-  సారాంశంపై సిఎం కెసిఆర్‌ ఫైర్‌
-  ఓ ముఖ్య కార్యదర్శిపై ఆగ్రహం ?
-  కమిటీ భేటీలు రహస్యం
-  ఆన్‌లైన్‌లో డేటా ఇప్పట్లో సాధ్యమేనా ?
(ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో)

               తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే-2014పై కెసిఆర్‌ సర్కారు భారీ అంచనాలే పెట్టుకుంది. అవినీతి రాజ్యమేలుతోదంటూ సామాజిక, ఆర్థిక సర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సర్వే సర్కారుకు గుదిబండలా మారనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పద్దతిలో నిర్వహించిన సర్వే సారాంశం కాస్త ప్రభుత్వం దిమ్మతిరిగిపోయేలా ఉందని అధికారులు అంటున్నారు. సంక్షేమ పథకాల్లోని ప్రజాధనం అవినీతిపరుల బొక్కసాల్లో వెలుతోందనే భావనతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ సర్వే చేయించారు. రేషన్‌కార్డు గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. ప్రణాళిక, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ తదితర శాఖలకు చెందిన 'ముఖ్య' అధికారుతో పలు సందర్భాల్లో భేటిలు నిర్వహించారు. అనంతరం సర్వేకు మొగ్గుచూపారు. సుమారు 3.69 లక్షల మంది ఉద్యోగులను గ్రామాలకు పంపడం ద్వారా ప్రజల విలువైన సమాచారాన్ని సేకరించారు. కుటుంబాలు పెరిగినా, జనాభా తగ్గిందనే సంగతి స్పష్టమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జనాభా ఎంతో ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. దాదాపు 12.20 లక్షల కుటుంబాలు ఇప్పటికీ సర్వేలో ప్రాతినిధ్యం దక్కలేదు. రెండో విడత సర్వే సంగతిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇదిలావుండగా ఇటీవల సర్వే సారాంశాన్ని విశ్లేషిస్తూ సంక్షేమ పథకాలకు ఎలా వర్తింపజేయాలో 'మార్గదర్శనం' చేయడానికి ఆయా ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగాయి. ఈ ప్రక్రియ మొత్తం రహాస్యంగానే సాగుతోంది. సమాచారాన్ని బయటకు పొక్కనీయడం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావే సర్వే అంశాలను లీక్‌ చేయరాదని ముఖ్యకార్యదర్శులను ఆదేశించినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులను సర్వే విశ్లేషణ గురించి అడిగితే 'ముఖ్యమంత్రి గారు... చెప్పోద్దన్నారు' అంటూ ఉన్నతాధికారులు సర్వే విషయాలపై మాట్లాడానికి నిరాకరిస్తున్నారు. కాగా ఒకానొక సమావేశంలో మాత్రం సర్వే నిర్వహించడానికి కారణమైన ఒక 'ముఖ్య కార్యదర్శి'పై సిఎం కెసిఆర్‌ ఫైర్‌ అయినట్లు విశ్వసనీయ అధికారులు చెప్పారు. ఈ సమాచారం దేనికి 'ఉపయోగపడుతుంది...' అంటూ ఆగ్రహం వ్కక్తం చేసినట్లు తెలిసింది. అధికారులు చెప్పినదానికి, తన అంచనాలకు బిన్నంగా సమాచారం వచ్చిందనే భావనలో ముఖ్యమంత్రి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దింతో మార్గదర్శకాల కమిటీ కాస్త నీరసపడ్డట్లుగా సమాచారం. ఇందిరమ్మ ఇళ్లు, ఫాస్ట్‌ పథకం, రేషన్‌కార్డులు, సామాజిక పింఛన్లు తదితర విషయాల్లో ఈ సర్వేను ఆయుధంగా వాడుకుని బడ్జెట్‌ను భారీగా తగ్గించుకోవాలనే ఆలోచనలో తొలుత తెలంగాణ సర్కారు ఉండేది. సర్వే సారాంశం కాస్త భిన్నంగా వచ్చిందనే అంతర్గత అభిప్రాయంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 120 ప్రశ్నలతో ప్రజలకు దగ్గరకు వెళ్లి సర్వే చేస్తే, సంక్షేమ పథకాలకు ఏ కత్తెరపెట్టే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయానికి సిఎం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఈ సర్వే సమాచారాన్ని సర్కారు ఉపయోగించుకుంటుందా? లేదా చెత్తబుట్టలోకి నెడుతుందా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేరు రాయడానికి ఇష్టపడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద కసరత్తు చేసి, దాదాపు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టి చేసిన సర్వేను వృధా పోనివ్వరాదనే తలంపుతో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సారాంశాన్ని విశ్లేషించడానికి దాదాపు 18 నుంచి 23 ప్రాతిపదికలు పెట్టుకున్నారని పంచాయతీరాజ్‌ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాతిపదికలేంటి? సమాచారాన్ని ఎలా విశ్లేషిస్తున్నారు? మార్గదర్శకాలు ఎవైనా రూపొందించారా? అనే విషయమై సర్కారు గోప్యతను పాటిస్తోంది. అధికారులు సైతం కిమ్మనడం లేదు. సర్వే విషయమై సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఒకింత భయం కనిపిస్తోంది. ఇదిలావుండగా సమాచార క్రోడీకరణ పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు సర్వే సారాంశాన్ని ఆన్‌లైన్‌లో పెట్టలేదు. ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు కూడా లేవనే ప్రచారం జరుగుతోంది. సారాంశాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరమే పరిమితమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌తో పెడతారనే వ్యాఖ్యానాలు అధికారవర్గాల నుంచి వస్తున్నాయి.
Reactions:

Post a Comment

 1. పనిలేని నీ ప్రశ్నలతో గిట్ల మమ్ముల వేదిన్చుదేంది ? నీ మనసు కుటుంభ అభివృద్దిపై పెట్టు బాగుపదతావ్ .

  ReplyDelete
 2. అచ్చా ! కామెంట్ కు నీ అనుమతి గావాల్నా ! అయితే ఒకే .. ఇంకా జరా సున్నితంగా మాట్లాడతా
  నీ కొడుకుని పేద దార్లో పోకుండా కాపాడుకో . వాని గురించి నీకు ఎరుక లేదు వాడు చట్ట విరుద్ద పన్లు చేస్తుండు
  రుజువులు గావాల్నా .. చూపిస్త బేజార్ కాకు

  ReplyDelete
 3. ఇది ఒక ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన సర్వే. ఎన్నో సదుద్దేశాలతో దీన్ని చేపట్టటం జరిగింది. తస్మదీయులు ఎప్పుడూ దురుద్దేశాలనే చూస్తారనుకోండి. అది వేరే సంగతి. ఫలితాల విశ్లేషణ తరువాత తగిన చర్యలకు ఎంత సమయం పట్టేదీ ఆ చర్యల రూపురేఖలమీద అధారపడే విషయం. కొన్ని కొన్ని అంశాలు అననుకూలంగా ఉన్నాయన్నది ఊహాగానం కావచ్చును. సర్వేఫలితాలను దాని మీద చర్యలను ప్రజలకు అందిచటం విషయంలో పభుత్వానికి తొందరపడవలసిన పని లేదనుకుంటాను. ఎప్పటికీ కాకపోతే సహచట్టం వాడుకోవచ్చును అవసరమైన వారు. ఇప్పుడే నిర్థారణలు అనవసరం అనిపిస్తోంది.

  ReplyDelete
 4. ఈ మద్య అసలు న్యూసు కంటే ఇలా డెస్కు దగ్గర కూసోని అల్లేసిన న్యుసేన్సు ఎక్కువైపోయింది, జనాల బిపి పెంచనీకి !!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top