ప్రయాణం............
                                                             My feelings, Learning's and Experiences

               ఇది నా బ్లాగుకు నేను పెట్టుకున్న పేరు. 

బ్లాగు ప్రపంచంలో చాలా రకాల ప్రయోగాలు చేసి కొన్ని విజయాలు కొన్ని అపజయాలు సాధించిన నేను ఈ ప్లాట్ ఫారం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. 2011 లో బ్లాగు ప్రపంచంలోకి వచ్చిన నేను చాలా ప్రయోగాలు చేసినా ఇంతవరకూ నాకు వ్యక్తిగత బ్లాగు లేదు. 

వ్యక్తిగత బ్లాగు లేదు అనేదానికంటే వ్యక్తిగత బ్లాగు వ్రాసుకోవాలన్న ఆలోచన రాలేదంటే సబబుగా ఉంటుంది. ఇంతకు ముందు నేను నడిపిన బ్లాగులలో వ్యక్తిగత విషయాలూ కొన్ని వ్రాసినా పూర్తిగా వ్యక్తిగత భావాలు వ్రాసుకోవాలని ప్రారంభించిన బ్లాగు ఇదే. ఆ పోస్టులను వీలయితే ఇక్కడికి తీసుకొస్తాను.

బ్లాగు అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉందిక్కడ. మన అభిప్రాయాలతో ఏకీభవించే స్నేహితులు. మనకు తెలియినవి ఓర్పుగా నేర్పే సహృదయులూ ఉంటారిక్కడ. 

వాస్తవ ప్రపంచంలో ఉండే మంచి - చెడ్డ మనసులన్నీ ఇక్కడి వర్చువల్ ప్రపంచంలోనూ ఉన్నా మంచివారి లిస్ట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు మనమో గ్రామంలో ఉంటే మన అభిప్రాయాలతో సన్నిహితంగా ఉండేవారి సంఖ్య చాలా చాలా తక్కువుగా ఉంటుంది. చుట్టుపక్కల ఊళ్ల్లలో చూసుకున్నా ఈ సంఖ్య అంతగా పెరగదు. కానీ బ్లాగులోకంలో ఆ కొరత తీరుతుంది. 

అయితే తేడా ప్రధానమైనది ఏమిటంటే వారు మనకు ఎదురుగా లేకపోవడమే. మనసులతో మాత్రమే ఇక్కడ సావాసం చేయగలం. మనుషులని చూడకుండా చేస్తున్న ఈ స్నేహం విలువా గొప్పదే కదా?

ఇక్కడ చాలామందికి నేనేంటో తెలుసు. కొద్దిమందికి ఎందుకో శతృవుగా మారాను. వారు పనికట్టుకుని మరీ కువిమర్శలు అబద్దాలు వ్రాస్తుంటారు. అలాంటివారివల్ల కొద్దిగా బాధ అనిపించినా బ్లాగు ప్రపంచంలో నాకు మిత్రులే ఎక్కువ. రాజకీయంగా వివిధ రకాల అభిప్రాయాలున్నవారు సైతం నాకు మిత్రులుగానే ఉండడం విశేషం. ఎప్పటిలాగే వారు ఇకమీదట కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నాను. భిన్నాభిప్రాయాలు అభిప్రాయబేధాలు ఉండడానికి వ్యక్తిగతంగా స్నేహంగా ఉండాడానికీ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు.

మన బ్లాగుకు మనమే యజమానులం గనుక, ఎడిటింగులూ మనవే పోస్టింగులూ మనవే కనుక ఇష్టపూర్తిగా సంపూర్ణమైన స్వేచ్చతో మన అభిప్రాయాలు ఇక్కడ వ్రాసుకోవచ్చు. హాయిగా మన జ్ఞాపాలను అనుభవాలను ఇతరులతో పంచుకోవచ్చు. బ్లాగులోకం లో సీనియర్ బ్లాగర్లకు ఆసక్తి తగ్గుతున్న సమయంలో నాకు ఆసక్తి పెరగడం ఏమిటా? అని ఒక నిమిషం ఆలోచించాను. బ్లాగు అంటే ఓ ఆన్‌లైన్ డైరీ లాంటిది. ప్రతి ఒక్కరి అనుభవాలు ఆలోచనలు జ్ఞాపకాలు మరికొందరికి పాఠాలుగా ఉపయోగపడతాయి కనుక ఎప్పటికైనా బ్లాగర్లలో తిరిగి ఆసక్తి పెరుగుతుందని నమ్ముతున్నాను. 

వారితో పాటే నా ప్రయాణం కూడా సాగించాలని ఆశిస్తున్నాను. సహకరిస్తున్న వాందరికీ ధన్యవాదములు.


Reactions:

Post a Comment

  1. Replies
    1. Thank you కిరణ్ కుమార్ కే garu.

      Delete
  2. అభినందనలు కొండలరావు గారూ ! మీ ఈ సరికొత్త ప్రయోగం , మీకు ఆనందం , సంతృప్తి కలిగించాలని ఆశిస్తున్నా !

    ReplyDelete
  3. అభినందనలు కొండలరావు గారూ ! మీ ఈ సరికొత్త ప్రయోగం , మీకు ఆనందం , సంతృప్తి కలిగించాలని ఆశిస్తున్నా !

    ReplyDelete
  4. good start kondalarao garu...all the best, keep blogging.

    ReplyDelete
  5. కొండలరావుగారు.
    మీరు మీ స్వంతబ్లాగు తెఱచినందుకు అభినందనలు.
    మీ‌ టపాలు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాను.
    సీనియర్ బ్లాగర్లలో‌మరొకతరం తప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నరోజులు.
    నేను కూడా ఇంకెన్నాళ్ళో ఈ‌ బ్లాగులోకంలో ఉంటానని అనుకోవటం లేదు.
    మీరు ఈ రంగంలో ప్రయాణం మొదలు పెదుతున్నారు. మంచిది.

    మీరు బ్లాగులో RSS ఫీడ్ అనేది FULL అనే సెట్టింగ్ మార్చి స్వల్పంగానే అనుమతించాలి. లేకపోతే rssing.com వంటివి మీ‌టపాలన్నింటినీ కాపీచేసుకుంటాయు. తస్మాత్ జాగ్రత. పైగా అది లీగల్ అట.

    వీలు చూసుకొని రోజూ ఒకటి రెండు టపాలు వేయండి.

    శుభం భూయాత్.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కరంట్ అఫైర్స్ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి హ్యూమనిజం
 
Top