'కేసీఆర్ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ'హైదరాబాద్ : తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విరసం నేత వరవరవరావు, మానవహక్కుల ఉద్యమనేత హరగోపాల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచేయాలని ఆయన చూస్తున్నారన్నారు. ప్రజాసంఘాల నేతల అరెస్టును తాము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి సమయంలో ఉద్యమనాయకులను అరెస్టు చేసి.. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోవడం తగదన్నారు.

భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి వైఖరినే అవలంబిస్తే మాత్రం తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కాళోజీ, జయశంకర్ లాంటి వాళ్లు ఎవరూ ఇలాంటి నిర్బంధాలతో కూడిన తెలంగాణను కోరుకోలేదని, ఈ విషయంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని వరవరరావు, హరగోపాల్ స్పష్టం చేశారు.
(from sakshi daily)
Reactions:

Post a Comment

 1. పాలక వర్గంతో మావోయిస్త్‌లు జరిపిన చర్చలు విఫలమైనప్పుడే వర్గ స్వభావం అంటే ఏమిటో అర్థమై ఉండాలి. విరసం నాయకులకి అది ఇంకా అర్థమైనట్టు లేదు.

  ReplyDelete
  Replies
  1. మీకేమి అర్ధమయింది వరవరరావు చెప్పినదానిలో. విరసం సభకు అనుమతించకపోవడం పై మీ కామెంట్ ఏమిటి? ఉద్యమ కాలంలో తనది కూడా నక్సల్ ఎజెండానేనని చెప్పిన కే.సీ.ఆర్ ఇప్పుడెందుకు వారికి అనుమతినివ్వడం లేదు. మావోయిస్టులపై చర్చించడమే తప్పా?

   Delete
  2. అతనిది మావోయిస్త్ అజెందా అయితే అతను తన ప్రైవేత్ ఆస్తిని వదులుకోవాలి. కోట్ల ఆస్తి ఉన్న కె.సి.ఆర్. అందుకు ఒప్పుకుంటాడా? మార్క్సిస్త్‌లమని చెప్పుకునేవాళ్ళకి ఈ విషయం ఎప్పుడో అర్థమై ఉండాలి. తెలంగాణా నిజంగా రాదనుకుని తెలంగాణ ఉద్యమానికి పబ్లిసితీ ఇచ్చిన TV9 లాంటి చానెల్‌లు ఉన్నట్టు మావో జెదాంగ్ ఎవరో తెలియక తనది మావోయిస్త్ అజెందా అని చెప్పుకునే పాలకవర్గంవాళ్ళు ఉన్నారు. గతితార్కిక-చారిత్రక భౌతికవాదం అనేది థియరీ. దాని అంతిమ లక్ష్యం ప్రైవేత్ ఆస్తిని రద్దు చెయ్యడం. 1970 నుంచి విప్లవం, విప్లవం అంటూ అరుస్తోన్న విరసం నాయకులకి ఈ విషయం తెలియదా?

   Delete
  3. ప్రవీణ్ గారు,

   పిచ్చివాడు తనకు పిచ్చి తగ్గింది రోకలిబండ తెచ్చి తలకు చుట్టమన్నాడట. తెలంగాణాకు గతితర్కానికి లింకు పెట్టే మూర్ఖులు కమ్యూనిస్టులు కారు. కమ్యూనిస్టు అంటే అర్ధం కూడా తెలీని వారు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ కమ్యూనిస్టు అనే పదానికే మచ్చ తెస్తుంటారని నా అభిప్రాయం. శ్రమని గౌరవించని వారు ఏ శ్రమా చేయకుండా పిచ్చిగా పచ్చి వాదనలు చేయడం పాలక వర్గాలకు గులాము గిరీ వాదనలు చేసేవారే అతివాదం చేస్తుంటారు.

   గతితర్కం గోల్ వ్యక్తిగత ఆస్తి రద్దయినప్పుడు, గతి తర్కం ప్రకారమే తెలంగాణాను సమర్ధించాలన్నప్పుడు, మరి తెలంగాణా వచ్చింది కదా? తెలంగాణాలో ఎప్పుడు అందరూ ఆస్థులు వదులుకోవడం ప్రారంభిస్తున్నారు?

   గతి తార్కిక భౌతికవాదం అనేది థియరీ. కానీ అది మీకర్ధమయినట్లు కాక వాస్తవం కు దగ్గరగా ఉంటుంది. పరిమాణాత్మక మార్పునుండి గుణాత్మక మార్పు వస్తుందని చెపుతుంది. విప్లవం ఒకేసారి రాదు. రమ్మంటేనో కోరుకుంటేనో రాదు. భౌతిక పరిస్తితులు అనుకూలించి ప్రజల మద్దతు ఉంటేనే వస్తుంది. అలా కాకుండా బలవంతంగానో తుపాకీ గొట్టం ద్వారానో వచ్చినా అది నిలబడదు. ప్రజల మద్దతు లేకుండా - ప్రజలను చైతన్యపరచకుండా వ్యక్తిగత పిచికారీతనంతో విప్లవాలు సృష్టిద్దామనుకుంటే అది సినిమా కథలు తీసుకుని సొమ్ము చేసుకోవడానికో, ఏ పనీ పాటా లేకుండా పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు వ్రాసుకోవడానికో పనికి వస్తాయి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడవు.

   వ్యక్తిగత ఆస్తి అనేది పిచ్చిగా బలవంతంగా రద్దు చేయాలని గతితార్కిక భౌతికవాదం ఎక్కడా చెప్పదు. వ్యక్తిగత ఆస్థి అనేది ప్రజలు స్వానుమతంగా రద్దు చేసుకోవాలి. కే.సీ.ఆరే కాదు ప్రవీణ్ కూడా ఇప్పటి పరిస్తితిలో వ్యక్తిగత ఆస్థిని వదులుకోడు. పరిస్తితులే మనిషి ఆలోచనను ప్రభావితం చేస్తాయి తప్ప ఆలోచనల ద్వారా పరిస్తితులను క్రియేట్ చేయలేము. కమ్యూనిస్టునని చెప్పుకునే పిచ్చి మూర్ఖుడికి తప్ప విభజనవాదమైనా- సమైక్యవాదమైనా రెండూ భౌతికంగా ఉన్నవేనని కమ్యూనిస్టులకి అవగతం అవుతుంది. వీటికి గతితర్కానికి అన్వయించి చూసి తియరీని చెప్పలేము. చెప్పాల్సిన అవసరం లేదు. మొండి సీతయ్యలు మాత్రమే పదే పదే బోడిగుండుకీ మోకాలికీ లింకు పెట్టినట్లు వాదిస్తారు. కే.సీ.ఆర్ భజనే మార్క్సిజం థియరీలా చెప్తుంటారు.

   ఆస్థి అంటేనే దొంగతనం అంటాడు మార్క్స్. కానీ వ్యక్తివాద సమాజంలో అందరూ అంతో ఇంతో ఆస్తి పరులే. అస్తిన్ పెంచుకుందామని చూస్తారే తప్ప పంచుకుందామని చూడరు. ఒకరిద్దరు సుందరయ్యలా పంచినా దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. మొత్తం వ్యవస్థలో మార్పు లేకుండా ప్రజల చైతన్యం పెంచకుండా ఒకేసారి మార్పు రాదు.

   వ్యక్తిగత ఆస్తి స్వానుమతంగా రద్దు చేసుకునేలా పరిస్తితులను చైతన్యపరచాలి తప్ప బలవంతంగా కాదు. ఆ నోడల్ పాయింట్ రావాలంటే సుదీర్ఘకాలం పడుతుందనేది వాస్తవవాదులకు అర్ధమవుతుంది పిచ్చి వాదులు వాగుతూనే ఉంటారు.

   1970 నుండే కాదు ఇంకా ఎన్నాళ్లు అరచినా ప్రజలను చైతన్యపరచకుండా ప్రజలకు దూరంగా ఉండి చేసేదీ చేయగలిగేది ఏమీ ఉండదెవరికైనా.

   Delete
  4. తెలంగాణావాదులు ఎన్నడూ తాము ప్రైవేత్ ఆస్తిని రద్దు చేస్తామని చెప్పుకోలేదు. దళిత అస్తిత్వవాదానికి మావోయిస్త్‌లు ఎలా మద్దతు ఇచ్చారో, తెలంగాణా అస్తిత్వవాదానికి కూడా మావోయిస్త్‌లు అలాగే మద్దతు ఇచ్చారు. ఫలానా దానికి గతితర్కంతో సంబంధం లేదని చెప్పి వితండవాదం చెయ్యడం మీకే సాధ్యమైంది.

   Delete
  5. మావోయిస్టులు మద్దతిచ్చినా, సీ.పీ.ఐ - న్యూడెమొక్రసీ లు తమ సమైక్యవాద వైఖరి మార్చుకుని తెలంగాణాకు మద్దతిచ్చినా, సీ.పీ.ఎం సమైఖ్యవైఖరితోనే ఉన్నా అవేవీ గతితర్కానికి సంబంధం ఉండాల్సినవి కావు. అలా చెప్తేనే వితండవాదం అవుతుంది. న్యూడెమొక్రసీ-సీ.పీ.ఐ లకి గతితర్కం అప్పుడొకరకంగా ఇప్పుడొకరకంగా అర్ధమయిందంటారా? కాదు గదా? ప్రజల స్పందనను బట్టి రాజకీయ ఎత్తుగడలతో వారి వైఖరి మార్చుకున్నారు. వితండవాదం గురించి మీలాంటి వాళ్లు చెప్పడం బాగోదు.

   Delete
 2. @ప్రవీణ్
  మీరు పాలక వర్గాన్ని సమర్ధిస్తారా లేక మావోయిస్ట్ లని సమర్ధిస్తారా?

  ReplyDelete
 3. నేను ఎప్పటికీ మావోయిస్త్‌నే. చర్చల వల్ల ఇంత నష్టం జరిగిన తరువాత వర్గ స్వభావం అంటే ఏమిటో మావోయిస్త్ పార్తీకి బాగా అర్థమయ్యే ఉంటుంది. విరసం నాయకులకే అది అర్థమైనట్టు లేదు.

  ReplyDelete
  Replies
  1. మీకు ఏ కోశానా వర్గ స్వభావం లేదు. ఒక్కటి కూడా కమ్యూనిస్టు లక్షణం లేదు. రైలు చార్జీలు పెంచాలంటారు. దళితులని సీ.ఎం చేస్తానని చెప్పి తల నరుక్కుంటానన్న కే.సీ.ఆర్ మాట మార్చినా అది మీకు కనపడదు. నిండు సభలో దళితుడిని అవమాన పరచినా అది మీకు తప్పుగా కనపడదు. చానెళ్లను ప్రసారం చేయకుండా నియంతృత్వం ప్రదర్సిస్తున్నా వాటిని నిషెధించాలంటావు. నాకు తెలిసి ఈ భూమిమీదనే ఏ కమ్యూనిస్టు వాటిని సమర్ధించలేదు పిచ్చి సీతయ్యవాదులు తప్ప. ఫీజు రీ ఎంబెర్స్‌మెంటులో ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతుంటే ఆ తుగ్లక్ చర్యలను సమర్ధిస్తారు. పైగా తెలంగాణా ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయంటూ శాడిస్టులా మాడ్లాడతారు. మీరెలా కమ్యూనిస్టునని చెప్పుకుంటారు? అది ఏ వర్గ స్వభావం? కే.సీ.ఆర్ భజన చేయడం లో మీకు అవార్డు ఇవ్వవచ్చు. వ్యక్తిగతంగా మీ పిచ్చి వాదనలను సమర్ధించుకోవడం తప్ప ఎక్కడైనా ఆత్మ విమర్శ చేసుకున్నారా? ఎదుటివారిని కించపరస్తూ గాయ పరస్తూ కామెంట్ చేయడం ఒక్కసారి కూడా ఆత్మవిమర్శ చేసుకోకపోవడం కమ్యూనిస్టు లక్షణమెలా అవుతుంది. మీలాంటి వాళ్లు కమ్యూనిస్టులమని చెప్పుకుంటుంటే నిజమైన కమ్యూనిస్టులు సిగ్గు పడతారు. మిగతావారు కమ్యూనిస్టులంటే ఇంత పైత్యపు వాదనలు చేస్తారా? అనుకునే ప్రమాదమూ ఉన్నది. దయచేసి మీ వాదనలను కమ్యూనిస్టుల వాదనలని చెప్పుకోకండి.

   Delete
  2. రైలు చార్జిలు పెంచకుండా ప్రయాణికుల్ని పశువుల్లారీల్లో పశువుల్ని ఇరికించినట్టు రైలు పెట్టెల్లో ఇరికించి..... ఈ రకంగా డబ్బులు సంపాదించడం కంటే రైలు చార్జిలు పెంచడం మేలు కాదా?

   కె.సి.ఆర్.కీ, నాకూ సంబంధం లేదు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా పచ్చ పార్తీ అనుకూల పత్రికలు తెలంగాణపై విషం చిమ్ముతోంటే నేను తెలంగాణా తరపున మాట్లాడాను. 60 లక్షలు జనాభా ఉన్న హైదరాబాద్‌లో మెత్రో పూర్తి కాదు అని ప్రచారం చేస్తూనే పది లక్షలు జనాభా కూడా లేని విజయవాడలో మెత్రో వెయ్యడం సాధ్యమని అదే సమయంలో ప్రచారం చేసే రెండు తలల నాగులు అవి.

   Delete
  3. తెలంగాణా తరపున మాట్లాడితే సంతోషం. కానీ మీరు మాట్లాడేది కే.సీ.ఆర్ తరపున అనేది నా విమర్శ. తెలంగాణా అంటే కే.సీ.ఆర్ కాదు. మీ కామెంట్లన్నీ మీరే ఓసారి రివ్యూ చేసుకోండి. కే.సీ.ఆర్ ని ఎవరేమన్నా ఒక్క క్షణం కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు. పచ్చ పత్రికలు , కే.సీ.ఆర్ పిచ్చి పత్రికలు రెండూ కూడా తెలంగాణా ను ఏమీ చేయలేవని నా అభిప్రాయం. అయినా ప్రతీదానికి పచ్చ పత్రికలు ఆంధ్రోళ్లు అంటూ మాట్లాడడం దుర్మార్గం. ఏ విషయానికావిషయాన్ని చూసి విమర్శించాలి.

   Delete
  4. నాకు తెలిసి నమస్తే తెలంగాణా ఒక్కటే కె.సి.ఆర్. అనుకూల పత్రిక. ఆ పత్రిక పెట్టినదే కె.సి.ఆర్., కానీ దానిలో 75% వాటాని లక్ష్మీ రాజంకి అమ్ముకున్నాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా కాదు. చంద్రబాబుకి ఆ పత్రికల్లో ఎలాంటి వాటా లేకపోయినా కేవలం కుల పిచ్చితో చంద్రబాబుకి భజన చేసే పత్రికలు అవి.

   Delete
  5. ఈనాడు-ఆంధ్రజ్యోతి లకు కులపిచ్చి ఉన్నా తెలంగాణా వ్యతిరేకత ఉన్నా ఉద్యమ కాలంలో దొంగ సమర్ధన చేసినా పెట్టుబడిదారుల చేతిలో పత్రికల ద్వారా అంతకంటే ఎక్కువ చైతన్యపూరిత సమాచారాన్ని ఆశించలేము. అలాగే తెలంగాణా రక్తం అంటూ దుర్మార్గంగా తెలంగాణా ప్రజలను ఆంధ్రాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని నమస్తే తెలంగాణా చూసినా ప్రజలు అంత చైతన్య రహితంగా ఉండరు. గతంలో పత్రికలను చానెళ్లను ప్రజలు అంత తేలికగా నమ్మడం లేదు. వాటి విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. ఈ రెచ్చగొట్టుడు కార్యక్రమం భజన కార్యక్రమం ఎక్కువకాలం మనుగడ సాగించలేవు.

   Delete
  6. @kondala rao
   abaout praveen
   మీకు ఏ కోశానా వర్గ స్వభావం లేదు. ఒక్కటి కూడా కమ్యూనిస్టు లక్షణం లేదు
   >>
   నిజమే, ప్రవీణ్ గొప్ప కమ్మ అనిష్టు!

   Delete
  7. నాకు వర్గ స్వభావం లేకపోతే పెట్టుబడిదారులకి లాభమే కానీ నష్టం కాదు కదా! కులం, మతం, ప్రాంతం కంటే కమ్యూనిజమే పెట్టుబడిదారులని ఎక్కువ వణికిస్తుంది. పెట్టుబడిదారుడెవడూ కులం కోసమో, ప్రాంతం కోసమో కమ్యూనిస్త్‌కి కితాబు ఇవ్వడు.

   Delete
  8. తెలంగాణా నిజంగా రాదనుకుని TRSతో పొత్తు పెట్టుకున్న పార్తీలు ఉన్నాయి కానీ కార్మిక వర్గ విప్లవం నిజంగా రాదనుకుని ప్రైవేత్ ఆస్తిని రద్దు చేస్తామని చెప్పుకునే పార్తీలు ఉండవు. కులం, ప్రాంతం కంటే వర్గమే పాలకవర్గాన్ని ఎక్కువ భయపెడుతుందనడానికి ఇదే సాక్ష్యం కదా. నాకు వర్గ స్వభావం నిజంగా లేకపోతే పెట్టుబడిదారులు నన్ను మెచ్చుకోవాలి కానీ తిట్టాల్సిన అవసరం లేదు.

   Delete
  9. నాకు వర్గ స్వభావం నిజంగా లేకపోతే పెట్టుబడిదారులు నన్ను మెచ్చుకోవాలి కానీ తిట్టాల్సిన అవసరం లేదు.
   >>
   అంటే ఇక్కడ తమరితో వాదిస్తున్న మేము అందరం పెట్టుబడిదారీ వెధవలం అని తీర్మానించేసారు, అంతేనా?ఒక్కొక్కళ్ళం మా రోజువారీ ప్రాజెఖ్తు పనుల్లో బుర్రలు పాడుజేసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చి అడిగారు కదా అని యేదో మాకు తోచిన మా అభిప్రయాల్ని చెప్తూ వుంతే మీరు మమ్మల్ని సంస్కరించి కమ్యునిష్టు మావోఇష్టు స్వరగంలోకి లాక్కెళ్ళడానికి వచ్చిన దేవదూత గాబ్రియేలు అన్నమాట?!మిమ్మల్ని తిట్టెవాళ్ళంతా పెట్టుబడిదారులు అనే మీరు నన్ను తిట్టేనవాళ్లంతా తెలంగాణా వ్యతిరేకులే అనుకునే కేసీఆర్ నచ్చడంలో ఆశ్చర్య మేముంది?
   మేము పెట్టుబడి దారీ సంస్కృతిలో పండిపోయిన మూర్ఖులం, అవునా?

   Delete
  10. @ హరిబాబు, హైదరాబాద్ తప్ప ఏదీ అవసరం లేదనుకునే ఆధిపత్య వర్గంవాళ్ళతో వర్గ స్వభావం గురించి చర్చ మార్క్సిస్త్‌లు ఎలా చేస్తారు? నువ్వు వర్గం గురించి మాట్లాడకపోతే నీకు వచ్చే నష్టం లేదు, దాని గురించి నువ్వు మాట్లాడితే మాకు వచ్చే లాభం లేదు.

   @కొండలరావు గారు, తెలంగాణావాదాన్ని తీవ్రంగా విమర్శించిన తెలకపల్లి రవి సమైక్యవాదానికి కార్మిక వర్గంతో ఏమి సంబంధం ఉందో చెప్పలేదు. హైదరాబాద్ అనే మేడి పండు కోసం గతితార్కిక భౌతికవాదాన్ని పూర్తిగా వదిలేసిన CPM నాయకులకి వర్గ స్వభావం ఏమాత్రం ఉందో అడగాలి కానీ భౌతికవాదానికే కట్టుబడి ఉన్న నన్ను కాదు.

   Delete
 4. >>> కేసీఆర్ తీరు అప్రజాస్వామికమన్న వరవరరావు

  వరవర రావు ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తున్నారా? లేక శ్రామిక నియంతృత్వాన్ని కోరుతున్నారా? ఇప్పుడున్న రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని బలపరచే వారైతే దానికి వ్యతిరేక భావజాలంతో సభలు పెట్టగూడదు. అలా కాక దాన్ని సమూలంగా మార్చి కొత్త సంవిధానాన్ని ఏర్పరచాలంటే అది రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం అవుతుంది. అటువంటప్పుడు కెసిఆర్ మాత్రమే కాదు, ఆ కుర్చీలో ఎవరున్నా అలాగే చేస్తారు.

  >>> తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచేయాలని ఆయన చూస్తున్నారన్నారు.

  తెలంగాణా ఉద్యమం జరిగింది తెలంగాణా ఏర్పాటు కోసం. కమ్యూనిజాన్ని ప్రతిష్టించడం కోసం కాదు. ఇప్పుడు తెలంగాణా ఏర్పాటు జరిగిపోయింది. ఇప్పుడు కావలసింది దాని అభివృద్ధికోసం ప్రయత్నించడం. ఉద్యమాలు చేసినా అవి రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్య సంవిధానాన్ని గౌరవిస్తూ... దాన్ని మెరుగు పరచడానికి చేసేవి అయి ఉండాలి. అంతే తప్ప ఆ ప్రజాస్వామ్యానికే తూట్లు పొడిచేవి కాకూడదు.

  >>> ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను

  పధ్ధతి ప్రజాస్వామ్యమే అయినా అందులో వ్యాప్తిచేసే భావజాలం ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధం అయినపుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం అందుకు అంగీకరించదు. అలా అంగీకరిస్తే రేపు ఏ అల్-కాయిదానో, జైష్-ఎ-మహామ్మదో "ప్రజాస్వామ్య" బద్ధంగా తమ తమ భావజాల వ్యాప్తి చేసుకుంటామంటే అనుమతి ఇవ్వాల్సి వస్తుంది కదా?

  >>> ఈ విషయంలో కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని వరవరరావు, హరగోపాల్ స్పష్టం చేశారు.

  రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్న కెసిఆర్ తన వైఖరి మార్చుకొని మావోయిస్టు పంధాని అనుసరించ లేడు. ఒకవేళ అందుకు సహాకారం అందించాలని చూసినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఆర్టికల్ 371 ఉపయోగించి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తుంది. తెలంగాణా మరింత సంక్షోభం లోనికి కూరుకు పోతుంది. గతంలో బెంగాల్ లోని మార్క్సిస్టు ప్రభుత్వం కూడా మావోయిస్టుల పైన ఉక్కుపాదం మోపిన సంగతి మరిచి పోవద్దు.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్‌చారి, కమ్యూనిజం సొంత ఆస్తి (పెట్టుబడిదారుల ఊపిరి)కి విరుద్ధమైనప్పుడు కమ్యూనిస్త్‌లు రాజ్యాంగం (పెట్టుబడిదారులు వ్రాసినది) ప్రకారం పని చెయ్యడం సాధ్యం కాదు. చర్చల ఉచ్చులో పడి వందల మంది విప్లవకారులు ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత కూడా విరసం నాయకులు సభల కోసం పాలక వర్గం అనుమతి మీదే ఆధారపడడం వల్లే నేను వాళ్ళని విమర్శించాను. కమ్యూనిజం అంటే ఏమిటో తెలియనివాళ్ళు ఎక్కువగా ఉన్న ఇందియాలో "తెలంగాణా ఉద్యమాన్ని పెట్టుబడిదారులు నడిపిస్తున్నారు" అంటూ తెలకపల్లి రవి లాంటి మేతావులు అసంగత ప్రచారం చెయ్యడం వల్ల మొదటికే మోసం వచ్చింది. సమైక్యవాదులు ఎలాగూ కమ్యూనిజంని వ్యతిరేకించే వర్గానికి చెందినవాళ్ళు. వాళ్ళకి హైదరాబాద్ తప్ప ఏమీ అవసరం లేదు. సాధారణ ప్రజలు కోరుకునే ప్రాంతీయ అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళు రెండు ప్రాంతాలకీ అవసరం లేకుండా పోయారు.

   Delete
  2. సమైక్యవాదులు తమకి హైదరాబాద్ తప్ప ఏదీ అవసరం లేదని బహిరంగంగా చెప్పుకుంటుండగా తెలుగు జాతి ఐక్యతకి సమైక్య రాష్ట్రం అవసరమే అని జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించిన చరిత్ర తెలకపల్లి రవిది. అందుకే వీళ్ళ పార్తీకి రెండు ప్రాంతాలలోనూ కార్యక్రమాలు ఉండవు.

   Delete
  3. శ్రీకాంత్ చారి గారు,

   నక్సల్స్ పంథా వేరు. ఎజెండా వేరు. నిజమే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో విరసం వారు సభను పెట్టుకోవడం తప్పు కాదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడమూ తప్పు కాదు. రాజ్యాంగాన్ని ఎమెండ్మెంట్ చేయడమూ రాజ్యాంగబద్ధమే. తుపాకీ గొట్టాలతో సభలు పెట్టుకుంటానంటే తప్పు.

   కమ్యూనిజాన్ని ప్రతిష్టించాలనుకోవడం అప్రజాస్వామికం కాదు. అది ఏ పద్ధతిలో అనేదే పాయింట్.

   మావోయిస్టులని ఉక్కుపాదంతో అణచడానికీ విరసం వారి సభలను అనుమతించడానికి పోలిక పెట్టకూడదు. ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా నక్సల్స్తోనైనా చర్చలు జరిపితే తప్పు లేదు.

   Delete
  4. తెలంగాణా ఉద్యమాన్ని పెట్టుబడిదారులు నడిపిస్తున్నారని తెలకపల్లి రవి ఎక్కడ అన్నారు లేదా వ్రాశారు ఆధారాలు చూపిస్తారా?

   సమైక్యవాదులు కమ్యూనిజాన్ని వ్యతిరేకించేవాళ్లు. పిచ్చి ముదిరిన వ్యక్తులే ఇలా మాట్లాడతారు. ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ కమ్యూనిస్టునని మీకు మీరే చెప్పుకోవడానికి అసహ్యం అనిపించదా ప్రవీణ్ మీకు? కనీసం సిగ్గు పడరా? పదే పదే పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి.

   Delete
  5. కొండలరావు గారు,

   రాజ్యాంగాన్ని పార్లమెంటులో అమెండ్ చేయడం వేరు. రాజ్యాంగాన్ని ధిక్కరించి నూతన రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నించడం వేరు. సహజంగానే ఇప్పుడున్న రాజ్యాంగ సంవిధానం దానికి అంగీకరించదు.

   రాజ్యాంగాన్ని, అసలు రాజ్య స్వరూపాన్నే సమూలంగా మార్చివేయాలనుకుంటున్నారు కాబట్టే, CPI, CPM లాగా మావోయిస్టులు ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. అది పూర్తిగా రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం. ప్రజాస్వామ్యం అయినంత మాత్రాన దాని మూలాలకే ముప్పు వచ్చే పనులను ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా అంగీకరించవు. అలా అంగీకరించడం మొదలు పెడితే అనేక మతోన్మాద శక్తులను కూడా బహిరంగ ప్రచారానికి అంగీకరించ వలసి వస్తుంది. అక్బరుద్దీన్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకే ఆయనపై కేసు బుక్ చేశారు. తరువాత మరోసారి లాతూర్ లో మీటింగు పెట్టుకోవడానికి అనుమతి కూడా ఇవ్వలేదు.

   ఇక పోతే ముసుగు ఏదైనప్పటికీ "విరసం" మావోయిస్టు పంథాను సమర్థిస్తున్న విషయం ఒక బహిరంగ రహస్యం. విరసానికి ప్లాట్ఫారం ఇవ్వడమంటే మావోయిజాన్ని ప్రచారం చేసుకోవడాన్ని అనుమతించినట్టే. రాజ్యాంగ శక్తులను మొగ్గలోనే తుంచివేయక పోవడం వల్లే కదా పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది? ఒక సారి బలపడ్డాక ఎన్ని ఉక్కు పాదాలు మోపినా నష్ట తీవ్రత పెరుగుతుందే తప్ప ఫలితం వుండదు. ఇప్పుడిప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణాకు అటువంటి సమస్యల్లోకి దూరడం అవసరమా?

   >>> కమ్యూనిజాన్ని ప్రతిష్టించాలనుకోవడం అప్రజాస్వామికం కాదు. అది ఏ పద్ధతిలో అనేదే పాయింట్.

   అందుకే నేను చెప్పాను "పంథా" "ఎజెండా" వేరు వేరని. వారి పంథా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం. వారు భారత ప్రజాస్వామ్య సంవిధానాన్ని అంగీకరించి ఆయుధాలను విడనాడి జన బాహుళ్యం మధ్యకు వస్తే వారూ అందరిలాగే ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గవచ్చు. రాజ్యాంగంలో వారికి కావలసిన అమెండ్‌మెంట్లు చేసుకోవచ్చు. అది ఎంతవరకు సాధ్యమన్న విషయాన్ని పక్కకు పెడితే, ప్రజలు ఎన్నుకుంటే ఆ విధంగా చేయడానికి మన రాజ్యాంగంలో పూర్తి అవకాశం వుంది.

   >>> ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా నక్సల్స్తోనైనా చర్చలు జరిపితే తప్పు లేదు.

   రాజశేఖర్‌రెడ్డి జరిపాడు కదా? ఏమయింది? రెండు వైపులా చిత్తశుద్ధి వుంటే తప్ప చర్చలు సఫలం కావు. రాజ్య స్వరూపాన్నే సమూలంగా మార్చి బలం ద్వారా శ్రామిక నియంతృత్వాన్ని స్థాపించాలనుకునే మావోయిస్టులు ఆయుధాలను త్వజించి ప్రజాజీవితంలోకి రావడానికి అంగీకరించరు. అలాగే మన క్యాపిటలిస్టు వ్యవస్థలోని నాయకులూ వారి ఎజెండా పూర్తిగా అమలు పరచడానికి ఒప్పుకోరు. కాబట్టి చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.

   Delete
  6. CPI CPM లు కూడా రాజ్యాంగాన్ని, రాజ్య స్వరూపాన్ని సమూలంగా మార్చేయాలనే అనుకుంటారు శ్రీకాంత్ చారి గారు. అయితే ఎన్నికల పట్ల ప్రజలకు నమ్మకమున్నందున వారు ఎన్నికలలో పాల్గొంటారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. CPI బూర్జువా పార్టీలతో కలసి అధికారం చేపటితే, CPM కేవలం లెఫ్ట్ పార్టీలతో కలసి మాత్రమే అధికారం పంచుకున్నది.

   అక్బరుద్దీన్ లాంటి మతోన్మాదులను లేదా ఇతర మత సంస్థలతో మావోయిస్టులతో పోల్చడం సరయినది కాదు. వారి పంథా తప్పు కావచ్చు. వారు కోరుకుంటున్నది, చెపుతున్నది తప్పు కాదు. అలాంటప్పుడు మతోన్మాదులతో టెర్రరిస్టులతో వారిని పోల్చడం తప్పు. వారి పంథా వల్ల వారికి గానీ ప్రజలకు గానీ ఒరిగిందేమీ లేదనేది ఎంత నిజమో వారు కోరుకునేది సరయినదే అనేదీ అంతే నిజమని నా అభిప్రాయం. అందుకే చాలామంది మా ఎజెండా నక్సల్ ఎజెండా ఒక్కటే అని అధికారంలో లేనప్పుడు ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక వారిపై ఉక్కు పాదం మోపుతుంటారు.

   బెంగాల్ లో CPM వారు ప్రజా వ్యతిరేక విధానాలు , అధికార మత్తు పెరగడం వల్లనే ఓటమి పాలయ్యారు. వారు తిరిగి గుణపాఠాలు నేర్చుకుని ప్రజలకు దగ్గరైతే తప్ప అధికారంలోకి రారు. సహజంగా CPM పై వ్యతిరేకతతో మావోయిస్టులు తృనమూల్తో లోపయకారీ ఒప్పందాలు చేసుకున్నారు. మావోయిస్టులు చేసే తప్పులలో అలాంటీవి చాలా ఉంటాయి. అంత మాత్రాన విరసం సభకు అనుమతి ఇవ్వడానికీ మావోయిస్టుల పంథాకి లింకు పెట్టడం సరయినది కాదు.

   రాజ్యాంగం బూటకమైనప్పుడు ప్రజల మద్దతు ఉంటే రాజ్యాంగబద్ధం కాకున్నా సాయుధ పోరాటం ద్వారా అయినా అధికారం చేపడితే తప్పు లేదు. భారత్ లో అలాంటి పరిస్తితులు లేవు. ప్రజలు సాధారణ పోరాటాలకే సిద్ధంగా లేనప్పుడు సాయుధ పోరాటం సక్సెస్ కాదు. విప్లవాలను కాపీ కొడితే రావు. పరిస్తితులను బట్టి వస్థాయి.

   రాజశేఖరరెడ్డికీ, మావోయిస్టులకు ఇద్దరికీ చర్చల భ్రమలు లేవు. అందులో ఎవరి ఎత్తుగడలు వారివి. ఎవరి తాత్కాలిక ప్రయోజనాలు వారివి.

   Delete
  7. కొండలరావు గారు,,

   CPI/CPMలకి మావోయిస్టులకు గల ప్రధాన తేడా... మొదటివి రాజ్యాంగ పరిథిలో పనిచేస్తున్నాయి, రెండోది దాన్ని ధిక్కరించి పనిచేస్తున్నది. దాన్ని మనం విస్మరించలేం.

   ఇక్కడ ప్రశ్న ఏమిటంటే రాజ్యాంగాన్ని ధిక్కరించమని ప్రచారం చేసే వారికి రాజ్యాంగం అనుమతించాలా? లేదా? అని.

   ఒకవేళ జవాబు "అనుమతించాలి" అన్నట్టైతే అది అందరికీ వర్తించాలి, జైషే మహమ్మద్, అల్-కాయిదాలతో సహా.

   జవాబు "అనుమతించకూడదు" అయితే అది కూడా రజ్యాంగాన్ని ధిక్కరించిన ప్రతి పక్షానికీ వర్తిస్తుంది.

   ఇక్కడ నక్సల్ ఎజెండా మంచిదా, అల్-కాయిదా ఎజెండా మంచిదా అన్న పద్ధతిలో నిర్ణయాలు వుండవు. ఇక్కడ ఎవరి ఎజెండా మంచిది అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. కేవలం వారి పద్ధతులు రాజ్యాంగ బద్ధమైనవా కావా అన్నవే చూడబడతాయి. కేవలం సంబంధిత ప్రచారం రాజ్యాంగ బద్ధమైందా, కాదా అన్న విషయం పైనే ఆధారపడి వుంటాయి. సంబంధిత పార్టీలు తమకు అనుమతి ఇవ్వడంలో అన్యాయం జరిగిందనుకుంటే కోర్టుకు వెళ్ళి న్యాయం పొందవచ్చు. గతంలో తెలంగాణా వాదుల మీటింగులను అప్పటి ప్రభుత్వం అడ్డుకున్నపుడు పలుమార్లు కోర్టులు పర్మిషన్ ఇచ్చాయి.

   >>> రాజ్యాంగం బూటకమైనప్పుడు ప్రజల మద్దతు ఉంటే రాజ్యాంగబద్ధం కాకున్నా సాయుధ పోరాటం ద్వారా అయినా అధికారం చేపడితే తప్పు లేదు.

   అది మీ భావన. ఆ భావన తప్పని, రాజ్యాంగం సరైనదని మరికొంత మంది (ఎక్కువమంది) భావన. అయితే రాజ్యాంగ బద్ధం కానిదాన్ని దేన్నీ రాజ్యాంగం ఒప్పుకోదు. అలా అంగీకరిస్తే రాజ్యాంగం అస్తిత్వమే దెబ్బతింటుంది, అరాచకం రాజ్యమేలుతుంది. మన రాజ్యాంగమే కాదు, దాన్ని ఏ రాజ్యాంగమూ ఒప్పుకోదు, కమ్యూనిస్టు రాజ్యాంగం అసలు ఒప్పుకోదు.

   >>> రాజశేఖరరెడ్డికీ, మావోయిస్టులకు ఇద్దరికీ చర్చల భ్రమలు లేవు. అందులో ఎవరి ఎత్తుగడలు వారివి. ఎవరి తాత్కాలిక ప్రయోజనాలు వారివి.

   మీరు చర్చించాలని అన్నప్పుడు ఆ ప్రస్తావన తెచ్చాను. మళ్ళీ చర్చించినా ఎవరి ఎత్తుగడలు వారికుంటాయి. ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే మావోయిస్టులు ఆయుధాలు త్యజించి ప్రజాజీవితంలోనికైనా రావాలి, లేదా వారు అత్యధిక ప్రజల మద్దతు కూడగట్టుకొని రాష్ట్రానిది కూడా కాదు, దేశాధికారం చేపట్టనైనా గలగాలి.

   Delete
  8. పెట్టుబడిదారీ చట్టాలకి లోబడి పని చేసేవి కమ్యూనిస్త్ పార్తీలు అవ్వవు. "జన సాహితీ సంస్థతో మా విబేధాలు" అనే శీర్షికతో రంగనాయకమ్మ గారు వ్రాసిన పుస్తకం చదవండి, మీకు విషయం అర్థమవుతుంది. OPDR అనే మానవ హక్కుల సంఘం ఉండేది. ఆ సంఘం వాళ్ళు తాము చట్ట ప్రకారమే పని చేస్తామని చెప్పుకున్నారు. వాళ్ళ అజెందా చట్టాలని మార్చడం కాదు, ఉన్న చట్టాలు సరిగా అమలు అయ్యేలా చూడడమే. జన సాహితీ సంస్థవాళ్ళు తాము కమ్యూనిస్త్‌లా లేదా మానవ హక్కుల కార్యకర్తలా అనేది స్పష్టంగా చెప్పుకోలేదు. CPI క్రుష్చేవ్ చెప్పిన peaceful coexistence with capitalism సూత్రాన్ని నమ్ముతోంది కాబట్టి అది కమ్యూనిస్త్ పార్తీ కాదు.

   Delete
  9. శ్రీకాంత్ చారి గారు, మీరు చెప్పేవన్నీ సరయినవే ఒక్క విషయంలోనే పొరపడుతున్నారు. మావోయిస్టుల సభకు అనుమతించడానికీ - విరసం సభకు అనుమతించడానికీ తేడా ఉన్నది. విరసం సభకు అనుమతించకపోవడం ప్రభుత్వం చేస్తున్న తప్పే. దానిని సమర్ధించకూడదు. సమర్ధించలేము.

   Delete
  10. విరసం చేస్తున్నది వర్గ పోరాటంలా కాకుండా వర్గ సహకారంలా ఉంది. మావోయిస్త్‌లని దెబ్బతియ్యడానికి చర్చలు అనే నాటకం ఆడిన రాజశేఖరరెడ్డి అందులో భాగంగానే మావోయిస్త్‌ల సభకి అనుమతిచ్చాడు. అంతమాత్రాన విరసం సభలకి అనుమతి ఎలా ఇస్తారు? విరసం చెపుతోన్న ప్రత్యామ్నాయ రాజకీయం అంటే ఏమిటి? పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రత్యామ్నాయం సోషలిజమే కానీ మూడవ మార్గం లేదు. అటువంటప్పుడు విరసం సభకి పాలకవర్గం అనుమతి ఎలా ఇస్తుంది? పాలకవర్గం అనుమతితో సభలు జరపడం అంటే వర్గ పోరాటం కాకుండా వర్గ సహకారం చెయ్యడమే.

   Delete
  11. పాలకవర్గం అనుమతితో సభలు జరపడం అంటే వర్గ పోరాటం కాకుండా వర్గ సహకారం చెయ్యడమే.
   >>
   ఈ మాట నాకు నచ్చింది,శభాష్ ప్రవీణ్!

   Delete
 5. @sreekaant chaari
  రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్న కెసిఆర్ తన వైఖరి మార్చుకొని మావోయిస్టు పంధాని అనుసరించ లేడు.
  >>
  యెప్పుడు తెలిసింది ఈ నిజం మీ ముఖ్యమంత్రికీ మీకూ.అధికారం వచ్చాక తెలిసింది, అవునా?
  అంతే పైన ప్రవీన్ |తెలంగాణా నిజంగా రాదనుకుని తెలంగాణ ఉద్యమానికి పబ్లిసితీ ఇచ్చిన TV9 లాంటి చానెల్‌లు ఉన్నట్టు | అన్నట్టు తెలంగాణా యెలాగూ రాదనుకుని అన్నారా "మాది మావోఇష్టు పంధానే' అని?

  ReplyDelete
  Replies
  1. >>> యెప్పుడు తెలిసింది ఈ నిజం మీ ముఖ్యమంత్రికీ మీకూ.అధికారం వచ్చాక తెలిసింది, అవునా?

   మీరు ఊహాలోకంలో విహరిస్తోన్నట్టుంది!

   >>> తెలంగాణా యెలాగూ రాదనుకుని అన్నారా "మాది మావోఇష్టు పంధానే' అని?

   ఎవరు ఎక్కడ అన్నారు? తుపాకితో రాజ్యాధికారాన్ని సాధించడం మావోయిస్టు పంథా. మరి తెరాసది ఆ పంథా కాదే!

   Delete
  2. మీరు ఊహాలోకంలో విహరిస్తోన్నట్టుంది! --- ఎవరు ఎక్కడ అన్నారు?

   కొండల రావు గారు అంటున్నారు, కాస్త చూసుకుని మాట్లాదండి యెవరూ వూహాలోకాల్లో విహరించదం లేదు,వాస్తవాల మీదనే మాట్లాడుతున్నాం?!

   @kondala raavu says beloow!
   ఉద్యమ కాలంలో తనది కూడా నక్సల్ ఎజెండానేనని చెప్పిన కే.సీ.ఆర్ ఇప్పుడెందుకు వారికి అనుమతినివ్వడం లేదు

   Delete
  3. మావోయిజం అంటే ఏమిటో తెలియక "తమది మావోయిస్త్ అజెందా" అని కె.సి.ఆర్. అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళది నిజంగా మావోయిస్త్ అజెండా అయితే రాజశేఖరరెడ్డి వాళ్ళని బతకనిచ్చేవాడు కాదు.

   Delete
  4. మావోయిజం అంటే ఏమిటో తెలియక "తమది మావోయిస్త్ అజెందా" అని కె.సి.ఆర్. అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు

   మరి ఇక పట్టించుకోవాల్సీనది యేమిటి?

   ఒక అవకాశ వాదపు బూర్జువా వెలమ దొర అధికారం కోసం తను అధికారం వచ్చాక ఆ పంధాలో పరిపాలించగలనా లేదా అని తెలుసోకుండా అప్పటికి వాళ్ళ సపోర్టు కోసం ఓ ముక్క అలా వొదిలేసి అధికారం వచ్చాక ఇప్పుదు వాళ్లనే అణిచేస్తుంటే అబ్బే పట్తించుకోనక్కర్లేదు అంటున్నాడీ కమ్యునిష్టు!

   Delete
  5. This comment has been removed by a blog administrator.

   Delete
  6. "ఒక అవకాశ వాదపు బూర్జువా వెలమ దొర" - అనేది మొత్తం ఆ మనిషిని గురించే నొక్కి చెప్పే మాట.నేను మాట్లాదే రాసే మాతలకి అర్ధం నాకు తెలుసు!ముందు అడిగిన దానికి జవాబు కావాలి నాకు?

   Delete
  7. This comment has been removed by a blog administrator.

   Delete
  8. This comment has been removed by a blog administrator.

   Delete
  9. మిగతా వాళ్ళం మేము అందరం పాటించే మామూలు పిలుపులు చూట్తం లేదా?నువ్వు తొంభయ్యేళ్ల వాడి వయితే నాకేంటి/తొమ్మిదేళ్ళ వాడి వయితే నాకెంటి?
   శ్రీకాంత్ చారి, జై గొట్తి ముక్కల మరియూ మిగతా బ్లాగర్లు మాలో మేము యెవర్నన్నా నువ్వు అంటూ వ్న్నామా? అందరికన్నా నువ్వు దిగొచ్చావా?

   Delete
  10. నా వయసెంతో నీకు తెలుసా?
   >>
   నీ మాటల్ని బట్టే తెలుస్తుందిగా ఇంకా పెళ్ళి కాలేదని!

   Delete
  11. నా పెళ్ళికీ దీనికీ సంబంధం ఏమిటి? నా వయసెంతో నీకు తెలియదు కనుక దాని గురించి మాట్లాడొద్దన్నాను.

   Delete
  12. @Hari Babu Suraneni

   >>> మీరు ఊహాలోకంలో విహరిస్తోన్నట్టుంది! --- ఎవరు ఎక్కడ అన్నారు?

   మీరు నేను వ్రాసిన "రాజ్యాంగ బద్ధమైన పదవిలో వున్న కెసిఆర్ తన వైఖరి మార్చుకొని మావోయిస్టు పంధాని అనుసరించ లేడు." వాక్యాన్ని కోట్ చేస్తూ "యెప్పుడు తెలిసింది ఈ నిజం మీ ముఖ్యమంత్రికీ మీకూ.అధికారం వచ్చాక తెలిసింది, అవునా?" అంటూ వ్రాస్తూ, అంతకు ముందు ఆయన మావోయిస్టు పంథాలో వున్నట్టూ, తర్వాత నిజం తెలుసుకున్నట్టూ వ్రాసినందుకు అలా అనవలసి వచ్చింది.

   కొండలరావు అన్నది:
   "ఉద్యమ కాలంలో తనది కూడా నక్సల్ ఎజెండానేనని చెప్పిన కే.సీ.ఆర్"

   "పంథా", "ఎజెండా" రెండూ వేరు వేరు విషయాలని మీరు గ్రహిస్తే బాగుంటుంది. ఎన్ టి ఆర్ కూడా "నక్సలైట్లు దేశభక్తులు" అన్నాడు. తరువాత వారిని బ్యాన్ చేసింది కూడా ఆయనే. ఏదో ఒక దశలో "నక్సలైట్ ఎజెండా మాది" అన్ని నాయకుడు లేడు మన ఆంద్రప్రదేశ్ లో.

   Delete
  13. This comment has been removed by the author.

   Delete
  14. This comment has been removed by the author.

   Delete
  15. This comment has been removed by the author.

   Delete
  16. పంథా", "ఎజెండా" రెండూ వేరు వేరు విషయాలని మీరు గ్రహిస్తే బాగుంటుంది.
   >>
   అయితే ఓకే?!(కొండవలస మాదిరి అన్నమాట:-))
   where could we get that dictionary of political meanings by T.R.S & K.C.R vocabulary?

   Delete
  17. It is sufficient if you use any valid dictionary. But some SA media houses and people seems to be using their own dictionaries with redefined words.

   Delete
  18. # వెలమ దొర

   ఇక్కడ కులం పేరు ప్రస్తావించాల్సిన ఆవశ్యకత ఏముంది? హరి బాబు అనే కమ్మ దొరకు ....అని ఎవరైనా రాస్తే మీకు బాగుంటుండ వచ్చు, అందరికి బాగుండదు. నెక్స్ట్ టైం ఇలాంటివి రాయునప్పుడు గుర్తుపెట్టుకోగలరు.

   Delete
  19. హరిబాబు గారు, కుల ప్రస్థావనలు తీసుకురావడం మంచిది కాదు. ప్రవీణ్ ఒక్కడికే కులగజ్జి ఉందనుకున్నాను. మీరు కూడా దయచేసి ఇక మీదట కుల ప్రస్థావన తీసుకు రాకండి.

   Delete
  20. ok,I used it as just for stressing the boorjuvaa typfeudalistic mntality,.and somewhat in a lighter vein.

   as far as 'kulagajji' anda s praveen identified i ama lso velama. caste anad hegemony are different..!

   I remember, no offense.i am sportive about such things, thanks!

   Delete
  21. ఈ రోజు ఆంధ్రజ్యొతిలో కంచె ఐలయ్య గారు ఈ రెండు సమస్యల్ని అంటే నిన్నటి మీడియా వ్యవహారాన్నె ఇప్పటి మావోఇష్టుల గురించీ చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు,చదివారా!

   Delete
  22. లేదండీ. లింక్ ఇవ్వగలరా?

   Delete
  23. link for the essay of ailayya gaaru

   http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/SEEMANDHRA/2014/09/26/ArticleHtmls/26092014006006.shtml?Mode=1

   Delete
  24. కొండలరావు గారు, నాకు కుల గజ్జి ఉందనే ముందు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం హైదరాబాద్ కోసం జరిగింది. కులం కోసం సమైక్యవాదులు ఎవరూ కె.సి.ఆర్.ని అభిమానించరు కనుక అతని కులం గురించి ప్రస్తావించొద్దని అన్నాను. అయినా నాకు కుల గజ్జి అంటగడుతూ మీరు వ్యాఖ్యానించారు.

   Delete
  25. ప్రవీణ్ గారు, నేను ఒళ్లు మెదడు దగ్గర పెట్టుకునే కామెంట్లు వ్రాస్తాను. ఏవైనా తింగరి వాదనలు అతిగా వచ్చినప్పుడు కొంచెం సహనం కోల్పోయినా మళ్లీ కోపం తగ్గించుకుంటాను. నేనెవరినీ ఇంతవరకూ కులం పేరుతో వ్యాఖ్యానించలేదు. కులం ఆధారంగా విమర్శలు రివ్యూలు చేయలేదు. చేయను. ఒక్కసారి మాత్రం భట్రాజులా పొగడ్తలు చేయవద్దని ఎవరికో సలహా ఇస్తే మా కులాన్ని అవమానపరుస్తున్నారంటూ ఓ స్టూడెంట్ (అనుకుంటాను) వాదనకు దిగాడు. నిజానికి నాకు భట్రాజు అనేది కులమని తెలీదు. అదే విషయాన్ని అతనికి చెపితే అంగీకరించాడు. దాదాపు అప్పటినుండి భట్రాజు అనే పదాన్ని కూడా వాడడం లేదు. నాకు రాజులను పొగిడే వృత్తి కలిగిన వారే భట్రాజులనుకునేవాడిని తప్ప అప్పటిదాకా అదొక కులమని తెలీదు. మీరు నా గురించే పల్లా అంటే కమ్మ అని తేల్చినట్లు ఓ పోస్టే వ్రాశారు గుర్తుందా? అది ఒళ్లు దూరంగా పెట్టుకుని వ్రాశారా? పల్లా అనే ఇంటిపేరుతో మా వూరిలోనే రెండు కులాలు ఉన్నాయి. ఆ విషయం గురించి నాకు కులపిచ్చి ఉందో లేదో మా వూరు వచ్చి తేల్చి చెప్పమని నేను చాలెంజ్ చేస్తే ఇంతవరకూ మీ దగ్గరనుండి సమాధానం లేదు. మీరు కమ్మ వ్యతిరేకతతఒ దారుణంగా వ్యాఖ్యలు - విశ్లేషణలు చేస్తుంటారు. ఫలానా కులం అంటూ వివిధ కులాలను బట్టి రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. కుల దురభిమానం ఉండడం + ఫలానా కులం పట్ల వ్యతిరేకతో వ్యాఖ్యానించడమూ, వైఖరి కలిగి ఉండడమూ కులగజ్జే అని నా అభిప్రాయం. ఆ లెక్కన మీకు కులగజ్జి ఉందనేదే నా ఆరోపణ. అయినా మీకు కులగజ్జి లేదని అంటే క్షమించాలి.

   Delete
  26. కంచె అయిలయ్య గారి ఆలోచనలు నన్ను కొంచెం భయపెడుతున్నాయి.ఆయన ప్రతిదాన్నీ కులం దృష్టితో చూస్తాదని అందరూ పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ గతంలో ఆయన వేసిన అంచనా లన్నీ నిజమై కనబడుతూ ఆయన లెక్కలు కరెక్టే అనేటందుకు సాక్ష్యాలూ కనబడుతున్నాయి.

   ఆయన టచ్ చేసిన పాయింట్లలో ఇక్కడ మనం నిజమా కాదా అని తేల్చుకోవలసీనవి కొన్ని వున్నాయి.ఏబీయెన్ ఆంధ్రజ్యోతికీ ఘర్షనను పెద్దది చేసిన అంశం కేటీఆర్ మీద జూన్ 18 2013న ప్రజల ముందుంచిన లాండ్ డీల్ కిడ్నాప్ స్టోరీ అంటున్నారు.దాని వివరాలు యేమిటి?యెందుకంటే టాపిక్ ప్రభుత్వం(కేసీఆర్) అప్రజాసామికంగా వ్యవహరించడం గురించి కాబట్టి ఇక్కడి చర్చలో అది కూడా ప్రస్తావనకి రావలని నేను అనుకుంటున్నాను.నలిగింటి శరత్ మీద జరిగిన దాడి గురించి ప్రస్తావించారు,ఆ బీఫ్ పార్టీ గురించి అప్పటి వార్తల్లోనే ప్రముఖంగా రావదం నాకు గుర్తుంది!

   ఆయన వ్యాసంలో చెప్పినట్టు ఈ విషయాలన్నీ విడి విడిగా రాండంగా జరిగినవే అయినా వీటన్న్నింటిలోనూ చిన్నపాటి వ్యతిరేకతని కూడా సహించలేని పెత్తందారీ మనస్తత్వం కనిపించడం లేదా?కొత్తగా రాష్ట్రాన్ని సాధించిన తడబాటుతో గానీ, ఇప్పుడే లోపాలు పట్తేస్తే ఆ లోపాల్ని సాకుగా చూపించి తెలంగాణా ప్రయోగం ఫెయిల్ అయ్యిందని చెడ్డపేరు తీసుకొస్తారనే సాకుతో గానీ చేస్తే అది సమర్ధనీయమేనా?

   Delete
  27. హరిబాబు గారు,

   ఆకుకు, పోకకు అందకుండా వాదించడంలో అయిలయ్యగారు దిట్ట. ఇంకేమీ దొరక్క మీరు ఆయన వ్యాసం పట్టుకొచ్చారన్న మాట! బాగుంది!

   వ్యాసంలో ఆయన ఒక పాయింటు చెప్పాడు, దానికి ఒక ప్రతీక ఇచ్చాడు. ముందు ఆయన ఇచ్చిన ప్రతీకను చూద్దాం. "ఇఫ్తార్ విందులో శరత్ పాడిన పాట విన్న ముస్లిములు, బిజెపి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీలో నిలబెట్టారు. తర్వాత మతోన్మాద శక్తులు శరత్ రూముపై దాడి చేసి తగులబెట్టాయి. దీనికి కారణం మతోన్మాదం ఫ్యూడలిజం కలవడమే." ఇదీ ఆయన ఇచ్చిన ప్రతీక.

   ఆయన చెప్పిన దాంట్లొ క్లియర్‌గా అర్థమౌతుంది, మతోన్మాద ఫ్యూడలిస్టు శక్తులు ఏవో, ఎలా ప్రతీకారం తీర్చుకున్నారో. ఆ శక్తులతో కారంచేడు ఘటనకు కారణమైన శక్తులు కలిసి పక్కరాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గురించి ఐలయ్యగారు ఏం చెప్తారో మరి!

   ఇకపోతే ఆయన అసలు పాయింటు... KTR పై ఆ పత్రిక ఎప్పుడో ఏదో రాసినందువల్లే నని. గత పది సంవత్సరాలల్లో KCR పై గాని ఆయన కుటుంబం పై గాని వ్యక్తిగతంగా దాడి చెయ్యని ఆంధ్రా మీడియా గాని, నాయకులు గాని ఉన్నారా? మీడియాను అడ్డం పెట్టుకొని ప్రపంచంలో ఏ వ్యక్తిపై జరగని వ్యక్తిత్వ హనన కాండ KCR పై జరిగింది. అందులో ఆంధ్రజ్యోతికన్నా కూడా పెద్ద పాత్ర వహించిన పత్రికలు, మీడియా సంస్థలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన ఆరోపణ పేలవంగా వుండి, ఇచ్చిన ఉదాహరణ కూడా అతకలేదు. వ్యాసం మొత్తంలో ఆయన కూడా వ్యక్తిగత దాడి చేయడం మినహా మరేమీ సాధించలేదు.

   Delete
  28. కంచ ఐలయ్యకి తెలంగాణావాదులు, మావోయిస్త్‌లు లాంటివాళ్ళలో మాత్రమే కులగజ్జి కనిపిస్తుంది కానీ సమైక్యవాదులు, పాలకవర్గ పార్తీల నాయకుల్లో అది ఉన్నట్టు అతనికి అనిపించదు.

   Delete
  29. This comment has been removed by the author.

   Delete
  30. @sreekaant chaari
   ఇంకేమీ దొరక్క మీరు ఆయన వ్యాసం పట్టుకొచ్చారన్న మాట! బాగుంది!
   >>
   నాకు వేరే పని లేక దొరికిన కేసీఆర్ వ్యతిరేక సమాచారాన్నంతా ఇక్కద మీముందు విదల్చటం లేదు.గతంలో కూడా అయిలయ్య గారి వ్యాసాలు చదివాను,అప్పుడు తను వేసిన కొన్న్ని అంచనాలు నిజమవటం గురించి చెప్పాడు, అవి వేరే విధంగా జరిగినయ్యనే వాదనతో ఆయనతో విభేదించేవాళ్ళు కూడా వొప్పుకుంటున్నారు.ఒక మనిషి భవిష్యత్తులో ఫలానా సన్నివేశం యెదురు కావచ్చు అని జ్యొతిష్యం లా కాకుండా కొన్ని ఆధారాలు చూపించి చెప్తున్నాడు, అవి జరుగుతున్నాయి అంటే ఆ మనిషి ఆకుకీ పోకకీ అందకుండా మాట్లాడుతున్నట్టా?

   మొన్ననే జై గొట్తిముక్కల నా బ్లాగులో నేనేదో తెలంగాణా మటాష్ అవ్వాలని యెదురు చూస్తున్నట్టుగా కామేంతు వేసారు,ఇప్పుడు మీరు యెక్కద యేది దొరికితే అది కొట్తుకొచ్చి నా దురద తీర్చుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారు.నేనెవర్ని, నెనేమయినా పాలిటిక్స్ లో వున్నానా?నా రాజకీయ జీవితానికి యేమయినా వుపయోగమా?ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక సామాన్యుడిగా తెలంగాణా ప్రజలకి అశుభాన్ని కోరుకోవదం వల్ల నాకేమి వుపయోగం?

   ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాలి,నావైపు నుంచి నేను స్పష్తం చెయ్యదల్చుకున్నది ఒకటే!విభజనకి నేను యెన్నడూ వ్యతిరేకం కాదు.ప్రవీణ్ మాటిమాటికీ "తెలంగాణా ఇక చచ్చినా రాదనుకుని లేఖ ఇచ్చిన చంద్రబాబు" అనే సుత్తిమాటనె అరగదీస్తున్నాడు గానీ తనొక్కడే గాకుండా రాష్ట్రంలోని అన్న్ని పార్టీలూ లేఖలు ఇచ్చినా ఇప్పుడు 2014 యెన్నికల ముందు ఒక నెల రోజుల ముందు వరకూ కాంగ్రెసు ఇవ్వకుండా ఆపి ఒక్క నెలా రెందు నెలల్లో చుట్టి పారేసి ఇవ్వాళ్టికీ పంచాల్సినవి యేవీ దఖలు పడకుండా వుండటానికి కూడా ప్రతీప్క్షంలో వున్న బాబే కారణమా?రహస్యంగా చేసుకున్న విలీనం వొప్పందాన్ని మాటిమాటికీ పబ్లీకున కెలికి వెక్కిరించినా మీకు కాంగ్రెసు మీద కన్నా బాబు మీదనే కోపం రావడానికి మొగుడు కొట్టినందుకు కాదు గానీ సవితి నవ్వినందుకు తిక్కగా వుందన్న బాపతుగా లేదా?

   ఇప్పటికీ విభజన ఇలాగే యెందుకు జరిగిందో దానికి కారణ మేమిటో మీకు అర్ధం కాలేదనే అనుకోవాలా?అన్ని పార్తీల వాళ్ళూ లేఖలు ఇచ్చాక అక్కడా ఇక్క్కడా అధికారంలో వున్న కాంగ్రెసు ఇంత దరిద్రంగా విదగొడితే అది మీకు యెక్కలేదు గానీ బాబు మీదకి మాత్రం వొంటికాలు మీద లేస్తున్నారే, కనీసపు తెలివయినా వుందా మీలో?మళ్ళీ ఈ ప్రశ్నలన్నీ వేసినందుకు నాకు బాబు భక్తిని అంతగడతారేమో, నాకా దురద లేదు, అతన్ని కూడా నాపాటికి నేను అనుమానిస్తూనే వున్నా!

   ఒకప్పుడు భాజపా మూడురాష్ట్ర్రాల్ని విడగొట్టినప్పుడు జరగని రభస ఇప్పుడెందుకు జరిగింది?విభజన వల్ల తెలంగాణాకి యేమాత్రమూ అన్యాయం జరగలేదనీ అంతా బ్రహ్మాండంగా వుందనీ మీరు అనుకుంటున్నారా?ఇన్ని అపార్ధాలకి గురయి నేను మీకు యేది చెప్పినా కొట్తుకొచ్చి కుమ్మరించినట్టుగా వుంటే నేను నా విలువైన టైముని వేస్ట్ చెసుకోవడమే గదా!

   ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఆ వొక్క వ్యక్తీ లేకపోతే చచ్చిపోతాం అనే భావన వొదులుకుని ఆ పార్టీలో గానీ మరో పార్టీలో గానీ యెవదయినా సరే ఈ సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే అనే పట్టింపు వుండాలి.ప్రజా జీవితములో పాటించాల్సిన సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేసీఆర్ మేమి చేసినా రైటే అని సమర్ధిస్తూ అవసరమయితే ఆ సాంప్రదాయల నిర్వచనాలనీ మార్చేద్దామని అనుకుంటున్నారే, యెందుకిలా చేస్తున్నారు?నవ తెలంగాణాలో మీరు కోరుకుంటున్నది ప్రజాస్వామ్యమా, పెత్తందారీ తనమా?

   Delete
  31. హరిబాబు గారు,

   మేం ఎవరిమీదా ఒంటికాలిమీద లేవాల్సిన అవసరం లేదు. కాని ఇక్కడ వస్తున్న కామెంట్లు ఒకసారి చూసుకోండి, అయినదానికీ కానిదానికీ KCRమీద ఎలా రెండు కాళ్ళూ లేపి మరీ దాడి చేస్తున్నారో!

   తెలంగాణాలో తిరగలేని పరిస్థితిలో లేఖ ఇచ్చిన చంద్రబాబూ, ఎన్నికల్లో మొఖం చూపలేని పరిస్థితిలో ఆంధ్రాకు అనుకూలంగా సవాలక్ష కొర్రీలతో విభజించిన కాంగ్రెస్సూ, రెండూ ఒకటే లెండి మా దృష్టిలో! ఆమాత్రం దానికి విలీనమొకటి! అడగడానికి ఆ పార్టీకి సిగ్గెటూ ఉండదు, మీరెందుకు మాటి మాటికి అది లేవనెత్తడం?

   మీరు బాబు భక్తులా కాదా అన్నది మాకు అప్రస్తుతం. అయితే ఆంధ్రలో చానెళ్ళు ఆపితే "అబ్బే మాకు తెలియద"ని తప్పించుకోవడం, తెలంగాణలో ఆపితే వీర శివాలెత్తి తుగ్లక్, నియంత అని సంబోధించడం (మీరు కాదనుకోండి), చంద్రబాబు తన ప్రెస్ మీట్లకు, అసెంబ్లీకి కూడా కొన్ని పత్రికల, చానెళ్ళ వారిని రానివ్వక పోతే చూసి చూడనట్టు ఉండడం ఇవన్నీ వ్యక్తిగత దాడిగా కనిపించడం లేదా? నిస్పాక్షికత లోపించినపుడు తెలంగాణా అస్తిత్వ వాదులమైన మేము సహజంగానే తెలంగాణా పక్షం వహించవలసి వస్తుంది.

   తన తెలంగాణా వ్యతిరేకతతో రాష్ట్రంలో మట్టి కరిచినా, తన జేబు మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని, కిరాయి కుక్కలతో అర్థం పర్థం లేని దాడులు చేయిస్తూ రాజకీయ దాడులకు పాల్పడుతున్న వారు ఒకరైతే వారి తిట్ల దండకాన్ని ప్రతిరోజు చర్చకు పెట్టే వారు మరొకరు. అదంతా చూస్తూ ఊరుకోలేక ఇక్కడికి వచ్చి సమాధానం ఇవ్వల్సి వస్తుందే తప్ప ఇక్కడికి వచ్చి చర్చల్లో పాల్గొనే ఓపికా తీరికా వుండి కాదు. ఇక ముందు ఎవరు ఎంత రెచ్చగొట్టినా రాకూడదనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతచెప్పినా కొందరిని రంజింప చేయలేము కాబట్టి. సెలవ్.


   Delete
 6. All Maoists support Telangana either they live in Andhra or in Telangana. హైదరాబాద్ కోసం వీధి పోరాటాలు చెయ్యకుండా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అని రైలులో పరిచయమైన సమైక్యవాదులకి చెప్పేవాణ్ణి.

  ReplyDelete
  Replies
  1. హైదరాబాద్ కోసం వీధి పోరాటాలు
   >>
   తెలంగాణా కోసం మీరు చేసిన రోడ్దు మీద వంతల తంతులు గొప్పవీ మా అభిప్రాయాల తో మేము చేసినవి వీధి పోరాతాలూ అనదం లోనే తెలుస్తుంది అది అహంకారమో వినయమో?
   >>
   అప్పటి నుంచీ ఇప్పటివారకూ అవే అహంకారపు కూతలు కూస్తూ పైకి మాత్రం మాకు అన్యాయం జరిగింది, మేము చేసింది న్యాయ పోరాతం అని బోడి గొప్పలు?!

   Delete
  2. "తెలంగాణా కోసం మీరు చేసిన రోడ్డు మీద" అని అంటున్నావు, ఆ వంటల కార్యక్రమానికి వెళ్ళి వచ్చినవానితో అన్నట్టు. నేను తెలంగాణలో పుట్టలేదు, రోద్‌లపై వంటలు చెయ్యనూ లేదు. కేవలం హైదరాబాద్ కోసం లేని సమైక్యత ఉన్నట్టు చెప్పుకోవద్దు అని మా ప్రాంతంవాళ్ళకి నేను చెప్పుకున్నాను.

   Delete
  3. హైదరాబాద్ కోసం లేని సమైక్యత ఉన్నట్టు చెప్పుకోవద్దు అని మా ప్రాంతంవాళ్ళకి
   >>
   యే ప్రాంతం వాళ్లకి చెప్పావు?నువ్వే ప్రాంతం వాడివి?నీ ప్రాంతం వాళ్ళు హైదరాబాదు లో వుండి హైదరాబాదు బాగు కోసం శ్రమించ లేదా?అలా శ్రమిస్తే తెలంగాణాలో వుంది కాబట్టి ఆదాయం కూడా మాదే అని ఒక్క నయాపైసా అయినా ఇవ్వకుండా తరిమెయ్యదం నీకు న్యయమే అనిపించిందా?

   Delete
  4. తెలంగాణా లో పుట్టలేదు?!
   వామ్మో, అంటే ఆంధ్రాకి చెందుతావా?వోరి నాయనోయ్, మా ఆంధ్రాకి యెంత కష్టం వొచ్చి పడింది రోయ్?!

   బాబ్బాబు, అర్జెంటుగా తెలంగాణా వాడివై పోమ్మా!అట్లా వెళ్ళేటట్లయితే నీకు మంచి గిఫ్టు ఇస్తాగా?!

   Delete
  5. I have been in the Telugu blogosphere for 6 years. Ask any Telugu blogger "From which region does Praveen hail?"

   Delete
  6. then please go anad live ina muslim country or in america, Please Please Please, i will give a very very precious gift!Three wives with good income, even your pinnamaa, attaayyaa including.no need of any worries,happy life both for you anad us.

   Delete
  7. Telugu blogosphere
   oh my GOD?
   Why I came to blogging!There is no NISHKRITI for my PAAPAAMS.

   Delete
 7. ఉధ్యమ కాలం లో చెప్పింది ఉధ్యమంతో తెలంగాణ సాదింటంకోసం. ఇప్పుడు చెపుతున్నది సాదించింది సొంతానికి పెట్టుకోవడం కోసం!

  ReplyDelete
  Replies
  1. కె.సి.ఆర్. నిజంగా మావోయిస్త్ అయితే రియాజ్‌ని చంపించినట్టుగానే కె.సి.ఆర్.ని కూడా రాజశేఖరరెడ్డి చంపించేవాడు. కె.సి.ఆర్. నిజంగా మావోయిస్త్ కాదనడానికి ఈ ఒక్క ఋజువు చాలు.

   Delete
  2. వీళ్ళని చూస్తోంటే ఒక జోక్ గుర్తొస్తోంది. ఇందిరా గాంధీ కూడా కమ్యూనిస్తే అని ఒకడన్న్నాడు. నీకెలా తెలుసు అని ఇంకొకడడిగితే, ఆమె కూడా దెంగ్ సియావోపింగ్‌లాగ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చెయ్యించింది కనుక ఆమె కమ్యూనిస్తే అన్నాడట! మావోయిజం అంటే ఏమిటో తెలియని కె.సి.ఆర్‌ని మావోయిస్త్ అనడం కూడా అలాంటి జోకే.

   Delete
  3. మావోయిజం అంటే ఏమిటో తెలియని కె.సి.ఆర్‌ని మావోయిస్త్ అనడం కూడా అలాంటి జోకే.
   LOL
   అలా యెందుకనుకుంటున్నరు నయ్నా?తనె చెప్పుకున్న కేసీఆర్ యేమైతడు?యెవుని మీద జోకెయ్యబోయి యెవుని మీద యేస్తున్నవు!నీ జోకు పోయి కేసీఆరు కే తగులుద్ది మరి,
   LOL

   Delete
  4. Maoists had been supporting Telangana statehood for more than 40 years. Why are Samaikyavadis not happy with KCR's tyranny against Maoists?

   Delete
  5. who told you that we are not happy with KCR's tyranny against Maoists?
   beacuase both are same for us

   if KCR beats MAVOISTS
   very happy
   if MAVOISTS beats KCR
   very happy

   Therea are no Samaikyavadis now?Are you still living in your own past!

   we andhras arae very happy about partition.
   HIP HIP HURRAY!!

   Delete
  6. Maoists had been supporting Telangana statehood for more than 40 years
   HE IS TRYING TO SUPPRESS THEM
   it is telangaaNaa peoles problem, whether to support whom anad curse whom.
   We only can pass just outsider views. That's all, What more is there for us to Vail about it?

   Delete
 8. Replies
  1. మావోఇష్టులకు యెన్నికల్లో పోటీ చేస్తున్న కమ్యునిష్తు లంతేనే ఆదరణా, సానుభూతీ లేవు.ఈ రివిజనిష్తులు కూడా మన శత్రువులే అంతున్నారు.ఇక KCR మీద యెందుకు అభిమానం,సానుభూతి వుంటాయి?

   Delete
  2. కేసీఆర్ సమర్ధంగా పరిపాలించి మంచి పేరు తెచ్చుకుంటే వాళ్లకి బలం పెంచుకోవదానికి అవకాశం యెలా వస్తుంది?పోరాటం అని వాళ్ళు అంతున్నప్పుడు శత్రువు బలహీనంగా వున్నప్పుడే కొట్టాలి అనేది వాళ్ళ వ్యూహం కావచ్చు గదా!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top