అంశం : సినీ రాజకీయం

స్వార్ధం కోసమే సినిమా నటులు రాజకీయాలలోకి వస్తున్నారా?

స్వార్థ ప్రయోజనాల కోసమే సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో వచ్చిన ఎమ్ జిఆర్ , ఎన్ టిఆర్ లు మంచి కమిట్ మెంట్ తో వచ్చి, అధికారంలోకి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం సినీహీరోలు ఎలాంటి కమిట్ మెంట్ లేకుండానే రాజకీయప్రవేశం చేస్తున్నారని చెప్పారు. పవన్, నాగార్జున మోడీకి మద్దతివ్వడంలో రాజకీయలబ్ధి ఉందని పేర్కొన్నారు. సినీ తారలు-రాజకీయ ప్రవేశం, ప్రయోజనాలు అనే అంశంపై మంగళవారం టెన్ టివి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బిజెపి నేత శ్రీధర్ రెడ్డి, నడింపల్లి సీతారామరాజు, వైసిపి నేత కొండా రాఘవరెడ్డి, ఫోన్ కాలర్స్ పాల్గొని, తమ అభిప్రాయాలను తెలిపారు. ఆ వివరాలను వారి మాటల్లోనే చూద్దాం...
శ్రీధర్ రెడ్డి..
దక్షిణాది రాష్ట్రాల్లో సినీ హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం మంచిందే. బిజెపికి మద్దతివ్వడంలో తప్పులేదు. తమిళనాడులో ఎంజిఆర్, జయలలిత, కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చారు. ఎపిలో ఎన్ టిఆర్, చిరంజీవి వచ్చారు. దేశరాజకీయల్లోకి జయప్రద లాంటి ఎంతో మంది సినీ తారలు వచ్చారు. బిజెపికి సానుకూల వాతావరణం ఉండడంతో సినీ తారలు, ఇతరులు బిజెపిలోకి వస్తున్నారు. మోడీకి మద్దతిస్తున్నారు. పార్టీ పిరాయింపులకు ఏ పార్టీ నేతలు అతీతం కాదు. పవన్, నాగార్జున మద్దతు తెలపడానికి మాత్రమే వెళ్లారు. కుటుంబ వాససత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో సినీ గ్లామర్ పని చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ తీర్పు. ప్రజల భావాలను నిజం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తుంటారు. ఆరోపణల ఆధారంగా వారి వ్యక్తిత్వాలను నిర్థారించకూడదు.
నడింపల్లి సీతారామరాజు...
ప్రస్తుతం సినీ నటులు స్వలాభం కోసమే రాజకీయాల్లోకి వెలుతున్నారు. సామాజిక దృక్పథంతో రాజకీయ ప్రవేశం చేస్తే మంచి పరిణామం కానీ, పెట్టుబడిదారుల ఉపయోగం కోసం వెళితే ప్రమాదం. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎంజిఆర్,ఎన్ టిఆర్ లకు కమిట్ ఉంది. ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్న హీరోలకు కమిట్ మెంట్ లేదు. రాష్ట్రంలో బిజెపికి, మోడీకి మద్దతు కూడగట్టడానికి పవన్, నాగార్జున ప్రయత్నిస్తున్నారు. వామపక్ష భావాలున్న పవన్ బిజెపి వైపు వెళ్లడం ఆశ్చర్యకరం. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురుపై పవన్ కు మంచి అభిమానం ఉంది.
కొండా రాఘవరెడ్డి వైసిపి నేత..
స్వార్థప్రయోజనాలకోసమే సినీ హీరోలు రాజకీయాల్లోకి వస్తున్నారు. అక్కినేని కుంటుంబం గతం నుంచి అధికారంలో ఉన్న వారిని కలుస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు నటులు ఎక్కడికి వెళ్లారు. ఎన్ టిఆర్ ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. సిఎం అయ్యారు. తర్వాత వచ్చినా వారు అంత ప్రభావం చూపలేకపోయారు. ప్రతి విషయాన్ని జగన్ కు అంటగట్టడం సరికాదు.
ఫోన్ కాలర్స్..అభిప్రాయాలు
రాము: స్వంత ప్రయోజనాల కోసమే హీరోలు రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీని పెట్టినప్పుడు ఒంటరిగానే పోటీ చేయాలి. వేరే వారికి మద్దతివ్వడం మంచిది కాదు.
సత్యనారాయణ: హైదరాబాద్...
మోడీని పవన్ కలవడం స్వాగతిస్తున్నాము.కానీ ఆరోపణలున్న నాగార్జున కలవడాన్ని వ్యతిరేకిస్తున్నాము.
చంద్రశేఖర్, రాజమండ్రి..
సినీ హీరోలు రాజకీయాల్లోకి రావడం మంచిదే.
సతీష్ : పవన్ బిజెపికి మద్దతివ్వడంలో అర్థం లేదు. ఓట్లను చీల్చడానికి ఉపయోగం పడుతుంది. పెద్దగా ప్రభావం చూపదు.
మహేష్, కరీంనగర్..
సినీ తారలు అవసరాన్ని బట్టి మారతారు.
రమేష్..ఒంగోలు.
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం విచిత్రం. మొదట సోషల్ సర్వీస్ చేయాలి. ఇంకమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి డబుల్ గేమ్ ఆడుతున్నారు. రాజకీయాలను నాశనం చేస్తున్నారు.
(from 10tv)
సినీ రాజకీయం పై మీ అభిప్రాయం?
Reactions:

Post a Comment

  1. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని ప్రశించేడట ఒక నా లాటి మందబుద్ధి. కారణం లేని కార్యం ఉండదు కదా!

    ReplyDelete
  2. Annee pichi comments. Evarikaina sandehamaa ee dourbhaagyula raajakeeyam pravesam meeda? Rude ga cheppalane veellantha raajakeeya vesyalu.Rambha voorvasi lani thala danne mmaayagaallu.edati vaadi votluncheelchadam laati takkula kosam or thama bhoomulu aasthulu kaapaadukune swaardham thappa veellaki NIBADHATA vunda.chee chee...

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top