Name:hari.S.babu 
E-Mail:kinghari010@gmail.com 
Subject:saamaajikam 
Message:ప్రశ్న;హిందూ వివాహ చట్తంలో హిందూ ధర్మ శాస్త్రాలకి విరుధ్ధమయిన అన్యాయ పూరితమయిన నియమాలు యెలా వచ్చాయి?వీటిని ఇలాగే కొనసాగించ వలసిందేనా?

1.విడాకులు: చాణక్యుడు స్త్రీ వైపు నుంచి విడాకులకు అబ్యర్ధన వస్తే వెంఠనే ఇచ్చెయ్య మన్నాడు!కారణం కూడా తనే చెప్పాడు.విడాకులు తిరస్కరించ బడినా, వాయిదా పడినా - తన నుంచి వేరు పదాలనుకున్నది అనే కోపంతో శారీరకంగా బలవంతుడు కావదం చేత ఆమేకి హాని కలిగించ వచ్చు.ఈ మాత్రం లోకజ్ఞానం కూడా ఆధినికులకి లేకపోయినదా - విడిపోవాలని కోరుకున్న తర్వాత కూడా ఆరు నెల్లు కలిసుండి అప్పుడు కూడా విడిపోవాలనే అనుకుంతే తప్ప ఇవ్వరాదనే నియమం పెట్టింది?

2.వారసత్వం:ఆశ్చర్యం యేమిటంటే - అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా వుంటూ సమానంగా కష్టనష్టాలని భరిస్తూ జీవిత కాలం పాటు తను కూడా సహధర్మచారిణి గా వున్నా పురుషుడి ఆస్తి మీద భార్యకు హక్కు లేదు ఆధునిక న్యాయసూత్రాల ప్రకారం!పిల్లలు వుంటే ఆ పిల్లలకి సంరక్షకురాలిగా తప్ప పిల్లలు లేకుందా వైధవ్యం వస్తే ఆ భార్యకు చిప్పే గతి?పిల్లలు వున్నా కూడా ఆ పిల్లలు పెద్దవాళ్లయ్యాక ఆస్తిని వాళ్లకి అప్పజెప్పే కాపలా మనిషి గానే తప్ప ఆమెకు యే హక్కూ ఇవ్వలేదు.కానీ చాణక్యుడు తన అర్ధశాస్త్రంలో ఇంతకన్నా నిజాయితీగా చెప్పాడు.ఒక ప్రస్తావన నాకు బలంగా గుర్తున్నది - భర్త చనిపోయిన స్త్రీ తన భర్త ఆస్తిని అనుభవిస్తూ దాన్ని అజమాయిషీ చెయ్యదం గురించి చాలా మామూలుగా జరిగే విషయం లాగా ప్రస్తావించాడు.

3.లైంగిక హక్కు:వివాహంలోని అసలయిన అర్ధం నాతి చరామి శ్లోకంలో వుంటుంది - ధర్మ అర్ధ కామ మోక్ష సంబంధమయిన నా అన్ని కోరికల్నీ నా భాగస్వామినే ఆలంబనగా చేసుకుని తీర్చుకుంటాను, దాన్ని అతిక్రమించి మరొకరితో ఈ పురుషార్ధాలలో దేనినీ నేను అనుభవించను - అనే ఒక వాగ్దానం అది. ఇద్దరికీ ఆ వాగ్దానం పట్ల సమానమయిన బాధ్యత ఇచ్చారు.అయితే మనకి సంస్కృతం అర్ధం కాదు, కనీసం పలకలేము అనే వుద్దేశంతో మన పంతుళ్ళు వాళ్లే చదివేసి మనల్ని \"మమ\" అనుకోమనడం, మనం కూడా \"మమ\" అనేసి ఇవతలి కొచ్చేస్తున్నాం!కానీ ఈ వాగ్దానానికి సంబంధించిన స్పూర్తిని ఆధునిక న్యాయసూత్రాలు పట్టించుకుని వుంటే వివాహతర సంబంధాలు అనే అనైతికమయిన వాటిని చట్తప్రకారం శిక్షించదగిన నేరాలుగా మార్చవచ్చు.ఇవ్వాళ ఒక స్త్రీ తన భర్త మరొక స్త్రీ తో గడపటం ఆమెకి యెంత అవమానం అనిపించినా చట్టప్రకారం యేమీ చెయ్యలేదు.తనభర్త ఆ స్త్రీతో కలిసి తన మీద హత్యాప్రయత్నం చేస్తున్నాడనో మరోవిధంగానో దొంగకేసు పెట్టాల్సిందే! మిగతా అన్ని వ్యవహారాల్లో బ్రీచ్ ఒఫ్ ప్రామిస్ అనేది నేరము అని నిర్ధారించారు కానీ అసలు పెళ్లిలో వుండే మౌలిక వాగ్దానాన్ని భంగం చేసినా అది చట్టప్రకారం నేరం కాకుండా పోతున్నది?

ముక్తాయింపు:ఇవన్నీ న్యాయశాస్త్రానికి సంబంధించిన సాంకేతిక పరమ్యిన అంసాలు.కానీ యెంత పామరత్వంతో ఆలోచించినా అన్యాయం అనిపించే విషయాలు.అదీ ఆహునికులమని చెప్పుకునేవాళ్లు తయారు చేసిన న్యాయసూత్రాలు ప్రచీనుల క్న్నా అన్యాయంగా వుండటానికి కారనం యేమిటో తెలుసుకోవలని ఈ ప్రశ్న వేస్తున్నాను. 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top