• ఆ రెండు పార్టీలదీ చీకటి ఒప్పందం
  • మాట తప్పిన ఎర్రబెల్లి
  • వెంకయ్య, బాబు చేతిలో కిషన్‌ రెడ్డి కీలుబొమ్మ: హరీశ్‌ రావు
  • రేవంత్‌ బండారం బయటపెడతాం: ఎర్రోళ్ల

సంగారెడ్డి/గజ్వేల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ల పోరాటం డిపాజిట్‌ కోసమేనని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలోని ఆయన ఇంట్లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నిక సందర్భంగా ఈ రెండు పార్టీలు అక్రమ కలయికతో చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. జాతీయ స్థాయిలో బద్దశత్రువులైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికలలో మాత్రం విమర్శలకు దిగకుండా పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్నికల నాటికి రెండు పార్టీలలో ఎవరికో ఒకరికి ఓటేయాలని వారు చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట తప్పడంటో దిట్ట అని విమర్శించారు. జగ్గారెడ్డి గెలిస్తే హరీశ్‌ రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా అని సవాల్‌ విసిరింది ఆయనేనని చెప్పారు. ఈ విషయం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమైందన్నారు. 
ఇపుడు ఆ మాట అనలేదంటూ మాట మార్చారని విమర్శించారు. తాను ఎర్రబెల్లి సవాల్‌ను స్వీకరించానని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసం చేస్తారా అని అడిగానన్నారు. కానీ టీఆర్‌ఎస్‌కు ఆరు లక్షల మెజారిటీ వస్తుందని తాను ప్రకటించలేదని పేర్కొన్నారు. ఎర్రబెల్లి తోక ముడిస్తే, వెనక్కి పోతే ఆయన విజ్ఞతకే వదిలేస్తామన్నారు. కిషన్‌రెడ్డి పేరుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ వెంకయ్యనాయుడు, చంద్రబాబుల చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. ఆంధ్రానాయకుల కనుసన్నల్లో పనిచేసే నేత అని ధ్వజమెత్తారు. సమైక్యవాది జగ్గారెడ్డికి టికెట్‌ ఇచ్చిన ఘనత కిషన్‌రెడ్డిదా లేక చంద్రబాబుదా స్పష్టం చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణకు శకునిగా చంద్రబాబు, ఆయనకు కూలీగా రేవంత్‌రెడ్డి, పెంపుడు కుక్కలుగా ఎర్రబెల్లి, మోత్కుపల్లిలు మారారని టీఆర్‌ఎస్‌ పోలీట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేవంత్‌ పేరుకే రేవంత్‌ కానీ ఆయన బుద్ది భేవంత్‌ అని వ్యాఖ్యానించారు.
ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసే రేవంత్‌కు హిమాచల్‌ ప్రదేశ్‌లో పవర్‌ప్రాజెక్టులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాం డ్‌ చేశారు. త్వరలోనే రేవంత్‌ బం డారాన్ని, ఆయన రియల్‌ ఎస్టేట్‌ బాగోతాన్ని బయటపెడతామన్నా రు. రేవంత్‌రెడ్డి 14సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలు గుండు కొట్టించి పంపుతారని చెప్పారు.
(From andhrajyothy daily)

Reactions:

Post a Comment

  1. తెలుగు దేశం ఆంధ్రాలో ఇద్దరు బిజెపి శాసనసభ్యులకి మంత్రి పదవులు ఇచ్చింది. జగ్గారెడ్డికి మెదక్‌లో తికెత్ ఇవ్వకపోతే ఐదేళ్ళ తరువాత బాబు ఆంధ్రాలో బిజెపికి మంత్రి పదవులు ఇవ్వడనే భయంతోనే బిజెపి జగ్గారెడ్డిని నిలబెట్టింది. అంతే కానీ జగ్గారెడ్డి ఓడిపోతాడని తెలియకకాదు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top