Name:Marxist-Leninist 
E-Mail:deleted 
Subject:పెళ్ళికి వరసల పట్టింపులు అవసరమా?  
Message:అమ్మాయి-అబ్బాయి వరసకి బావమరదళ్ళైనా అమ్మాయి అందాన్నీ, అబ్బాయి ఉద్యోగాన్నీ చూసి పెళ్ళి చేస్తారు. ఇదేమీ స్త్రీవాదానికి అనుకూలమైన భావజాలం కాదు. ఉద్యోగం లేని అబ్బాయిని ఉద్యోగం ఉన్న అమ్మాయికి (ఆమె అతనికి పిన్ని వరసైనా సరే) ఇచ్చి పెళ్ళి చెయ్యకూడదా? 

--------------------------------------------------------


ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే ఇక్కడ, ప్రజ పాలసీ కోసం ఇక్కడ, ప్రజ ఆర్టికల్స్ కోసం ఇక్కడ నొక్కండి.

*republished
see also the post ..... click HERE
Reactions:

Post a Comment

 1. అక్కర్లేదు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కూడా పెళ్ళి చేసుకోవచ్చు.మావో మరియూ వారి సతీమణి పాటించిన గ్లాసుడు మంచినీళ్ళ సిధ్ధాంతాన్ని కూడా కలిపేస్తే ఇంకా బాగుంటుంది!

  ReplyDelete
  Replies
  1. ఈ గ్లాసుడు మంచినీళ్ళ సిద్దాంతం యేటండీ బాబూ?!

   Delete
  2. No one suggests to marry one's own brother/sister.

   Delete
  3. అడిగారూ, పరమ బూతు విషయం.గబుక్కున చెప్పడానికి జంకా!మావో గారు ఒక చోటా వారి సతీమణి మరొక చోటా వుద్యమం లో తిరుగుతూ వుంటారు గదా? మరి మూడొచ్చినప్పుదు అంత దూరం పరిగెట్టుకుని వచ్చెయ్యలేరు గదా?అందుకని దివ్యమయిన యేర్పాటు చేసుకున్నారు - ఆ పుణ్య దంపతులు.యేమిటయ్యా అంటే అప్పుడు యెదురుగా యెవరు దొరికితే ఆ ఆపోజిట్ సెక్సుకి సంబంధించిన వాళ్ళతో కోర్కె తీర్చేసుకోవటం.మంచినీళ్ళు యే గ్లాసుతో తాగినా ఒక్కటే కదా, తాగి దాహం తీర్చుకోవటం ముఖ్యం?!గ్లాసు యెవరిదీ చెయ్యి యెవరిదీ అని అడుగుతామా?దాంపత్యం కూడా అంతేనని ఆ పుణ్య దంపతుల భావన.

   ప్రశ్న వేసిన వ్యక్తి కూడా వారి చేత ఇన్స్పైర్ అయిన వాడు గనకనే ఆ ప్రశ్న వెయ్య గలిగాడు?!

   Delete
  4. పిన్ని అంటే తల్లికి చెల్లెలు అని నీకు తెలియదా?పిన్ని వరస అంటే తల్లిని కూడా చేసుకోవటం గురించి అడుగుతున్నావు, దాన్నే చెయ్యకూడదా అన్నాక ఇంకా యే వరసని నువ్వు పవిత్రంగా వుంచావని మళ్ళీ |No one suggests to marry one's own brother/sister| తో సమర్ధించుకుంటున్నావు?

   Delete
  5. @Hari Babu Suraneni
   ఓరి దేవుడో! గ్లాసుడు మంచినీళ్ళ వెనకాల ఇంత కధ వుందా?

   Delete
  6. కోస్తా ఆంధ్ర, తమిళనాడుల్లో సొంత అక్క కూతురిని పెళ్ళి చేసుకునేవాళ్ళు లేరా? సౌందర్యని ఆమె మేనమామకే ఇచ్చి పెళ్ళి చెయ్యలేదా? కానీ అబ్బాస్ తన పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకుంటే అది విచిత్రమా?

   Delete
  7. @Praveen
   మరి హరిబాబు గారు "అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కూడా పెళ్ళి చేసుకోవచ్చు" అని రాస్తే
   "No one suggests to marry one's own brother/sister." అని ఎందుకు రాసారు?
   "కానీ అబ్బాస్ తన పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకుంటే అది విచిత్రమా?" అని మళ్ళీ ఎదురు ప్రశ్న ఎందుకు వేసారు?

   ఈ ప్రశ్న మీకు మీరే వేసుకున్నారా? జవాబు కూడా మీరే ఇస్తే బావుంటుందేమో. కొంచెం ఆలోచించండి.

   నాకు తెలిసిన చాల మంది ఉత్తర భారత దేశ మిత్రుల ప్రకారం వాళ్లకు బావ మరదలు వరసలు లేవు. అందరూ అన్న చెల్లి లాగానే భావిస్తారు. రాఖీలు కట్టుకుంటారు.

   దక్షిణ భారత దేశంలో హిందువులలో అధిక శాతం మేనరికాలు చేసుకుంటారు. ఇస్లాం మతం ప్రకారం పెద్దమ్మ కూతురిని లేక పిన్ని కూతురిని చేసుకుంటారు. ఇది నేనేమి శోధించి కొత్తగా రాయడం లేదు.

   అసలు ఇలా చేసుకోవడానికి "స్త్రీవాదానికి అనుకూలమైన భావజాలం" కి సంబంధం ఏమిటో మీరు సెలవిస్తే బావుంటుంది.

   Delete
  8. Aunt's daughter is called cousin but not sister. You are aware only about Hindu kinship names but not English kinship names.

   Delete
  9. This comment has been removed by the author.

   Delete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. ఉద్యోగం లేని అబ్బాయిని ఉద్యోగం ఉన్న అమ్మాయికి (ఆమె అతనికి పిన్ని వరసైనా సరే) ఇచ్చి పెళ్ళి చెయ్యకూడదా?
  >>> చేస్తే? పిన్నిని చేసుకోవడం వలన ఆవిడను వుద్దరిస్తున్నట్టు మీరు అనుకుంటున్నారా? అసలు స్త్రీకైనా పురుషుడికైనా పెళ్ళే పరమార్ధమా? మీ ఉద్దేశ్యం లో 'స్త్రీవాదానికి అనుకూలమైన భావజాలం' ఏమిటి?

  ఒక ఇంటికి వరండా, పడక గది, వంట గది, మరుగు దొడ్డి - ఇలా ఎందుకు విడి విడిగా కట్టుకోవాలి? ఒకవేళ మన ఖర్మ కాలి కట్టుకున్నామే అనుకుందాం - వరండాలో వంటచేసుకుని, పడక గదిలో భోంచేస్తూ పని కానిచ్చేసి, మరుగు దొడ్డిలో ఎందుకు పడుకోకూడదు?

  ReplyDelete
 4. మిత్రోత్తములారా!

  మీకు సలహా ఇస్తున్నాను అనుకోకపోతే, ఇక్కడ చర్చించటానికి ఎమి ఉంది? ఇటువంటి ప్రశ్నలు ఇంతక్రితమే చాలా సార్లు చర్చించబడ్డాయి. మళ్లి మళ్లీ చర్చించటానికి ఎముంది ఇందులో, ఎవరి పెళ్ళి వారి ఇష్టం. ఊరికినే వాదోపవాదాలు అనవసరం.

  ReplyDelete
 5. https://www.dropbox.com/s/lkftvadvt8xfzk7/Screenshot_2014-09-21-06-30-17.png?dl=0

  ReplyDelete
 6. Mao was married to his cousin but not sister. నేను నంది అంటే మీరు పంది అనడానికి సిద్ధమైపోయి ముందువెనుకా చూసుకోలేదు.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశ్నే వరసల పట్టింపు అవసరమా? అని. ఏ వరసలు అని కాదుగా? అలాంటప్పుడు అలాంటి కామెంట్లే ఎదురవుతాయి. మీరు పెళ్లికి ఏ వరసలు అవసరం? ఏవి అనవసరం? లేదా ఏవి రైట్? ఏవి తప్పు? అనుకుంటున్నారు? ఎందుకు? ముందు దీనికి వివరణ ఇవ్వగలరా? మావో చెపితే ప్రపంచమంతా పాటించాల్సిన అవసరం లేదు. సాంప్రదాయం అనేది వివిధ ప్రాంతాలను బట్టి, వివిధ సమూహాలను బట్టి మారుతుండవచ్చు. సాంప్రదాయం ముదిరినా - సైన్స్ ముదిరినా ప్రమాదమే. ఏది జీవన విధానానికి బాగుంటుందో అంతమేరకే సైన్స్ నయినా - సాంప్రదాయాన్నైనా వాడుకుంటారు.

   Delete
  2. Close kin marriages (దగ్గరి బంధువుల మధ్య వివాహాలు) వేరు, degree of relations (వరసలు) వేరు. మన ఇందియాలో ఆ రెండిటినీ ఒకేలా చూస్తారు. అందుకే నేను చెప్పింది మీకు అర్థమైనట్టు లేదు. వరసలు అనేవి ఒక్కో సమాజంలో ఒక్కోలాగ ఉంటాయి. వికీపీదియాలో మావో తన కజిన్‌ని పెళ్ళి చేసుకున్నాడని వ్రాసి ఉంది కానీ తోబుట్టువుని పెళ్ళి చేసుకున్నాడని కాదు. హరిబాబు గారు కేవలం హిందూ సమాజంలో పాటించే వరసలు ఆధారంగా హిందూ సమాజంలో పుట్టని మావోపై విమర్శలు చెయ్యడం చూస్తే అది ముందూవెనుకా చూడకుండా చేసిన వ్యాఖ్య అనిపించలేదా?

   Delete
  3. మావో చేసింది తప్పని నేననదలచుకోలేదు. మావో ఏది చేస్తే అది ప్రపంచానికి ఆదర్స సాంప్రదాయం కానవసరం లేదు. అలాగే గాంధీ ఏది చెపితే ప్రపంచానికంతటికీ ఆచరణీయమూ కాదు.

   ఇక మీరు చెప్పినది నాకే కాదు ఎవరికీ సరిగా అర్ధం కాదు. కనుక అర్ధమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత చెప్పేతీరులో నైపుణ్యత పెంచుకోవలసిన అవసరం మీపై ఉందనేది నా విమర్శ.

   ఇండియాలో అత్యధికులు కజిన్ అన్నా సిస్టర్ అన్నా వేరే అనుకోరు. అలా అనుకోవడానికి మనసు అంగీకరించదు. ఎవరు ఏ సంస్కృతీ సాంప్రదాయాలలో పెరుగుతారో వాటిని తూలనాడినట్లుగా మన ప్రవర్త్న లేదా వాదన ఉండకూడదు. సాంప్రదాయం వేరు. సైన్స్ వేరు. సాంప్రదాయంలో ఉన్న దమ్ముని ఒక్కోసారి సైన్స్ గుర్తించలేకపోవచ్చు. వివరించలేకపోవచ్చు.

   Delete
  4. << Close kin marriages (దగ్గరి బంధువుల మధ్య వివాహాలు) వేరు, degree of relations (వరసలు) వేరు >>

   అసలు వరసలు ఎలా ఏర్పడతాయనుకుంటున్నారు మీరు?

   Delete
  5. హరిబాబు గారు తెలియక అలా వ్రాసారనుకోవడానికి కూడా లేదు. ఆయన మైదానం నవల సఘం చదివానన్నారు. ఆ నవల సఘ భాగం పూర్తవ్వక ముందే రాజేశ్వరి మేనమామ ఆమెని వెతుక్కుంటూ అమీర్ దగ్గరకి వస్తాడు. "హిందూ సంప్రదాయం ప్రకారం నీకు మేనమామ అయితే ఆయన నాకు ఏమవుతాడు?" అని అమీర్ రాజేశ్వరిని అడిగే దైలాగ్ ఆయన చదివే ఉంటాడు. అమీర్ బందువు మీరాని రాజేశ్వరి అడ్డగించి అతని రహస్యాలు అడిగే దగ్గర వరకు ఆయన ఆ నవల చదివినా ఆయనకి ఆ దైలాగ్ గుర్తుండే ఉండాలి. హిందూ సంస్కృతి ఉన్నతమైనది అని హరిబాబు గారి అభిప్రాయం కావచ్చు కానీ హిందూ సమాజంలో పుట్టని ఒక వ్యక్తిపై హిందూ సంప్రదాయాల ఆధారంగా చెత్తగా వ్రాయడం ఏమిటి?

   Delete
  6. కొబ్దల రావు గారూ, ఆంద్ర తమిళ ప్రజలలో మేనమామ/మేనత్త కూతురితో బాటు మేనకోడలును కూడా చేసుకుంటారు. తెలంగాణా కర్నాటకలలో మేనమరదలను చేసుకోవొచ్చు కానీ మేనకోడలును కాదు. మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలలో మరదలు చెల్లితో సమానం.

   ఇలా ఇండియా అంతా ఒక్కటే పద్దతి లేదు, ఒక్కోచోట ఒక్కో సంప్రదాయం.

   Delete
  7. ఇందియాలో ఉన్నది పితృస్వామిక బంధుత్వ విధానం. ఇక్కడ తండ్రి తరపు బంధువుల్నే వంశంగా భావిస్తారు కానీ తల్లి తరపు బంధువుల్ని వంశంగా భావించరు. అందుకే ఇందియాలో మేనమామ కూతురుని పెళ్ళి చేసుకుంటారు కానీ చిన్నాన్న కూతురిని పెళ్ళి చేసుకోరు. ఈ విషయాలు స్కూల్ పుస్తకాలలో వ్రాయరు, యూనివర్సితీలలోని ఆంథ్రొపాలజీ ప్రొఫెసర్‌లకి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి.

   Delete
  8. ఏమైనప్పటికీ భారతీయుడు కాని ఒక వ్యక్తి గురించి భారతీయ సంస్కృతి ఆధారంగా అనుచితంగా వ్రాయడం తాలిబాన్ స్తైల్ వాదం అవుతుంది.

   Delete
 7. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 8. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 9. @ప్రవీణ్

  "పెళ్ళికి వరసల పట్టింపులు అవసరమా?" అనే ప్రశ్నకు నా సూటి సమాధానం "ఖచ్చితంగా అవసరం".

  ఇంకా నా ప్రశ్నలు. సూటిగా సమాధానం ఇచ్చేటట్టు అయితేనే ఇవ్వండి. మావో ని ఇందులోకి తీసుకు రావద్దు.

  1. హిందూ సాంప్రదాయం ప్రకారం మేనరికాలని, ముస్లిం సాంప్రదాయం ప్రకారం పెద్దమ్మ/చిన్నమ్మ పిల్లల్ని - ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు.
  మీరు అడిగిన ప్రశ్న: కానీ అబ్బాస్ తన పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకుంటే అది విచిత్రమా?

  ఎవరికి విచిత్రం? మీరు హిందూ ముస్లిం వివాదం సృష్టించడానికి ఈ ప్రశ్న వేసినట్టుంది.

  2. "స్త్రీవాదానికి అనుకూలమైన భావజాలం" అంటే ఏమిటి?

  3. "ఉద్యోగం లేని అబ్బాయిని ఉద్యోగం ఉన్న అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చెయ్యకూడదా?" అని అడిగారు. భేషుగ్గా చెయ్యచ్చు. నాకు తెలిసిన ఒక ఫామిలీలో భార్య బ్యాంకు ఉద్యోగి, భర్త ఇంట్లోనే వుంటారు. ఎవరి జీవితం వారిది. కానీ ఇందులో మీరు పిన్ని వరసను తీసుకొచ్చారు. మీరు హిందువు అని నేను అనుకుంటున్నాను. పిన్ని తల్లి వరస ఐనప్పుడు ఆవిడని పెళ్లి చేసుకోవడం అనే ఆలోచన మీకెలా వచ్చింది?

  4. స్త్రీలని, వారి హక్కులని కాపాడాలి అని మీరు అనుకుంటున్నారా? 'నేను స్త్రీలని ఉద్దరిస్తా' అన్న ఆలోచన ఎవరికైన వచ్చిందంటే 'నేను స్త్రీలకన్నా గొప్పవాడిని/బలవంతుడిని/able person ని' అన్న superiority complex వుందని అర్ధం. మీ ఆలోచనలేంటి?

  I think I have spent enough time and energy on this topic alone. I will reply only if your answer/s make sense.

  ReplyDelete
 10. ఆడపిల్లని అమ్మవాళ్ళ సొంత తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేసేవాళ్ళు తెలంగాణ, గోవా తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాలలో లేరా? ఇదేమైనా పురుషుడు పిన్ని వరస స్త్రీని పెళ్ళి చేసుకోవడం కంటే ఒప్పా?

  ReplyDelete
  Replies
  1. తివిరి యిసుమున దైలంబు దీయవచ్చు
   దవిలి మృగతృష్ణలో నీరు ద్రాగవచ్చు
   దిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు

   కానీ...

   Delete
 11. @praveen
  మావో తన కజిన్‌ని పెళ్ళి చేసుకున్నాడని వ్రాసి ఉంది కానీ తోబుట్టువుని పెళ్ళి చేసుకున్నాడని కాదు. హరిబాబు గారు కేవలం హిందూ సమాజంలో పాటించే వరసలు ఆధారంగా హిందూ సమాజంలో పుట్టని మావోపై విమర్శలు చెయ్యడం చూస్తే
  >>
  మావో యెవర్ని చేసుకున్నాడో నాకు తెలియదు.నేనసలు ఆ ప్రసక్తే తేలేదు.పెళ్ళి తర్వాత వాళ్ళు పాటించిన దాంపత్యాన్ని గురించే చెప్పాను. పెళ్ళి అనేది యెక్కడయినా ఒక సామాజుక కట్టుబాటు.అది కేవలం ఆ ఇద్దరి స్వంత వ్యవహారమే అయితే ఆ పెళ్ళికి అంతమందిని పిలవనక్కర లేదు.

  అందర్నీ పిలవడం వెనక వుద్దేశం - ఈ ఇద్దరూ ఇకనుంచీ వాళ్లకి సంబంధంచిన అన్ని విషయాల్లోనూ ఒక్కటిగా వుంటారు, వెళ్ళిద్దరూ సమాజానికి సంబంధించిన అన్ని వ్యవహారల్లోనూ ఒకరు చెప్పింది మరొకరు వ్యతిరేకించకుండా వుంటారు, వీళ్ళిద్దరై ద్వారా పుట్తబోయే సంతానాన్ని మంచి పౌరులుగా సమాజం ముందు నిలబెట్టి తమ జ్ఞానాన్నీ సంపదని వాళ్ళకి ఇస్తారు - మీరు దీనిని వొప్పుకోవాలి అనే ఒప్పందం.ఒకచోత సంస్కృతంలో మంత్రాలు చదివినామరొకచోట బైబిలు సూక్తులు చదివి ఆమెన్ అనిపించినా పెళ్ళి అనే దాని అసలు స్వభావం ఇదే.ఇంకా గట్టిగా చెప్పాలంతే పెళ్ళిలో జరిగే సంగౌలన్నీ మతాచారాలకే సంబంధించి వుంటాయి గాబట్టి అది ఆ సమాజం యొక్క సామూహిక ఆధ్యాత్మికతలో ఒక భాగం.

  ఒకసారి ఆ వొప్పందం కుదిరాక వీలుని బట్టి గ్లాసుడు మంచినీళ్ళ సిధ్ధాంతం పాటించడం గురించి ప్రస్తావించాను.ఇంకా అది పూర్తిగా నా సొంతమూ కాదు,ముప్పాళ్ళ రంగనాయకమ్మ చేసిన విమర్శ అది. ఆవిదకి ఒక స్త్రీ ఒక పురుషుడూ నిష్టగా వుండతం అనే యేక్ పత్నీవ్రతమూ- పాతివ్రత్యమూ నచ్చలేదు, దానికి భిన్నమయిన మావో దంపతుల పధ్ధతీ నచ్చలేదు.అయ్యా, తమరు యెదటివాళ్ళు యేమి ప్రస్తావించారఓ దేన్ని విమర్శిస్తున్నారో కూడా అర్ధం కాని అజ్ఞానంలో వున్నారు?!

  ReplyDelete
 12. ప్రవీణ్ మీకు అర్ధం కాని వాటిని మూడ నమ్మకాలు అనుకోవడం మానేయ్యండి, ఒక్క సారి మీకు తెలిసిన xy కాణాలతో ఒక చిట్టా వేసుకుని ఏది మంచిదో తెలుసుకోండి!
  మేనరికం ఒక వరసలో తప్పు అవుతుంది ఇంకో వరసలో కాదు, అలాగే పిన్ని లేదా పెద్దమ్మ కూతురిని మనువాడటం ఒక వరసలో తప్పు ఇంకో వరసలో కాదు!
  కానీ కొన్ని విషయాలు ధనం మూలం ఇదం జగత్ లేదా పుత్రుడు మాత్రమే పున్నమ నరకం నుంచీ తప్పించ గలడు, అన్న వాటి మీద నిలబడిపోయాయి!
  ఇక్కడ పితృస్వామ్యం అన్న ప్రశ్నే లేదు, ఎందుకంటే మన పూర్వీకులు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూడాలి అనే వారు, అటు అంటే పెళ్ళికొడుకు తండ్రి వైపు నుంచీ ఇటు అంటే పెళ్లి కొడుకు తల్లి వైపునుంచి మరియు పెళ్లి కూతురు తల్లి వైపు నుంచీ పెళ్లి కూతురు తండ్రి వైపు నుంచీ బంధుత్వం చూడాలి అనే వారు ఎందుకంటే బంధుత్వం కలిస్తే ఆడ పిల్లకు మాత్రమె జన్యు దోషం ఉంటుంది కాబట్టి!
  దీని ప్రకారం చూస్తె మన పూర్వీకులు ఆడ పిల్లకు కూడా సమన్యాయం ఇచ్చారు, కానీ బద్దకస్తుల ప్రపంచంలో ఈ సమన్యాయం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఈ ప్రపంచంలో నా పని ఇంకొకడు చేయాలి అనే వాళ్ళే ఎక్కువ!

  ReplyDelete
 13. ప్రవీణ్ ఈ వరసలు అభివృద్ధి నిరోధకం ఎలా అవుతాయో చెప్పు .
  ప్రతీ కాలం లో , ప్రతీ సంస్కృతి లో ఇవి ఉంటాయి .
  ఈజిప్ట్ రాజులు, వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకునే వాళ్లంట ఎందుకంటే వాళ్ళ పవిత్ర రక్తం కలుషితం కాకూడదని .
  ఇలానే ఈ ప్రపంచం లో చాలా ఉన్నాయి .

  నీ పర్సనల్ ప్రాబ్లం ని గ్లోబల్ ఇష్యూ లా చర్చ పెట్టడం సమంజసం కాదు

  ReplyDelete
  Replies
  1. దగ్గర బంధువుల మధ్య వివాహాలు వేరు, వరసలు వేరు. ఇందియాలో దూరపు బంధువులైనా అమ్మాయి అబ్బాయికి వరసకి పిన్ని అయితే వాళ్ళకి పెళ్ళి చెయ్యడానికి పెద్దవాళ్ళు ఒప్పుకోరు. నాకు ఒక matrimonial websiteలో ఒరిస్సాకి చెందిన ఒక అమ్మాయి పరిచయమైంది. ఆమెది మా కులం కాదు కానీ ఆమె ఇంటి పేరు, మా ఇంటి పేరు ఒకటేనని చెప్పి ఆమె నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఆమెది మా కులం కాదు కానీ కేవలం ఇంటి పేరు ఆధారంగా ఆమెని అక్కా లేదా చెల్లి అని అనుకోవాలట! ఇది ఫార్స్ కాకపోతే ఇంకేమిటి?

   Delete
  2. నీ బాధ ఇంకొకరి మీద రుద్దడానికి ప్రయత్నించకు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని నువ్వు అనుకుంటే వెళ్లి doctor దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిది నీది జన్యుక్రమంలో ౭ తరాలు సంబంధం ఉందొ లేదో తెలుసుకుని పెళ్లి చెసుకొ!

   Delete
 14. @praveen
  యూనివర్సితీలలోని ఆంథ్రొపాలజీ ప్రొఫెసర్‌లకి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి
  >>
  ఆ ఆంథ్రొపాలజీకి బాబు లాంటి జూవాలజీలో నాకు M.Sc డిగ్రీ వుంది.

  ReplyDelete
 15. Anthropology is not merely related to zoology. It is more related to sociology.

  ReplyDelete
  Replies
  1. నీకంత వరకే తెలుసు?జెనెటిక్ పూలింగ్ గురించీ జాతుల మధ్య వుందే శాస్త్రీయమయిన అన్ని విషయాలకీ సంబంధం వుంటుంది.సోషియాలగీలో ఎవల్యూషనరీ థెయరీ బైయలాజికల్ ఎంటిటీస్ గురించి కూడా పరిశోధిస్తారని నీకు తెలుసా?

   Delete
 16. @praveen
  ఏమైనప్పటికీ భారతీయుడు కాని ఒక వ్యక్తి గురించి భారతీయ సంస్కృతి ఆధారంగా అనుచితంగా వ్రాయడం తాలిబాన్ స్తైల్ వాదం అవుతుంది
  >>
  భారతీయం కాని విషయాల్ని భారతీయుల ముందు యెందుకు వాగుతున్నావు నువ్వు?అక్కడ వాళ్ళు అలా చేస్తారు గాబట్టి ఇక్కడ మీరూ వాట్ని పాటించితే బాగుండదా అని యెందుకు కూస్తున్నావు?

  ReplyDelete
  Replies
  1. నేను మానవ శాస్త్రం (ఆంథ్రపాలజీ) గురించి మాట్లాడుతోంటే నువ్వు జంతు శాస్త్రం (జువాలజీ) గురించి మాట్లాడుతున్నాం. జంతువులు కన్నతల్లితోనె సంపర్కం చేస్తాయి. మనిషి జంతువులా బతకాలని రికమెంద్ చేస్తున్నది నువ్వే కానీ నేను కాదు.

   Kinship terminology విషయంలో నేను ఇస్లామిక్ షరియాని నమ్ముతాను. ఇస్లాంలో పిన్నిని పెళ్ళి చేసుకోవడం నిషిధమే. సొంత పిన్ని లేదా చిన్నాన్న గారి ఉపుడుగత్తె విషయంలోనే ఆ నిషేధం వర్తిస్తుంది. దూరపు బంధువుల విషయంలో ఆ నిషేధం వర్తించదు.

   Delete
  2. ఏమైనప్పటికీ భారతీయుడు కాని ఒక వ్యక్తి గురించి భారతీయ సంస్కృతి ఆధారంగా అనుచితంగా వ్రాయడం తాలిబాన్ స్తైల్ వాదం అవుతుంది
   >>
   భారతీయం కాని విషయాల్ని భారతీయుల ముందు యెందుకు వాగుతున్నావు నువ్వు?అక్కడ వాళ్ళు అలా చేస్తారు గాబట్టి ఇక్కడ మీరూ వాట్ని పాటించితే బాగుండదా అని యెందుకు కూస్తున్నావు?

   Delete
  3. This comment has been removed by a blog administrator.

   Delete
  4. భారతీయం కాని విషయాలు తెలుసుకోవడం నీకు ఇష్టం లేకపోతే వేరేవాళ్ళు చర్చించకూడదా? దీన్నే తాలిబాన్‌వాదం అంటారు.

   Delete
  5. నీకు పెళ్లి జరగకపోతే వెళ్లి అందరి జన్యుక్రమం తీసుకుని నీ జన్యు క్రమంతో సంబంధం లేని అమ్మాయిని పెళ్లి చేసుకో!
   ఎందుకు నీ బాధ అందరి మీద రుద్దుతావు,
   నీకు ముందే చెప్పాను పిన్ని కూతురిని ఎందుకు చేసుకోరు అంటే అన్నదమ్ములు ఒక్కోసారి అక్క చేల్లిల్లను పెళ్లి చేసుకుంటారు మరి అలాంటప్పుడు పుట్టబోయే పిల్లలకు ఎలా వేరే జన్యు క్రమం ఉంటుంది అందుకే పెళ్లి చేసుకోరు, నువ్వే పితృస్వామ్యం లో మాట్లాడు తున్నావు ఎందుకంటే నీ అభిప్రాయం ప్రకారం పెళ్లి జరిగితే పుట్టబోయే అమ్మాయి ఖచ్చితంగా ఒకటే x chromosome ఉండే అవకాశంగా పుడతారు, దాంతో అమ్మాయి చనిపోయే ఆస్కారం ఎక్కువ!

   Delete
  6. ఇక్కడ నా పెళ్ళి సంగతి అనవసరం. దగ్గర బంధువుల మధ్య వివాహాలు వేరు, వరసలు వేరు. వరసలు ఒక్కో దేశంలో ఒక్కోలాగ ఉంటాయి. ఈ విషయాలు స్కూల్ పుస్తకాలలో వ్రాయకుండా అర్థం కాని ఇంకేవో విషయాలు వ్రాస్తుంటారు. అందుకే దీని గురించి ప్రస్తావించాను.

   Delete
  7. ఇక్కడ నీ పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చింది నువ్వే నేను కాదు, నేను గతంలో వ్రాసాను ఇప్పుడు కూడా వ్రాస్తున్నాది ఒక్కటే, వాళ్ళు చూసిన ప్రకారం ఆ వివాహం సరైనదే, నేను చూసిన ప్రకారం మన హిందూ వివాహ పద్దతి సరైనదే! ఒక్క మేనరికం తప్ప, దానిలో కూడా ఆడ పిల్లకే హాని తప్ప మొగపిల్ల వాడికి కాదు . సమానత్వం కోరుకునే వారు మేనరికం సోదరీ సోదరుల వివాహాలకు దూరంగా ఉంటారు.
   అంతే!

   Delete
  8. ఇంటి పేర్లు, గోత్రాల పేర్ల వల్ల పెళ్ళి సంబంధాలు దొరకనివాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నా ఒక్కడి సమస్య కాదు. దూరపు బంధుత్వం కూడా లేని అమ్మాయిని ఇంటి పేరు ఆధారంగా అక్కా లేదా చెల్లి అనుకోవడం సంకుచితత్వం కాదా?

   Delete
  9. నేను చాలా సార్లు చెప్పాను పూర్వం ఇప్పుడు గోత్రాలు నిలబడటానికి కారణం జన్యు క్రమం తెలుసుకోవడానికి, ఒకే జన్యు క్రమం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుట్టే ఆడ పిల్ల ఒకే జన్యువుతో పుట్ట వచ్చు అనే కారణంతో చెయ్య కూడదు అన్నారు!
   ఒక వేళ ఆడపిల్ల పుట్టి ఒకే జన్యువు కారణంగా అనారోగ్యం పాలైన పర్వాలేదు అనుకుంటే ఒకే గోత్రం అమ్మాయిని పెళ్లి చేసుకో!
   పశువులకు మనుషులకు జన్యు సంభందాల విషయంలో చాలా తేడాలు ఉంటాయి!
   వాటిని చూపించి మనుషులకు అది మంచిదే అనుకుంటే నీకు ప్రయోగాల పేరుతొ జంతువులను/మనుషులను చంపే వాళ్లకు తేడా లేదు!

   Delete
 17. ఒక చిన్నమాట.
  ఎందుకని ప్రవీణ్‍తో ఇంత విస్తృతంగా చర్చిస్తున్నారు?
  ఆతడికి బోలెడు ఓపికా తీరికా ఉన్నాయి.
  అనంతంగా తన రాగం-తానం-పల్లవి తాను పాడుతూనే ఉంటాడు.
  అందరి మాటల్లోనూ నిరంతరాయంగా రంధ్రాన్వేషణ చేస్తూ పోతుంటాడు.
  మధ్యలో మీరే అనవసరమైన చర్చలో ఇరుక్కొని బయటకు రావటానికి గింజుకోవటం.
  ఈ మాట అనటానికి తలదూర్చానా? ఇప్పుడు నాకు కౌంటర్లు మొదలు.
  కాని నేను ప్రవీణ్‍కు జవాబిచ్చేంత తీరికతో లేను కాబట్టి ఇవ్వను.

  Here is a tribute to Praveen

  Praveen the Great
  Is always in fight
  No matter what
  He is just right

  Do not you ever dare argue
  With him you have no clue
  When words don't go right
  He could jump up and bite

  Oh Praveen spare me please
  This is first time I try to tease
  And is perhaps the last time
  As provoking you is a crime

  Thank you Praveen for the entertainment you provide.

  ReplyDelete
  Replies
  1. మానవ ప్రయత్నం అతనికి తెలిసినది తెలియనట్టు నటిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి నా ప్రయత్నం!

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
  3. My little two cents about this post ;-]

   Link or

   http://static1.quoteswave.com/wp-content/uploads/2011/12/The-difference-between-genius-and.jpg

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. ఒకప్పుడు మా ఇంటిలో మత విశ్వాసాలు అంతగా లేవు. దసరా, సంక్రాంతి పండగలు మాత్రమే జరుపుకునేవాళ్ళం. కరీమ్‌నగర్‌లో మాకు కొంత మంది షిరిడీ సాయిబాబా భక్తులు పరిచయమయ్యారు. అప్పటి నుంచి మా ఇంటిలో శని, సోమ, గురువారాల నాడు మాంసం వండకూడదని నియమం పెట్టుకోవడం, జాతకాలు & వాస్తు లాంటివి నమ్మడం మొదలైంది. మతం ఒక వ్యక్తిగత విశ్వాసం అంటారు. అది నిజమైతే ఆ విశ్వాసం లేనివాళ్ళకి కూడా దాన్ని అంటించడం ఎందుకు?

   వరసలు అనేవి అన్ని దేశాల్లో ఒకేలా ఉండవు అనే నిజాన్ని భారతీయులు ఎవరూ తెలుసుకోకూడదు అనుకుంటే మన ఆలోచనలు కూడా ముస్లింల ఆలోచనల కంటే ఏమీ గొప్పవి కావనుకోవాలి.

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. @praveen
   మతం ఒక వ్యక్తిగత విశ్వాసం అంటారు.
   >>
   యెవడు చెప్పాడు మతం వ్యక్తిగత విశ్వాసం అని?!అది మొత్తం సమాజానికి సంబంధించిన వ్యవహారం అయితే,నీ బుధ్ధ్కి తోచిందే అందరూ అంటున్నట్టు అనిపిస్తుందా నీకు?ఇద్దరు వ్యక్తులు చేసుకునే పెళ్ళి కూడా సమాజం మొత్తానికి సంబంధించిన వ్యవహారమే నువ్వు చెప్పే ఆ ముస్లిం మతంలో కూడా అనేది నీకు తెలుసా లేదా?

   Delete
  8. This comment has been removed by a blog administrator.

   Delete
 18. @kondala raavu gaaru!

  నేను మాట్లాడిన దాంట్లో యేమి హాని వుందని తొలగించారు,అదీ అతను అంత వెటకారపు జవాబు చెప్పాక నా ప్రశ్న వొక్కదాన్నె తొలగిస్తే యెట్లా?నేను తనకన్నా వయసులో పెద్దవాణ్ణి గనక తన మూర్ఖత్వానికి చిరాకు పుట్తి నువ్వు అన్నా అతని మర్యాదకి యేమన్నా భంగమా?తను కనీసం పెద్దంతరం చిన్నంతరం కూడా తెలియకుండా నన్ను నువ్వు అంటుంటే అతని వ్యాఖ్యలు మీకు సబబుగా అనిపిస్తున్నాయా?!

  క్షమించండి, మీ ధోరణి నాకు కష్టంగా వుంది!నేనిక నుంచి ఇటువైపుకి రాదల్చుకోలేదు.ఇతని చరిత్ర గురించి మీకు తెలియదేమో గానీ మలక్పేట రౌడీ గురించి ఇతన్ని అడిగి చూదండి.ఇతని పాపిష్టి వాగుడుకి విసుగు పుట్టి చాలామంది బ్లాగర్లు బ్లాగులు మూసుకు పోయారు?ఇప్పుదు మీ ప్రజ కీ అదే పరిస్థితి దాపరిస్తుంది,

  శెలవ్?!

  ReplyDelete
  Replies
  1. ఇంతకుమునుపు ఇటువంటి అంశాల మీద చర్చలు జరిగాయి.మీరేవరో కొత్తగా ఉన్నారు ఇటువంటి పరిస్థితి రాకుడదనే చర్చించటం అవసారమా? అని ముందు జాగ్రత్తగా హెచ్చరించాను. చివరికి ఊహించిందే నిజ్కమైంది. ఒక సంస్కృతి /వ్యవస్థాలో కొన్ని లోపాలు ఉంటాయి. అసలికి లోపాలు లేని వ్యవస్థే లేదు ప్రపంచంలో. అదే సమయంలో వాటిని చక్క దిద్దటానింకి, కొన్ని యక్సెప్షన్స్ ఉంటాయి. యక్సెప్షన్స్ ను ప్రాముఖ్యత ఇచ్చి/ దృష్ట్టిలో పెట్టుకొని వ్యవస్థలను ప్రపంచంలో ఎవరు సృష్టించలేరు. కమ్యునిస్ట్ల ముసుగులో వారి వాదన యక్సెప్షన్స్ ను మాత్రమే చూస్తూ వ్యవస్థ అంతా చెత్త అని తీర్మానించటం చేస్తూంటారు.

   Delete
  2. @ Hari Babu SuraneniSeptember 24, 2014 at 10:12 AM

   నాకు అతని గురించి తెలుసు.

   నేను చెపితే మర్యాద నేర్చుకునే స్తితిలో ప్రవీణ్ లేడు. సీతయ్య ఎవరి మాటా వినడన్నట్లుంటుంది ప్రవీణ్ వాదన. అది మార్చుకుంటాడా? లేదా? అనేది అతని వ్యక్తిగత విషయం.

   నువ్వు అన్నందుకు నేను మీ వ్యాఖ్యను తొలగించలేదు. విషయపరిధి పక్కకు పోయినందుకు తొలగించాను.

   Delete
 19. @praveen
  అయ్యా, తమరికి మామూలు తెలుగు చదవటం, అర్ధం చేసుకోవటం వచ్చా రాదా?

  మావోని నేను హిందూ సాంప్రదాయం ప్రకారం విమర్శించానని మీకు యెలా అర్దం అయ్యింది?

  పెళ్ళి అనేది యే సాంప్రదాయం ప్రకారం చేసుకున్నా వాళ్ళు చేసింది తప్పు, అవునా కాదా?

  వాళ్ళు యే సాంప్రదాయం ప్రకారం చేసుకున్నారో చెప్పగలరా?

  యెట్లా చేసుకున్నా సమయానికి దంపతుల్లో రెందవ వ్యక్తి దొరకలేదు గాబట్టి అందుబాటులో యెవరు వుంటే వాళ్ళతో కోరిక తీర్చుకోవటం వాళ్ళు పాటించే సాంప్రదాయం ప్రకారమయినా కరెక్టే అని మీరు భావిస్తున్నారా?

  మీరు ఆంథ్రొపాలజీ గురించి ప్రస్తావిస్తే వూరికే ప్రస్తావించినట్టూ నేను జంతుశాస్త్రం గురించి ప్రస్తావిస్తే దాని ప్రకారమే వాదించమన్నట్టూ అవుతుందా?

  పెళ్ళిలో జరిగే అన్ని తంతులూ వ్యవహారాలూ వాళ్ళు యే ప్రాంతానికి చెందిన వాళ్ళో యే మతాని సంబంధించిన వాళ్ళో ఆ ప్రకారమే జరుగుతుండతం చూసి కూడా మతం సమాజానికి సంబంధించినది అని నేను వూహించుకుని మాట్లాడటం యేమిటి?

  అచ్చులో అంత స్పష్టంగా వున్న దానిని చదవటం, అర్ధం చేసుకోవటం తెలియనప్పుదు వివరంగా అడిగితే వోపికగా చెప్తాము గానీ మీకు తోచిన అర్ధాన్ని మాకు అంటగట్టి నిలదీస్తే దాని అర్ధ మేమిటి?

  యెదటివాడు చెప్పేది మీకు అనవసరమై మీ బుర్రలో వున్నది కక్కడమే ప్రధానం అయినప్పుడు ఇక్కడ చర్చలో మేమూ మీరూ యేమి నేర్చుకుంటున్నట్టు?

  యెదటివాడు అచ్చులో అంత స్పష్తంగా ప్రింటు కొట్టి చెప్తున్నా అర్ధం కానప్పుడు యెందుకీ వృధా ప్రయాస?

  ReplyDelete
  Replies
  1. ఆ దంపతులు ఎలా గడిపారు అనే దానికి ఈ చర్చతో సంబంధం లేదు కదా. మగవాడు తన అక్క కూతురిని పెళ్ళి చేసుకోగాలేనిది ఆడది తన అక్క కొడుకుని ఎందుకు పెళ్ళి చేసుకోకూడదో చెప్పు.

   Delete
  2. యెందుకలా అడిగాను అంతే ఒక విషయం మీకు స్పష్తంగా అర్ధం అవ్వటానికి. అది అర్ధం కాలేదని తెలుస్తున్నది గాబట్టి ఇప్పుడు వివరంగా చెప్తాను.సూటిగా అడుగుతూ దారి కొచ్చినందుకు సంతోషం.

   ఆంథ్రొపాలజీ గురించి ప్రస్తావించారు, అందులో యేమయినా ప్రవేసం వుందా?ఇది కూడా యెందుకు అడుగుతున్నాను అంతే మీకు యే స్థాయిలో చెప్తే అర్ధ మవుందో నాకు తెలియాలి గదా!దాన్ని బట్టే నా జవాబు వుంటుంది మరి.ఒకసారి వివరంగా జవాబు చెప్పాక మళ్ళీ మళ్ళీ రొడ్డకొట్టుదు ప్రశ్నలు వేస్తే నాకు చిరాకు, అందుకని!

   Delete
  3. ఆ దంపతులు ఎలా గడిపారు అనే దానికి ఈ చర్చతో సంబంధం లేదు కదా.
   >>
   అలా కుదరదు!నేను అనని మాటల్ని కూడా నాకు అంతగట్తి మావోనినేను హిందూ సాంప్రదాయం ప్రకారం విమర్సిస్తున్నాని అంత యాగీ చేసింది తమరే!ఇప్పుడు నేను ప్రశ్నిస్తే జవాబు చెప్పకుండా తమరు తప్పించుకుందామనుకుంటే నానుంచి జవాబుని ఆశించే హక్కు కూడా మీకు వుందదు!నేను అడిగిన వాటీకి తమరు కూడా జవాబు చెప్పి తీరాల్సిందే,తప్పడు తప్పదు తప్పడు!!!

   ముఖ్యంగా తెలుగు చదవటం అర్ధం చేసుకోవతం వచ్చా రాదా?

   Delete
  4. @praveen
   అయ్యా, తమరికి మామూలు తెలుగు చదవటం, అర్ధం చేసుకోవటం వచ్చా రాదా?
   దగ్గిర్నుంచి
   యెదటివాడు అచ్చులో అంత స్పష్తంగా ప్రింటు కొట్టి చెప్తున్నా అర్ధం కానప్పుడు యెందుకీ వృధా ప్రయాస?
   వరకూ పాయింట్ బై పాయింట్ చెప్పి తీరాలి!

   చర్చించటం అంతే నోటి కొచ్చింది మాట్లాడటం కాదు, యెదటివాళ్లు మాట్లాడిన దానికి విపరీతార్ధాలు తియాటం కాదు అనేది తెలియడం కోసం అది తప్పనిసరిగా మీరు చేసి తీరాలి.నేను మిమ్మల్ని మీరు అంటున్న తర్వాత కూడా నన్ను మీరు నువ్వు అంటున్నందు వల్ల నా మాటలు మీకు అర్ధ కాలేదని అనిపిస్తున్నది.అందుకోసమే తప్పని సరిగా పాయింట్ బై పాయింట్ వాటికి జవాబు చెప్పి తీరాలి?!

   Delete
  5. @హరిబాబు
   [ఆశ దోస అప్పడం వడ...]

   YJs ఉవాచ:
   మీరొక ప్రశ్న వేసి దానిని ప్రవీణ్ గారు చదివాలి అనుకోవడం మీ ఆశ
   మీ ప్రశ్నని ప్రవీణ్ గారు అర్ధం చేసుకోవాలి అనుకోవడం మీ అత్యాశ
   మీరు వేసిన ప్రశ్నకి ప్రవీణ్ గారు తిన్నగా సమాధానం ఇవ్వాలి అనుకోవడం దురాశ

   [మళ్ళీ ఆశ దోస అప్పడం వడ...]

   మీరు క్యూలో వున్నారు. ప్రవీణ్ గారు ముందు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత చాన్స్ మీకే :)

   Delete
  6. క్యూలో ఉన్న వారికి టైం పాస్ కోసం.

   http://www.mediawebapps.com/upload/alberteinstein-quote.jpg

   Delete
  7. @Sree and @Hari Babu Suraneni
   ఇది 'విన్నారా'? నాకు చెవుడంట!
   కొంపదీసి మీకు కూడా చెవుడు ఉందా ఏంటి? :) LOL

   Delete
 20. ఇతర విషయాలు ఇక్కడ అనవసరం. వరసలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయనేది నిజమే కదా. ఆ విషయం చర్చించకుండా ఇంకేవో విషయాలు లాగుతున్నారు.

  ReplyDelete
  Replies
  1. వరసలే ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటున్నాయా? పెళ్ళికి ఏ వరస పాటించాలనేది ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటుందా ప్రవీణ్ గారు? వరసలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటే ఆ విషయం తెలిసి మీరు ఎందుకు వాదన పొడిగిస్తున్నారు. పెళ్ళికి వరసలు పాటించడం అవసరమా అనేది మీ ప్రశ్న. మీరేమి అనుకుంటున్నారు. ఏ వరుసలు మంచివని శాస్త్రీయంగా చెప్పదలచుకున్నారు. ఒక్క హిందువులలోనే తప్పులున్నట్లు టార్గెట్ చేసి వాదించడం వాదనలను రెచ్చగొట్టడానికో పాపులారిటీ పెంచుకోవడానికో ఉపయోగపడుతుంది తప్ప నిజమైన చర్చకు ఉపయోగపడదు. నిజంగా మీకేమైనా పిన్ని సంబంధం వచ్చిందా? చేసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే అది మీ వ్యక్తిగతం. లేదు చర్చ జరపాలనుకుంటున్నారా? ముందు మీ ఆలోచన ఏమిటో అది ఎందుకు ఎలా సరయినదనుకుంటున్నారో వివరించగలగాలి. ఇతరులను వ్యంగ్యంగా కామెంట్లు చేసూ ఉంటే మూర్ఖత్వం అంటారు తప్ప ప్రజాస్వామిక లక్షణం అనరు.

   Delete
  2. This comment has been removed by a blog administrator.

   Delete
 21. మీరు మీ అసలు ప్రశ్నలు మర్చిపోయినట్టున్నారు
  1. మీ మొదటి/అసలు ప్రశ్న: పెళ్ళికి వరసల పట్టింపులు అవసరమా?
  నా సమాధానం: అవసరమే

  2. ఉద్యోగం లేని అబ్బాయిని ఉద్యోగం ఉన్న అమ్మాయికి (ఆమె అతనికి పిన్ని వరసైనా సరే) ఇచ్చి పెళ్ళి చెయ్యకూడదా?
  నా సమాధానం: భేషుగ్గా చెయ్యచ్చు. నాకు తెలిసిన ఒక ఫామిలీలో భార్య బ్యాంకు ఉద్యోగి, భర్త ఇంట్లోనే వుంటారు. ఎవరి జీవితం వారిది. కానీ ఇందులో మీరు పిన్ని వరసను తీసుకొచ్చారు. మీరు హిందువు అని నేను అనుకుంటున్నాను.
  నా అనుబంధ ప్రశ్న: పిన్ని తల్లి వరస ఐనప్పుడు ఆవిడని పెళ్లి చేసుకోవడం అనే ఆలోచన మీకెలా వచ్చింది?

  3. మీరు అడగని ప్రశ్నలు ఏమిటో నేను కింద రాస్తున్నా
  అ. మిమ్మల్ని ఒక అమ్మాయి కేవలం ఇంటి పేర్లు ఒక్కటే అవడం మూలంగా తిరస్కరించింది. ‘ఎందుకలగ’ అనేది మీ ప్రశ్న.
  ఆ. మీకు మీ పిన్నిని చేసుకోవాలని ఉందేమో. ‘ఎందుకు నన్నీ పాడు సమాజం అడ్డుకుంటోంది’ అనేది మీ రెండో ప్రశ్న.
  ఇక పొతే మీ సరికొత్త ఉవాచ: “ఇతర విషయాలు ఇక్కడ అనవసరం. వరసలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయనేది నిజమే కదా. ఆ విషయం చర్చించకుండా ఇంకేవో విషయాలు లాగుతున్నారు.”
  నిజం కాదని ఎవరన్నారు? సౌదీలో ముస్లిం మతస్తులు బావ మరదలు సంబంధం వొప్పుకోరు. అది మీకు విచిత్రంగా అనిపించలేదా? భారతా దేశంలో హిందూ మతం అక్క తమ్ముడు వరస అయ్యే వాళ్ళని చేసుకోవడం కూడదు అంటారు. ఇది మాత్రం మీకు విచిత్రంగా అనిపించింది!
  మిమ్మల్ని మీ పిన్నిని చేసుకోకుండా ఆపేది భారత దేశంలోని హిందూ మతంలోని వరసలు అను నేను అనుకుంటున్నాను. సుబ్బరంగా మీరూ, మీ తల్లిదండ్రులూ, మీ పిన్నీ ఇస్లాం మతం పుచ్చుకుంటే మాకీ చర్చ బాధ తప్పుతుంది కదా? [మీరొక్కరే మారితే సరిపోదు]
  మీరు ఇప్పటికీ తిన్నగా సమాధానం ఇవ్వని నా ప్రశ్నలు
  a. మీరు ఒక కామెంట్లో "అబ్బాస్ తన పెద్దమ్మ కూతురిని పెళ్ళి చేసుకుంటే అది విచిత్రమా?" అని అడిగారు. ఎవరికి విచిత్రం? విచిత్రము అని మేము ఎవరూ అనలేదే? ఎవరి మతం ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. మీ అభ్యంతరమేమిటి? Why are you so against Hindu religion?
  b. "స్త్రీవాదానికి అనుకూలమైన భావజాలం" అంటే ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. I can't blow the conch before deaf men. You can go ahead.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. @praveen
   I can't blow the conch before deaf men. You can go ahead.


   Hi, we are doing the same thing to you?!

   Delete
  4. @praveen
   Q:
   పెళ్ళికి వరసల పట్టింపులు అవసరమా?

   @praveen
   A
   వరసలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయనేది నిజమే కదా.
   ??:

   Delete
  5. Which means he replied to his own question :)
   ప్రవీణ్
   మీరు అద్దం ముందర కూర్చుని మిమ్మల్ని మీరే ఇలా ప్రశ్నలు అడుక్కుని మళ్ళీ మీరే సమాధానాలు ఇచ్చేస్తే ఇంక ఇంత చర్చ దేనికి?

   Delete
 22. నిజాలను అబద్దాలు అని నిరూపించడానికి ప్రవీణ్ ఈ వాదన మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది!
  తనే తన పెళ్లి గురించి చర్చించి లేదు అంటాడు!
  తనే సంబంధాలు మొదలు పెట్టి ఇక్కడ పెళ్లి గురించి మాట్లాడుతున్నాను అంటాడు!

  గతంలో కూడా అదే జరిగింది హిందూత్వంలో మంచి చెబితే పెళ్లి గురించి తీసుకు వచ్చి మేనరికం అంటాడు, దాని గురించి చర్చిస్తే శృంగార సంబంధాల గురించి మాట్లాడతాడు!
  చివరికి తను అనుకున్నది ఒప్పుకోవట్లేదు అంటాడు!

  స్త్రీ సమాజం కోసం పనిచేస్తున్నట్టు అంటాడు ప్రక్రుతి విరుద్ధమైన పద్దతిలో పిల్లలను కంటే ఆడపిల్ల ఒకటే జన్యువు పొంది చనిపోయే ఆస్కారం ఉంది అంటే ఆవు వ్యాసం తీసుకు వస్తాడు.

  ఇక కొండలరావుగారు ఈ టపా మీరు తీసేస్తే బాగుంటుంది లేదా వ్యాఖ్యలు మీరు అనుకున్నట్టు కొన్ని రోజుల తరువాత అనుమతించవద్దు!

  ReplyDelete
  Replies
  1. వ్యక్తి స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇచ్చే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నప్పుడు నేను పిన్నిని పెళ్ళి చేసుకున్నా, మేనత్తని పెళ్ళి చేసుకున్నా ఎవరూ అభ్యంతరం చెప్పక్కరలేదు.

   మనిషి తన కోసం బతుకుతాడా లేదా మతం కోసం బతుకుతాడా? ఫలానా వరసలవాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు అని హిందూ మతం చెప్పిందని దాన్ని ఫాలో అవ్వాలా? మతం మీద నమ్మకం లేనివాళ్ళ మీదకి మత విశ్వాసాలు రుద్దడం అవసరమా?

   దీనికి హరిబాబు అనే వాడు ఏమి సమాధానం చెపుతాడో నాకు తెలుసు. "వరసల విషయంలో ఇస్లామిక్ షరియత్‌ని నమ్ముతానని నువ్వే అన్నావు. నువ్వు మళ్ళీఎ ఎందుకు మాట మార్చావు? నువ్వు నాస్తికుడివి కాదు" అని.

   వరసలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయని తెలిసిన తరువాత కూడా తమ దేశంలో నమ్మేదే నిజమనుకోవడం అనేది తాలిబాన్ తరహా భావజాలమే అవుతుంది.

   Delete
  2. వ్యక్తి స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇచ్చే పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నప్పుడు నేను పిన్నిని పెళ్ళి చేసుకున్నా, మేనత్తని పెళ్ళి చేసుకున్నా ఎవరూ అభ్యంతరం చెప్పక్కరలేదు.
   >> ఎవడ్రా అది! ప్రవీణ్ కి అడ్డు జెప్పనీకి? ప్రవీణ్ నువ్వు మీ పిన్నిని మేనత్తని పెండ్లి జేసుకుని హాయిగా కాపురం జేస్కో! ఎవడు అడ్డొచ్చినా అడ్డంగా నరికేస్తా...

   మనిషి తన కోసం బతుకుతాడా లేదా మతం కోసం బతుకుతాడా? ఫలానా వరసలవాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు అని హిందూ మతం చెప్పిందని దాన్ని ఫాలో అవ్వాలా? మతం మీద నమ్మకం లేనివాళ్ళ మీదకి మత విశ్వాసాలు రుద్దడం అవసరమా?
   >> ప్రవీణ్ గారు, ఈ కుహనా వాదులకి దిమ్మ తిరిగేలాగా మీ పేరు 'మహమ్మద్ డేవిడ్ ప్రవీణ్' గా మార్చుకుని సర్వమత సంబోధకుడిగా సరికొత్త ఒరవడిని సృష్టించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

   దీనికి హరిబాబు అనే వాడు ఏమి సమాధానం చెపుతాడో నాకు తెలుసు. "వరసల విషయంలో ఇస్లామిక్ షరియత్‌ని నమ్ముతానని నువ్వే అన్నావు. నువ్వు మళ్ళీఎ ఎందుకు మాట మార్చావు? నువ్వు నాస్తికుడివి కాదు" అని.
   >> హరిబాబు కేం తెలుసు, వంకాయ పులుసు కాకపొతే. హరిబాబు నాస్తికుడూ కాదు, ఆస్తికుడూ కాదు - హాస్తికుడు [హాస్యానికి :)]

   వరసలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయని తెలిసిన తరువాత కూడా తమ దేశంలో నమ్మేదే నిజమనుకోవడం...
   >> "సౌదీలో ముస్లిం మతస్తులు బావ మరదలు సంబంధం వొప్పుకోరు. భారత దేశంలో హిందూ మతం అక్క తమ్ముడు వరస అయ్యే వాళ్ళని చేసుకోవడం కూడదు అంటారు." అని నేను రాసాను కదా?

   ...అనేది తాలిబాన్ తరహా భావజాలమే అవుతుంది.
   >> 'ఒకరు ఒక ప్రశ్న వేసి, దాని నుండి యూ టర్న్ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రశ్నకి సమాధానం తనే సమాధానం చెప్పడం' = ఇది ప్రవీణ్ తరహా భావజాలం.

   Delete
 23. నా అభిప్రాయం కూడా అదే!

  కొండలరావ్ గారు, ఈ టపాకి ఇప్పటివరకు జరిగిన 'చర్చ'/'రచ్చ' చాలు అనిపిస్తోంది.

  ప్రవీణ్ గారు, మీ పెళ్ళికి మమ్మల్ని పిలవడం మర్చిపోకండి. నాకు ఒక్కడికీ SMS పంపించండి. ఎందుకంటే నాకు చెవుడు కదా? మీరు పిలిస్తే నాకు వినపడకపోవచ్చు.

  ReplyDelete
 24. Replies
  1. @to all
   ఇక కొండలరావుగారు ఈ టపా మీరు తీసేస్తే బాగుంటుంది లేదా
   >>
   అయ్యయ్యో, అంత పని చెయ్యకండి?!ఇక్కద జరిగిన చర్చ లన్నిట్లోనూ పిచ్చ సరదాగా జరిగి కాలక్షేపం కుదిరింది!

   తన ప్రశ్నకి తనతోనే జవాబు చెప్పించాలనే నా ట్రిక్కు అద్భుతంగా పేలింది,నాకిది చాలా ఇష్తమయిన చర్చ, ప్లీజ్!

   Delete
 25. Inbreeding among immigrants is causing a dramatic rise in birth defects, a government minister has warned.

  Referring to the culture of Muslim arranged marriages between cousins, environment minister Phil Woolas said: "If you have a child with your cousin the likelihood is there'll be a genetic problem."

  Mr Woolas, whose views were supported today by medical experts, said the practice did not extend to all Muslim communities and that most cases occur in families from rural Pakistan, where up to half of all marriages are thought to involve first cousins

  http://www.dailymail.co.uk/news/article-513388/Minister-Muslim-inbreeding-Britain-causing-massive-surge-birth-defects.html

  ReplyDelete
 
Top