శ్రీరాముడు!

భారతీయ సమాజంపై ఈ పదానికున్న పవర్ సామాన్యమైనది కాదు. 

కేరక్టర్ గురించి ఉదహరించాలన్నా వ్యక్తిత్వాన్ని పెంపొందించే రోల్‌మోడల్ గురించి చెప్పాలన్న అత్యధిక శాతం ఇప్పటికీ రాముడినే చెప్తారు. 

కొద్దిమంది విమర్శలు చేసేవారూ ఉన్నారు.

ఆ విషయాలు పక్కన పెడితే రాముడిని రాజకీయాలలోకి లాగడం అనేది కొంతకాలంగా నడుస్తున్న చరిత్ర. 

అయోధ్యలో రామాలయం కడతామంటున్న బీ.జే.పీ వారికి నిజంగా రాముడి మీద అంత ప్రేమ ఉందా? రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నదా?

రాముడి మీద నిజమైన భక్తే ఉంటే భద్రాచలంలో రామాలయాన్ని ముంచి పోలవరం కట్టడానికి ఎందుకు ఆరాటపడుతున్నది?

డిజైన్ మార్చి రాముడికీ, గిరిజన ప్రజకూ ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎందుకు ప్రయత్నించదు?

ఈ అంశం పై మీ అభిప్రాయం ఏమిటి?

Reactions:

Post a Comment

 1. కొండలరావు గారు,

  పోలవరం కడితే భద్రాచలం రామాలయం వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉందా? దీని గురించి ఎక్కడైనా వివరంగా రాసి వుంటే ఆ లంకెను ఈ టపాలోనే ఇవ్వగలరు.

  ReplyDelete
  Replies
  1. పోలవరం ప్రాజెక్ట్ వివరాలు దశాబ్దాల నుండీ ఎన్నో మార్పులు జరిగాయి. అసలు ఏమి జరుగుతుందనే విషయంలో ఎవరికీ పూర్తి క్లారిటీ లేదు. ఉ. ముంపు ప్రాంతాల జాబితా అందుబాటులో లేదు. ఇవన్నీ చూస్తె తెర వెనుక రహస్యాలు ఏమిటా అన్న అనుమానాలు రావడం సహజం.

   The project (and its variations over the decades) are clouded in total veil of opacity. While this is quite usual in most irrigation projects, the total lack of transparency in the present case is intriguing to say the least.

   అయితే ప్రాజెక్ట్ యొక్క విభిన్న అవతారాలలో ఎక్కడా భద్రాద్రి గుడి మునుగుతుందనే ప్రతిపాదన నేనయితే చూడలేదు. అంచేత "మామూలు ముంపు" నుండి రాములోరు తప్పించుకున్నారని అనుకొవొచ్చు.

   గీతం యూనివర్సిటీ శివాజీ రావు గారు డాం బ్రేక్ అనాలిసిస్ ప్రకారం రాజమండ్రికి ప్రమాదం ఉంది. వారు కూడా భద్రాద్రి గుడి గురించి చెప్పలేదు.

   Delete
  2. Y Js గారు, లింకులైతే ఏమీ లేవు నా దగ్గర.

   గతంలో షుమారు 1996 అనుకుంటాను. బాగా వరదలు వచ్చినప్పుడు రామాలయం చుట్టూ నీరు వచ్చాయి. 30 లక్షల క్యూసెక్కులు నీరు వస్తే రామాలయం మునిగే ప్రమాదం ఉన్నది. ఇప్పటిలా రాకపోకలుండవు. రాముడి ప్రాశస్త్యం డెఫినెట్ గా తగ్గుతుంది.

   పోలవరం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు అదనంగా నీటి సరఫరా అని ప్రభుత్వం చెప్పే లెక్కలలో ప్రస్తుతం తాటిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా సగం సాగవుతున్నది. పైకి రైతు ప్రయోజనాలు అని చెపుతున్నా పారిశ్రామిక ప్రయోజనాలే ఎక్కువ.

   శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం కూడా పోలవరం ప్రాంతం ప్రాజెక్టుల నిర్మాణానికి అనుకూలం కాదు. సాయిల్ అందుకు అనుగుణంగా లేదు. భూకంపాలు వంటివి సభవిస్తే కాకినాడ-రాజమండ్రి ప్రాంతాలకూ ముప్పు ఉన్నది. ఇక్కడి అటవీ ఉత్పత్తులు ఖనిజ ఉత్పత్తులు గిరిజన సంస్కృతి నాశనం అవుతాయి. ప్రాజెక్ట్ డిజైన్ మార్చి అందరి ప్రయోజనాలకు అనుగుణంగా తక్కువ నష్టంతో పోలవరం నిర్మిస్తే బాగుంటుంది.

   Delete
 2. మన భ్రద్రాద్రిరాముడు.దాక్షిణాత్యుడు.

  వామాంక స్థిత జానకీ, పరిలసత్‌ కోదండదండం కరే
  చక్రం చోర్ద్వ కరేణ బాహుయుగళే శంఖం శరం దక్షీణే
  బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్థ్ని స్థితం
  కేయూరాది విభూషితంరఘుపతిం రామం భజే శ్యామలమ్.

  అని భ్రద్రాద్రిరాముని మూర్తిని కమనీయంగా శ్రీ శంకరభగవత్పాదులు వర్ణించారు తమ శ్రీరామకర్ణామృతంలో.

  కానీ బీజేపీవారిది ప్రధానంగా ఉత్తరదేశీయుల పార్టీ. కాబట్టి వారికి భద్రాద్రీశుని మీద భక్తిమాట దేవుడెఱుగు దయకూడా లేదేమో.

  పూర్వం శ్రీరామనవమికి ఢిల్లీలో జరిగే హంగామానే దూరర్శన్ వారు వార్తల్లో చూపేవారు కాని భద్రాద్రిలో రామకల్యాణాన్ని అసలు పట్టించుకొనేవారే కాదు. భ్రద్రాచలంలో జరిగే సీతారామకళ్యాణం లైవ్ ఇస్తామని తెలుగు దూరదర్శన్ వారు విజ్ఞాపన చేస్తే ఢిల్లోలో అధికరులు ఠాఠ్ కుదరదు పోండి అన్నారట అప్పట్లో.

  అంచేత, భద్రాచలం ములిగితే బీజేపీవారికి చీమకుట్టదన్నా ఆశ్చర్యం ఏమీ లేదు.

  ReplyDelete
  Replies
  1. మీ వ్యాఖ్య వలన కొత్త విషయాలు తెలిశాయి శ్యామలీయం గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top