• సంచలనం సృష్టించిన ఆంధ్రా ఇ-కేబినెట్‌ !
  • అదే దారిలో పయనానికి కేంద్రం సిద్ధం
  • కేబినెట్‌ సమావేశానికి ఫైళ్లు వద్దన్న బాబు


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సోమవారంనాడు ఇ కేబినెట్‌ సమావేశం నిర్వహించి సంచలనం సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి సమావేశం జరిగింది. మంత్రులు ఐపాడ్‌లతో ఈ సమావేశానికి విచ్చేశారు. 

సోమవారంనాడు జరిగిన ఇ కేబినెట్‌ సమావేశం పట్ల కేంద్రం కూడా చాలా ఆసక్తి కనబరిచింది. అసలు ఈ సమావేశం ఎలా నిర్వహించారని, ఇందుకు ఉపయోగించిన పరికరాలు ఏమిటని ప్రధాని కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం తెప్పించుకుంది. ఇ కేబినెట్‌ సమావేశం విజయవంతంగా జరగడం గురించి తెలుసుకున్న అనంతరం ఇక మీదట కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని కూడా ఇలాగే నిర్వహించాలన్న ఆసక్తి కేంద్రంలో కనిపించింది. 

ఈనాటి చర్చలన్నీ ఐపాడ్‌లపైనే జరిగాయి. ఈ సమావేశానికి ఫైళ్లు మోసుకురావద్దని మంత్రులకు ముందుగానే ముఖ్యమంత్రి మాటగా చెప్పడంతో అందరూ ఐపాడ్‌లతోనే సమావేశానికి వచ్చారు. అందరూ ఐపాడ్‌ల వినియోగానికి ఆసక్తి కనబరిచారు. వీటి వినియోగంలో ఎవరైనా ఇబ్బంది పడితే వారికి నెమ్మదిగా పక్కవారు నేర్పిస్తూ సహకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి యనమల తొలినుంచీ ఆధునిక పరికరాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.

దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కర్నూలు జిల్లా పాణ్యంలో 5000 ఎకరాలలో, కడప జిల్లాలోని గాలివీడులో 3000 ఎకరాలలో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం సోలార్‌ ఎనర్జీ ఇండియా కార్పొరేషన్‌ సహాయంతో 2500 మెగావాట్ల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. అక్టోబర్‌ రెండవ తేదీనుంచి ఎన్టీఆర్‌ సుజల స్రవంతిని తొలిదశగా 1230 గ్రామాలలో ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. 

చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టి 100 రోజులైన సందర్భంగా జరిగిన ఈ కేబినెట్‌ సమావేశంలో మంత్రులు తమ తమ మంత్రిత్వ శాఖల బాధ్యతలను, లక్ష్యాలనూ ఎవరికి వారే ఎప్పటికపడు అంచనా వేసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
(From andhrajyothy daily)
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top