యూనిస్టులు విలీనం పండగ జరపాలని కోరుతున్నారు?

  గత అర్థ దశాబ్ద సమైక్య పాలనలో విస్మరించబడ్డ తెలంగాణా చరిత్రను మరింత విపులంగా పరిశోధించ వలసిన అవసరం వుంది. ఇప్పటివరకు జరిగిన పరిశోధన అంతా ఆయా పార్టీల ఎజెండాల కింద మాత్రమే జరిగింది. మరింత అధికారిక శోధన జరగాలి. ఆ కాలపు చరిత్రకు సంబంధించిన విలువైన పత్రాలు బ్రిటిష్ ప్రభుత్వ ఆర్కైవ్స్ లో కొన్ని, కేంద్ర ప్రభుత్వం వద్ద కొన్ని ఉన్నాయి. వాటిని మరింత లోతుగా పరిశీలించి జరిగిన చరిత్రను నిగ్గు తేల్చాలి. అప్పటివరకు ప్రత్యేక ఎజెండాల ప్రకారం ఎవరికి కావలసిన విధంగా వారు విలీన దినాన్నో, విద్రోహ దినాన్నో, విమోచన దినాన్నో ప్రైవేటుగా జరుపుకుంటే సరిపోతుంది.

  ReplyDelete
 5. ఈ రోజు ఆంధ్రజ్యొతిలో అప్పుదు నిజాముకి వ్యతిరేకంగా పోరాడిన యొధు దొకరు అప్పుదు తను చూసిన వాట్ని స్పష్టంగా చెప్పారు.వాళ్ళు కట్టిన భవనాల్నీ ఆస్పత్రుల్నీ ఇప్పటి వాళ్ళు మనకి గొప్పగా చెప్తున్నారే ఆ విషయం కూడా చెప్పారు.అదంతా తన ఆరోగ్యాన్ని తన వాళ్ల కోసమూ చేసుకున్నదే తప్ప ప్రజల కోసం కాదని.హైదరాబాదు దాటితే అంతా దరిద్రం అనారోగ్యం తప్ప మరొక రకంగా లేదని! అయినా కమ్యునిష్టుల్ని క్రూరంగా అణిచెయ్యాలని చూసిన నిజామునీ నిజాముని అంతగా పొగుడుతున్న కేసీఆర్ ని కమ్యునిష్టు ప్రవీణ్ కూడా సమర్ధిస్తున్నాడంటే వీళ్ళలో మూర్ఖత్వం యెంత బలంగా వుందో తెలుస్తున్నది?!

  ReplyDelete
  Replies
  1. తెలంగాణలో కాంగ్రెస్‌కి పడిన వోత్‌లని కూడా సమైక్యవాద వోత్‌లుగా చూపించేవాళ్ళు తమకి తెలంగాణాపై ప్రేమ ఉన్నట్టు, నిజాంపై వ్యతిరేకత ఉన్నట్టు నటించక్కరలేదు. హైదరాబాద్ విమోచన దినం జరిపితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని రాజశేఖరరెడ్డి ప్రచారం చేసినప్పుడు గాడిదలకి పళ్ళు తోమినవాళ్ళు ఇప్పుడు తమకి నిజాంపై వ్యతిరేకత ఉన్నట్టు నటిస్తున్నారు.

   Delete
  2. యెప్పుడో దుర్మరణం పాలయిన రోగశేఖరుది గురించి ఇప్పుదెందుకు యేడవటం అంటున్నా తెలియని మందబుధ్ధికి కమ్యునిజం అతకదు గానీ నేను కమ్యునిష్టుని కాదని వొప్పుకుని మాట్లాడు, బాగుంటుంది!

   Delete
  3. @praveen
   నాకు నిజాము పట్ల వ్యతిరేకత గానీ సానుకూలత గానీ వుందాల్సిన అవసరం లేదు,అది మీ ప్రాంతపు చరిత్ర:యే దృష్టితో చూడా లన్నది మీ సొంత విషయం.కానీ బయటి వాళ్ళకి మీరే నిజాము మాకు ద్రోహం చేశాడని అప్పుదు పోరాడిన వాళ్ళు చెప్తుంతే ఇప్పుదు పుట్తిన నువ్వు వాళ్ళ కన్నా నీకు యెక్కువ తెలిసినట్తు మాట్లాడుతుంటే యెలా వుంటుంది?!

   Delete
 6. ఇక్కడ ఇద్దరుముగ్గురు కె.సి.ఆర్. అభిమానులు నిజామ్‌ని పొగిడినప్పుడు వాళ్ళని ఉతికీఅరేసింది నేనే అని మర్చిపోయినట్టు ఉన్నారు.

  ReplyDelete
  Replies
  1. మరిప్పుదు యే పూనకం పట్టి అప్పటి నీ మాటల్తో నిన్ను నువ్వే వుతికి ఆరేసుకుంటున్నా విప్పుడు?

   Delete
  2. వాళ్ళని ఉతికీఅరేసింది నేనే అని మర్చిపోయినట్టు ఉన్నారు.
   >>
   తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు;మరిచిపోతే తాగగలను మరువనివ్వదు అన్నట్టు ఒక్కసారి నీ తిక్కమాటలు విన్నవాడెవ్వడూ నిన్ను మరిచిపోలేడు:->))నిన్ను మర్చిపోయినా కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి పొందలేడు:-?))

   Delete
 7. ఆంధ్రాలో భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. తెలంగాణాలో మాత్రం ఎల్లప్పుడూ గతం గురించే ఆలోచిస్తున్నారు. అవే చర్చిస్తున్నారు. ముత్తాతల నాటి విషయాలు ఇప్పుడు తవ్వుకోవడం అవసరమా?

  ReplyDelete
  Replies
  1. నేనెప్పుడో చెప్పాను - మిగతా ప్రపంచమంతా 2014 నుంచి 2015 కి వెళ్తే వాళ్ళు మాత్రం 1957 లోకి వెళ్తారు అని :-)

   Delete
  2. పొట్టి శ్రీరాములు బొమ్మతో పూనకాలు పోయింది ఎవరో మరిచిపోయారా?

   Delete
 8. అప్పుడు పుట్టి అప్పుడు బతికి వాళ్ళు యెందుకు తిరగబడ్డారో వాళ్ళ మాటల్లోనే చెప్తుంటే ఇంకా పరిశోధిస్తాం లండన్ ఆర్కైవ్స్లో తవ్వుతాం కేంద్ర పుస్తక భాందాగారాల్ని తవ్వుతాం అంతే ఇంక చెప్పేదేముంటుంది?పార్టీల యెజెండాల్లో అంతున్నది విలీనమా, విమోచనా, ఆక్రమణా అనేది తేల్చుకోలేకపోయినా అన్యాయాలు చెయ్యతమె తప్ప ప్రజలకి యే మేలూ చెయ్యకపోబట్టే పోరాడాం అంటున్నారు కదా?ఆ వాస్తవాన్నే మీరు వొప్పుకోవడం లేదే!

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడు పుట్టిన మీరూ నేనూ ఒక్కలాగా మాట్లాడుతున్నామా? ఎవడి చచ్చు ఎజెండా వాడికుంటుంది. శాస్త్రీయంగా అధ్యయనం చేసిందే చరిత్ర అవుతుంది.

   ఇప్పుడు చర్చ విమోచన దినం జరపడం గురించి. అంతే కాని నిజాం మంచోడా కాదా అన్న దాని గురించి కాదు. పండిట్ సుందర్లాల్ రిపోర్టు ప్రకారం పోలీస్ యాక్షన్ సందర్భంగా భారత సైన్యం 27000 మంది అమాయక ముస్లిములను ఊచ కోత కోసిందట! ఆయనా అందర్నీ కనుక్కుని మరీ రిపోర్టు రాశాడు. ఒప్పుకుంటారా?

   Delete
  2. తాతకి దగ్గులు నేర్పడ మంటే ఇదేనా?రావి నారాయణ రెడ్ది తాత గారికి మనవడు శ్రెకాంత్ చారి, "తాతా తాతా, ఆరోజు జరిగింది అది కాదు!ఇదిగో ఇలా జరిగింది.' అని చెప్తాడు.ఆ తాత గారు చచ్చినట్టు వింటాడు.వినకేం చేస్తాడు పాపం?!

   Delete
  3. జాం మంచోడా కాదా అన్న దాని గురించి కాదు
   >>
   ప్రశ్నలో నిజాము సమాధి దగ్గిర .. అని కూడా వుంది కదా?సరే లెండి మీకు నచ్చి మీరు జవాబులు చెప్పగలిగిన ప్రశ్నే వెయ్యాలన్న మాట 8-<)

   Delete
  4. అద్వానీ వెళ్లి జిన్నా సమాధి వద్ద నివాలులర్పించాడు. పొగిడాడు కూడా. అంటే ఇక ఆయన జిన్నా చేసిన పనులన్నీ సమర్థించి నట్టేనా? ముందే చెప్పాను ప్రశ్నలోనే గడబిడ వుందని. అద్వానీ లాంటి కరడుగట్టిన హిందుత్వ వాదే జిన్నాను పోగిడినప్పుడు సందర్భోచితంగా సమాధులను దర్శించినప్పుదు ఎవరైనా రెండు ముక్కలు మంచి మాటలు చెపుతారు. ఈ విషయం మీద ఇదివరకే చాలా చర్చ జరిగింది.

   Delete
  5. >>> మీరు జవాబులు చెప్పగలిగిన ప్రశ్నే వెయ్యాలన్న మాట 8-<)

   ఆ ప్రశ్న గురించి ఇదివరకు చాలాసార్లు చర్చించాం లెండి, ఇదే బ్లాగులో.

   పండిట్ సుందర్లాల్ రిపోర్టు గురించి అడిగినపుడు సమాధానం తెలివిగా దాటేశారెందుకు?

   Delete
  6. @శ్రీకాంత్ చారి:

   अब ये बन्दा आपके नाना तक पहुँच गया! कल आपकी जनम कुंडली निकालेगा क्या?

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
  8. @Sreekaanth chaari
   ఆయనా అందర్నీ కనుక్కుని మరీ రిపోర్టు రాశాడు. ఒప్పుకుంటారా?
   >>
   తర్వాతేప్పుడో అందర్నీ కనుక్కుని రిపోర్టు రాసిన సుందర్ లాల్ గారి కి అప్పుదు పాల్గొన్న లోహిర్ రెడ్ది గారి కంటే యెక్కువ తెలుస్తుందా?మీ చరిత్ర గురించి నాకెలా తెలుస్తుంది! మీ పెద్దవాళ్ళు అలా చెప్తున్నారు, మీరేమో వాళ్ళ మాటలు వొప్పుకోవడం లేదు, ఆశ్చర్య పడటం, గందర గోళం పదతం తప్ప నేను వాదించ లేనే?మీ గందర గోళాన్ని మీరే తేల్చుకోండి.అందులో వేలు ధైర్యం ధైర్యం నాకెంత మాత్రం లేదు.

   Delete
  9. అద్వానీ గారు ప్రతీ యేదాదీ సొంత ఖర్చుల్తో వెళ్ళి పొగిడి వస్తున్నాడా?వాళ్ళ దేశం వెళ్ళినందుకు వాళ్ళు పిలిస్తే వాళ్ళ వూళ్ళో వాళ్ళతో గొడవ పడటం బాగుండదని వెళ్ళాడు.ఇక్కడా అట్లా తప్పని సరి అయి చేస్తే తప్పు లేదు లెండి?!

   Delete
  10. హరిబాబు గారు,

   మీరు చెప్పే లోహిర్ రెడ్డి ఎవరో కూడా నాకు తెలియదు. ఆ కాలంలోని లక్షలాది మందిలో ఒకడు కావచ్చు. ఆయన చేసిన పోరాటం ఎంత? ఆయనకు ఉన్న అవగాహన ఎంత అన్నవి ఆలోచించ వలసిన విషయాలు. అవునులెండి, మొత్తం ప్రాంతాన్ని తిరిగి విశ్లేషించి చెప్పిన కమిటీలు మీకెలా నచ్చుతాయి? వార్తలను మనక్కావలసినట్టుగా వండి వార్చడానికి ఏ అనామక లోహిర్ రెడ్లో కావాలి గాని?

   మళ్ళీ అదే మాట మార్పు. అద్వానీ సొంత కర్చుతో వెళ్ళితే ఏమి? ప్రతీ ఏడూ వెళ్లకుంటే ఏమి? అద్వాని చెప్తే ఒకటీ, కెసిఆర్ చెప్తే మరొకటీనా?

   Delete
  11. http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/SEEMANDHRA/2014/09/17/ArticleHtmls/17092014006005.shtml?Mode=1

   Delete
  12. @jai
   बन्दा = సేవకుడు,దాసుడు.
   >>
   ఇప్పుడీ దాసుడు మీ తాత వరకూ అడుగుతున్నాడు, రేపు తమరి జన్మ కుందలి కూడా అడుగుతాడా?
   >>
   ఇది మీరు యేవరి గురించి వాడారు?ఆయనేందుకు LOL అన్నాడు?

   Delete
  13. హరిబాబు గారు,

   సేవకుడు, దాసుడు అన్నది ఒకప్పటి అర్థం. ఇప్పుడు బందా అంతే కేవలం మనిషి అనే అర్థం.

   Banda is nowadays used for any man, while earlier Banda was used mostly for a servant or a slave.

   (See: http://www.bollymeaning.com/2010/08/allah-ke-banday-meaning.html)

   Delete
  14. హరిబాబు గారు,

   మీరు ఇచ్చిన లింకు లోని వ్యాసం చదివాను. ప్రతి వ్యక్తీ తన దృగ్వలయం మేరకు అభిప్రాయాలు కలిగి ఉంటాడు. తను నమ్మిన సిద్ధాంతాలు కూడా కొంత మేరకు ప్రభావాన్ని చూపుతారు. ఒకే విషయాన్ని కమ్యూనిస్టులు, క్యాపితలిస్తులు వేరు వేరుగా చూడడం మనం ఇక్కడి చర్చల్లోనే చూస్తుంటాం.

   వ్యాసంలోని ఆయన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతం. వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కాని ఆయన ప్రత్యక్ష సాక్షిగా చెప్పిన చెప్పిన విషయాలు గ్రహించాల్సిందే.

   నిజాం విలీన పత్రం పైన సంతకాలు చేశాడు, నిజమే ఎప్పుడు? అది 17 సెప్టెంబర్ రోజున మాత్రం కాదు. ఆ తర్వాత కొన్ని వారాలకు. మరి విలీన దినం ఎప్పుడు పాటించాలి? సంతకం చేసిన రోజునా, లొంగి పోయిన రోజునా? లొంగి పోయిన మరుక్షణం భారత ప్రభుత్వం ఆయన్ను రాజ్ ప్రముఖ్ చేసి తిరిగి అదే కుర్చీలో కూచోబెట్టింది. మరి విమోచన ఎలా జరిగింది? నిజాం చేసిన ఘోర అపచారాలకు శిక్ష ఎక్కడ పడింది? ఆ రోజున ఎందుకు పండగ చేసుకోవాలి?

   నిజాం పాలనలో మతకలహాలు లేవని ఆయన ఘంటాపథంగా చెపుతున్నాడు. మరి అదే విషయం నేను చెప్పినప్పుడు (మీరో మరొకరో గుర్తులేదు) తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందువల్ల?

   రాజకీయ కార్యకలాపాలు పెరిగిన తర్వాతే సమస్యలు మొదలయ్యాయని ఆయనే చెప్పాడు. అంటే అంతకు ముందు సమస్యలు లేవనే గద? రాజకీయ ఉద్యమాలు ప్రారంభమైంది 1946 తర్వాత. అంటే చివరి నిజాం పాలనలో 1911 నుండి 1945 వరకు ఎలాంటి సమస్యలు లేవనేగా అర్థం? అదే మాట నేనో కెసిఆరొ చెప్తే ఎందుకు ఉలుకు? ఒక రాజు రాజరిక అధికారాన్ని బదలాయించమని ఉద్యమాలు చేస్తే నిజామయినా ఇంకో హిందూ రాజయినా ఎలా ప్రవర్తిస్తాడు?

   నిజమే, భారత సైన్యం జోక్యం చేసుకోవాలని తెలంగాణా ప్రజలు మనస్పూర్తిగా కోరుకున్నారు. కాని ఏం జరిగింది? భారత సైన్యం వచ్చి సాధారణ ప్రజలకు అధికారం కట్టబెట్టిందా? నిజాంకు ఆయన తాబెదార్లైన హిందూ దొరలకు కాదా? భూములన్నీ ఆక్రమించి ప్రజల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న దొరలకు తిరిగి భూములు అప్పజెప్ప లేదా? మరి ఎందుకని విమోచనో విలీనమో జరుపుకోవాలి?

   రజాకార్లు చేసిన వేలాది హత్యలకు, మానభంగాలకు నిజామే బాధ్యతా వహించాలని అనుకుందాం. మరి అంతకు అనేకరెట్లు ఎక్కువమంది అమాయక ముస్లిముల, కమ్యూనిస్టుల హత్యలు, మానభంగాలకు భారత సైన్యం కారణమైతే దానికి బాధ్యత వహించవలసింది ఎవరు? పోలీసు ముసుగులో సైన్యాన్ని పంపిన పటేలా నెహ్రూనా?

   మన మనస్సులో ముందే ఒక భావం ఏర్పడి వుండడం వాళ్ళ ఒకే నేరం చేసినా, వేరు వేరు వ్యక్తులు వేరు వేరుగా కనపడతారు. అందుకే జిన్నా సమాధి వద్ద మాట్లాడిన అద్వానీ ఒకలాగా, నిజాం సమాధి వద్ద మాట్లాడిన కెసిఆర్ ఒకలాగా కనపడతారు.

   చరిత్ర మనకు ఒకలా కనపడితే పక్కోడికి ఇంకోలా కనపడుతుంది. ముఖ్యంగా 'తెలంగాణా' అన్న పదాన్నే నిషేధించిన గత యాభై సంవత్సరాల కాలంలో అది పూర్తిగా మసకబారి పోయింది. అందుకే శాస్త్రీయ అధ్యయనం అవసరం అని చెప్పింది.

   Delete
  15. This comment has been removed by the author.

   Delete
  16. @ శ్రీకాంత్ ఆచారి గారు,

   *కాని ఏం జరిగింది? భారత సైన్యం వచ్చి సాధారణ ప్రజలకు అధికారం కట్టబెట్టిందా?*
   ఇక్కడ సాధారణ ప్రజలంటే ఎవరు?

   రజాకార్లు చేసిన వేలాది హత్యలకు, మానభంగాలకు నిజామే బాధ్యతా వహించాలని అనుకుందాం. మరి అంతకు అనేకరెట్లు ఎక్కువమంది అమాయక ముస్లిముల, కమ్యూనిస్టుల హత్యలు, మానభంగాలకు భారత సైన్యం కారణమైతే దానికి బాధ్యత వహించవలసింది ఎవరు? పోలీసు ముసుగులో సైన్యాన్ని పంపిన పటేలా నెహ్రూనా?

   ఇన్ని అన్యాయాలు జరిగాయని మీరు భావిస్తున్నారుకదా. ఇంతకాలం నోరు మూసుకొని గమ్ముగా ఎందుకున్నారు? పోని ఈ మధ్యే మాకు తెలిసింది అని అంటారేమో, ఇప్పుడు తెలంగాణా వారి రాష్ట్రం ఏర్పడింది కదా! అప్పటి అన్యాయలపై ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిలదీస్తున్నారా? దానికి ఉంటే దాని కొరకు తెలంగాణ వారు చేస్తున్నా కార్యక్రమాలు ఎమిటి? ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మీప్రయత్నానికి మద్దతు పలికే అవకాశం ఉందా?

   Delete
  17. @UG శ్రీరామ్

   >>> ఇక్కడ సాధారణ ప్రజలంటే ఎవరు?

   మీరు తొందర పడకుండా తర్వాతి లైన్లు కూడా చదివితే అర్థమయ్యేది సాధారణ ప్రజలంటే ఎవరో.

   "నిజాంకు ఆయన తాబెదార్లైన హిందూ దొరలకు కాదా? భూములన్నీ ఆక్రమించి ప్రజల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న దొరలకు తిరిగి భూములు అప్పజెప్ప లేదా? "

   >>> ఇన్ని అన్యాయాలు జరిగాయని మీరు భావిస్తున్నారుకదా. ఇంతకాలం నోరు మూసుకొని గమ్ముగా ఎందుకున్నారు?

   మీరు పూర్తి చర్చ చదవకుండా మధ్యలో వచ్చి కామెంటితే ఇలాగే వుంటుంది. అన్యాయం చేయడం రాజ్యం యొక్క స్వభావం అని చెప్తున్నాను. మిగతా రాజులూ, రాజ్యాలు అంతా మంచివారైనట్టు కెసిఆర్ ఏదో సందర్భంలో నిజాంని పొగడగానే దాడి మొదలుపెడతారు గదా కొంతమంది? అందుకని సంఘటనలు పోల్చడం జరిగింది.

   >>> అప్పటి అన్యాయలపై ప్రస్తుత భారత ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిలదీస్తున్నారా?

   అంతటి అతి తెలివితేటలు మాకు లేవండీ. ఉంటే పక్కరాష్ట్రపు దోపిడీ పాలనలో అర్థశతాబ్దం ఎందుకు వెళ్ళబుచ్చుతాం? అయితే గియితే రాష్ట్రం విడిపోతే పాకిస్తాన్ లో కలుస్తాం అని బీరాలు పలికే వారు నిలదీయాలి.

   Delete
  18. అతి తెలివితేటలు ఎవరివో అందరికి తెలుసులేండి. బీరాలు పలికిన వారి పరిస్థితి సితార సినేమాలో శరత్ బాబు ( సంపదలు అంతా పోగొట్టుకొన్న జమీందార్) లాగా ఉంది. అది తెలిసినా కూడా వారి వలన తెలంగాణాకు ముప్పు, వాళ్లు ఇంకా బలవంతులైనట్లు, కుట్రలు చేస్తున్నారు అని వాదించటం ప్రజ బ్లాగులో చదువుతూనే ఉన్నాను. క్లాసిక్ యక్సాంపుల్ "కే.సీ.ఆర్ ది హంతక భాష అనే ఆరోపణలపై మీ కామెంట్!?" అనేటపాలో సుమారు వందపైన వ్యాఖ్యలు చదివితే అందరి తెలివితేటలు అర్థమౌతాయి. ఇక వాదన భారత సైన్యం ఇమేజ్ ని దెబ్బతీసే వరకు వేళిపోతున్నాది. ఇంతక్రితం కూడా స్కై బాబా ఒక బ్లాగరు కూడా ఇంచుమించు ఇటువంటి ఆరోపణలే చేశారు. కుమార్ అనే అతను ప్రశ్నిస్తే, వివరాలు పుస్తకం లో రాసి ఉంది అని, ఎప్పుడు వినని ఒక పుస్తకం పేరు చెప్పారు. తెలంగాణ వారి పైన భారత సైన్యం అన్యాయలను చేసిందని, దానికి భారత ప్రభుత్వం అపాలజి చెప్పాలని డిమాండ్ చేయబోరని ఎలా అనుకోగలం? అందుకొరకు మిమ్మల్ని ప్రశ్నించటం జరిగింది.

   Delete
  19. Hyderabad 1948: India's hidden massacre

   http://www.bbc.com/news/magazine-24159594

   Delete
  20. @UG SriRam,
   I think you will stop responding after reading my comment.

   కే.సీ.ఆర్ ది హంతక భాష అనే ఆరోపణలపై మీ కామెంట్
   >>> కే.సీ.ఆర్ ది తెలంగాణా భాష :)

   Delete
 9. విడిపోయిన తరువాత కూడ వాదించుకోవటం అవసరమా?
  ఎవడి రాష్ట్రం గొడవ వాళ్ళు చూసుకోవచ్చు కదా!
  అంతగా వాదించుకోవాలంటే, ఏ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ఆ రాష్ట్రం వాళ్ళే వాదించుకుంటే బాగుంటుంది.

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. ఈ విషయంపై ఎందుకింత ఆవేశంతో వ్యక్తిగతనిందలతో వ్రాస్తున్నారో తెలియటంలేదు.నిజాంప్రభువు కొన్ని మంచి ప్రయోజనకరమైన పనులు చేసి ఉండవచ్చును.బ్రిటిష్ వారు కూడా చాలా మంచిపనులు చేసినవిషయం మనకు తెలిసిందే.ఐనా విదేశె పాలననుంచి స్వరాజ్యం సాధించాలనుకున్నాము.15 ఆగస్టుని స్వాతంత్ర్య దినం గ జరుపుకొంటున్నాము.ఐనా మనమిప్పుడు బిటిష్ వారిని ద్వేషించడంలేదు.అలాగే ఫ్యూడల్ ప్రభుత్వమైన,మన శత్రువు పాకిస్తాన్ తో జత కట్టిన నిజాం రాజ్యం నుంచి 'విమోచన కలిగిన రోజుని జరుపుకోడం మంచిదేకదా.అందుకు ముస్లిములను నిందించనక్కరలేదు.ద్వేషించనక్కరలేదు.ప్రస్తుతప్రభుత్వం జరపకపోయినా ప్రజలు జరుపుకోవచ్చును. కాని,ప్రజలు,ప్రభుత్వము కూడా ముస్లిములకు మనస్తాపంలేకుండా తెలంగాణ విమోచన దినం జరుపుకుంటే మంచిదని నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. 1857లో నిజాంపై తిరగబడిన తురేహ్‌బాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్‌లు ముస్లింలే. నిజాంపై హిందువులలో వ్యతిరేకత 1900 తరువాతే మొదలైంది. నిజామ్‌ని తిడితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయనే ప్రచారం మొదలుపెట్టింది రాజశేఖరరెడ్డి.

   Delete
  2. @కమనీయం: mainstream పార్టీలు అన్నీ సెప్టంబర్ 17 జరుపుకున్నారు. అధికారికంగా (ప్రభుత్వ పరంగా) చేయాలా అన్నదే చర్చ. గతంలో టీడీపీ, కాంగెస్ ప్రభుత్వాలు అందుకు ఒప్పుకోలేదు. తాజాగా గతంలో ఇదే డిమాండ్ చేసిన తెరాస కూడా అధికారంలో వచ్చాక పాత నిర్ణయాన్ని మార్చలేదు.

   The question is not about celebration per se but official celebration. Hopefully this will be resolved next year (after a due historical review).

   @Praveen Kumar: FYI మజ్లిస్, వైకాప పార్టీలు తప్ప మిగిలిన mainstream parties సెప్టంబర్ 17 నాడు తమ కార్యాలయాలలో తిరంగా జండా ఎగరేసారు.

   Delete
  3. తండ్రి చేసిన ప్రచారాన్ని కొడుకు నమ్మడం విచిత్రం కాదు కదా. మరి జగన్ తెలంగాణా విమోచన దినం జరపకపోవడం విచిత్రమెలా అవుతుంది?

   Delete
  4. @Jai
   "గతంలో ఇదే డిమాండ్ చేసిన తెరాస కూడా అధికారంలో వచ్చాక పాత నిర్ణయాన్ని మార్చలేదు" చాలా నైసుగా చెప్పారు :)

   ఇంకోలా చెప్పాలి అంటే 'గతంలో ఇదే డిమాండ్ చేసిన తెరాస ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది'.

   Delete
  5. @YJs:

   ఇంకా ఫిరాయించలేదు, రేప్పొద్దున చేస్తుందేమో?

   చరిత్రను పునర్ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇది వచ్చే నెలలలో పూర్తి అవుతుందేమో చూద్దాం.

   I am reserving my "judgment" for now.

   Delete
  6. @Jai
   ఇంకా ఫిరాయించలేదు, రేప్పొద్దున చేస్తుందేమో?
   >>> హతోస్మి! ఒకప్పుడు తెరాస వాళ్ళు డిమాండ్ చేసినదే అధికారం లోకి వచ్చాక యిప్పుడు చెయ్యలేదు. అప్పుడొక మాట యిప్పుడొక మాట చెప్పడం ప్లేటు ఫిరాయించడం కాకపొతే ఇంకేంటి?

   చరిత్రను పునర్ సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇది వచ్చే నెలలలో పూర్తి అవుతుందేమో చూద్దాం.
   >>> కొన్ని పదుల సంవత్సరాల చరిత్రతో పాటు ఒక సంవత్సరం క్రితం జరిగినవి కూడా సమీక్షించాల్సిన అవసరం వుంది. సంవత్సరం క్రితం తెరాస, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును యీ విషయం లో యెంత ఆడిపోసుకుందో మీకు తెలియనిదా?

   ఒక వేళ దీనిని కూడా 'తెలంగాణా ప్రకటిస్తే తెరాసని కాంగ్రెస్ లో విలీనం చేస్తాం', 'తెలంగాణా వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం' లాగ భావించమంటే సరే! స్వస్తి!

   Delete
 12. కేసీఆర్‌ అప్పుడు అధికార పక్షం కాదు, ఇప్పుడు అధికార పక్షం.
  అప్పుడు ముస్లిముల ఓట్లు పెద్దగా అవసరం లేదు, ఇప్పుడు ఉంది.

  ఒకప్పుడు మోదినీ హిట్లర్ అన్న చంద్రబాబుకు ఈ రోజు ఆయనే ప్రియం. సమయాన్ని బట్టి అవసరాలు కూడా మారతాయి.

  ReplyDelete
  Replies
  1. @శ్రీ
   లెస్స పలికితిరి :)

   Delete
  2. This comment has been removed by the author.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top