పార్టీ ఫిరాయింపులన్నీ బంగారు తెలంగాణా కోసమేనా!?

తెలంగాణాలో తెలుగుదేశం ఖాళీ అవబోతుందా? అవుననే అనిపిస్తోంది. పార్టీ మారి టీ.ఆర్.ఎస్ లోకి జంపవుతున్న ప్రతీ నేత బంగారు తెలంగాణాకోసమే అంటున్నాడు. ఇందులో నిజానిజాలు వారికీ ఎరుకే ప్రజలకూ ఎరుకే. కానీ ప్రతీ పార్టీ అదే వైఖరి అవలంబిస్తున్నందున ఎవరూ ఎదుటివారిని గట్టిగా విమర్శించే స్తితి లేదు. వై.ఎస్ ఉంటే ఈపాటికి TRS,TDP ల పరిస్తితి మరోలా ఉండేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. TRSని బోందపెట్టేందుకు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్-టీ.డీ.పీలు బహుశా చేయని ప్రయత్నమంటూ లేదు. నేడు అదే అస్త్రాన్ని నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా అధికార టీ.ఆర్.ఎస్సూ ప్రయోగిస్తోంది. తెలుగు తమ్ముళ్లు నీతి వాక్యాలు చెప్పడానికి ఆంధ్రాలో ప్రమాణ స్వీకారమైనా కాకుండానే జగన్ పార్టీకి చుక్కలు చూపారు. జె.డ్పీ లను సైతం కైవసం చేసుకున్నారు. నేతల ఆకర్ష్ పథకానికి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం కావడమే ఆందోళన కలిగిస్తున్నది. రానున్న కాలంలో సామాన్యులు - నైతిక విలువలున్న వారు మన ఘనతవహించిన ప్రజాస్వామ్యంలో పోటీ చేసే స్తితి కూడ ఉండదనిపిస్తోంది. ఎంతకాలమిలా? ఏమిటి పరిష్కారం?
please click on image for original article


Reactions:

Post a Comment

  1. నాగేశ్వర్ లాంటి వ్యక్తి ఇలాంటి చౌకబారు వ్యాసం రాయడం వారి తాహతుకు తగదు. వేమూరి రాయాల్సిన మాటలు మీకు సరిపోవండీ.

    ReplyDelete
    Replies
    1. వేమూరి దుర్మార్గపు ఎజెండాను నాగేశ్వర్ విశ్లేషణలతో పోల్చలేం. ఇక్కడ 250 కోట్ల కాంట్రాక్టుల విషయం ధర్మారెడ్డి కార్యకర్తల మీటింగులో చెప్పినది లీక్ అయినదాని ప్రకారం ఆర్టికల్ వ్రాసినదానికి ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్తో ఎలా పోలుస్తారు. అంటే ఎలా అయినా సరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే రైటా? అయితే గతానికీ ఇప్పటి ఉద్యమ పార్టీ పెంపుదలకు చీప్ ఎత్తుగడలలో తేడా ఏమీ ఉండాల్సిన అవసరం లేదా? అమ్ముడు పోయే నేతలతో నీతివంతమైన బంగారు తెలంగాణా ఎలా నిర్మిస్తారు?

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top