- చిన్ననీటిపారుదలకు కొత్త పథకం 
- ఏడాదికి 9 వేల చెరువుల మరమ్మత్తు
- ఐదేళ్లలో 50 వేల నుంచి 70 వేల కోట్లు
- ఒక్కో చెరువుకు 50 లక్షల కేటాయింపు
- అన్ని చెరువులూ సాగునీటికి బదలాయింపు
- ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే నిర్మాణ బాధ్యతలు
- రైతుల పంటపొలాల్లో బంగారమే
- వారోత్సవంలో తట్ట మోస్తా.. పాట రాస్తా
- ఇంజనీర్ల సదస్సులో సిఎం కెసిఆర్‌
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
     చెరువుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ బృహత్‌ ప్రణాళిక పెట్టుకున్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని పదిజిల్లాలో ఉన్న 45 వేల చెరువులకు పూర్వవైభవం తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగా ఐదేళ్లలో ఇరిగేషన్‌ రంగానికి 50 వేల కోట్ల నుంచి 70 వేల కోట్ల ఖర్చు చేయబోతున్నట్లు గురువారం జరిగిన ఇంజనీర్ల సదస్సులో కెసిఆర్‌ ప్రకటించారు. ఒక్కో చెరువు మరమ్మతుకు 50 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డబ్బు విషయంలో వెనుకాడొద్దని, సకాలంలో పనులు పూర్తి చేసుకునేలా షెడ్యూల్‌ తయారు చేసుకోవాలని అధికారులకు బాధ్యత అప్పగించారు. కాంట్రాక్టర్లకు గాకుండా నిర్మాణ బాధ్యతలను ఇంజనీర్లకే అప్పగించారు. చెరువుల పునరుద్ధరణ వారోత్సవాల్లో ప్రజలందరితో పాటు తానూ తట్ట మోస్తానని, పాట రాస్తానని హామీ ఇచ్చారు. అధికారులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ, ఎంపీలూ, స్థానిక ప్రజాప్రతినిధులందరూ పాల్గొంటారని, హాజరయ్యేలా తాను చూస్తానని సిఎం కెసిఆర్‌ హామీ ఇచ్చారు. ఎటువంటి ఒత్తిడులు రాకుండా రక్షణంగా పోలీసులను కేటాయిస్తామని ముఖ్యమంత్రి అధికారులకు భరోసా కల్పించారు. వేసవికాలం మొత్తం జెసిబిలతో తెలంగాణ నిండిపోయాలని, గ్రామాల్లో పండుగ వాతావరణం రావాలని సూచించారు. చిన్ననీటిపారుదల పునరుద్ధరణ పథకంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, దీనికింద రాబోవు ఐదేళ్లలో గుర్రపుడెక్క లేకుండా చెరువులను నీటితో కళకళలాడించాలని ఆయన ఆకాంక్షించారు. ఇంజనీర్లకు వాహనయోగం కల్పిస్తామని, వాటికి కావల్సిన ఇతర సౌకర్యాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. కొత్త తెలంగాణ ఇరిగేషన్‌ చట్టాన్ని తేబోతున్నట్లు తెలిపారు.చెరువుల పునరుద్ధరణపై గురువారం జెఎన్‌టియు హైదరాబాద్‌ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇంజనీరింగ్‌ అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగిన సుదీర్ఘ సమావేశంలో చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, టెండర్లు, గొలుసుకట్టు చెరువులు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు, హౌంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సాగునీటి ముఖ్యకార్యదర్శి జోషి, ముఖ్య ఇంజనీర్లు మురళీధర్‌, రామకృష్ణారావు, రమేష్‌, ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరీలు స్మితా సబర్వాల్‌, రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందరెడ్డి, మదన్‌రెడ్డి, మంత్రి ఓఎస్‌డి దేశ్‌పాండే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ చిన్న నీటిపారుదల రంగంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు
(from prajasakthi daily)
Reactions:

Post a Comment

 1. ఎక్కడ నా పనిలేని మందీ మార్బలం
  ఎక్కడ నా క్రొత్త లాగిన్ ఐడిలు
  ఎక్కడ నా ....

  ReplyDelete
  Replies
  1. యెక్కడ నా మర్చిపోయిన వాగ్దానాలు
   యెక్కడ నా కోర్టుల చేత తగిలించుకున్న బొప్పెలు...

   Delete
 2. చాలా మంచిది .
  ఆంధ్ర లో కూడా ఇటువంటి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది .

  ReplyDelete
  Replies
  1. ఆంధ్రాలోనే కాదు దేశవ్యాపితంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి.

   Delete
 3. ఈ నిర్ణయం పూర్తిగా సమర్తనీయం. విద్యాసాగర్ రావు గారి సారధ్యంలో కాకతీయ/కుతుబ్షాహీ/ఆసఫ్జాహీ కాలపు చెరువులు పునర్వైభవానికి నోచుకుంటే చాలా సంతోషం.

  ReplyDelete
 4. జైగారితో ఏకీభవిస్తున్నాను. మంచిని మంచిగా చూసేందుకు ఎవరికీ ఏ ఇగోలూ అడ్డం రాకూడదు.
  Dare2Writeగారి వెక్కిరింపులకు నాకేమీ సందర్భం కనబడటం లేదు.
  హరిబాబుగారు ఎదురు దెబ్బలను ప్రస్తావించారు. సంతోషం. కార్యసాధనలో ఎదురుదెబ్బలు మామూలే. మనం చివరకు ప్రజకు మంచి జరగాలనే అశిద్ధాం.

  ReplyDelete
  Replies
  1. చెరువుల పునరావాసం అనుకున్నంత సులభం కాదు. కేవలం పూడ్పు తీయడంతో సరిపోదు. తిరిగి మళ్ళీ పూడిపోకుండా మెయింటైన్ చేసే వ్యవస్థ కావాలి. ఒక్కోసారి ఇదంతా చేసే బదులు కొత్త కుంటను తయారు చేయడం నయం.

   అలాగే గొలుసు చెరువుల అనుసంధానానికి ఎంతో ప్లానింగ్ అవసరం. ప్రభుత్వ కార్యాలయాలలో చెరువులు ఎన్నున్నాయన్న లెక్క కూడా సరిగ్గా లేదు. There are many potential hiccups.

   అదృష్టవశాత్తు తెలంగాణాలో అద్బుతమయిన సాంకేతిక పరిజ్ఞానం, అంతకంటే ముఖ్యంగా బ్రహ్మాండమయిన చిత్తశుద్ధి ఉన్న (శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి ఎందరో) ఇంజనీర్లు ఉన్నారు. ముఖ్యంగా TREF వారు ముందు వరసలో ఉండి ఈ రంగాన్ని పైకి తీసుకు వస్తారని నా కోరిక. ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోకుండా వారు తమ సేవలను అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయం. Hats off to these committed engineers.

   Delete
  2. ఇది మంచి ఆలోచన. మంచి ప్రయత్నం. ఈ ప్రాజెక్టులో విజయం సాధిస్తే పల్లెప్రపంచం వర్ధిల్లుతుంది. కాంట్రాక్టర్లు కాకుండా ఉద్యోగుల ద్వారా కార్యక్రమం చేపట్టాలనుకోవడం మరో ఆదర్శవంతమైన ఆలోచన. నిజంగా ఇది సక్సెస్ అయితే దేశానికే ఆదర్శం అవుతుంది. రైతు గురించి అందరూ మాటలు చెప్పేవారే. ఉన్న అవకాశాలను వినియోగించకుండా అవసరానికి మించి కార్పొరేటీకరణను ప్రోత్సహించడం దారుణం. ఒకప్పుడు విత్తనాలను తయారు చేసిన రైతు నేడు అదే విత్తనాలకోసం వినియోగదారుడిగా మారాడంటే మన సాంప్రదాయ విధానాలలోని సైన్స్ ని చిన్న చూపు చూసే పాలక వర్గాల ధోరణే కారణం. అందుకు భిన్నంగా మళ్లీ చెరువులకు మహర్దశ వస్తే సంతోషం. ఇదే పద్ధతిలో పల్లెలను మళ్ళీ కలకలలాడిస్తే సంతోషం. ఈ మంచి ఆలోచన ఆచరణలో కూడా విజయం సాధించాలని ఆశిద్దాం.

   Delete
  3. చాలా మంచి ఆలోచన. చెరువులకి కుంటలకి పునరుజ్జీవం తెచ్చి స్థానిక నీటి వనరులని పెంపొందించడం వల్ల ప్రక్రుతి పరంగా, వ్యవసాయ పరంగా, మత్స్య పరిశ్రమ పరంగా చాలా లాభం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డాంలు కట్టడం, లిఫ్ట్ ఇరిగేషన్ లు కట్టడం లాంటివి అవసరం ఉండదు. అన్ని రాష్ట్రాలూ ఈ దిశలో ఆలోచన చేయాలి.

   Delete

 5. అవును,ఇది చాలా మంచిపనే.ఆధునిక నదీ ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టి చెరువుల్ని అశ్రద్ధ చేసారు.అంతేకాదు,చిన్న చెరువులనీ,కుంటలనీ కబ్జా చేసి ఆక్రమించుకొన్నారు.పై కార్యక్రమాన్ని ఆంధ్రప్రదెశ్లో కూడా అమలుచేస్తే మంచిదే.

  ReplyDelete
  Replies
  1. అవును కమనీయంగారు, కబ్జాలకు గురైన చెరువులను వారి బారినుండి రక్షించి పునరుద్ధరించాలి రెండు రాష్ట్రాలలో.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top