కేసీఆర్‌పై దళిత సంఘాల ఫైర్‌.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు
గోల్కొండలో జెండా నాటినుంచే కేసీఆర్‌లో రాజరిక పోకడ
రాజయ్యను తొలగించేందుకు కుట్ర
అందుకే అవమానించారు: మందకృష్ణ
సీఎంగా తరువాత.. డిప్యూటీగా కూడా
దళితుడిని సహించలేకపోతున్నావు
టీ- కాంగ్రెస్‌ దళిత నేత జట్సన్‌ ధ్వజం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ‘ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’ అంటూ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను ఉద్దేశించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్‌ అహంకారంతో దళితుడైన ఉప ముఖ్యమంత్రిని వందల మంది సమక్షంలో చులకనగా మాట్లాడారంటూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల ఆత్మగౌరవాన్ని ఆయన దెబ్బతీశారని నిప్పులు చెరిగాయి. మంగళవారం వరంగల్‌లో కాళోజీ శత జయంతి ఉత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. రాజయ్యను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మాదిగ సామాజికవర్గానికి చెందిన రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించే కుట్రతోనే కేసీఆర్‌ దుర్మార్గంగా వ్యవహరించారని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ‘‘ కేసీఆర్‌ అహంకారపూరిత ంగానే అవమానకరంగా రాజయ్యపట్ల దురుసు భాష వాడారు. ఆయన రాజయ్యకు, దళిత జాతికి వెంటనే క్షమాపణ చెప్పాల’ని డిమాండ్‌ చేశారు. జట్సన్‌ అనే వ్యక్తి కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ దురహంకారంతో మాట్లాడుతున్నారని మాలమహానాడు ఆరోపించింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దళిత సంఘాలు హెచ్చరించాయి. 
కేసీఆర్‌ది దొరపోకడ : మందకృష్ణ 
కేసీఆర్‌ది దొర పోకడ అని మందకృష్ణ ఆరోపించారు. అగ్రకుల దురంహకారంతోనే నిండుసభలో దళితుడైన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి అనేదీ చూడకుండా ‘ఒళ్లు దగ్గరపెట్టుకోవాల’ని హెచ్చరించారని విమర్శించారు. కేసీఆర్‌ పాలన రాజరికాన్ని తలపింపచేస్తోందన్నారు. ‘గోల్కొండకోటలో జెండా ఎగురవేసిన తర్వాత కేసీఆర్‌లో రాజరిక పోకడ మరింత పెరిగింది. రాజరిక పాలనలో అంతా రాజుదే పెత్తనం. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగానే ఉండేవారు. కేసీఆర్‌ పాలన అచ్చం అలాగే ఉంది’ అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని మందకృష్ణ డిమాండ్‌ చేశారు. ‘‘రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కుట్రచేస్తున్నారు. అందులోభాగంగానే ‘ఓ డిప్యూటీ సీఎం ఔట్‌’ పేరిట పత్రికల్లో వార్తలు రాయించారు. ఆ వార్తలను సీఎం సహా మంత్రులు, ఆ పార్టీ నేతలు ఖండించకపోవడం ఈ కుట్రను బలపరుస్తోంది. 
రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయ’’ని హెచ్చరించారు. కేసీఆర్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొనే హామీలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్నో వేదికల మీద హామీలు ఇచ్చావు (కేసీఆర్‌). దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని చెప్పావు. బెల్లంపల్లిలో మైనింగ్‌ నిలిపివేస్తానని చెప్పావు? ఏమైంది ఆ హామీ? నిజామ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని దోచుకున్న బాబులను జైళ్లలో పెడుతానని హెచ్చరించావు? ఆ హామీల అమలు ఏమైంది? ఎవరిని జైలుకు పంపావు? దళితుడికి బదులు నీవు సీఎం అయి హామీలను తుంగలో తొక్కావు. ఈ హామీలు ఇచ్చినప్పుడు నీవు ఒళ్లు దగ్గరపెట్టుకోలేదా?’’ అని ఆయన ప్రశ్నించారు. 
రాజయ్య చేసిన తప్పేంటి? జట్సన్‌ 
కేసీఆర్‌ దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి జట్సన్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని ఆయన కమిషన్‌ను కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒక డిప్యూటీ సీఎంను తొలగించనున్నట్లు ఈ నెల 4న ఒక పత్రికకు సీఎం కేసీఆర్‌ లీక్‌ ఇచ్చారు. బుధవారం డిప్యూటీ సీఎం సొంత జిల్లా వరంగల్‌ సభలో ఆయనని వేదిక మీదనే అవమానించారు. అంటే... ఒక రకంగా డిప్యూటీ సీఎంను తొలగిస్తున్నట్లు సంకేతాలు పంపించారు. ఒళ్లు దగ్గర పెట్టుకోవడానికి రాజయ్య చేసిన తప్పేమిటి? గత ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు, వై.ఎస్‌లు కూడా తమ మంత్రులను అవమానపర్చేవిధంగా, కించపర్చేలా మాట్లాడలేదు. ద్రౌపది వస్త్రాపహరణ జరిగేలా నిండు సభలో రాజయ్యను అవమానపర్చారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం పూటకోసారి చేసే హామీల మాటేమిటి అని ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్‌ను సింగపూర్‌ చేస్త్తానంటూ ముఖ్యమంత్రి చెప్పవచ్చుగానీ, ఒక దళితుడైన డిప్యూటీ సీఎం వరంగల్‌లో హెల్త్‌ యూనివర్సిటీని పెడతామంటే తప్పా? సింగపూర్‌లో ఏముంది? స్మగ్లింగ్‌కు అది కేంద్రం. తెలంగాణను తెలంగాణగా చూడాలి. ఇతర ప్రాంతాలతో పోల్చి అభివృద్ధి చేస్తానని...తీరా చేయకపోతే? నిండు సభలో అవమానించినందుకు సీఎం కేసీఆర్‌ దళితులకు భేషరతుగా క్ష మాపణ చెప్పాలి’’అని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దళితుల మనోభావాలను కాపాడడానికి రాజయ్య వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ‘‘ తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పారు. కానీ, దళితుడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటేనే ఓర్వలేకపోతున్నారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామని, లంబాడి తండాలను పంచాయతీలుగా మారుస్తామంటూ చెప్పి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. మీడియా మెడలు వంచుతానంటూ పూర్తి నియంతృత్వ పోకడతో మాట్లాడుతున్నారు. నియంతలు వాడని పదాలను వాడుతున్నారు. 
ఇలా మాట్లాడిన చాలా మంది కాలగర్భంలో కొట్టుకుపోయారు. కేసీఆర్‌ దళిత నేతలను ఓర్వడం లేదు. గతంలో విజయరామారావును, చంద్రశేఖర్‌రావును పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు రాజయ్యకు పొగపెడుతున్నారు. రాజయ్య ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే అవమానించారు. మెదక్‌ ఎన్నికలో ప్రజలు కేసీఆర్‌ చెంప చెల్లుమనిపించేలా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. హైదరాబాద్ ను సింగపూర్ చేయగలిగే వారికి, కరీంనగర్ ను లండన్ చేయగలిగే సామర్ధ్యమున్నవారికి, స్వతహాగా వైద్యుడైన తన దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన చిన్న హామీ హెల్త్ యూనివర్సిటీ ఎందుకు అసాధ్యమైన, చేయనలవిగాని హామీ గా కనిపించిందో? ఆయనకు అలా కనిపించినా దాన్ని సభాముఖం గా చెప్పి తన దళిత సహచరుడ్ని అవమానించి తనని తానె అవమానించుకున్నాడు. నిజానికి రాజయ్య మృదుస్వభావి. కనిపించని అవమానాలెన్నో వారి పార్టీ వారికి వారి ముఖ్యమంత్రి నుండి. ఇలా అహంకార పూరిత దొర స్వభావాన్ని, ఇతర ప్రాంతాల మీద ద్వేష భావాల్ని ప్రజల్లో రేకెత్తించి పబ్బం గడుపుకొనే లక్షణాల్ని విడనాడితే తను కుడా ఒక మంచి ముఖ్యమంత్రి కాగలడని ఒక నిరంతర ఆశావాదిగా నేనిప్పటికీ విశ్వసిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. అంత ఆశావాదం నాకు లేదు!యెప్పుడో ఆంధ్రా ఆకాసరామన్న బ్లాగులో హోరాహోరీగా కొట్లాడుకునేటప్పుదే ఒక మాట అన్నాను, "తెలంగాణా వచ్చిన రెందు సంవత్సరాల్లో కేసీఆర్ అత్యంత అవమాన కరమయిన పధ్ధతిలో రాజకీయ రంగం నుంచి గెంటివెయ్యబడతాదు" అని. నా అంచనా అతని స్వభావం మీద ఆధార పడి చేసిందే!అది నిజం కావడానికే కేసేఅర్ దగ్గిర్నుంచి అందరూ కృషి చేస్తున్నట్టుగా వుంది!

   Delete
  2. ఎవరి పతనానికైనా కారణం అహంకారమే. ఉద్యమం వేరు, పరిపాలన వేరు అని గుర్తించలేని మనఃస్థితి. కేసీయార్ ఇప్పటికీ వీథిలో ఉద్యమకారుడుగానే ఉన్నాడు. పరిపాలకుడుగా, స్టేట్స్ మన్ గా ఎదగడం లేదు. ఒక ఉన్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన వ్యక్తి వాడకూడని భాషనీ, శైలినీ ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వాడుతున్నాడు. ఆ స్థాయి వ్యక్తుల నుంచి అందరూ మితభాషిత్వాన్ని ఆశిస్తారనే వాస్తవాన్ని ఆయన మర్చిపోతున్నాడు.

   Delete
  3. 60 దాటినవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మారరు.

   Delete
  4. నేను నా కులానికి చెందినవాణ్ణే "ఒళ్ళు కొవ్వెక్కిందా" అని అంటాను. నాది ఏ కులమో అతనికి తెలియకపోతే నేను కులం పేరుతో తిట్టానంటూ అతను నా మీద పోలీస్ కంప్లెయింత్ ఇస్తాడు. నేను ఓ రాజకీయనాయకుణ్ణైతే నా శతృవులందరూ పండగ చేసుకుంటారు. ఇప్పుడు కె.సి.ఆర్.ని తిడుతూ పండగ చేసుకునేవాళ్ళు తమ నిజజీవితంలో ఎన్నడూ ఎవరితోనూ రఫ్‌గా మాట్లాడనట్టు నటించక్కరలేదు.

   Delete
  5. OK ప్రవీణ్. BTW, నువ్వూ నేనూ ఏ రాష్ట్రానికీ ముఖ్యమంత్రులం కాము. బహిరంగ సభల్లో కేమేరాల సాక్షిగా మనమెవరినీ తిట్టిన దాఖలా లేదు.

   Delete
  6. దళితులని ఏమీ అనకూడదనుకుంటే, అంటే కులదూషణ కేస్‌లో ఇరుక్కునే పరిస్థితి ఉంటే, దళితుడు కానివాడు కూడా తాను దళితుణ్ణని చెప్పుకుని కులం ముసుగులో రేప్‌లు కూడా చెయ్యొచ్చు. అతను రేప్ చేసినా, అతని మీద ఎవరైనా కంప్లెయింత్ ఇస్తే దళితుని మీద తప్పుడు కంప్లెయింత్ ఇచ్చిన కేస్‌లో అరెస్త్ చెయ్యొచ్చు.

   నేను గిరిజనుణ్ణి. ఎవడైనా వంద రూపాయల కోసం నాతో గొడవపడితే, ఆ వంద రూపాయల పేరు చెప్పే నేను అతన్ని కొట్టగలను కానీ కులం పేరు చెప్పి అతన్ని పోలీస్ స్తేషన్‌కి లాగాలనుకోను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top