Name:Sree Dhar 
E-Mail:deleted 
Subject:
క్షేత్ర స్థాయిలో నిజాలకు మీడియాలో నిజాలకు తేడా ఉంటుంది అన్న విషయం ఎందరికి తెలుసు? 
Message:
కొద్ది రోజుల క్రితం ఒక తెలుగు వెబ్సైట్ లో (http://tinyurl.com/nhpyvwp) మెదక్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అని ఒక పోల్ నిర్వహించబడినది. ఆ సైట్ లో అభ్యర్తులకు వచ్చిన ఓట్ల శాతం చూడొచ్చు. 65.5% భారి ఓట్లతో బాజాపా-తెలుగు దేశం అభ్యర్థి మొదటి స్థానంలో ఉండగా, తెరాసా అభ్యర్థి 23% ఓట్లతో రెండో స్థానంలో, కేవలం 5.5% ఓట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది.

ప్రస్తుతం ఈ ఉప ఎన్నిక అయిపోయి, పలితాలు కూడా వచ్చాయి. పలితాలు చూస్తే తెరాసా-59% తో మొదటి స్థానంలో ఉండగా, కాంగ్రెస్-22% శాతం తో రెండో స్థానంలో ఉంది. ఇక తెలుగు దేశం-బాజాపా పొత్తు అభ్యర్థి జగ్గారెడ్డి 19% ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.

పై పోల్ లో ఎవరు గెలుస్తారు అనే పోల్ నిర్వహించారు. పోల్ కు ఓట్లు వేసిన వారిలో అత్యధికులు ఓటు వేసిన అభ్యర్థి నిజానికి చిట్ట చివరి స్తానం గెలుచుకున్నాడు. జగ్గారెడ్డి గెలిచే అవకాశం ఏమాత్రం లేదని క్షేత్ర స్థాయిలో పరిస్తితులు తెలిసిన వారు ఎవ్వరైనా చెప్పగలరు. మరి పోల్ పలితాలు ఇంత సత్య దూరంగా ఎందుకు వచ్చాయి?

ప్రతి మీడియా గ్రూపు ఏదోక పక్షపాతంతో వ్యవహరిస్తున్న ఈ రోజుల్లో ఈ ఎన్నికల విషయమే కాకుండా పలు ఇతర విషయాలలో ఇవే ప్రజల అభిప్రాయాలు అని ప్రకటిస్తున్న ఆన్లైన్ లేదా టివి లేదా పేపర్ మీడియాల విశ్లేషణలను ఎంత వరకు నమ్మగలం? 
Reactions:

Post a Comment

  1. ప్రశ్న వేసిన వాడిగా మొదట నా అభిప్రాయం చెపుతాను.

    ఆ వెబ్సైట్ లో ఎవరు గెలుస్తారు అని విశ్లేశించమంటే ఓట్లు వేసిన వారు, వారికి ఎవరు గెలవటం ఇష్టం ఉందొ వారికి ఓటు వేసారు. నిజానికి ఇలా ఓట్లు వేసిన వారు క్షేత్రంలో ఓటు వెయ్యలేరు కాబట్టి, వారు కోరుకున్న పలితాలు రాలేదు. వచ్చే ఎలక్షన్ లో తెలంగాణా రాష్ట్రంలో ఎవరు గెలవొచ్చు అని ఆంధ్ర ప్రదేశ్లో సర్వే చేస్తే అప్పుడు కూడా తెలుగుదేశం సంపూర్ణ మెజారిటితో గెలుస్తుంది అని సర్వే పలితం వస్తుంది. క్షేత్రంలో జరగని సర్వేలు లోప భూయిష్టం అని చెప్పటానికి ఇది ఉదాహరణ.

    ఇలాంటి విషయాలను ఉపయోగించుకొని మీడియాలు తమ పక్షపాత పార్టీలకు వంతపాడతాయి. ప్రతి మీడియా ప్రజల పక్షం కాకుండా ఉన్నన్ని రోజులు మీడియాలో ప్రజలకు వాస్తవాలు కనిపించే అవకాశాలు చాలా తక్కువ.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర చర్చావేదిక జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top