'మావోయిస్టుల ఎజెండానే అమలు చేస్తున్నాం'

వరంగల్ లో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు శుభపరిణామనని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుత్తూ.... గత ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. వచ్చే బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో కరెంట్ కోతలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని విమర్శించారు. 2017 లోగా రాష్ట్రంలో కోతలు లేని కరెంట్ అందిస్తామన్నారు. అలాగే 2018 నాటికి రాష్ట్రంలో సరిపడ విద్యుత్ ఉంటుందన్నారు. పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్తున్నామన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ అనవర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు. ప్రతిపక్షాల మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు ఈటెల రాజేందర్ హితవు పలికారు. విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం సూచన మేరకే మావోయిస్టులపై నిషేధం పొడిగించామన్నారు. తాము మావోయిస్టుల ఏజెండానే అమలు చేస్తున్నామన్నారు. మావోల అంశంపై అంతర్గత వేదికల్లో చర్చలు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు.
from sakshi daily
Reactions:

Post a Comment

 1. చైనాలో మేనేజర్‌లు లేకుండా ఫాక్తరీలు నడిచిన రోజులు ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారులని రాష్ట్రానికి పిలుస్తున్న కె.సి.ఆర్., కార్మిక వర్గానికే యాజమాన్యాన్ని అప్పగించే మావోయిస్త్ అజెందాని ఎలా అమలు చేస్తాడు? అతను నాలుగు వోత్‌ల కోసం మావోయిజం గురించి తెలిసితెలియనిది మాట్లాడితే దాన్ని సీరియస్‌గా తీసుకునేది ఒకటి!

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబునైతే ప్రతీదీ సీరియస్‌గా తీసుకోవాలి.కే.సీ.ఆర్ నైతే బుజ్జగించాల్ననా మీ ఉద్దేశం? ఏ పాలకుడు తప్పుడు నిర్ణయాలు తప్పుడు మాటలు మాట్లాడినా విమర్శించాలి. ఎండగట్టాలి. మంచి చేసినప్పుడు సమర్ధించాలి తప్ప మనకి నచ్చితే ఓ రకంగా నచ్చనివాడిని ఒకరకంగా చూడడం ఇతరులూ అదేలా చూడాలనుకోవడం సరయినది కాదు.

   Delete
  2. చంద్రబాబు పాలనని నేను 9 ఏళ్ళ పాటు కళ్ళారా చూసాను. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో అతను ఎలా ముంచాడో నాకు బాగానే తెలుసు. కె.సి.ఆర్. అప్పులు చేస్తాడా లేదా అభివృద్ధి చేస్తాడా అనేది కొంత కాలం తరువాత ఎలాగూ తెలుస్తుంది కదా.

   Delete
  3. IT, tourism తప్ప అన్నీ దండగ అని చంద్రబాబు తెలియక అనలేదు. అతను ఆ రెండు రంగాలని మాత్రమే అభివృద్ధి చెయ్యాలనుకున్నాడు కనుక అలా అన్నాడు. చంద్రబాబు మాటలని కె.సి.ఆర్. మాటలతో పోల్చలేము.

   Delete
  4. చంద్రబాబు పొరపాటున గ్రామాలపై దృష్టి పెట్టడు. ప్రచారానికిచ్చిన ప్రాధాన్యత మౌలిక వనరులపై ఉండదు.

   Delete
  5. చంద్రబాబు పొరపాటున గ్రామాలపై దృష్టి పెట్టడు. ప్రచారానికిచ్చిన ప్రాధాన్యత మౌలిక వనరులపై ఉండదు.
   >> కొండలరావు గారు, మీరు అన్న మాటలు విని అయినా సరే, చంద్రబాబు గ్రామాలను నిర్లక్ష్యం చేయకుండా వుండాలని ఆశిస్తున్నాను.

   Delete
 2. నక్సలైట్ ఎజెండాలో ప్రధానమైనది భూసంస్కరణలు. పివి నరసింహారావు కాలంలోనే అవి అంతో ఇంతో తెలంగాణలో అమలయ్యాయి. సీమాంధ్రలో ఆయన అమలు చేయడానికి ప్రయత్నించగానే ఆయనను పదవిలోంచి ఊడబీకారు.

  దళితులకు మూడెకరాల పంపిణీ పథకాన్ని మొదలు పెట్టడం ద్వారా దాన్ని కొంత ముందుకు తీసుకు వెళ్ళడానికి తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అటువంటి ప్రయత్నం సీమాంధ్రలో ఇప్పటికీ మొదలు కాలేదు. స్వభావ రీత్యా చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేస్తాడన్న ఆశా లేదు.

  తెలంగాణలో భూసంస్కరణల పుణ్యమా అని దళితులకు, బలహీన వర్గాలకు అంతో ఇంతో భూములున్నాయి. అదే సీమాంధ్రలో అధిక శాతం భూమి అగ్రకుల పెత్తందారుల వద్ద కేంద్రీకృతమైంది. విరసం నాయకులు అక్కడ పోరాటం చేయడం మానేసి తమ శక్తియుక్తులను తెలంగాణా మీదనే కేంద్రీకృతం చేయడంలో ఒక ఎత్తుగడ కనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యవస్తీకృతం కాకముందే, దాన్ని అవ్యవస్తితం చేసి, ఆ అరాచకాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడమే ఆ ఎత్తుగడ.

  మావోయిస్టులకు ఏమాత్రం వెసులుబాటు కల్పించినా సీమాంధ్ర మీడియా, కేంద్రంలోని రైటిస్టు ప్రభుత్వం తెలంగాణా మీద విరుచుకు పడతాయి, అవసరమైతే ఆర్టికల్ 371 ఉపయోగించడానికి కూడా వెనుకాడవు. అది తెలిసీ వారు అటువంటి ఎత్తుగడలకు పూనుకుంటున్నారంటే, వారికి తెలంగాణా ప్రజాస్వామికంగా నిలదొక్కుకొని అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేదని అర్థమవుతోంది.

  ReplyDelete
  Replies
  1. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యవస్తీకృతం కాకముందే, దాన్ని అవ్యవస్తితం చేసి, ఆ అరాచకాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడమే ఆ ఎత్తుగడ.
   >>
   నేను మీకు మొదటి నుంచీ చెప్తున్నది అదే!కేసీఆర్ నాదీ మావోఇష్టు పంధాయే అని యెంత డప్పు కొట్టుకున్నా అతనూ మావోఇష్తులకు వర్గశత్రువుగానే కనిపిస్తాడు!శత్రువు బలహీనంగా వున్నప్పుడు దాడి చెయ్యతం వల్ల అతి తక్కువ నష్టంతో గెలవొచ్చు ననే వుద్దేశంతో వున్నవాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెసే విజ్ఞప్తులకు లొంగుతారా?చర్చలకు పిలిస్తే వాళ్ళ మొదటి ఆఖరి దిమాండ్: సంపూర్ణ స్థాయిలో భూసంస్కరణలు.కేసీఆర్ తో సహా అందరూ వాళ్ళు పదెకరాలు అంతే ఆ పదెకరాలతోనే సర్దుకు పోయి మిగిలిన దంతా పంచెయ్యాలి, కుదిరేదేనా?యేది యేమయినా అణిచెయ్యటమా ఆహ్వానించటమా అనేది తెలంగాణా ప్రభుత్వం తేల్చుకుంటుంది.నాకయితే అణిచెయ్యటమే జరుగుతుందనిపిస్తున్నది.ఆ లిస్తులో ఈ ప్రవీణ్ కూడా వుందతెటట్లు చూదండి?!అయ్యాయ్యో వొద్దులెండి, అతను లేకపోతే ఇక్కడ చర్చల్లో బొత్తిగా సరదా లేకుండా అయిపోతాం?!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top