Reactions:

Post a Comment

 1. ఒక సిధ్ధాంతం యొక్క విలువ అది ప్రబోధించే సత్యస్వరూపం పైన ఆధారపడి ఉంటుంది, సమాజానికి హితకారిగా.
  ఒక సిధ్ధాంతం యొక్క ఆచరణ అనేది ఆచరించే సమాజం యొక్క పరిస్థితిపైన ఆధారపడి ఉంటుంది.

  ఏ సిధ్ధాంతమూ సమాజాన్ని చెడగొట్తటంకోసం ప్రబోధించబడదు. కాని సమాజం ద్వాన్ని సరిగా స్వీకరించలేకపోయినా, ఆచరించటంలో అలసత్వం చూపినా దానికి సిధ్ధాంతం కాక సమాజమే బాధ్యత వహించాలి.

  అహింసా పరమోధర్మః అనేది త్రికాలాబాధ్యమైన గొప్పసిధ్దాంతం. దాన్ని ఆచరించలేని, కనీసం సరిగా అవగాహన చేసుకోలేని స్థితిలో సమాజం ఉంటే దానికి విచారించటం తప్ప సిధ్ధాంతాన్ని ప్రశ్నించలేము.

  ReplyDelete
  Replies
  1. హింసను హింసతో రూపుమాపితే అహింసను కాపాడినట్లు కాదా సర్. రాక్షస సంహారం లోకకళ్యాణానికే అయితే అవసరమైనప్పుడు హింస సరయినదే కదా?

   Delete
 2. ఏ ధర్మం బి.సి కాలం లో కేవలం హిందువులు బౌద్ధులు ఉన్నప్పటిది.
  టెర్రరిసటు ల మతం పుట్టనప్పటిది....
  ఇప్పుడంతా జైసె కో తైసా కాలం .... కనుక హింస కి హింస నే సమాధానం కావాలి.

  ReplyDelete
 3. "అహింస పరమ ధర్మం" అదే నిజమైతే ప్రతి పుట్టుకా హింసే! ప్రతి జీవీ తల్లిని హింసించే పుడుతోంది... అలాంటప్పుడు ఇక దీనిమీద వ్యాఖ్యానించడానికి అయోనిజులు తప్ప ఎవరూ సరిపోరుగా..... ఈ ధర్మ సూక్ష్మ ఉద్దేశ్యం అది కాదు.

  అహింస అంటే ఏదో ముందు తెలుసుకోవాలి, తనకి కానిదానిని, తన అవసరానికన్నా ఎక్కువ సంగ్రహించడాన్ని, ఆ క్రమంలో కలిపింపబడే ఖేదమే హింస. హింస అంటే ఎక్కడో ఎవరినో రాళ్లతోటో, కత్తితోటో తుపాకులు, బాంబులు ఇత్యాది మారణాయుధాలతోటో చేసేదే కాదు. నిజానికి "అహింస పరమ ధర్మం" అనే దాన్ని ఎంత అపహాస్యంగా ఎంత వెకిలిగా తేలికగా తీసుకున్నారో అంత కన్నా ఎక్కువగా అనవసర వ్యాఖ్యలతోటీ దాని అర్థం మార్చారు. అవతలవారికి ఎటువంటి బాధ కలిగింపబడ్డా అది హింసే అని నిర్థారించేశారు అవైదిక మత వర్తకులు . శాస్త్రం (వేదం) చెప్పిన విధంగా ఏది ఎంతవరకు ఎలా వాడాలో అంతవరకు వాడితే ఏదీ అహింస కాదు. అవసరానికన్నా ఎక్కువ వాడినా, తక్కువ వాడినా హింసే, అందుకే మనకి కుశాగ్ర బుద్ధి అనే ఒక మాట ఉన్నది. పూర్వం పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు ముందు దర్భలు ఏరడం నేర్పేవారు. వాటిని ఎంతవరకు కోయాలో అంత వరకే కోయాలి తప్ప సాంతం వేర్లతో సహా పైకి లాగకూడదు. ధర్మ చట్రంలో ఉండి శాస్త్రానువర్తిగా చేసేదేదీ హింస కాదు. ఉదాహరణకు నేను సంపాదించిన దాంట్లో నాకు నా భార్యకు పోషణకి ఎంతవాడాలో అంత వాడి నా పిల్లల ఉత్తరోత్తరావసరాలకు ఎంత ఉంటే వారి సాధారణ జీవనానికి సరిపోతుందని లెక్కకట్టి అంత ఆ వేపుగా ఖర్చు చేయాలి. పిల్లలకోసం ఎక్కువ దాచి నేను నా భార్య పోషణలో కోత పెట్టినా అది ఈ శరీరాన్ని హింసించిన లెక్కలోకొస్తుంది, అలా అని అంతా మాకోసమే ఖర్చు చేసుకొని అనవసర సుఖాలకు ఖర్చులు పెడితే.. భావితరాలకు చెందవలసిన సంపాదనలో కొంత చోరత్వం చేసి హింసించిన లెక్కలోకొస్తుంది. కాబట్టి ఏది హింస ఏది అహింస అనేది శాస్త్ర సమ్మతమైన స్మృతుల ద్వారా తెలుసుకొని ఆచరించాలి గానీ, ఎవరో ఏదో మతానువర్తకుడు చెప్పాడని కాదు, అయోనిజులైన మతానువర్తులెవరైనా అలా చెప్తే చూడవచ్చు.

  ఒకవేళ అదే నిజమైతే, సాధువులు వారి రక్షకులు ఎప్పుడో నశించి ప్రపంచమంతా రావణ నరకాసుర భండాసుర, శిశుపాలాదులతో నిండిపోయుండేది.

  ReplyDelete
 4. అహింసా యుత పోరాటం(గాంధీ మార్కు) సఫలీకృతం కావాలంటే అవతలి వ్యక్తిలో యెంతో కొంత మంచితనం - తను చేస్తున్నది తప్పు అని తెలిసిన గిల్ట్ ఫీలింగ్ - వుండాలి. కానీ అన్నీ తెలిసి దుర్మార్గం చేస్తున్న వ్యక్తిలో పశ్చాత్తాపం వస్తుందని మనం యెలా నమ్మగలం?మీరు ప్రస్తావిస్తున్నది గాంధీ మార్కు అహింసావాదం గురించే అయితే అది గాంధీ కాలంలోనే పూర్తిగా ఫెయిలయింది!ఈ కాలానికీ ముందు కాలానికీ అస్సలు పనికి రాదు!!

  ReplyDelete
  Replies
  1. నేనడిగినది గాంధీ మార్కు అహింస ధర్మం గురించేనండీ. మీరు చెప్పినదాంతో కూడా ఏకీభవిస్తున్నాను.

   Delete
  2. పైన ఈ అహింసా పరమో ధర్మః అనేది బౌధ్ధ సూక్తి అని చెప్పారు.అదే బౌధ్ధ్ మత గ్రంధాలలో వున్నదో మరి ఆ సూత్రాన్ని యెట్లా అర్ధం చేసుకోవాలి అనే లక్షంతో వేరేవాళ్ళు రాఇనదో గానీ చందమాంలో అనుకుంటాను ఒక కధ చదివాను.

   ఈ అహింసని బోధించే గురువు గారి శిష్యు లిద్దరు అడివిలో వెళ్తుండగా ఒక చోట దొంగలు భీబత్సం చేస్తుంతే చూసారు.ఇద్దర్లో ఒకడు యంటీవొడిలా ఫైటింగు చేసేసి అందులో ఒక ఆడ మనిషి వుంటే క్షేమంగా వుండే చోటికి యెత్తి కుదేసి ఇరగ దీశేశాడు!ఆశ్రమం చేరాక బుడ్డి మంతుదయిన రెండో శిష్యుడు ఈ అప్రాచ్చ్యపు పనులన్నింటినీ యేకరువు పెట్టగా విని గురువు గారు, "నీకన్నా వాడే నిజమయిన అహింసా వాది రా నాయనా.అక్కడ వున్నది ఆదమనిషి అనే స్త్రీ పురుష భేదాన్ని నువ్వు చూసావు గానీ వాడికి ఆపదలో వున్న మనిషిలా కనబడింది.దొంగలనే వాళ్ళు వేఅరే వాళ్ళని కొడుతుంటే అడ్దుకోవతానికి కొట్టటాన్ని హింస అని నీలాగే వాడూ అనుకుని వుంటే అక్కడ అమాయకులు బాధ పడే వాళ్ళు." అని కళ్ళు తెరిపించాడు.

   నీతి:షావొలిన్ తెంపుల్ అనేదాన్ని ఒకదాన్ని పుట్టించి పోరాత కలని ప్రపంచవ్యాప్తం చేసింది బౌధ్ధ సన్యాసులే గదా!అహింస అనేది ఒక లక్ష్యం.సాధనం యెలాగయిన వుండొచ్చు.

   Delete
 5. అహింస హింసకు ఎప్పుడూ సమాధానం కాజాలదు. ఉదాహరణకు అహింసా ధర్మాన్ని పాటించే వాడిపై వేరొకడు దాడి చేసినపుడు మొదటివాడు తన ప్రాణాన్నైనా అర్పించాలి లేదా తానుకూడా అహింసా మార్గాన్ని వదిలి హింసా మార్గాన్ని ఆశ్రయించాలి. రెండు విధాలుగానూ అహింస గెలవలేక పోయింది గదా?

  నిజంగా శాంతి అహింసలను నెలకొల్పాలంటే హింసకు సర్వ సన్నద్ధంగా ఉండడమే సరైన మార్గం. శత్రుదేశం దగ్గర అణ్వస్త్రం వుంటే మనదగ్గర కూడా అది ఉంటేనే శాంతి స్థాపన జరుగుతుంది. అంతే కాని అది వున్నవాడి దయా దాక్షిణ్యాలపై ఆధారపడితేనో లేక వాడికి అహింసా పద్ధతులపై సూక్తులు చెప్పడం వల్లనో కాదు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top