• ఇదిగో సాక్ష్యం.. ఇప్పుడేమంటారు?
 • తమ స్థలాన్ని మార్చవద్దని ఎల్‌అండ్‌టీ కోరింది
 • అలా చేస్తే ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామంది 
 • కిరణ్‌ చేయలేకపోయిన పనిని కేసీఆర్‌ చేశారు
 • బంధువు కోసం తెలంగాణకు ద్రోహం చేశారు
 • కేటీఆర్‌ వస్తే బహిరంగ చర్చకు సిద్ధం
 • ఎన్వీఎస్‌ రెడ్డిని బెదిరించి ఖండనలు ఇప్పిస్తున్నారు
 • కేటాయింపు రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం 
 • ప్రభుత్వ పత్రాలు బయట పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘తమకు ఇచ్చిన స్ధలంలో అనేక రకాల కార్యకలాపాలు చేపట్టామని, పర్యావరణ అనుమతులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అనుమతులు కూడా తీసుకొన్నామని ఎల్‌ అండ్‌ టీ సంస్ధ మాకు లేఖ రాసింది. ఆ స్ధలంలో భారీ నిర్మాణాల కోసం మాస్టర్‌ ప్లాన్‌ కూడా తయారు చేసుకొన్నామని, ఇన్ని పనులు పూర్తయిన తర్వాత తమ స్ధలం మార్చాలన్న ప్రతిపాదన వల్ల మొత్తం మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఆర్ధిక సౌష్టవం దెబ్బతింటుందని, ఈ ప్రాజెక్టుపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంది. 
ఎల్‌అండ్‌టీ విభాగాధిపతులు కేంద్ర ఆర్థికమంత్రిని, ఇతర సీనియర్‌ కేంద్ర మంత్రులను, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని, గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నుంచి వైదొలగుతామని ప్రతిపాదించారు. వ్యాపార వాతావరణం మారిపోవడం, ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, మెట్రో నిర్మాణానికి ఇస్తామన్న రహదారులు, స్థలాలు అప్పగించడంలో జాప్యానికి తోడు తమకు ఇస్తామని చెప్పిన 15 ఎకరాల స్థలాన్ని వదులుకొని వేరే చోట స్థలం తీసుకొనే పరిస్థితులు లేకపోవడమే దీనికి కారణం.’
ఈ ఏడాది ఏప్రిల్‌ 16న ఏపీఐఐసీ సీఎండీ జయేష్‌ రంజన్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి రాసిన లేఖలోని రెండు పేరాలు ఇవి. 
జయేష్‌ రంజన్‌ లేఖను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. హైటెక్‌ సిటీ వద్ద ఎల్‌అండ్‌టి సంస్థకు మెట్రో రైల్‌ నిర్మాణం కోసం ఇచ్చిన స్థలాన్ని మార్చలేదని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి చేసిన ప్రకటనకు ప్రతిస్పందనగా రేవంత్‌ ఈ లేఖను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను కేసీఆర్‌ బెదిరించి, ఆ పదవి నుంచి తీసేస్తామని భయపెట్టి ఆయనతో ఖండన ఇప్పించారని రేవంత్‌ ఆరోపించారు. ‘ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎల్‌అండ్‌టీ సంస్థకు హైటెక్‌ సిటీ సమీపంలో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 
మెట్రో రైల్‌ నిర్మాణానికి ఆ సంస్థ పెడుతున్న పెట్టుబడికి ప్రత్యమ్నాయంగా ఈ స్థలాన్ని కేటాయించారు. దీని పక్కనే మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌కు మూడు ఎకరాలు, పెద్ద సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ట్రాన్స్‌కోకు ఐదు ఎకరాలు, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి కొంత భూమి ఇచ్చారు. దీని పక్కనే గేమింగ్‌ సిటీ నిర్మాణానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏపీఐఐసీకి 31 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ కేటాయింపులకు చాలా ముందు 2007లో రాయదుర్గంలోని ప్రభుత్వ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం పాట వేసింది. ఇందులో డీఎల్‌ఎఫ్‌ సంస్థ కొంత భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమిలో అరుదైన రాళ్లు ఉన్నాయన్న అభ్యంతరాలు రావడంతో ఆ సంస్థ అక్కడ నిర్మాణాలు చేయలేదు. తర్వాత ఆ సంస్ధ నుంచి ఆ భూమిని మై హోం రియల్‌ ఎస్టేట్‌ సంస్ధ యజమాని రామేశ్వరరావు తీసుకొన్నారు. తన భూమిలో తాను నిర్మాణాలు చేసుకొనే వీలు లేనందువల్ల గేమింగ్‌ సిటీకి ఇచ్చిన 31 ఎకరాలను తనకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అప్పట్లో సీఎంగా ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి దానికి అంగీకరించి ఎల్‌అండ్‌టికి ఇచ్చిన స్థలంలోకి గేమింగ్‌ సిటీని మార్చి, గేమింగ్‌ సిటీ స్థలాన్ని రామేశ్వరరావుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఎల్‌అండ్‌టీని మరో చోట భూమిని తీసుకోవాలని కోరారు. కాని దానికి ఎల్‌అండ్‌టీ ఒప్పుకోలేదు. ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో అధికారికంగా ఎవరికీ భూముల మార్పిడి జరగకుండానే కిరణ్‌ సర్కారు దిగిపోయింది. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లోనే గేమింగ్‌ సిటీకి కేటాయించిన 31 ఎకరాల స్థలాన్ని మైహోం రామేశ్వరరావుకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్‌అండ్‌టీ సంస్థకు మల్టీ లెవల్‌ పార్కింగ్‌ కోసం కేటాయించిన మొత్తం 18 ఎకరాల్లోకి గేమింగ్‌ సిటీని మార్చేశారని, గేమింగ్‌ సిటీకి కేటాయించిన 31 ఎకరాలను రామేశ్వరరావు సంస్థకు అప్పగించిందని రేవంత్‌ చెప్పారు. తమకు ఇచ్చిన 31 ఎకరాల స్థలాన్ని రిజిసే్ట్రషన్‌ చేయించుకోవడానికి రామేశ్వరరావు సంస్థ ప్రభుత్వానికి రూ.23 కోట్లు స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంది. అది కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా కేసీఆర్‌ ప్రభుత్వం మినహాయింపు ఉత్తర్వులను ఈ ఏడాది జూన్‌ 27న ఇచ్చిందని రేవంత్‌ వివరించారు.
రామేశ్వరరావుకు ఇచ్చిన స్థలంలో గతంలో తాము రూ.3కోట్లు వెచ్చించి రహదారి నిర్మించామని, ఆ డబ్బులైనా ఇప్పించాలని ఏపీఐఐసీ కోరితే అది కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుందని రేవంత్‌ వెల్లడించారు. ‘మెట్రో రైల్‌ హైదరాబాద్‌కు ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. దాని వల్ల హైదరాబాద్‌ ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా వేల ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాజెక్టు కోసం ఎల్‌అండ్‌టీ కంపెనీకి ఇచ్చిన స్థలాన్ని కేసీఆర్‌ ఎలా మారుస్తారు? తన బంధువుకు మేలు చేయడం కోసం ఏదైనా చేస్తారా? పిడికెడు దొరల కోసమేనా తెలంగాణ వచ్చింది?’ అని రేవంత్‌ ప్రశ్నించారు.
తెర వెనుక ఏం జరుగుతోందో తెలియజేయడం కోసమే తాను కొన్ని ప్రభుత్వ పత్రాలు విడుదల చేస్తున్నానన్నారు. ‘నా వద్ద ఇంకా సమాచారం ఉంది. నన్నో... చంద్రబాబునో కేసీఆర్‌ తిట్టిస్తే ఉపయోగం లేదు. మేం అడిగిన దానికి సమాధానం చెప్పాలి. పనికిమాలిన గాడిదలు మాట్లాడే మాటలు మేం పట్టించుకోం. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ వస్తే పాత్రికేయుల ముందు బహిరంగ చర్చ నిర్వహించడానికి నేను సిద్ధం. లేదా కోదండరాం మధ్యవర్తిగా ప్రెస్‌క్లబ్‌లోనో...సచివాలయంలోనో చర్చ పెట్టినా నేను సిద్ధం’ అని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి రామేశ్వరరావుకు ఇచ్చిన భూ కేటాయింపు రద్దు చేయకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలు స్తంభింపచేస్తామన్నారు. తనపై ఇప్పటికి మూడు కేసులు పెట్టారని, గన్‌మెన్‌ను తొలగించాలని చూస్తున్నారని, అదే జరిగితే తనకు భద్రత ఇవ్వడానికి ఊరూరా తన సామాజిక వర్గానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారన్నారు. కిరణ్‌ కుమార్‌ కూడా చేయలేని పనిని కేసీఆర్‌ చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని రేవంత్‌ విమర్శించారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. సింపుల్ గా రేవంత్ గారు చెప్పే విషయాలలో డొల్ల తనాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను

  1. ఆ రామేశ్వరరావు గత ప్రభుత్వ కాలంలో ఏదో భూమి కొన్నాడు, స్టాంపు డ్యుటి కింద అప్పుడు సుమారు 35 కోట్లు కట్టాడు.

  2. ఆ భూమిలో ఏవో విలువైన రాళ్ళు ఉన్నాయని, నిర్మాణాలు వద్దని, ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి ఇచ్చెయ్యాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. భూమి ఇచ్చేస్తే డబ్బు తిరిగి ఇవ్వటం లేదా దానికి బదులుగా ఇంకో భూమి ఇవ్వటం అనే ఒప్పందం గత ప్రభుత్వ కాలంలో జరిగింది.

  3. ఆ ప్రభుత్వ కాలం లో ఫైళ్ళు సంతకాలు కాకుండానే ఆగిపోయాయి.

  4. ఈ ప్రభుత్వం ఆ ఫైళ్ళు క్లియర్ చేసి ఆ రమేశ్వరరావుకు మరొక భూమి ఇచ్చారు.

  5. రమేశ్వరరావు కు ఇచ్చిన అ పాత భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఇదివరకే ఆ పాత భూమికి రామేశ్వరరావు స్టాంపు డ్యుటి కట్టినందున, ఆ డబ్బు తిరిగి ఆయనకు ఇచ్చే బదులు, అదే డబ్బును ఈ కొత్త భూమి కొనుగోలుకు చెల్లించాల్సిన స్టాంపు డ్యుటిలో సర్దుబాటు చెయ్యాలని నిర్ణయిస్తు, ఇప్పుడు కొత్త భూమికి కట్టాల్సిన 29కోట్ల స్టాంపు డ్యుటి కట్టనవసరం లేదని ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఈ భూ మార్పులు జరిగాయి కాబట్టి ఏపీఐఐసీ అభ్యంతరాల పక్కన పెట్టి ఉండొచ్చు.

  6. రమేశ్వరరావుకు ఇచ్చిన ఈ కొత్త భూమి ఇదివరకు ఎల్ అండ్ టి కి కేటాయించిన భూమి అని మరొక ఆరోపణ. అది నిజం అనేందుకు రేవంత్ రెడ్డి ఆధారాలు చూపలేదు. తమకు కేటాయించిన భూములు ఏవి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు అని ఎల్ అండ్ టి వారు స్వయంగా కేటాయించారు. ఈనాడు వార్తలో చివరి లైన్ లో ఇలా రాసారు "మెట్రోకు ఇచ్చిన 18 ఎకరాలను గేమింగ్ పార్క్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు జారి చేసింది అన్న అంశంపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వలేదు"

  ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆ భూమికి రమేశ్వరరావు స్టాంపు డ్యుటి కట్టాల్సిన అవసరం లేకుండా జారి అయిన ఉత్తర్వుల ఆధారంగానే రేవంత్ రెడ్డి ఈ కథ అంతా అల్లాడు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత వరకు రేవంత్ రెడ్డి చూపించిన ఆధారం ఆ స్టాంపు డ్యుటి రద్దు ఉత్తర్వులు మాత్రమె.

  రేవంత్ రెడి మరిన్ని ఆధారాలు చూపిస్తానని అంటున్నాడు, అవన్నీ చూపిస్తే నిజ నిజాలను మరోసారి విశ్లేశిచుకోవచ్చు.

  ReplyDelete
  Replies
  1. మరో ముఖ్యమయిన అభియోగం (వాస్తవం): రామేశ్వరరావు వెలమ దొర. ఇది తప్పించుకోలేని బ్రహ్మాస్త్రం!

   Delete
  2. Sujaya Krishna Rangarao is also a Velama Dora but staunch supporter of Samaikyandhra. Can we relate him with KCR?

   Delete
  3. కె.సి.ఆర్.కి అంత కులతత్వం ఉంటుందనుకోను. BTW, కమ్మవాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్ జిల్లాలలో దారిన పోయే కమ్మవాళ్ళని కూడా ఎన్నికల్లో నిలబెట్టిన చరిత్ర తెలుగు దేశానికి ఉంది.

   Delete
 2. కిరణ్ కుమార్ కే గారి వివరణ సరైనది. అంతే కాకుండా రామేశ్వర్ రావు గారు స్వయంకృషి తో ఎదిగారు. వివాదాలకు దూరం. చాలా సౌమ్యులు, దైవభక్తి కలవారు, నిస్వార్ధంతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా వ్యాపారంలో కూడా విలువలు పాటించే వ్యక్తి. వారి సంస్థల లోని ఉద్యోగులు, వారితో పరిచయం ఉన్నవారు, ఆయనను ఎంతో ప్రేమిస్తారు. అటువంటి వారిని వివాదాల లోకి లాగడం మంచిది కాదు.

  ReplyDelete
 3. http://www.thehindu.com/news/national/telangana/gadgils-absence-at-crucial-meet-draws-flak/article6497566.ece

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top