• కేటీఆర్‌కు ‘స్థానికత’ వర్తించదు
 • సీమాంధ్రులతో కలిసి వ్యాపారాలు
 • సెంటిమెంట్‌ ముసుగులో అరాచకం
 • కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు తిరగబడాలి

టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీహార్‌ నుంచి వలస వచ్చారని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ గుంటూరులో చదువుకున్నారని, ఆంధ్రా వాళ్లతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మొత్తంగా... తెలంగాణలో వలసవాదుల పాలన సాగుతోందని అభివర్ణించారు. శుక్రవారం రేవంత్‌ రెడ్డి ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. ‘వెలమ కమ్యూనిటీ... మేము బీహార్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చాం’ అని కేసీఆర్‌... ‘ ఆంధ్రాప్రాంతం వాళ్లు కూడా నా వ్యాపారంలో భాగస్వాములు ఉన్నారు. నాకు అక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు’ అంటూ కేటీఆర్‌ చెప్పిన క్లిప్పింగ్స్‌ను చూపించారు. ‘‘కేసీఆర్‌ బీహార్‌ నుంచి, కేటీఆర్‌ గుంటూరు నుంచి వచ్చిన వలస దొరబాబులు. ఉత్తర భారతదే నుంచి దిగుమతి అయిన కేసీఆర్‌ తెలంగాణకు సీఎం అయ్యారు. సెంటిమెంట్‌ను కప్పుకుని తెలంగాణలో అరాచక పాలన సాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒక్క క్షణం ఆలోచించండి. అలాంటి నాయకత్వం మనకు అవసరం ఉందా? తక్షణమే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌పై తిరుగుబాటు చేయండి. ఆ పార్టీలో మరెవరు సీఎం అయినా ఫరవాలేదు. కేసీఆర్‌ సీఎంగా కొనసాగితే తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థుల ఆత్మ ఘోషిస్తుంది’’ అని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులో చదువుకున్న కేటీఆర్‌కు తెలంగాణ స్థానికత కూడా వర్తించదని చెప్పారు. ‘‘371డీ, 610 జీవో ప్రకారం కేటీఆర్‌ తెలంగాణలో ఉద్యోగం పొందడానికి కూడా అర్హుడు కారు. కానీ, కేటీఆర్‌ తెలంగాణలో మంత్రి అయ్యారు. ఆంధ్రావారితో కలిసి వ్యాపారం చేస్తున్నారు’’ అని విమర్శించారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని, తెలంగాణ వాదం ముసుగులో అధికారంలోకి వచ్చారని రేవంత్‌ మండిపడ్డారు. 
బీజేపీ వల్లే తెలంగాణ: తెలంగాణ ఇవ్వాలని పదేపదే కేంద్రానికి లేఖలు రాసింది తెలుగుదేశం పార్టీయే అని చెప్పారు. తెలంగాణలో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రూపుమాపింది టీడీపీయేనన్నారు. అలాంటి టీడీపీ కేవలం ఆంధ్రా పార్టీయా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్‌ చేయించిది బీజేపీ అని, ఆపార్టీలో కీలక నేత ఇందుకు ఎంతో సహకరించారని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌కు కాకుండా కోట్లకు పడగలెత్తిన కొత్త ప్రభాకర్‌ రెడ్డికి మెదక్‌ ఎంపీ టిక్కెట్‌ ఇచ్చారని రేవంత్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన హరీశ్‌ రావు మెదక్‌ జిల్లా సిద్దిపేటకు రాగా... కొత్త ప్రభాకర్‌రెడ్డి నిజామాబాద్‌ నుంచి మెదక్‌కు వచ్చారన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుపైనా రేవంత్‌ ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్‌, తుమ్మల కలయిక చూస్తుంటే ఇద్దరు దురాశాపరులు కౌగిలించుకున్నట్లుగా ఉంది. ఒకాయనకు మంత్రి పదవి, ఇంకొకాయనకు గులాంగిరి కావాలి.’’ అని రేవంత్‌ దుయ్యబట్టారు. 
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. వినేవాడు వెఱ్ఱివాడైతే పంది పురాణం చెపుతుంది. అలాగే మనకి రేవంత్ రెడ్డి పురాణం చెపుతాడు.

  ReplyDelete
 2. రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.
  రేవంత్‌ మండిపడ్డారు.
  రేవంత్‌ దుయ్యబట్టారు.

  అంటూ ఆంద్ర జ్యోతి ఎంత నొక్కి పలికినా, ఆ తిట్ల వెనుక స్క్రీన్ ప్లే, దర్శకత్వం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిదే. ఈ తిట్ల పురాణానికి కారణం తుమ్మల పార్టీని వదిలి ఉన్నొక్క ఖమ్మం తెలుగదేశం పార్టీని ఖాళీ చేయడమే. ఇక ఆ తిట్ల వెనుక లాజిక్ వెతకడం గొంగట్లో వెంట్రుకలు వేరుచేసే ప్రయత్నమే.

  ఇలా రేవంత్ ఎన్ని తిట్టినా, కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా తిరగబడతాడా అన్నది సూర్యుడు పడమట ఉద్యయిస్తాడా అన్నంత కష్టమైన ప్రశ్న.

  ఇక్కడ ఒక తమాషా చెప్పుకోవాలి. మాటల మధ్య ఫ్లోలో "2001 వరకు కెసిఆర్ పనిచేసిన తెలుగుదేశం ఆంధ్రా పార్టీ కాదా?" అని ప్రశ్నించాడట రేవంత్! ఇప్పుడే ఫేసుబుక్కులో చదివాను. దాన్నిఆంధ్రజ్యోతి కన్వీనియెంట్ గా ఆ తిట్ల పురాణం నుంచి తప్పించి వేసింది. వారి మనసులోని భావాలు ఆ విధంగా వెళ్ళగక్కుతున్నారన్న మాట!

  ReplyDelete
  Replies
  1. కె.సి.ఆర్.ని జనం రాళ్ళతో కొడతారని కూడా గతంలో తెలంగాణా తెలుగు దేశం నాయకులే అన్నారు. అయినా కె.సి.ఆర్. గెలిచాడు. జగ్గారెడ్డిని మాత్రం ఏనుగు మీదకి ఎక్కిస్తారని తెలుగు దేశం నాయకులు అనుకుంటున్నారేమో!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top