• ఈ వివాదంలో కే.సీ.ఆర్ ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయా?
 • చంద్రబాబు ఒత్తిడిమేరకు ఎల్ ఎండ్ టీ సంస్థ కావాలనే తెలంగాణా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నదన్న ఆరోపణలలో వాస్తవాలున్నాయా?
Reactions:

Post a Comment

 1. వేరే వాళ్ళు చేస్తున్న గొడవ కన్నా ముందు రూటు మార్చాలని పనులు ఆపమని అన్నదే తను కదా?మధ్యలో రూటు మార్చడం కుదరదని వాళ్ళు చెప్పారు, అయితే కొంతకాలం పనులు ఆపి కుదురుతుందేమో చూదందని అన్నదీ తనే గదా!
  అవన్నీ అబధ్ధాలు అయితే అప్పుదు యెదటి వాళ్ళని విమర్శించటం బాగుంటుంది.రూటు మార్చాలని తను అన్నదానికి కూడా చంద్రబాబు కుట్రే కారణమా?

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబు పాత్ర ఉందని అక్కడ రాజధాని నిర్మాణం కాంట్రాక్టులు ఎల్.ఎండ్.టీ కి ఇస్తారనీ అందుకు గాను ఇక్కడ మెట్రో రైలును ఆపాలని అతను ఒత్తిడి తెస్తున్నట్లు సాక్షి చానల్ లో చూశాను. వాస్తవాలు ఏమిటో పరిశీలించాల్సి ఉన్నది. రేవంత్ రెడ్డి తనదగ్గర ఆధారాలున్నాయంటున్నాడు. అవేమిటో బయటబెడితే చెప్పొచ్చు. కే.సీ.ఆర్ ఏం? బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? మీరు కడతారో లేదో తేల్చుకోమని వార్నింగ్ ఇచ్చాకనే ఎల్ ఎండ్ టీ వారు దారిలోకి వచ్చారనీ చెప్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. వాస్తవాలు బయటకు రావలసి ఉన్నది. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణా పునర్నిర్మాణంలో ఇది కీలక అంశం.

   Delete
  2. అయ్యా కొండలరావుగారు, ఈ సాక్షి ఛానెల్ వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా తప్ప మరే విధంగాను వ్రాయలేరు కదా, అటువంటప్పుడు అక్కడ అలా కాక మరొకలా వార్త అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఈ రోజున ఫలానా మీడియాలో చూసాను అంటే, అదే మీడియా ఐనా సరే, విశ్వసనీయత అస్పష్టమే అని అని మననం చేసుకోక తప్పని పరిస్థితి. రాజకీయాలమీద పూర్తిగా విరక్తి కలిగి వార్తలను గమనించటమే దాదాపు మానివేసాను.

   Delete
  3. "హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉన్నది"

   మెట్రో ప్రాజెక్టు మధ్యలో గతంలో ఒకసారి ఆగిపోయింది. అప్పుడు పోని ఇమేజ్ ఇప్పుడు జరిగినా పోదు లెండి. ఇకపోతే వారసత్వ సంపదను నాశనం చేసి పెంచే ఇమేజ్ ఎందుకు అనే ప్రశ్న కూడా ఆలోచించండి.

   "సాక్షి ఛానెల్ వారు చంద్రబాబుకు వ్యతిరేకంగా తప్ప మరే విధంగాను వ్రాయలేరు"

   సాక్షి పేరు బదులు ఆంధ్రజ్యోతి, చంద్రబాబు బదులు కెసిఆర్ రాసినా వ్యాఖ్య సరిపోతుంది. రెంటికీ పెద్ద ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం.

   Delete
  4. అప్పటి హైదరాబా ఇప్పటి హైదరాబాద్ అని నేను ప్రత్యేకంగా చూడడం లేదు. ఎప్పుడైనా హైదరాబాద్ ఇమేజికి దెబ్బేనండీ. ఇప్పుడైతే మరింత జాగ్రత్తగా అడుగులువేయాలనేది బాధ్యతగా ఆలోచించేవారు బాధ్యతగా తీసుకోవలసిన మంచి మాట.బ్రాండ్ ఇమేజిని కాపాడతామని కే.సీ.ఆర్ కూడా చెప్తున్నారు.

   Delete
 2. Replies
  1. పరిస్తితి అక్కడి దాకా వస్తే 17 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబడుతున్న మెట్రోను తెలంగాణా ప్రభుత్వం స్వయంగా నిర్మించటం అంత కష్టమేమి కాదు. ఆ పదిహేడు వేల కోట్లు ఇప్పటికి ఇప్పుడే అవసరం లేదు, ప్రాజెక్టు పూర్తీ కావటానికి అయిదారేళ్ళు పడుతుంది, ఆలోగ మరిన్ని చిన్న చిన్న భాగ స్వామ్యాలను కలుపుకొని కూడా సమకూర్చుకోవచ్చు. ముందు ముందు ఐటిఐఆర్ లాంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. నష్టపోయేది ఎల్ అండ్ టి నే.

   Delete
  2. ఈ వార్త నిజమైతే కార్పొరేట్ సక్తులకు తలొగ్గని సీ.ఎం ల జాబితాలో మరో మొనగాడు వచ్చినట్లే.

   Delete
 3. ఎల్ ఎండ్ టీ కూడా మధ్యలో ఒక ప్రాజెక్త్ అగిపోయినా లేదా పూర్తి చెయ్యకుండా ముగించెయ్యల్సి వచ్చినా తన మాన్ పవర్ కీ నష్టమూ ఇమేజి దృష్ట్యా అవమానమే కాబట్టి లొంగి రావచ్చు.రావాలి!

  ReplyDelete
  Replies
  1. Not just image, they run the risk of being black listed.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. అసలు అప్పుడు జరిగింది ప్రాచీన కట్టడాలు దెబ్బతింటాయనే అభ్యంతరమూ అందర్ గ్రవుండ్ కన్స్ట్రక్షన్స్ గురించి అదగటం వల్లనే కదా ఆగింది?కాదా!వ్యాఖ్యలని తీసేస్తే అప్పటి వార్తల్లో వున్నది అదే కదా?దానికి కూడా చంద్రబాబే కారణం యెలా అవుతాడు?

   చిన్న చిన్న పన్లకే యెంతో ముందు నుంచీ మాన్ పవర్నీ అరేంజ్మెంట్లనీ ముందు నుంచే ప్లాన చేసుకుంటారు, పెద్ద యెత్తున చేసే పన్లలో హఠాత్తుగా మార్పులు చెయ్యాలంటే ఇబ్బంది కాదా?ఆ ఇబ్బంది వల్ల కూడా వాళ్ళు పన్లు ఆపి వుండొచ్చునేమో? మేము చేసే వెబ్ డెజైనింగుల్లోనే 20 రోజులు పూర్తయ్యి ఇంకో 10 రోజుల్లో పూర్తవుతుందనగా క్లయింటు మార్పులు చేస్తే విసుక్కుంతూ వుంటాం! క్లయింటు మెత్తని వాదయితే మా ఇబ్బందిని మా కంపెనీయే వాళ్ళకి చెప్పి కుదరదనటం, కాదు అలాగే చెయ్యలని క్లయింటు గట్టిగా అంటే మరో 5 రోజులు యెక్కువ తీసుకుని చెయ్యటం జరుగుతుందే, మరిప్పుడు అక్టోబర్2 కల్లానో నవంబర్2 కల్లానో పూర్తి చెయ్యాలి అంటున్నారు!ఈ ఆఖరి దశలో మార్పులు చెయ్యాలంటే కష్తం కాదా?ఇలాంటి వాటికి కూడా చంద్రబాబే కారణం యెలా అవుతాడు?!

   ఇప్పుడయినా మార్పులు వుంటాయా? లేక పాత ప్లాను ప్రకారమే పూర్తి చేస్తున్నారా?

   Delete
 4. ఈ నెలా రెందు నెలల్లో ప్లాను మార్చి మొదటి నుంచీ యెత్తుకోవదం సంభవమేనా?పాత ప్లాను ప్రకారమే పూర్తి చెయ్యటం నిజమయితే కేసీఆరే యెల్ అండ్ టీ కి లొంగినట్టు కదా!

  ReplyDelete
  Replies
  1. మొత్తం ఆరు దశల్లో మొదటి దస కి సంబంధించిన 3 లిన్లు పూర్తవుతాయా?ఈ చరిత్రక ప్రాధాన్యం వున్న భవనాలని కూల్చకుండా మరో యేర్పాటు - దారి మళ్ళించదం గానీ అందర్ గ్రవుంద్ కన్స్ట్రక్షన్స్ గానీ - చెయ్యొచ్చు ననుకుంటాను. అయితే మంచిదే.

   Delete
  2. నాకు తెలిసినంత వరకు చారిత్రిక కట్టడాలు ఉన్నది 5, 6 స్టేజీల్లో. ఐదో దాంట్లో సుల్తాన్ బజార్, ఆరో దాంట్లో అసెంబ్లీ.

   Delete
  3. ఆ రోజు వార్త చూదటమే, తర్వాత మళ్ళీ ఇప్పుదు ఈ చర్చ లో తప్ప శ్రధ్ధగా ఫాలో అవ్వలేదు!సమాచారం కూడా మీరిచ్చిన లింకు మాత్రమే చూశాను.వీలున్నంత వరకూ వాటిని తప్పించటమే మంచిది కుదిరేటట్లు వుంటే..

   Delete
 5. చిన్న చిన్న పన్లకే యెంతో ముందు నుంచీ మాన్ పవర్నీ అరేంజ్మెంట్లనీ ముందు నుంచే ప్లాన చేసుకుంటారు, పెద్ద యెత్తున చేసే పన్లలో హఠాత్తుగా మార్పులు చెయ్యాలంటే ఇబ్బంది కాదా?

  మీకు తెలియనిది కాదు, చిన్న చిన్న ప్రజేక్టులకే మనం అన్ని ప్లాన్ చేసుకొని ఉంటాం. చివరికి వర్క్ ప్రొడక్షన్ కి వెళ్ళాకా ఫెయిల్ అయితే 'ఎగ్జిట్ ప్లాన్' ఏంటి అనేది కూడా ఆలోచించుకొని ఉంటాము.

  అలాంటిది, వేల కోట్ల ప్రాజెక్టులు చేసే ఎల్ అండ్ టి లాంటి వరల్డ్ క్లాస్ కంపిని ఇటువంటి అవాంతరాలను వారి ప్లానింగ్ లో ఊహించలేదు అనేది నమ్మ శక్యం కాదు. వారి వద్ద బడా బడా ప్లానర్స్ ఉంటారు. బాగులో కబుర్లు పెట్టుకుంటున్న మనకే ఇన్ని విషయాలు తెలిస్తే ఇవన్ని వారికి తెలియదు అని అనుకోలేము. ఇలాంటి సమస్యలు ఎదురైతే ఏమి చేద్దాం అనేది ఖచ్చితంగా చాలా ముందుగానే ఆలోచించి ఉంటారు.

  చిన్న పిల్ల వానికి కూడా తెలిసినవి, ఆ సంస్థకు తెలియని(ఆ లేఖలో వారు చెప్పుకున్నట్లు) కొన్ని విషయాలు

  1. ట్రాక్ రూట్ మార్పు => ప్రభుత్వాలు మారితే అలా జరగటానికి ఆస్కారాలు ఉన్నవి, లేదా అకస్మాత్తుగా ప్రజా వ్యేతిరేకత హెచ్చు మిరితే (సుల్తాన్ బజార్) కూడా రూటు మారవోచ్చు. ప్రాజెక్టు మొదటి నుండి తెరాసా వారు పాత రూట్ ను వఎతిరేకిస్తూనే ఉన్నారు. ఏది ఏమైయినను ఈ పాయింటు పట్టుకొని వారికి వారు ప్రాజెక్టు నుండి వైదొలిగే అవకాశం/హక్కు వారికి ఉండొచ్చు.

  2. రాష్ట్ర విభజన => జరగదేమో అని వారు అనుకోని ఉండొచ్చు, కాని జరిగితే ఎలా అనేది కనీసం ఆలోచించి ఉంటారు కదా? ఈ పాయింటు పట్టుకొని ప్రాజెక్టు నుండి వైదొలగలేరు. మెట్రో ఒప్పందం జరిగినప్పుడు రాష్ట్రం ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది అని వారికి ప్రభుత్వాలు హామీ ఇవ్వలేదు కదా.

  3. రాష్ట్ర విభజన వలన మెట్రో లాభ దాయకం కాదు => పై పాయింటు ప్రకారం వారు ఈ కారణం చే కూడా ప్రాజెక్టు నుండి వైదోలగలేరు.

  4. ప్రభుత్వం భూసేకరణ చేసి సకాలంలో మాకు ఇవ్వటం లేదు. ప్రాజెక్టు జాప్యం కావటం వలన ఖర్చు పెరుగుతుంది => ఈ కారణం కూడా అంత ఆమోదయోగ్యంగా లేదు. ఎందుకంటే తెలంగాణా ప్రభుత్వం ఏర్పడి కేవలం మూడు నెలలే అయ్యింది. ప్రభుత్వ కాంట్రాక్టు లలో ఇలా జాప్యం కావటం అనేది అతి సాధారణ విషయం, ఎన్నో ప్రాజెక్టులు చేసిన ఈ కంపినికి ఆ విషయం తెలియదు అనేది నమ్మసక్యంగా లేదు. మరియు నిజంగా అదే కారణం అయితే కనీసం రెండు మూడు వార్నింగ్ లెటర్ లు అయినా ఇదివరకు పంపి ఉండవలసింది. అలాంటిది లేకుండా చెప్పటం చెప్పటమే మేం ప్రాజెక్టు నుండి వైదొలుగుతాం అనటం వెనుకా వారికి ఇంకేవో ఉద్దేశాలు ఉన్నట్లు కనబడుతుంది.

  5. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంది అనుకున్నాం => హైదరాబాదు అలా అయితే/కాకపొతే ఇక్కడ వీరికి వచ్చే తేడా ఏమిటో నాకు అర్థం కాలేదు, ఎవరికైనా ఏమైనా అర్థం అయితే నాతొ పంచుకోగలరు.

  6. గత ఎనిమిది నెలలుగా ఉత్తరాలు రాస్తున్నాము => తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయ్యింది. అంతకు ముందు జరిగినవి అన్ని సమీక్షించి యుద్ద ప్రాతిపదికన ప్రభుత్వాలు వీరికి సమస్యలు తీరుస్తాయి అని ఒక ప్రైవేటు కంపిని ఆశించటం అత్యాశే.

  నాకు అర్థం అయినంత వరకు, ఇలా లేఖ రాసి తెలంగాణా ప్రభుత్వం దగ్గర ఎంతో కొంత బెనిఫిట్ తీసుకుందాం అని ప్లాన్ వేసినట్లున్నారు. కాని లేఖ బయటకు లీక్ కావటంతో వారి ప్రయత్నం బెడిసి కొట్టింది. ఒక వేల ఈ లేఖ వారే లీక్ చేసి ఉంటె, వారికి వారే భారిగా నష్టం చేసుకున్నారు అని నా అభిప్రాయం. వారే లీక్ చేసింది నిజమైతే ఇకపై ప్రాజెక్టు కొనసాగినా కూడా ప్రభుత్వం వారితో ఖటినంగా వ్యవహరిస్తుంది. కింది వార్త నిజమైతే ఇది ఆ సంస్థకు దెబ్బే.
  http://telugu.oneindia.in/news/andhra-pradesh/telangana-cm-kcr-sees-metro-chief-play-politics-143712.html

  ఈ లేఖను లీక్ చేసిన వారు ఆకాశ రామన్న టైపులో అన్ని పత్రికలకు ఒక కాపి పంపొచ్చు. కాని కేవలం "ఆ రెండు పత్రికలకు మాత్రమె" ఈ లేఖ లీక్ అవ్వటం అనేది ఆలోచించదగ్గ విషయం.

  ఇక మీడియా గురించి. భాద్యతగల మీడియా అయితే ఇలాంటి విషయాలు ప్రచురించే ముందు ఆ ప్రైవేటు సంస్థ లేదా ప్రభుత్వ అభిప్రాయాలు తెలుసుకొని ఉండాల్సింది. ఎందుకంటే, ఒక వేల ఈ లేఖ ఎవరో సృష్టించినది అయితే దీని వలన ఏర్పడే వాతావరణం వలన ప్రాజెక్టు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టు పై ఆధారపడిన వేల మంది ఉద్యోగులు విధిన పడే అవకాశం ఉంది. మరొక సంస్థ ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినను, ఆ విధిన పడ్డ ఉద్యోగులనే తిరిగి తీసుకోకపోవచ్చు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top