• తెలుగు సినిమా దర్శకులలో సృజనాత్మకత లోపిస్తున్నదా? ప్రయోగాలకు భయపడుతున్నారా?
 • ఆగడు సినిమా దూకుడు - గబ్బర్ సింగ్ లను కాపీ కొట్టినట్లున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకంటే ముందొచ్చిన మహేష్ సినిమా వన్ బాగున్నా మన ప్రేక్షకులకు రీచ్ కాలేదు. దూకుడు మంచి హిట్ నివ్వడంతో అదే ఫార్ములాతో అవసరానికి మించిన పంచ్ డైలాగులతో సాగదీసి దూకుడుసింగ్ (దూకుడు+గబ్బర్ సింగ్ ల కాపీ) తీసినట్లున్నది. 
 • తమిళ మళయాలీ సినిమాలలా మన వాల్లు మంచి సినిమాలను తీయలేరా?
 • హీరోల ఇమేజ్ లే సినిమా కథలకు మూలంగా ఉండాల్నా?
 • శంకరాభరణం , స్వాతిముత్యం లాంటి కళాత్మక సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు కదా? దృశ్యం లాంటి మంచి చిత్రాలను అతి తక్కువ బడ్జెట్ తో తీసినా హిట్ చేశారు కదా? నేటి భారతం లాంటి టీ.కృష్ణ సినిమాలను గతంలో తెలుగు ప్రేక్షకులు ఆదరించారు కదా? వీటిని బట్టి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించరనేది తప్పని చెప్పవచ్చు. 
 • హీరోలపై అభిమానులకుండే పిచ్చి ని కేష్ చేసుకునేందుకే దర్శకులు నిర్మాతలు చూస్తున్నారనే విమర్శలోనూ వాస్తవం ఉందనిపిస్తోంది.
 • తెలుగు సినిమాలు బాగుపడాలంటే రావలసిన మార్పులేమిటి?
Reactions:

Post a Comment

 1. కళాత్మకమైన సినిమా తీయటం‌ చాలా సున్నితమైన వ్యవహారం. కళాత్మకచిత్రాలు కళాపిపాసుల్నే ఆకర్షిస్తాయి కానిపాటకజనాన్ని కాదని ఒక అభిప్రాయం బలంగానే ఉంది. సినిమాకి టిక్కెట్టు డబ్బులు ఇచ్చేవారిలో హెచ్చుశాతం పాటకజనమే. మరీ గొప్పగా పండితే తప్ప పాటకజనం వీటిజోలికి రారు. కళాత్మకచిత్రాలలో సందేశం ఉంటుంది - అది ఈ‌నాటి జనానికి తలనొప్పి. ఒకవేళ సమాజపు అభిప్రాయాలకు భిన్నమైన మాట చెబితే ఎంత బాగున్న సినిమా ఐనా బోల్తా కొట్టవచ్చును - అరవైలలో వచ్చిన మనసూ మాంగల్యం సినిమాలాగా అనుకుంటాను.

  ఈ నాడంతా ఒకప్పటి ప్రఖ్యాతనటుల వారసులు. కళాకాంతులు లేని ముఖాలే ఎక్కువ. వీళ్ళు కళ్ళల్లోనూ ముఖంలోనూ ఏమీ భావప్రకటన చేయలేరు. ఆంగికం కన్న వాచికం ఇంకా దారుణం. వత్తులు పలకవు. చిత్రమైన యాసలు పైగా. అందుచేత వీళ్ళతో అభినయంతో పనిలేని సినిమాలే తీసి ఏడవాలి. అభినయం చేయిస్తే నిజంగానే ఏడవాలి మరి.

  ఇంక కళాత్మక చిత్రాలేమిటి? కొత్తనీరు రావాలి. ఇప్పుడున్న సజ్జు( నటీనటులు, దర్శకులు, గింగీతంగాళ్ళు, పాటల్లాంటివి రాస్తున్నామనుకునే వాళ్ళు ) అంతా బయటికి పోతే కాని కాస్త తెరిపిన పడదు తెలుగుసినిమా. కాని అది జరిగే దెన్నడూ అని?

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడొస్తున్న సినిమాలలో కూడా మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. హిట్ అవుతూనే ఉన్నాయి. బ్లాక్ బస్టర్ అవుతాయని ఊదరగొడుతున్నవి ఫట్టవుతూనే ఉన్నాయి. కనుక ముందు తీసేవారిలో మార్పు నేర్పు రావాలి. ఏమైనా సినిమా శక్తివంతమైన మీడియా కనుక సమాజాన్ని ప్రభావితం చేయడానికి సినిమాని పాజిటివ్‌గా ఉపయోగించవచ్చు.

   Delete
  2. కళాత్మకమయిన సినిమాలు తియ్యాలంటే సమాజం పట్ల బాధ్యత వుండాలి!నేను రాజ్ కపూర్ గురించి ఒక పోష్తు వేసాను.మొదట పైన పైన టచ్ చేసి వొదిలేద్దామనుకుని యెంతయినా పోష్టు వేస్తున్నాం గదా కొంచెం తెలుసుకుని రాద్దాం అని అతని సినిమాల గురించి చూస్తే కొత్తగా అనిపించింది. చాలా మంది అనుకుంటున్నట్టు అతను కేవలం అమ్మాయిల్ని అందంగా చూపించే ఫార్ములా దైరెక్టర్ అనేది అపోహ మాత్రమే.

   http://harikaalam.blogspot.in/2014/09/blog-post_23.html

   అతనికి వున్నట్తు సమాజాన్ని పరిశీలించటం, సరదాగా వుంటూనే సందేశాన్ని ఇవ్వతం అనే లక్షణాలు స్వతహాగా వాళ్లలో వుంటేనే పరిస్తితిలో మార్పు వస్తుంది.

   ఇంకొక ముఖ్యమయిన విషయం - విమర్స చాలా ముఖ్యం ఒక కళారంగంలో స్థాయి యెలా వుండాలి, ఇప్పుదెలా వుంది నేది ఖచ్చితంగా నిర్వచించబడితే అక్కడ స్థాయి తప్పకుండా పెరుగుతుంది. నా పోష్టులోనే సత్యజిత్ రే ఒపీనియన్ చూడండి.మన సాహిత్యం ఈ మాత్రం అయినా స్థాయిని మయింటెయిన్ చేస్తున్నదంటే సాహితీ విమర్శ బలంగా వుండటం వల్లనే.అలా చూస్తే సినిమాలకి సంబంధించి రివ్యూలు రాయడానికే పరిమితమైపోయారు మన సినిమా విమర్సకులు.

   Delete
  3. సినిమా రివ్యూలు కేవలం హీరోలు కలెక్షన్లు బట్టి గాక సామాజిక బాధ్యతని పెంచేవిధంగా ఇంప్రూవ్ కావాలి. అలా జరిగితే కొంత మార్పుకు అవకాశం ఉన్నది.

   Delete
 2. నిజజీవిత సినీ వ్యక్తులకీ, ఖరీదైన సెట్టింగులకీ కాకుండా కథకి ప్రాధాన్యం పెరగాలి. ఇక్కడ వాస్తవంగా హీరోలెవరూ లేరు. వెరైటీ కథే ఎప్పటికీ అసలైన హీరో. అదే నిజమైన సూపర్ స్టార్ కూడా. కనకవర్షాలు కురిపించేదీ అదే. ఆ సంగతి మనవాళ్ళు పూర్తిగా మర్చిపోయారు.

  ReplyDelete
  Replies
  1. కథే హీరో. ఆ విషయం మనవాళ్లు మరచిపోయిన మాట వాస్తవమే. నిజంగా హీరోల వల్లే సినిమాలు ఆడితే అన్ని సినిమాలు హిట్ కావాలి. అయితే హీరో ఓరియెంటెడ్ అనేది మొత్తం సమాజ భావజాలంలోనే ఉన్నందున కొంతమేరకు హీరోల వల్ల కలెక్షన్లు వస్తాయి. అదే హీరోలు కథే హీరో అనే నిజాన్ని గుర్తిస్తే వారి ఇమేజ్ కూడా ఇంకాస్త పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ ఆ నిజాన్ని అంగీకరించేంత విజ్ఞత ఉన్న హీరోలు మనకు తక్కువే.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top