ఆంధ్రావారిని తిట్టి పబ్బం గడుపుకుంటున్నారు
ప్రజలకు టీఆర్ఎస్ మాయమాటలు చెబుతోంది : జగ్గారెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 1 : ఆంధ్రావాళ్లను తిట్టి పబ్బం గడుపుకుంటున్నారని, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్‌పై బీజేపీ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల ఫీజుల సంగతి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. టిక్కెట్లు అమ్ముకున్నది టీఆర్ఎస్ నాయకులే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

హరీష్‌రావు రోజూ తన జపమే చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం బీజేపీ తీర్మానం చేసినప్పుడు హరీష్‌రావు చిన్న పిల్లాడన్నారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఆయన స్పష్టం చేశారు. పుట్టినప్పటి నుంచే తెలంగాణ కోసం పోరాడినట్టు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు.
(From andhrajyothy daily)

Reactions:

Post a Comment

 1. 5 ఏళ్ళకొకసారి పార్తీ మార్చే జగ్గారెడ్డి పార్తీ లక్ష్యం గురించి మాట్లాడడం విడ్డూరం కాదా? మొన్నటి వరకు తెలంగాణా అవసరం లేదని వాదించిన జగ్గారెడ్డి ఇప్పుడు బిజెపి వల్లే తెలంగాణా వచ్చిందని చెపుతున్నది ఎవరి కోసం?

  ReplyDelete
 2. ఒక సామ్రాజ్యవాది జాతుల విముక్తి గురించు మాట్లాడితే ఎలా ఉంటుందో, జగ్గారెడ్డి తెలంగాణా ఏర్పాటు గురించి మాట్లాడితే అలాగే ఉంటుంది.

  ReplyDelete
  Replies
  1. కే.సీ.ఆర్ కూడా తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడినవాడేగా ప్రవీణ్?

   Delete
  2. Jaggareddy was a disciple of YSR and Kirankumar Reddy. He opposed Telangana statehood even when the movement was at the apex.

   Delete
  3. తెలంగాణా ఉద్యమంలో నిజాయితీగా పోరాడినవారిని వదిలేస్తే కే.సీ.ఆర్ తో సహా రాజకీయనేతలది ఎవడి రాజకీయం వాడిది.

   Delete
  4. కొండల రావు గారు,

   మీ దృష్టిలో నిజాయితీగా పోరాడిన వారు ఎవరు? రాజకీయం అంటే మొత్తం చెడేనా, అందులో మంచి ఉండదా?

   స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది నిజాయితీగా పోరాడారు. కాని గాంధీ నాయకత్వంలోనే స్వాతంత్ర్యం సిద్ధించింది. కమ్యూనిజం కోసం ఎందఱో పోరాడారు, కాని అది లెనిన్, మావోల సారథ్యంలోనే సిద్ధించింది (తరువాత పరిణామాలు కాసేపు వదిలేద్దాం). వీరందరూ ఉద్యమకారులే కాదు, గొప్ప రాజకీయ చతురులు కూడా.

   ఉద్యమం కూడా ఒకరకమైన యుద్ధమే. ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేయలేక పొతే ఏ ఉద్యమం నెగ్గదు.

   ఇక జగ్గారెడ్డి రాజకీయానికి, కెసిఆర్ రాజకీయానికి హస్తి మశకాంతర భేదం వుంది. కెసిఆర్ ఒకప్పుడు సమైక్యవాది కావచ్చు, కాని తెలంగాణా వాదాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ వెనుకడుగు వేయలేదు. నమ్మిన సిద్ధాంతానికి తూట్లు పొడవలేదు.

   కేవలం రాజకీయ అస్తిత్వం కోసం, డబ్బు దందాలకోసం పార్టీలను దుస్తుల్లా మార్చిన చరిత్ర జగ్గారెడ్డిది. ముఖ్యమంత్రుల దగ్గర చెంచాగిరీ చేస్తూ తెలంగాణా ఉద్యమాన్ని, తద్వారా ప్రజలను అవమానిస్తూ తన వ్యక్తిగత పబ్బాలు గడుపుకున్న మనిషి ఇప్పుడు ఇతరుల గురించి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. అతని మాటలకు తెలంగాణలో ఏ విలువా లేదు.

   Delete
  5. మీ ప్రశ్నలకు కాస్త వివరంగా సమాధానం చెప్పాలి గనుక కొంత సమయం తీసుకుంటాను శ్రీకాంత్ చారి గారు,.

   Delete
 3. జగ్గారెడ్డి ఐదేళ్ళూ తెలంగాణావాదుల్ని తిడుతూ పబ్బంగడపలేదా?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top