- ఏ పార్టీ కూడా ఎన్నికలను కోరుకోవడం లేదు
- షాక్‌తిన్న కాంగ్రెస్‌

         న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలకు మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి అవకాశం ఇవ్వాలని, అది ఢిల్లీ ప్రజలకు మంచిదని గురువారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. షీలా వ్యాఖ్యలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అది ఆమె సొంత అభిప్రాయమని, పార్టీకి సంబంధం లేదని తప్పుకునే ప్రయత్నం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలే ప్రజలకు మంచిదని, బిజెపి ఆ పరిస్థితికి చేరుకుంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, అది ఢిల్లీ ప్రజలకు మంచిదని ఆమె అన్నారు. ఢిల్లీ శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యులెవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా తాజా ఎన్నికలను కోరుకోవటం లేదని ఆమె అన్నారు. తాము ప్రతినిధులను ఎన్నుకుని ఏడాది కూడా కాకుండానే అప్పుడే ఎన్నికలేమిటంటూ పలువురు ప్రజలు తనను నిలదీశారని ఆమె చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఏర్పాటును కోరుకుంటున్నారని తాను భావిస్తునాన్నన్నారు. అయితే ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటవుతుందన్న విషయాన్ని తాను స్పష్టంగా చెప్పలేనని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటవుతుందో, మైనార్టీ సర్కారుకు ఎదురయ్యే సమస్యలేమిటో చూడాల్సిందేనని, వీటిని వారు అధిగమిస్తారా లేదా అన్నది వారి (బిజెపి)పైనే ఆధారపడి వుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు తామెన్నుకున్న ప్రభుత్వం లేకపోతే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో వున్నారని ఆమె అన్నారు. ప్రజల వాణి వినిపిస్తే అది మంచిదేనని, వారు (బిజెపి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే శాసనసభలో మెజార్టీని రుజువు చేసుకోవాల్సి వుంటుందని ఆమె అన్నారు. ముందు ప్రభుత్వాన్నిఏర్పాటు చేయనిచ్చి తరువాత నిర్ణయాలు తీసుకోవచ్చని ఆమె సూచించారు.
షాక్‌ తిన్న కాంగ్రెస్‌
షీలా దీక్షిత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే వెంటనే తేరుకున్న పార్టీ నాయకత్వం అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీ వైఖరి కాదని స్పష్టం చేసింది. ఢిల్లీ పిసిసి ప్రతినిధి ముకేష్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ షీలా వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు ఎటువంట సంబంధమూ లేదని స్పష్టం చేశారు.
దేశ రాజధానిలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వరాదన్నదే మొదటి నుండి తమ వైఖరి అని ఆయన పునరుద్ఘాటించారు. కాగా ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై షీలా ముక్కుసూటిగా అభిప్రాయం చెప్పారని అన్నారు. మరోవైపు ఆమాద్మీ పార్టీ దీనిపై స్పందిస్తూ కాంగ్రెస్‌కు, బిజెపికి తేడా ఏమీ లేదన్న అంశాన్ని షీలా వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయని వ్యాఖ్యానించింది.
(from prajasakthi daily)
Reactions:

Post a Comment

 1. ఒక అవినీతి వ్యతిరేక పార్తీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్, బిజెపి రెండూ ఒకటయ్యాయి.

  ReplyDelete
  Replies
  1. అవును. కానీ పైకి మాత్రం షీలాదిక్షిత్ ఓకే అన్నా అది తమ పార్టీ నిర్ణయం కాదని కాంగ్రెస్ వారు చెప్తున్నారు.

   Delete
  2. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలు కేవలం నాటకాలు. గతంలో రాజశేఖరరెడ్డి బంధువులకి చెందిన ప్రైవేత్ థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనడానికే చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జిలు పెంచాడు. చంద్రబాబుకీ, రాజశేఖరరెడ్డికీ మధ్య వ్యక్తిగత శతృత్వం లేనట్టే కాంగ్రెస్ & బిజెపిల మధ్య కూడా అది ఉండదు. తమ దారికి అడ్డు తగిలే మావోయిస్త్‌లు, ఆమ్ ఆద్మీ పార్తీ లాంటివాళ్ళకి వ్యతిరేకంగా కలిసి పని చెయ్యడానికి వాళ్ళు ముసుగులు తొలిగించుకోగలరు. షీలా దీక్షిత్ బహిరంగంగానే ముసుగు వదులుకుంది.

   Delete
 2. అవినీతి వ్యతిరేకం అని ముసుగులో ఉన్న సంస్థను పాలనలోకి రానివ్వకుండా అవినీతి congress BJP కు మద్దతు ఇస్తుంది!

  ReplyDelete
 3. BJP never claimed that they would eradicate corruption. Therefore Sheila dared to support BJP.

  ReplyDelete
 4. అలా కాదు .... మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి సంపూర్ణ మద్దతు ఉన్న పార్టీయే ప్రభుత్వం ఏర్పరచాలి .... మహా అయితే 100 కోట్లు ఖర్చు అవుతుంది ... డిల్లీ లాంటి రాష్ట్రస్నికి అదో లెక్కకాదు ....
  ఉన్న అన్ని ఎం.పీ సీట్లు భా.జ.పా గెలిచినా ఆప్ రాజ్యాంగాన్ని చేస్తున్న గేలి ఈ రాద్ధాంతం ....

  It was sheelaa's personnel opinion .....
  Oh how aap is anti curroption messaiah ...... Aap not ready to publish its foreign funds details even after Ec ordered them to do ...... AAP is soft face of PAAP ...CURRUPTION .

  BJP will win if elections conducted ...
  Its better idea to form govt to save 100 crores.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top