సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఎత్తుగడల్లో  భాగం గా గత 25 ఏళ్లలో కుదుర్చుకున్న రాజకీయపొత్తుల వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా అనే అంశాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్)- సీపీఎం లోతుగా సమీక్షిస్తోంది. ఈ పొత్తులతో పార్టీ ఎందుకు పుంజుకోలేకపోయిం ది ?, నష్టమెలా  జరిగిందన్న అంశంపై మేధోమథనం సాగిస్తోంది. బూర్జువా పార్టీలపొత్తులతో సీపీఎం క్రమంగా బలహీనపడడం, ఓటింగ్‌శాతం తగ్గిపోవడం, కేడర్ దూరం కావడంపై అంతర్గత చర్చ సాగుతోంది. అనంతరం ఒక డాక్యుమెంట్‌ను రూపొందించుకుని పార్టీ మహా సభల్లో దీనిని  ఆమోదించనుంది.
భవిష్యత్‌లో అనుసరించాల్సిన విధానానికి కూడా పార్టీ తుది రూపాన్ని ఇవ్వనుంది. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపై దృష్టిపెట్టి, సామాజిక ఉద్యమాల్లో భాగం కావాలని భావిస్తోంది. ఆయా సమస్యలపై ఇప్పటికే పనిచేస్తున్న స్వతంత్ర ప్రజాసంఘాలు, కులసంఘాలతో పనిచేయడం ద్వారా అనుకున్న ఫలితాలను సాధించవచ్చుననే అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉంది. మిగతా కమ్యూనిస్టుపార్టీలతో ఐక్యత, ముఖ్యమైన సమస్యలు, అంశాలపై ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించనుంది.
 జనవరి 26 నుంచి తొలి రాష్ట్ర మహాసభలు
 వచ్చే జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు సీపీఎం తెలంగాణ తొలి రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి,  సంప్రదాయా లపై సమావేశాలు నిర్వహించనుంది. కుటుంబా లు, మహిళలు, సినిమాలు, ఇంటర్నెట్, ఆచారాలు, సూక్తులు, ప్రజాసంస్కృతితో ముడిపడినఅంశాలపై చర్చించనున్నట్టు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పదిజిల్లాల్లో విస్తృతపరిశీలన జరిపి ఒక విధానం రూపొందిస్తామన్నారు. హైదరాబాద్‌లోని కొత్తపేట్ బాబూ జగ్జీవన్‌రాం సంక్షేమభవన్‌లో మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు.

(from sakshi daily )

Reactions:

Post a Comment

 1. ఆంధ్రాలో ఎవరూ వోత్ వెయ్యని జై సమైక్యాంధ్ర పార్తీతో పొత్తు పెట్టుకోవడం CPM చేసిన అత్యంత తెలివితక్కువ పని కాదా?

  ReplyDelete
  Replies
  1. తెలంగాణాలో బాగా ఓట్లువేసిన TRSతోనూ, జగన్ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి ప్రజలు ఆశించినవైధంగా ఓట్లు రాల్చలేదు.

   కమ్యూనిస్టులు తెలంగాణావాదం సమైక్యవాదం అంటూ పిచ్చిగా పదే పదే దానినిగురించే ఆలోచించరు. ఆ సమస్యపట్ల ఓ వైఖరిని మాత్రమే కలిగి ఉంటారు. పొత్తులనేవి దేశవ్యాపిత పాలసీగా ఉండాలి.

   సీ.పీ.ఎం పొత్తులు ప్రజలు అసహ్యించుకునేలా ఉండడం వల్లనే ఆ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఓ వైపు సుందరయ్య మరోవైపు జగన్ బొమ్మలు పెట్టి ప్రచారం చేస్తుంటే జనం సిగ్గు పడుతున్నారని సీ.పీ.ఐ నారాయణ అంటే , దేశవ్యాపితంగా కాంగ్రెస్ ని వ్యతిరేకించిన సీ.పీ.ఐ కేవలం తెలంగాణా సెంటిమెంటుని అడ్డంపెట్టుకుని ఓట్లకొసం ప్రయత్నించిందని సీ.పీ.ఎం వారన్నారు. కానీ ప్రజలు ఈ రెండింటినీ అసహ్యించుకుంటున్నారని వారు గుర్తించరు. కావాలంటే ఈ వదనలపై తమ నిర్ణయమెంత పవిత్రమైనదో తెలుపుతూ వందల వ్యాసాలు వ్రాయగలరు తప్ప ఆత్మ విమర్శ పొరపాటున చేసుకోరు.

   ఆంధ్రాలో పనికి రాని జగన్ తెలంగాణాలో అదీ అంతటాగాక ఖమ్మం జిల్లాలో ఎలా పనికివచ్చాడో వారే చెప్పాలి. ఓ వైపు జగన్‌తో మరో వైపు కే.సీ.ఆర్ తో పొత్తు పెట్టుకోవడం ఆంధ్రాలో ప్రజలనాడికి అందని జై సమైక్యాంధ్రా పార్టీతో పొత్తు పెట్టుకోవడం కేవలం ఓట్లకోసమాడిన డ్రామాలా ఉంది తప్ప బాధ్యతగా వ్యవహరించినట్లు లేదు.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. కమ్యునిష్తులు చారిత్రక తప్పిదాల స్పెషలిష్టులు!గతి తార్కిక బౌతికవాదం నిజంగా అర్ధమయితే అన్ని తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదు, అయినా మళ్ళీ మళ్ళీ అంత తేలివితక్కువ పనులు యెందుకు చేస్తున్నారు?వారు నిన్నటి రోజున చేసిన చారిత్రక తప్పిదాలకు ఈ రోజున క్షమాపణలు చెప్పటం, రేపటి రోజు క్షమాపన చెప్పదం కోసం ఇవ్వాళ కొత్త చారిత్రక తప్పిదాలను తలకెత్తుకోవడంలో మునిగిపోయి వున్నారు!

   కమ్యునిష్తు పార్టీ చరిత్ర చదవడం కన్నా గీతా పారాయణం బెటరు?!

   Delete
  4. పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ దొరకనట్టు జై సమైక్యాంధ్ర పార్తీయే దొరికిందా? చెప్పు ఎంత ఖరీదైనదైనా దాన్ని కాలికే వేసుకుంటారు కానీ నెత్తిన పెట్టుకోరు.

   Delete
  5. పోయి పోయి చెప్పు గుర్తెందుకు బుర్రలోకి వచ్చిందో ఆ కికురె కి?
   చెప్పు దినెడి కుక్క చెరకు తీపి యేమెరుగు - వేమన!

   Delete
  6. నేను అన్నది జనం ఆ పార్తీని చెప్పుతో సమానంగా చూసారని. కేవలం గుర్తు వల్ల వాళ్ళు ఓడిపోలేదు.

   Delete
  7. చెప్పు ఎంత ఖరీదైనదైనా దాన్ని కాలికే వేసుకుంటారు కానీ నెత్తిన పెట్టుకోరు.
   >>
   yes,i agree.గుర్తు వల్ల వోడిపోయాదని నేను అన్నానా?తమరు అన్నదాన్నే నేనూ సమర్ధించినా లా వులికిపడితే యెట్లా?!

   Delete
 2. సి.పి.ఎం.వాళ్ళు మార్క్సిజంతో పాటు అంబేడ్కరిజం కూడా వల్లిస్తుంటారు. అంబేడ్కర్ మార్క్సిజమ్‌ని వ్యతిరేకించాడని వాళ్ళకి తెలుసో, లేదో? రిజర్వేషన్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెపితే అందరూ నమ్ముతారు కానీ సొంత ఆస్తిని రద్దు చెయ్యడం సాధ్యం అని చెపితే ఎంత మంది నమ్ముతారు అనే సందేహం వల్ల కూడా సి.పి.ఎం. మార్క్సిజం, అంబేడ్కరిజం అనే రెండు పడవల మీద కాలేస్తుంది. దీని గురించి ఫేస్‌బుక్‌లో చర్చ జరుగుతోంది. మార్క్సిజం తెలిసినవాడు ఎవడూ అంబేడ్కరిస్టులతో కూడా పొత్తు పెట్టుకోడు. కానీ వీళ్ళు పొత్తులు పెట్టుకున్నది పాలక వర్గ పార్టీలతో.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top