‘ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కే సూటి ప్రశ్న
జవాబు చెప్పలేకపోయిన కవిత
ఎంతసేపూ టీవీ 9 గురించే!
నాన్న వాడిన భాష సరికాదట
భావం కరెక్టేనట
ఏబీఎన్‌ను ఎవరూ అడగడం లేదట 
ఎన్‌డీటీవీ చర్చలో వాదన
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాను ఉద్దేశించి దారుణంగా చేసిన వ్యాఖ్యలపై ‘ఎన్‌డీటీవీ’ ప్రత్యేక చర్చలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ, కేసీఆర్‌ కుమార్తె కవిత పాల్గొన్నారు. ‘తెలంగాణ ప్రజల్ని, సంస్కృతిని అవమానించేలా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఏం చేశాయో ఒక్క చిన్న ఉదాహరణైనా చెప్పండి’ అని రాధాకృష్ణ సూటిగా ప్రశ్నించగా, కవిత సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఎంతసేపూ టీవీ 9 ఇలా చేసింది, అలా చేసింది అంటూ దాటవేసేందుకు ప్రయత్నించారు. టీవీ 9 చేసిన తప్పును అడ్డం పెట్టుకుని ఏబీఎన్‌ చానల్‌పై కేసీఆర్‌ కక్ష సాధిస్తున్నారని కవిత తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కేసీఆర్‌ వాడిన భాష కొంత అభ్యంతరకరంగా ఉందని ఆమె అంగీకరించారు. అయితే ఆయన చెప్పిన విషయం మాత్రం కరెక్టేనని వాదించారు. ‘ఎన్‌డీటీవీ’ చర్చ సాగిన తీరు ఇలా ఉంది...
నిధి రజ్దాన్‌ (ఎన్డీటీవీ): రెండు టీవీ చానళ్లు తెలంగాణను అవమానించేలా ప్రసారాలు చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన దగ్గర్నుంచి తెలంగాణలో గత మూడు నెలలుగా రెండు టీవీ చానళ్లపై నిషేధం అమలవుతోంది. దీనిపై జర్నలిస్టులు, ఇతరులు నిరసన తెలపడంతో ఆ చానళ్లను పాతరేస్తామంటూ సీఎం కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించారు. (కేసీఆర్‌ వీడియో క్లిప్‌ ప్రదర్శించారు) తెలంగాణలో రెండు టీవీ చానళ్లను పది కిలోమీటర్ల లోతున పాతరేస్తాం, మెడలు విరిచేస్తాం అని మీ తండ్రి కేసీఆర్‌ హెచ్చరించారు. రాష్ట్ర సీఎం ఇంత దారుణంగా మాట్లాడడం సరైనదేనా? 
కవిత: ఇందులో రెండు అంశాలున్నాయి. మొదటిది... తెలంగాణ ప్రజలను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ఎమ్మెల్యేలనుఅవమానిస్తే ఊరుకోవాలా? రెండోది... ఆ రెండు చానళ్ల నిషేధంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. 
నిధి రజ్దాన్‌: మీ తండ్రి కేసీఆర్‌ అటువంటి భాష ఉపయోగించడం సరైనదేనా?
రాధాకృష్ణ: నేను కవిత గారిని ఒకే ప్రశ్న అడుతున్నాను. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సంస్కృతిని మేం ఎప్పుడు అవమానించామో నిర్దిష్టంగా ఒక్క ఉదాహరణ అయినా చెప్పగలరా? 
కవిత: (నిర్దిష్టంగా ఏమీ సమాధానం చెప్పలేకపోయారు) టీవీ 9 ఎలాంటి భాష ఉపయోగించిందో చూడండి..
రాధాకృష్ణ: నేను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ గురించి అడుగుతున్నాను. మేం తెలంగాణ ప్రజల్ని, సంస్కృతిని అవమానించేలా చిన్న మాటైనా రాశామా? ఏం రాశామో నిర్దిష్టంగా చెప్పండి? కేసీఆర్‌ తెలంగాణ సీఎం అయిన తర్వాత ఆయన పాత ఇంటర్వ్యూను మేం ప్రసారం చేస్తే ఆ విషయమై మాపై కక్షగట్టి బురద జల్లుతున్నారు. 
నిధి రజ్దాన్‌: కవితగారూ! ఆ ఇంటర్వ్యూ విషయంలో ఆశ్లీల, అన్‌పార్లమెంటరీ అంశాలు ఏమున్నాయి? ప్రస్తుత వివాదంపై మీరు పంపిన ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న ఏబీఎన్‌ మాటల్లో కూడా ఆశ్లీలం, అన్‌పార్లమెంటరీ ఏదీ కనిపించడం లేదు. 
కవిత: ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటుంది. తెలంగాణ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తుంటుంది. ఒక దళిత మహిళ ప్రమాణ స్వీకారంలో కొద్దిగా తడబడితే దానిని హైలైట్‌ చేశారు.
నిధి రజ్దాన్‌: ప్రభుత్వం మంచి చెడ్డల్ని విమర్శించడం మీడియా విధినిర్వహణలో భాగం కదా? అది తెలంగాణను అవమానించడం ఎలా అవుతుంది?
రాధాకృష్ణ: తెలంగాణ ప్రజల్ని, సంస్కృతిని అవమానించేలా మేం ఏం రాశామో నిర్దిష్టంగా చెప్పమనండి. అసలు తెలంగాణ ఉద్యమాన్ని హైలైట్‌ చేసింది మా పత్రిక, చానలే. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాస్తే తెలంగాణకు వ్యతిరేకంగా రాసినట్టా? నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీకు జనరల్‌ పవరాఫ్‌ అటార్నీ ఏమైనా రాసిచ్చారా? 119 సీట్లకు టీఆర్‌ఎస్‌ 63 సీట్లే కదా గెలిచింది?
కవిత: టీవీ 9 ప్రసారం చేసిన దాని గురించి మాట్లాడరేం?
నిధిరజ్దాన్‌: ఇక్కడ ఏబీఎన్‌ ఎండీ ఉన్నారు కాబట్టి ఏబీఎన్‌ సంగతి మాట్లాడుదాం. ఏబీఎన్‌ ఏం చేసిందో చెప్పండి. 
కవితా: ఆంధ్రజ్యోతిలో తెలంగాణ సర్వేకు వ్యతిరేకంగా రాశారు. సీమాంధ్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదని ప్రచారం చేశారు. ఆ పత్రిక వారు ఒక ఎజెండా పెట్టుకుని చేస్తున్నారు.
రాధాకృష్ణ: అవును. అలా రాయడంలో తప్పేముంది? హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేయలేదనేది వాస్తవం. అందుకే టీఆర్‌ఎస్‌కు హైదరాబాద్‌లో 24కు మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. మేం ఆ విషయం రాశాం. మీ రాజకీయ పార్టీలకు ఎజెండాలు ఉండొచ్చు. మాకు ఎలాంటి ఎజెండాలు లేవు. మేం తెలంగాణ ఉద్యమాన్ని. సంస్కృతిని అవమానించామా? అదే నిజమైతే గతంలో మీరు నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు మమ్మల్ని మీడియా పార్ట్‌నర్‌గా ఎందుకు పెట్టుకున్నారు? 
కవిత:అవును. బతుకమ్మ పండుగకు మద్దతిచ్చి, నిర్వహించారు. రాధాకృష్ణ: తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన ఏకైక పత్రిక ‘ఆంధ్రజ్యోతి’ అని శ్రీకృష్ణ కమిటీ నివేదికలో కూడా పేర్కొనడం నిజం కాదా..?
కవిత: నిజమే.. అయితే కేసీఆర్‌ సీఎం అయిన దగ్గర్నుంచి ఆంధ్రజ్యోతి ఆయనను టార్గెట్‌ చేస్తోందన్నది, తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నదీ నిజమే. 
రాధాకృష్ణ: తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య దూరం పెంచింది మేమా, మీరా?
నిధి రజ్దాన్‌: చానళ్లను పది కిలోమీటర్ల లోతున పాతరేస్తామని అనడం ఎంతవరకూ కరెక్టు?
కవిత: తెలంగాణలో 16, 17 మీడియాసంస్థలున్నాయి. వాటిలో చాలా వరకూ సీమాంధ్రుల ఆధ్వర్యంలోనివే. మరి ఈ రెండు చానళ్లపైనే ప్రజలు ఎందుకు వ్యతిరేకత చూపుతున్నారో ఆలోచించాలి
నిధిరజ్దాన్‌: మెడలు విరగ్గొడతాం అనడం ఎంతవరకూ కరెక్టు?
కవిత: కేసీఆర్‌ ఎంచుకున్న మాటలు సరైనవి కాకపోవచ్చు. అయితే విషయం మాత్రం కరెక్టే. తెలంగాణ ప్రజల మనోభావాలను ఆయన వ్యక్తంచేశారు. చానళ్ల నిషేధంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు. అదీగాక ఇప్పుడు ఏబీఎన్‌, టీవీ 9 చానళ్ల కోసం ప్రజల్లో ఎలాంటి డిమాండ్‌ లేదు.
రాధాకృష్ణ: తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి వల్లే తాము ప్రసారాలు నిలిపివేసినట్లు కేబుల్‌ ఆపరేటర్లు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. హైదరాబాద్‌లో కేబుల్‌ ప్రసారాలు చేసే సంస్థల్లో రెండు ఆంధ్రావారివి, రెండు ముంబై వారివి ఉన్నాయి. ముంబై వారికి ఇక్కడి వ్యవహారాలతో ఏం సంబంధం? ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే ప్రసారాలను వారెందుకు నిలిపేస్తారు?
కవిత: ప్రైవేటు సంభాషణల్లో ఏమైనా చెప్పవచ్చు. దానిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు? చానళ్లు నిలిపివేయాలన్న నిర్ణయం కేబుల్‌ ఆపరేటర్లదే
నిధి రజ్దాన్‌: కేసీఆర్‌ భాష కటువుగా ఉందని కవిత అంగీకరించారు. తెలంగాణలో ప్రభుత్వానికి, మీడియాకు మధ్య తీవ్రమైన విభేదాలున్నాయని అర్థమవుతుంది. చర్చను ఇంతటితో ముగిద్దాం. 
కంట్రోల్‌లో పెట్టుకునే యత్నం: ఆర్కే
తెలంగాణలో మీడియాను కంట్రోల్‌లో పెట్టుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని అంతకుముందు ఆర్కే టైమ్స్‌ నౌ చానల్‌కు తెలిపారు. తెలంగాణలో మీడియా యాజమాన్యాలన్నీ ఆంధ్రావారివే అయినందున తెలంగాణ ప్రజల వాణిని విన్పించేందుకు తామే ఒక చానల్‌ను ప్రారంభించాల్సిన వచ్చిందని కవిత అన్నారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. నిజానికి ఆంధ్రజ్యొథి తప్పు యేమాత్రమూ లేదు అప్పుడు జరిగిన గొడవల్లో! "పాచి మొహమోళ్ళు, లాప్ తాప్ ఇస్తె యెక్కడ పెట్తుకుంటారు" అని వాగింది వేరే వాళ్ళు.కానీ తనూ తన కుటుంబ సభ్యులూ మాత్రమే పూర్తి అధికారాలు చెలాయిస్తూ హవా వెలగబట్టటానికి - ABN అనే ఒక బలమయిన మీడియా సంస్థ యెప్పటికయినా అడ్డుగా వస్తుందనే వుద్దేశంతో - పనిలో పనిగా ఆ చానెల్ తో పాటూ దీన్ని కూడా కలిపేశారు, సర్పయాగం లో "సహేంద్ర తక్షకాయ స్వాహా!" అన్నట్టు.ఇప్పుడు నడుస్తున్నది ఆనాటి సన్నివేశమే?

  పురాణాలు పాత చింతకాయ పచ్చడి అనుకుంటాం గానీ ఇవ్వాళ్టికీ కొన్ని పురాణ కధలు రిపీటవుతున్నాయి, అదే విచిత్రం?!

  ReplyDelete
  Replies
  1. మీరు పొరపాటుపడుతున్నారని అభిప్రాయపడుతున్నాను హరి గారు.

   బాధ్యతాయుతంగా కే.సీ.ఆర్ ప్రభుత్వ పాలనలో తుగ్లక్ చర్యలను ఎండగడుతూ మంచి పనులను ప్రోత్సహించడమయితే అభినందించవచ్చు. కానీ ఆంధ్రజ్యోతి టార్గెట్ తెలంగాణాలో కే.సీ.ఆర్ ని బొందపెట్టి తెలుగుదేశం ను అందలమెక్కించడమే. ఆ పత్రికలో వ్రాతలన్నీ అలాగే ఉంటాయి. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం తప్పే కదా? అలా కాక నవ్వుతున్నవాడు మంచివాడనుకుంటే పొరపాటే. కే.సీ.ఆర్ - రాధాకృష్ణలమధ్య నిజానికి సాన్నిహిత్యం ఉన్నది. కానీ కే.సీ.ఆర్ కు తెలుగుదేశంకు సరిపడదు. ఈ గోల్ లో తేడా ఉన్నందున అసలు సమస్య. ఏమిచేయాలో పాలుపోక కే.సీ.ఆర్ ఎమ్మెస్వోలచేత ఈ పని చేయించాడు. కానీ అది తప్పక బెడిసికొడుతుంది. ఒకరకంగా ఇది పిరికిచర్య. అలా చేయకుండా ఉంటేనే ఆంధ్రజ్యోతి వ్రాతలను జనం చీదరించుకునేవారని నా అంచనా.

   తెలంగాణాలో ప్రస్తుత పరిస్తితులలో కాంగ్రెస్ - తెలుగుదేశం లకంటే టీ.ఆర్.ఎస్ ప్రభుత్వముండడమే ప్రజలకు కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది. అలా అని కే.సీ.ఆర్ నియంతలా మారితే చూస్తూ ఊరుకోవలసిన పనిలేదు. రాధాకృష్ణ అలా బాధ్యతకలిగిన గోల్ తో లేడు. కే.సీ.ఆర్ ని బలహీనపరచడమే అతని టార్గెట్. తెలంగాణాను - తెలంగాణా సంస్కృతిని ఎక్కడ వ్యతిరేకించాను అని చాలెంజ్ చేసి అడుగుతున్న రాధాకృష్ణ తెలుగుదేశానికీ - చంద్ర్బాబుకు తొత్తులా వార్తలు వ్రాయడంలేదని చాలెంజ్ చేసి చెప్పమనండి చూద్దాం.

   Delete
  2. తెలుగుదేశాన్ని, కాంగ్రెస్సుని వెనకేసుకొచ్చే చానళ్ళని బంద్ చేయ్యచ్చనా మీ ఉద్దేశ్యం...

   Delete
  3. అలా అని నేను చెప్పలేదు కదా? మీరెందుకు అలా అర్ధం చేసుకున్నారు? నా వ్యాఖ్యలను మరోసారి చదవండి.

   Delete
  4. This comment has been removed by the author.

   Delete
  5. నిజమే కొందల రావు గారూ, రాధాకృష్ణ మంచివాదని నేనూ అనటం లేదు - కానీ తను చాలా తెలివిగా దోష మెంచ లేని పధ్ధతిలో చేస్తున్నాడు,దాన్ని యెదుర్కోవదానికి తను కూడా మరో తెలివయిన మార్ఫం చూసుకుని వుండాల్సింది!

   అసలు చెత్త పని చేసి దొర్కిపోయిన చానల్ ని మాత్రమే బాన్(ప్రసారాలు నిలిపి వెయ్యతం - ఈ సాంకేతిక పదాలతో గొదవ మరింత పెద్ద దయ్యేట్టు వుంది?!) చేసి వుంటే యెవ్వడూ అడిగేవాడే కా, కానీ అందులోకి ఆంధ్రజ్యోతిని లాగతం వల్లనే డిఫెన్స్ లో పడి పోయారు టీ ఆర్ యెస్ వాళ్ళు.

   Delete
  6. హరిబాబు గారు, రాధాకృష్ణ రామోజీ కంటే కూడా తెలివైనవాడు. ఎవరేమి అనుకున్నా, ఎం.ఎస్.ఓ లు చేసినపనికి TRS ఎలా బాధ్యత అంటూ ఎవరు కావాలని లేదా వ్యూహాత్మక అమాయకత్వం ప్రదర్శించినా ముమ్మాటికీ ఈ విషయంలో కే.సీ.ఆర్ ఎండ్ టీం ఓటమి పాలు కాక తప్పదు. ఇలాంటివి సమర్ధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ఓ సవాల్ వంటిది. ఇలాంటి దుందుడుకు దూకుడు చేష్టలను ప్రోత్సహించడం పిల్లచేష్టలవుతాయి తప్ప ఉద్యమ లక్షణాలు కావు. ఇది రాధాకృష్ణ ఎండ్ కే.సీ.ఆర్ ల సమస్య కాదు. ఓ పెద్ద వ్యవస్థ మనుగడకు సంబంధించినదానిలో వీరిద్దరు బచ్చాలవుతారే తప్ప వీరే వ్యవస్థలను నడిపించే వారు కాదు కదా?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top