రామ మందిరం నిర్మించి తీరుతాం


న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కానిదనుకుంటే ఆ అంశాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో ఎందుకు పెడతామని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌ ప్రత్యేకాధికారాల రద్దు, ఉమ్మడి పౌర స్మృతి విషయంలో తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామనే విషయాన్ని ప్రజలకు తెలియజేశామని చెప్పారు. అయితే, ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యాలు పాలన సక్రమంగా నడవటం, ఆర్థికంగా దేశం పునరుత్తేజం పొందడం కనుక వాటిపై దృష్టి సారించామని తెలిపారు. రామ మందిర నిర్మాణం సహా మిగతా అంశాలపై అందరితోనూ మాట్లాడి సమన్వయపరచి, అందరిలోనూ ఆమోదం తీసుకు వచ్చి ముందుకెళతామన్నారు. కాగా, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎంత ఉందో.. రాష్ట్ర నిర్మాణంలో కూడా అంతే పాత్ర పోషిస్తామని చెప్పారు. రాషా్ట్రభివృద్ధి పట్ల ఎంత కట్టుబడి ఉన్నామో, రాష్ట్రంలో తమ పార్టీ అభివృద్ధి పట్ల కూడా అంతే కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీలోకి అయినా వలసలు ఉంటాయని, ‘ఏ ఇతర పార్టీ నాయకుడినీ పార్టీలోకి చేర్చుకోబోం..’ అని ఎవరూ చెప్పబోరని, ఒక్కసారి తమ పార్టీలోకి వచ్చిన నాయకులంతా బీజేపీ సిద్ధాంతాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోదీ ఒక్కరే అన్ని పనులూ చేస్తున్నారని, మంత్రులందరినీ నిర్దేశిస్తున్నారని వస్తున్న వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. మోదీ సమర్థంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వారు సంతోషిస్తుండగా మీడియా విమర్శించటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. భాగస్వామ్య పార్టీలను తమంతట తాముగా వదులుకోబోమని, ‘పూర్తి మెజారిటీ వచ్చింది కదా’ అన్న రీతిలో తాము వ్యవహరించబోమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. అవన్నీ గాలి కబుర్లు. అరిచే కుక్క కరవదు, బి.జె.పి.వాళ్ళు రామాలయాన్ని నిర్మించరు.

  ReplyDelete
  Replies
  1. తెలంగాణా రాదు అని కొందరు అనుకుంటే ఆగిందా?ఇదీ అంతే కడతారు,కట్టి తీరతార్.తెలంగాణా వచ్చినట్టే రామాలయం కూదా వస్తుంది?

   Delete
 2. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగటానికి మార్గం సులువు చేయటానికి అవసరమయ్యే పనులను సుబ్రహ్మణ్య స్వామి చేపట్టారు. మసీదు స్థలం షియా ముస్లిం లకు చెందినది. మారిన రాజకీయ పరిస్థితులలో షియా ముస్లింలు బిజెపి కి మద్దతు ఇస్తున్నారు.వారి సహకారంతో ఎటువంటి గొడవలు, గందరగోళం లేకుండా వారిని ఒప్పించి, మందిరం నిర్మించాలని ఆశిస్తున్నారు.

  ReplyDelete
 3. కాంగ్రెసులో వున్న హిందువులు కూడా పెద్దగా గొడవ చెయ్యక పోవచ్చు?

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top