టీఆర్‌ఎస్‌లో చేరితే పవిత్రులు...బీజేపీలో చేరితే పాపాత్ములా? : కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 : టీఆర్‌ఎస్‌లో చేరితే పవిత్రులు...బీజేపీలో చేరితే పాపాత్ములన్న విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి సమైక్యవాది అంటున్న టీఆర్‌ఎస్‌ అదే జగ్గారెడ్డికి 2004లో ఎలా టికెట్‌ ఇచ్చి గెలిపించిందో చెప్పాలని ప్రశ్నించారు. సమైక్యవాద పార్టీలుగా ప్రకటించుకున్న వైసీపీ, సీపీఎం నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎందుకిచ్చారన్నారు.

మానుకోట కాల్పులకు కారణమైన కొండా సురేఖను ఏ ప్రతిపాదికన పార్టీలో చేర్చుకున్నారని నిలదీశారు. ఒకే రోజు మూడు పార్టీలు మారిన మైనంపల్లికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదా అని అడిగారు. తెలంగాణలో ఏ పార్టీ ఉండకూడదా...టీఆర్‌ఎస్‌ ఒక్కటే ఉండాల అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

కేసీఆర్‌ కుటుంబం కంటే ముందు నుంచే తెలంగాణ కోసం ఉద్యమాలు చేశామన్నారు. అధికారం ఉందనే అహంకారంతో తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీపై టీఆర్‌ఎస్‌ నేతలు గోబెల్స్‌ ప్రచారం మానుకోవాలని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్‌ నుంచే ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. జగ్గారెడ్డి బీజేపీలో చేరినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. కిషన్‌రెడ్డి సమక్షంలో మెదక్‌ జిల్లా మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి బీజేపీ చేరారు.
(from andhrajyothy daily)

Reactions:

Post a Comment

 1. Jaggareddy is a snake. He spilled venom on Telangana movement even when the movement was at the apex.

  ReplyDelete
 2. ఇప్పుడు అలాగే అంటారు. జగ్గారెడ్డికి 100 వోత్‌లు పడితే కె.సి.ఆర్. సొంత నియోజకవర్గంలో 100 మంది సమైక్యవాదులు ఉన్నారని ప్రచారం చెయ్యొచ్చు.

  ReplyDelete
  Replies
  1. అలాంటి ప్రచారాలే చేయాలనుకుంటే, కే.సీ.యార్ కి పడని వోట్లన్నీ తెలంగాణా వ్యతిరేక వోట్లే అని ప్రచారం చెయ్యొచ్చుగా ప్రవీణూ? 100% వోట్లు కే.సీ.యార్ కు పడలేదు కదా?

   Delete
  2. Parakala Prabhakar had already done such propaganda.

   Delete
 3. తెరాస ఏ విధంగా వ్యవహరిస్తోందన్నది కాస్త పక్కకు పెడితే...

  నువ్వు నిప్పుతో చుట్ట కాల్చుకున్నావు, కాబట్టి నేను కర్రు తెచ్చి వాత పెట్టుకుంటాను అన్నట్టుంది బిజెపి వ్యవహారం. తెరాస సురేఖకో, మైనంపల్లికో, నోములకో టికెట్లు ఇస్తే ఆ పార్టీ బలపడింది కాని బలహీన పడలేదు. కానీ ఇక్కడ బిజెపి టికెట్టు ఇచ్చింది ఒకప్పుడు తెలంగాణా వాడినని చెప్పుకొని తెరాసలో తిరిగి, దరిమిలా సమైక్య వాదుల చంకలో చేరిన మనిషికి.

  ఆ మనిషి మంచోడా చెడ్డోడా, అతని మనసులో సమైక్యవాదం ఉందా, ప్రత్యేక వాదం ఉందా అన్న విషయాలు పక్కకు పెడితే...

  ఆ మనిషిని తమ పార్టీలో చేర్చుకొని పైగా ఎంపీ టికెట్ ఇవ్వడం బిజెపికి అస్సలు లాభించే విషయం కాదు. అది ఎన్నికల తర్వాత ఎలానూ తెలుస్తుంది. మరి ఎందుకిచ్చారో మోడీకి, వెంకయ్యకి, బాబుకి, పవన్ కి మాత్రమె ఎరుక!

  ReplyDelete
  Replies
  1. జగ్గారెడ్డికి పడిన వోత్‌లని చూపించి తెలంగాణలో కూడా సమైక్యవాదులు ఉన్నారనీ, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనీ సీమాంధ్రలో సందేశం ఇచ్చుకోవచ్చు. అయిదేళ్ళ తరువాత జరగబోయే ఎన్నికల కోసం ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నారు.

   Delete
 4. సమైక్య వాదం, కలిసుండటం అంటే బండ బూతు, వేర్పాటువాదం అంటే అదేదో పవిత్ర కార్యం అన్నట్టు చేసేసారు. వీళ్ళకి వోట్లు రాలాలంటే ఒకటే దారి విద్వేషం. వీళ్ళ రాజకీయ జీవితానికి అదే పునాది.

  ReplyDelete
  Replies
  1. సీమాంధ్రలో సమైక్యవాదం నిజంగా ఉంటే మన చెప్పుల పార్తీ ఎందుకు గెలవలేదు? చెప్పుల పార్తీ కంటే కాంగ్రెస్‌కే వోత్‌లు ఎక్కువ వచ్చాయి కదా!

   Delete
 5. Jaggareddy also does real estates settlements. ఆంధ్రావాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే కూకట్‌పల్లిలో స్థిరపడిన ఆంధ్రావాళ్ళలో ఒకరికి తికెత్ ఇవ్వొచ్చు. They need not use the man who is engaged in kangaroo courts.

  ReplyDelete
 6. Jaggareddy is still a supporter of United Andhra. In the election affidavit, he wrote that he lives in Andhra Pradesh though the state was bifurcated some months ago. మెదక్ ఉప ఎన్నికలలో జగ్గారెడ్డికి 100 వోత్‌లు పడినా తెలంగాణాలో కొంత మంది సమైక్యవాదులు ఉన్నారని ప్రచారం చెయ్యొచ్చు అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బిజెపిపై ఒత్తిడి తెచ్చి జగ్గారెడ్డికి తికెత్ ఇప్పించారు.

  ReplyDelete
  Replies
  1. తెలంగాణాలో సమైక్యవాదులు లేరనుకోవడం లేదా ఉండకూడదనుకొవడం మూర్ఖత్వం,అవివేకం లేదా అహంకారం అవుతుంది ప్రవీణ్!

   Delete
  2. విభజన జరిగిపోయిన తరువాత కూడా సమైక్యవాదాన్ని పట్టుకుని వేలాడే జగ్గారెడ్డికి తికెత్ ఇచ్చినది తెలంగాణాని అవమానించడానికి కాదా?

   Delete
  3. తెలంగాణాని అవమానించాల్సిన అవసరం బీ.జే.పీకు ఉందంటారా? ఇదేమి లాజిక్కో నాకర్ధం కావడం లేదు. జగ్గారెడ్డి నీజమైన సమైక్యవాదా? కే.సీ.ఆర్ నంది అంటే జగ్గారెడ్డి పంది అంటాడని అందరికీ తెలుసు.

   Delete
  4. కేవలం కె.సి.ఆర్. మీద కోపంతో కాదు. జగ్గారెడ్డి రియల్ ఎస్తేత్ గొడవల్లో జోక్యం చేసుకుని సెతిల్‌మెంత్‌లు చేసేవాడు. తెలంగాణా ఏర్పడితే రియల్ ఎస్తేత్ ధరలు తగ్గి అతని వ్యాపారానికి నష్టం కాబట్టే అతను తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించాడు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top