Name:Jai Gottimukkala 
E-Mail:deleted  
Subject:ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం సాయం 
Message:వార్త: హుధుద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.18 కోట్ల విలువైన విద్యుత్ సామాగ్రిని పంపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో530 ట్రాన్స్‌ఫార్మర్లు, 28,500 స్తంభాలు, 900 కిలోమీటర్ల నిడివిగల వైర్లు పంపుతున్నట్టు తెలిపింది

ఆధారం: http://namasthetelangaana.com/News/telangana-government-financial-aasistant-to-ap-1-1-412473.aspx#.VD0MA5G6a00

ప్రశ్న: ఆంద్ర ప్రభుత్వం అడగకుండానే సాయం చేయడం అవసరమా? ఇందుకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత వచ్చే అవకాశం కొంచమయినా ఉందా? 
Reactions:

Post a Comment

 1. ఆంద్ర ప్రభుత్వం అడగకుండానే సాయం చేయడం అవసరమా?
  అవసరం లేదు.

  ఇందుకు ప్రతిఫలంగా కనీసం కృతజ్ఞత వచ్చే అవకాశం కొంచమయినా ఉందా?
  అవకాశం లేదు. సీమాంధ్రులు నమ్మక ద్రోహులు. అన్నం పెట్టిన చేతినే కరిచే రకం. ఇప్పుడు సాయం చేసి తరువాత భంగపడడం దేనికి?

  చాలా? సాయం చేయడం అంటే ప్రతిఫలం ఆశించకపోవడం. 'ఇందుకు ప్రతిఫలంగా...' అని రాయడంతోనే ఇది వ్యాపారం అని అర్ధమవుతోంది.

  ReplyDelete
 2. అడిగితే చేసేదాన్ని సాయం అనరు. ఆంధ్ర అయినా ఇంకో రాష్ట్రం అయినా ఆపద లో ఉన్నప్పుడు ఆదుకొనే శక్తి ఉంటె ఆదుకోవడం మానవ ధర్మం. ఇక్కడ కృతజ్ఞత ఆశించడం కూడా అసందర్భం.

  ReplyDelete
 3. అడగకుండానే సాటి తెలుగువారికి సహాయం చేయాలన్న కే.సీ.ఆర్ ప్రభుత్వ ఆలోచన అభినందించదగినది. ప్రాంతీయ విద్వేషం శృతిమించినప్పుడే ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి. మొగుడు చచ్చి ఏడుస్తుంటే.... సామెతలా ఉందీ ప్రశ్న. పరస్పర సహకారం ప్రతి పొరుగు రాష్ట్రాలకీ ఆ మాటకొస్తే అన్ని రాష్ట్రాలకీ అవసరం. సహాయం చేసినవాడు కృతజ్ఞతకోసం ఎదురుచూడకూడదు. సహాయం పొందినవాడు కృతఘ్నుడిగా మారకూడదంటారు. విపత్తు సమయంలో సహాయం చేసి కృతజ్ఞత పొందాలనే ఆలోచనే దుర్మార్గమైనది.

  ReplyDelete
  Replies
  1. "అన్ని రాష్ట్రాలకీ అవసరం"

   కాశ్మీరులో ఇంతకంటే ఎన్నో రెట్లు ఆపత్తు జరిగింది. తెలంగాణా ఆంద్ర రాష్ట్రాలు వారికి ఏమేరకు సాయం చేసారో తెలుసాండీ?

   Delete
  2. తెలీదండి. మరో రాష్ట్రంలో తుఫాన్ వచ్చినప్పుడనుకుంటాను చంద్రబాబు ముందే స్పందించి సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు సిబ్బందిని పంపినట్లు గుర్తు. అయినా కాశ్మీరుకి ఈ రెండు రాష్ట్రాలు ఎంత సహాయం చేసిందీ తెలీకపోతే నేనా వ్యాఖ్య చేయకూడదా? మీ ఉద్దేశం నాకర్ధం కాలేదు.

   Delete
  3. మీరు వ్యాఖ్య చేయకూడదని నా ఉద్దేశ్యం కాదు. భారతదేశ ప్రజలందరూ మనకు సమానం కాబట్టి (అయితే) అన్ని ఆపత్తులకు ఒకేరకంగా స్పందించాలని నా కోరిక.

   ఇక్కడ చాలామంది "ప్రతిఫలం" అనే మాటను తప్పు పెటారు. నటుడు సూర్య 50 లక్షలు విరాళం ఇచ్చిన వార్తలలో ఆయన సినిమాలకు ఆంధ్రలో మంచి గిరాకీ ఉందని కూడా ప్రత్యేకించి రాసారు. ఇది (ఒకవేళ నిజమయితే) కూడా ప్రతిఫలమే కదా?

   Delete
  4. అన్ని ఆపత్తులకు ఒకే రకంగా స్పందిస్తే మంచిదే. స్పందన అనేదానికి ఎవరి పరిస్తితులు వారికి ఉంటాయనేది సహజమే. సూర్య కంతే ఎక్కువ మార్కెట్ ఉన్నవారు తక్కువే ఇచ్చారు. జనరల్ గా సూర్య ఇటువంటి సమయాల్లో ఉదారంగా వ్యవహరిస్తుంటాడని విన్నాను. కువిమర్శలు చేయాలనుకుంటే ఎలాగైనా చేయవచ్చు.

   కే.సీ.ఆర్ చేసిన ఇంకో మంచి పని ఏమిటంటే ఆర్ధికంగా కంటే వస్తు రూపేణా సహాయం చేయడం. విపత్తుల సందర్భంలో సహాయ ధనం అవినీతిపరుల పాలు కావడమూ చూస్తూనే ఉన్నాం కదా?

   Delete
  5. తెలంగాణా కాశ్మీరు వరద బాదితుల కోసం చెరి 5 లక్షల విలువ చేసే 50 నీటి శుబ్రత యంత్రాలను పంపింది. ఇది కాక 10 కోట్లు నగదు సాయం కూడా చేసింది.

   http://ibnlive.in.com/news/telangana-send-50-waterpurifiers-to-floodhit-kashmir/499016-3-245.html

   ఆంద్ర సాయం చేసిందా చేస్తే ఎంత అన్న సమాచారం నాకు దొరకలేదు.

   Delete
  6. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం కంటే ముందుగానే కాష్మీర్ వరదలకు స్పందిచి 5 కోట్ల సహాయం ప్రకటించింది.కొన్ని తెలుగు పత్రికలలో ఇలాంటి వార్తలు కనిపించవు. ఈ లింక్ క్లిక్ చేసి చూడంది. http://www.ndtv.com/article/andhra-pradesh/andhra-pradesh-announces-five-crore-rupees-aid-for-jammu-and-kashmir-floods-589510

   గతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సైక్లొన్ సమయంలో ఒరిస్సాకు చేసిన సాయానికి క్రుతజ్ఞతగా ఒరిస్సా సహాయ కార్యక్రమ్మలకు తమ సిబ్బందిని పంపటమేకాకుండా సరిహద్దు జిల్లాకి తమ సబ్స్టేషన్లనుండి తాత్కాలికంగా విద్యుత్ సరఫరాచేస్తోంది.

   Delete
 4. ఒక పెద్దమనిషికి సహృదయుడైన దాతగా పేరుండేది. ఒక నాడు ఆయన వద్దకు ఒక బీదవాడు సహాయంకోసం వచ్చాడు. ఆయన అంగీని తడిమి చూసుకున్నాడు. కుడివైపు జేబు ఖాళీ. కాని ఎడమవైపు జేబులో కొంత సొమ్ముంది. అది అలాగే తీసి బీదవాడి చేతుల్లో పెట్టాడు. బాబుగారూ ఎడంచేత్తో దానం చేస్తున్నారే, పరాకు పడ్డారా అన్నాడు బీదవాడు. లేదయ్యా, ఇప్పుడీ డబ్బుని ఎండం చేత్తో‌ అంగీనుండి బయటకు తీసినవాడిని కుడిచేతిలోనికి మార్చుకుని నీకు ఇచ్చేలోగా నా మనస్సు మారిపోతే నీకు అన్యాయం చేసినవాడినౌతాను. అందుకే ఆ ఎడం చేత్తోనే నీకు ఇచ్చేసాను. ఏమీ‌ అనుకోకు అన్నాడా పెద్దమనిషి. ఇదొక కథ ఎన్నడో చదివాను. గమనించారా? లెక్కపెట్టి ఇచ్చేలోగా మనసు మారిపోయే ప్రమాదం ఉందనే ఆయన లెక్కకూడా పెట్టుకోకుండా ఉన్నపణాన ఇచ్చేసాడు. వీడికి ఇస్తే నాకేం లాభం, ఎవరన్నా గమనించి నా గొప్ప చాటే వాళ్ళున్నా ఇక్కడ? వగైరా అలోచనలు చేయటం దాత లక్షణం కాదు. అటువంటి దానానికి విలువా లేదు.

  తెలంగాణా దొరతనంవారు ఏదో ఆశించి సహాయానికి వచ్చారని అనుకోలేను. స్పందించటం సాటి మనుషులుగా కర్తవ్యంగా భావించారంతే అనుకుంటాను. మనం ఈ విషయంలో అర్థాలు వెదకటం వలన ఇరుపక్షాల్లోనూ తప్పొప్పులు ఎంచటం వలన మన మనస్సులకే కశ్మలం అంటుకుంటుంది. ఎందుకిదంతా? వదిలెయ్యండి.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం సర్, ఇక్కడ ' తెలంగాణా దొరతనం వారు ' అనే విశేషణం అవసరమా!?

   Delete
  2. కొండలరావుగారూ, మంచిప్రశ్న వేసారు. ఈ దొరతనంవారు అంటే ప్రభుత్వం అని అర్థం ప్రసిధ్ధమే. ఇక్కడ ఏ విధమైన విరుపులూ ఆక్షేపణలూ లేనే లేవు. ఈ మాట గురించి లోగడ కూడా మనబ్లాగులో కొంత చర్చ జరిగిందని గుర్తుకు వస్తోంది. దొరతనంవారు అన్నది ఈ వాక్యంలో ఏ విదమైన క్రియాదికాలకూ విశేషణంగా లేదు. ఆ మాట కర్తస్థానంలోనే ఉంది. వీలైనప్పుడు తెలుగుమాటలు వాడటంలో అభ్యంతరం ఉండనవసరం లేదని అనుకుంటాను. అలాగని అప్రసిధ్ధమో కేవలం నిఘంటులభ్యమో ఐన మాట కూడా వాడనవసరం లే దనుకోండి.

   Delete
  3. ఆర్యా! దొరతనం అంటే అచ్చతెలుగులో ప్రభుత్వం. మీరనుకుంటున్నట్లుగా కులం కాదు.

   Delete
  4. కొండలరావు గారూ, ఇటీవలి నేపధ్యంలో మీరన్నది కరెక్టే. అయితే శ్యామలీయం మాస్టారు ఇది వరకే స్పష్టత ఇచ్చారు కనుక ఆయనను ఆక్షేపించనవసరం లేదు.

   అసలు వార్తలో కెసిఆర్ పేరే లేదు కనుక ఆయనను గుంజడం ఎందుకు?

   Delete
  5. @ శ్యామలీయం గారు, ఆంధ్రా హ్యూమనిస్టు గారు,

   నాకు మాకొద్దీ తెల్లదొరతనమూ .... గురించి తెలుసు. అంటే ఇక్కడ ఇష్టం లేని బలవంతపు పాలనను మాత్రమే అలా పిలుస్తారనుకుంటున్నాను. అలాంటప్పుడు అన్ని రాష్ట్రాల ఏలికలకు ఈ సంబోధన ఉంచాలనుకుంటాను. కేవలం తెలంగాణా దొరతనం వారికే ప్రత్యేకత ఎందుకని అనుమానం వచ్చి అడిగానండీ. దొరతనం అంటే కులమని నేననుకోలేదు.

   శ్యామలీయంగారి వివరణకు ధన్యవాదములు.

   Delete
  6. ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే నిఘంటువులు చూచుకొన వచ్చును. ఉదాహరణకు వెబ్‍లో
   Ref: http://www.andhrabharati.com/dictionary/
   దొరతనమువారు
   దొరతనమువారు : శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
   వి. , బహు.
   ప్రభుత్వమువారు.
   దొరతనమువారు : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953
   n.
   the government, the sircar.

   Delete
  7. శ్యామలీయము గారి విచక్షణ ప్రకారం "కూతలు" అన్నది అప్రసిద్ధము, కేవలము నిఘంటు లభ్యము, "దొర తనము" అన్న శ్లేష మాత్రము సుప్రసిద్ధము, ఆమోద్యయోగ్యము. ఆహా ఏమి చతురత!

   Delete
  8. అయ్యా శ్రీకాంత్ గారూ,

   కం, తప్పులుబట్టుట పనిగా
   తిప్పలు బడువారి దృష్టితీవ్రత తడుమున్
   తప్పక హరిహరబ్రహ్మల
   నెప్పగిదిని నన్ను బోంట్ల నిప్పుడు విడచున్

   కం. చూచెడు దృక్కోణంబుల
   వైచిత్రికి దగిన రీతి భాసించు గదా
   యీ చిత్రమైన లోకము
   మీ చూపులు వలచు రీతి మీ కగుపించున్

   కం. ఊరకనే వాదించెడు
   తీరిక మీ కుండు గాక దినదినమున్ మీ
   పోరాట పటిమ జూడగ
   తీరిక లే దనుచు నాకు తెలిసికొనుయా

   స్వస్తి. శుభం భూయాత్.

   Delete
  9. శ్యామలీయంగారూ,

   కం: ఒరుతప్పుల బట్టుటకై
   నిరతము పరికించు వారు నిజముగ తామే
   పొరపాటులు జేయుచుండ
   పరులవి పరికించి దెల్ప పాపమ్మగునే?

   మీరు పెద్దలుగా మా తప్పులు పట్టుకోవలసిండేనండీ. కాని అప్పుడప్పుడూ మా వాదన కూడా వినాలి మరి! :)

   Delete
  10. చివరికందం చివరి పాదంలో typo ఉంది. సరిజేసిన పాఠంగా 'తెలిసికొనుడయా' అని ఉండాలి. ముద్రారాక్షసాలు ఎక్కువ వస్తున్నాయి వేగంగా వ్రాయవలసి వచ్చినప్పుడు.

   Delete
  11. (offline: "యోవ్ శ్రీకాంత్ చారి! తెలిసికొనుయా!!" అని రాయలసీమ యాసలో చదువుకుని నవ్వుకున్నాను మాస్టారూ!)

   శ్రీకాంత్ చారి గారూ! ఏమీ అనుకోకండి!! :)

   Delete
 5. ఛీ ఛీ.. ఇంతకన్నా వ్యాఖ్యానం దండగ.

  ReplyDelete
 6. లేదు. ఇదో రాజకీయపు చేష్ట. దీనిమీద అప్పుడే బ్లాగుల్లో మీరు బుద్ది బైటపెట్టుకున్నారు ఈ ప్రశ్నతో. ఇప్పుడు ఈ 18 కోట్ల సాయం ఆంధ్రకు అవసరం లేదు, అడగలేదు కూడా. అయినా ప్రకటించి ఆంధ్ర ప్రభుత్వం నిరాకరిస్తే అదిగో తెలుగుదేశానికి చంద్రబాబుకి తెలంగాణ అంటే పడదు, మేం చెప్పలే అని ప్రచారం చెయ్యొచ్చు, సరే అని మర్యాదకి స్వీకరిస్తే అదిగో మేం ఆంధ్రని తెగ ఆదుకున్నాం, వాళ్ళు మాత్రం మాకు విద్యుత్ ఇవ్వటం లేదు (ఆంధ్ర బైటనుంచి కొని వాడుకుంటున్న విద్యుత్తు) అని బురద జల్లొచ్చు. ఇలాంటి జనాలు అని తెలుసు కనుకనే ఆంధ్ర ముఖ్యమంత్రి ఇంత విపత్తులో కూడా ఒడిశాని, తమిళనాడుని, కర్ణాటకని, కేంద్రాన్ని సహయ సహకారాలు అర్థించాడు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని నోరు తెరిచి అడగలేదు. అయినా అడగని సాయం పంపిస్తూ అప్పుడే మొదలైంది లేకి వ్యాఖ్యానం. ప్రకృతి విపత్తులో దెబ్బతిన్న అంధ్ర మీద, ఆంధ్ర ప్రభుత్వం మీద ఇదో నీచ రాజకీయపు ఎత్తుగడ.

  మీకు నిజంగా చేతనైతే మీ ప్రభుత్వంతో ఇలాంటి అడగని సాయాలు అవసరం లేదని మాన్పించండి, చేతగాకపోతే ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యానాలు కట్టిపెట్టండి.

  ReplyDelete
  Replies
  1. @ తెలుగోడు గారు,

   < అడగని సాయం పంపిస్తూ మొదలయ్యింది లేకి వ్యాఖ్యానం > ఇక్కడ లేకి వ్యాఖ్యానం చేసింది కే.సీ.ఆర్ కాదుగదా? అడగకుండా సహాయం చేస్తే తప్పేంటండి? భావోద్వేగాలను ఇరువైపులవారూ అదుపులో ఉంచుకోవడం లేదు. ఏ ఏలికలు సహాయం చేసినా అది అంతిమంగా ప్రజాధనమేనని అందరూ గుర్తుంచుకోవాలి.

   Delete
 7. నేను ఇదే ప్రజలో సామరస్యంగా వుందామని ధర్మరాజు దుర్యొధనుదు గంధర్వుల పాల బడినప్పుదు భీముడికి తమ్ముడూ, మనలో మనం యెలా వున్నా వేరేవాళ్ల దగ్గిర 105గురిలా వుండాలి అన్నందుకు అసలా ధర్మరాజుదే తప్పు అని వాదించటానికి తయారయిన జై గొట్టిముక్కల గారికి ఈ ప్రశ్న మనసులోకి రావడం సహజమె.

  మళ్ళీ యెక్కద ఈ రెండు ప్రాంతాలూ కలిసిపోతాయో ననే భయం కనిపిస్తున్నది నాకు ఆయనలో.యెట్తి పరిస్థితుల్లోనూ సాటి తెలుగు వాళ్లనే పాయింటుతో గానీ మరో విధంగా అంటే దేశంలో వున్న మిగతా రాష్ట్రాల్లో అదీ వొకటి అని కూడా గుర్తించటానికి మనసొప్పనంతగా ద్వేషం వుంటేనే ఇలాంటి ప్రశ్న వస్తుంది!పైన మాకు ద్వేషాన్ని అంటగట్టటం?

  ReplyDelete
 8. హుద్ హుద్ తుఫాను లాంటి ప్రకృతి విపత్తుల సమయములో సహాయం చేయడం మానవ ధర్మం. చివరికి పాకిస్తానులో భూకంపాలు లాంటివి వస్తే, శతృదేశం అని కూడా చూడకుండా ఇండియా సాయం చేసింది. పాకిస్తాను వారు కూడా అదే తరహా సహృదయాన్ని కొన్ని సార్లు చాటుకున్నారు. ధరిద్రమేమిటంటె, కలిసుందాల్సిన తెలుగు వారు, ఇలాంటి సమయాలలో కూడ ఇలాంటి రాతలు రాసుకుంటున్నారు. ఎవరి ప్రాప్తం వారిది. ఏంచేస్తాం. ఇదే కాదు, కొన్ని చోట్ల, విశాఖ వాసులు ఒక మహానాయకుడ్ని మోసం చేసి వోటు వేరే వారికి వేశారు కాబట్టి, ప్రకృతి వారిని శిక్షించింది అని, ఇది వరకు వర్షాలు తమ నాయకుడి వల్లే కురిసాయని భావించిన కొంత మంది మూర్ఖులు మాట్లాడుకుంటున్నారట. ఇలాంటి వాల్లని ఏమి చేస్తాం? ఇక్కడ కొంత మంది అన్నట్లు.. "ఛీ, ఛీ" అనుకోవడం తప్ప.

  ఏదేమైనా, కష్టాల్లో ఉన్న విశాఖకు తన వంతు సాయం అందించిన KCR గారి సహృదయతకు వందనం. ప్రస్తుతం దీని మీద ఇంతకు మించి మాట్లాడడం అనవసరం.

  ReplyDelete
  Replies
  1. (offline:
   అయ్యా, ఈ శుక్రాచార్య అన్నది బాగానే ఉంది. ఎవరన్నాబుధ్ధిమంతులు బృహస్పతి అన్న పేరుతో వస్తే మరింత బాగుంటుంది మంచి జోడీగా! :) ఏమంటారు?
   )

   Delete
  2. "KCR గారి సహృదయత"

   ఇది తెలంగాణా ప్రజాధనం, కెసిఆర్ సొంత డబ్బు కాదు

   Delete
  3. జైగారూ. చంద్రశేఖరరావుగారు సహాయంగా ఇస్తున్నది తెలంగాణాప్రజాధనమే అన్నది ముమ్మాటికీ‌ నిజమే. ఐతే దానిని ఖర్చు చేసే విషయంలో నిర్ణయాధికారం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారిదే కదా. అందుకని ఆయన సహృదయత అనటం జరిగింది అనుకుంటాను. ఇందులో తప్పుబట్ట వలసింది కనిపించలేదు. రాజకీయపరమైన స్పర్థలు వేరు. మానవతాకోణంలో స్పందించటం వేరు. ఈ విషయంలో చంద్రశేఖరరావుగారికి ఉద్దేశాలు ఆపాదించటం కూడా తొందరపాటే కావచ్చును అని నా అభిప్రాయం. కష్టకాలంలో వెయ్యిరూపాయలు సాయం చేసినవాడైనా రూపాయి సాయం చేసినవాడైనా తమ శక్తికొద్దీ చేస్తున్నారు. వారికి ఇలాంటి విషయాల్లో ఉద్దేశాలను ఆపాదించ నవసరం లేదనుకుంటున్నను. అలాగే ‌ఈ విషయంలో తెలంగాణా ప్రజానీకంలో ఆక్షేపణలుంటాయని అనుకోను కూడా. ఒక వేళ అలా ఉన్నపక్షంలో మాత్రం అది దురదృష్టకరం. అన్నీ ఆలోచించే చంద్రశేఖరరావుగారు ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోంది నాకు.

   Delete
  4. KCR సహృదయత అన్నా అనకున్నా లెక్కలోనిది కాదు. నా అభిప్రాయమైతే అవసరానికి మించి సానియా మీర్జాలాంటివారికి కోట్లు ఇవ్వడం కంటే ఇది సరయినది. తెలంగాణా ప్రజాధనం ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికీయబడింది తెలంగాణాలోని మెజారిటీ ప్రజలచేతనే. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్రజలు భావిస్తే వారే బుద్ది చెప్తారు. ఈలోగా ఎవరి భావప్రకటనా స్వేచ్చ మేరకు వారికి స్పందించి ప్రచారం చేసుకునే హక్కు తప్ప చేయగలిగేది నిర్ణయాలను మార్చగలిగేదీ లేదు కదా.

   Delete
  5. శ్యామళీయం గారూ,
   నా మనసులో మాట చెప్పారు. Thank you :-)

   Delete
  6. నేను కెసిఆర్ పేరు గుంజొద్దని అన్నది శుక్రాచారులను. నా ఉద్దేశ్యంలో థాంక్స్ చెప్పాలనుకుంటే (అనిపిస్తే) అదేదో తెలంగాణా ప్రజల ఖాతాలో వేస్తె సంతోషం.

   మాస్టారు చెప్పింది చాలా మటుకు బాగున్నా అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి ఒక్కరే తీసుకోరని గుర్తుంచుకుందాం. అధికారులు & సంబందిత మంత్రులు తీసుకున్న నిర్ణయాలు సీఎం అనుమతి తరువాత అమలు అవుతాయి. చెడుకు కాకపోయినా మంచికి ఒకే వ్యక్తిని కాక ప్రభుత్వానికి ఆపాదిస్తే బాగుండేది.

   కొండలరావు గారు సానియా మిర్జా పేరు మరియు ఆమెకు ఇచ్చిన 2 కోట్లు గుంజడం ఎందుకో అర్ధం కావడం లేదు. దేని దారి & ఖాతా దానిది. కేంద్రం ఆట పోటీలను ఆపేసి ఆంధ్రకు సాయం చేయడం లేదు కదా? ఇదీ అంతే.

   Delete
  7. జై గారు, మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది. ఏం? సానియామీర్జాకిచ్చిన 2 కోట్లు ప్రజాధనం కాదా? సాధారణ స్థాయిలో పాఠశాల స్థాయిలో క్రీడా వసతులకు వెచ్చిస్తే సమాజంలో వెలుగు చూడని మట్టిలో మాణిక్యాలు వెలుగు చూస్తాయి. కేంద్రానికైనా ఏ పాలకవర్గానికైనా నా సలహా అదే. తెలంగాణా సొమ్ము తెలంగాణాలో అయితే దుర్వినియోగం కావచ్చా? నా అభిప్రాయం బ్రాండంబాసిడర్ల పేరుతో తగలేసే ప్రతీ రూపాయి శుద్ధ దండగమారి పని అది ఎవడు చేసినా.

   Delete
  8. సరే మీ ఇష్టం. బడిపిల్లలలో క్రీడాస్పూర్తి పెంచాలి లేదా రాజూ యాదవ్ లాంటి వారికి ప్రోత్సహించాలి కానీ ఇదివరకే బోలెడు డబ్బున్న వారికి కాదన్నది మీ అభిప్రాయం.

   క్రీడారంగం బడ్జెటు వేరుగా ఉంటుందన్న మాట మీరు ఒప్పుకుంటారని ఆశిస్తాను. మీరు చెప్పినట్టు చేసినా అది అందుట్లో నుండే ఉంటుంది కానీ ఇతర సొమ్ముల నుంచి కాదు.

   ప్రతీ దానికి సానియా మిర్జా ఎందుకు అన్నదే ఇక్కడ నా ప్రశ్న. మరీ అవువ్యాసం లాగుంది!

   Delete
  9. జైగారూ, "అన్నీ ఆలోచించే చంద్రశేఖరరావుగారు ముఖ్యమంత్రిగా ఒక నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోంది నాకు." అన్నప్పుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవటం అంటే అన్ని పధ్ధతులూ పాటించే అనే నా ఉద్దేశం కూడా. ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటారని నేనూ అనుకోను. అందుకే నా వ్యాఖ్య ఒక ముఖ్యమంత్రిగా అన్న ప్రస్తావనతో ఉండి ఒకే వ్యక్తిని కాక ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఉద్దేశించినదే అని వివరణ ఇచ్చుకుంటున్నాను.

   కొండలరావుగారూ, ప్రభుత్వం దగ్గర ఉన్నది ప్రజాధనమే ఐనా వివిధపద్దుల క్రింద ఖర్చు చేస్తారు కాని కలగాపులగంగా ఖర్చు చేయరు కదా. బ్రాండంబాసిడర్ల అవసరం ఉందా లేదా అన్నది వేరే ఛర్చనీయాంశం. మీరన్నట్లు ఒకపద్ధులో భారీఖర్చులు తగ్గించి లబ్ధిదారుల్లో అర్హులు ఎక్కువమందికి సాయపడవచ్చును. జైగారు అన్నట్లు అంధ్రాకు చేసే సహాయానికీ యీ పద్ధుకూ సంబంధం లేదు.

   Delete
  10. శ్యామలీయం గారు ప్రజాధనం అని చర్చకు వచ్చింది అంటే అది ఏ పద్దయినా ప్రజాధనం ద్వారా బడ్జెట్ ప్లానింగ్ చేయబడిందేకదా? ప్రజాధనం దుర్వినియోగం అని చర్చిస్తున్నామన్నప్పుడు ఎక్కడెక్కడ ఎలా దుర్వినియోగం అవుతుందో ఎన్నిసార్లు చర్చకు వచ్చినా తప్పు లేదు. ఏలికల పైత్యాలకు ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు ప్రజలలో ఒకరంగా దానిని మనం వేలెత్తి చూపితే ఆ భావజాలం వ్యాప్తి చెందితే ఎప్పుడో ఒకప్పుడైనా ఆ చర్చకు ప్రయోజనం ఉంటుంది. ఇక్కడెవ్వడికీ మనం భజనలు చేయాల్సిన అవసరం లేదనేది నా నిశ్చితాభిప్రాయం.ఆపదలో సహాయం చేసినదానికి అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా స(హే)హాయం చేసినదానికి తేడా ఉంటుంది.

   Delete
  11. < ప్రతీ దానికి సానియా మిర్జా ఎందుకు అన్నదే ఇక్కడ నా ప్రశ్న. మరీ అవువ్యాసం లాగుంది! > మీరెందుకు అంత ఇబ్బంది ఫీలవుతున్నారో నిజంగా నాకు ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు జై గారు. ప్రజాధనం అని చర్చకు వచ్చినప్పుడు అదీ తెలంగాణా ప్రజాధనం అని మీరు నొక్కి చెప్పినప్పుడు తెలంగాణాలో ప్రజాధనం సానియామీర్జాకు పోయిందీ, హుదుద్ బాధితులకు పోయిందీ పోలిక నాకు గుర్తుకు వచ్చింది. అది తప్పెలా అవుతుంది. నాకు తెలిసి అవసరం ఉన్నా లేకున్నా ఆంధ్రా వ్యతిరేకతను వెతుక్కునే ఆవు వ్యాసాలకంటే అవసరమైన్ సానియా మీర్జా ఆవు వ్యాసమే ప్రజలకు మేలు చేస్తుంది. ఈమధ్య రేవంత్ రెడ్డి కే.సీ.ఆర్ ని సానియా కలిసినప్పుడల్లా కోటి రూపాయలు ఇస్తున్నాడంటే కాదు కాదు గెలిచినప్పుడల్లా ఇస్తున్నామని టీ.ఆర్.ఎస్ వాళ్లంటున్నారు. ఇదేమన్నా పిల్లాటా? కోట్లు గుమ్మరించడానికి అని నాకనిపించింది. అది మీకు ఆవు వ్యాసంలా అనిపించింది. ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు కాదు గానీ ఆంధ్రాకు ఆపద సమయంలో ఇస్తే మీకు దుర్వినియోగంగా తెలంగాణా ప్రజాధనం గా కనపడడం విడ్డూరంగా నాకు అనిపిస్తోంది. సరే మీ ఆలోచనలు మీ ఇష్టం. నా ఆలోచనలు నా ఇష్టమే. నేను సానియా మీర్జా లాంటి ప్రజాధన దుర్వినియోగాలను ఎవరు ఎలా అనుకున్నా అలాంటివి ఏలికలు మానుకునేంతవరకూ విమర్శిస్తూనే ఉంటాను. అటువంటివాటిపై పెద్ద ఎత్తున చర్చ జరగడం ద్వారా బ్రాండంబాసిడర్లవంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయకుండా ఉండాలని కోరుకుంటాను. ఇది కొంతమందికి ఇబ్బందిగా ఉన్నా నేను చేయగలిగేది మార్చుకునేది ఏమీ లేదు.

   Delete
  12. మాస్టారూ, మీ వివరణ బాగుంది. నేనన్నది కూడా మిమ్మల్ని కాదు.

   కొండల రావు గారూ, ప్రజాధనం దుబారా చేయోద్దనే భావన మంచిదే. అయితే పద్దులు ఖాతాలు తత్సంబంధ అకౌంటింగ్ పద్దతులు దృష్టిలో పెట్టుకొని చెబితే బాగుండేది.

   ఇంకొక్క విషయం. వేల కోట్ల దుబారా గురించి వేయి సార్లు, కోటి రూపాయిల గురించి ఒకసారి మాట్లాడితే బాలన్సుడుగా ఉంటుంది. ఒకటే విషయాన్ని సాగదీస్తే మన బయాస్ అనిపిస్తుంది తప్ప లక్ష్యం నెరవేరదు. ఉ. తన డిల్లీ కార్యాలయంలో మహిళలకు పెట్టలేని ప్రధాని మంగల్యాన్ యాత్రలు మొదలు పెట్టాడని వెక్కిరిస్తే బాగుంటుందా? ఇది చంద్రబాబు ఇంటి కోసం ఖర్చు పెట్టిన 20 కోట్లు అయినా సానియా మిర్జాకు ఇచ్చిన 2 కోట్లు అయినా వర్తిస్తుంది.

   Delete
  13. జై గారు, చంద్రబాబు దుబారాతో పోల్చుకుంటే కే.సీ.ఆర్ దుబారా చాలా తక్కువే లెండి. ఇక్కడ చర్చ తెలంగాణా ప్రజాధనం దుర్వినియోగం + కే.సీ.ఆర్ ఖర్చు పెట్టేదానిపై చర్చిస్తున్నప్పుడు నాకు సానియామీర్జా వ్యవహారం గుర్తుకు వచ్చింది యాదృచ్చికమే తప్ప కావాలని అన్నది కాదు. కావాలని అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేనన్నదానిలో తప్పు లేదనుకుంటున్నాను కనుక. చంద్రబాబు ఇంటికోసం 20 కోట్లూ పెడతాడు, రామోజీ రాధాకృష్ణలు ఏదన్నా ప్లాన్ ఇస్తే జలయజ్ఞం - నీరు-మీరు అంటూ ప్రచారార్భాటాలకూ కోటాను కోట్లు ఖర్చుపెడతాడు. అలాంటి పిచికారీపనులు బాబు ఖాతాలో చాలా ఉన్నాయి లెండి. మంగల్ యాన్ ని ఇలాంటి పిచ్చి పనులతో పోల్చడమెలా కుదురుతుంది?

   Delete
  14. నా వ్యాఖ్య, కొండల రావు గారి వ్యాఖ్య క్లాష్ అయినట్టుంది. నేను రాసే సరికి వారు రాసిన వ్యాఖ్య పబ్లిష్ కాలేదు.

   నేను తెలంగాణా ప్రజాధనం ఆంధ్రకు ఇవ్వొద్దని అన్నానా లేదే? అది కెసిఆర్ సొంత సొమ్ము కాదని చెప్పడం తప్పెలా అవుతుంది?

   బ్రాండ్ అంబాసడర్ హోదాకు ఎటువంటి వేతనం లేదు. సానియా మిర్జా ప్రభుత్వాన్ని యూఎస్ ఓపెన్ శిక్షణ & ప్రయాణం ఖర్చులకు 1 కోటి అడిగింది. అది మంజూరు చేయడం, హోదా ప్రకటించడం ఒకేసారి జరిగాయి.

   తెలంగాణా ప్రభుత్వం ఆసియా క్రీడలలో స్వర్ణ పతాకం గెలిచిన సానియాకు 1 కోటి బహుమతి ఇచ్చింది. అదే సమయంలో 2002 (ఆంటే 12 ఏళ్ల కిందటి) స్వర్ణ పతాక విజేత హేమలతకు 25 లక్షలు ఇచ్చింది.

   తనకు 2002 తరువాత ఎటువంటి అవకాశమూ ప్రభుత్వాలు ఇవ్వలేదని హేమలత వాపోయింది. ప్రపంచ బాడీ బిల్డింగ్ రెండు సార్లు గెలిచిన రాజూ యాదవ్ పరిస్తితి ఇంకా దారుణం. ఆయనకు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోతే తెలంగాణా జాగృతి ముందుకు వచ్చింది. సైనా నెహ్వాల్ ఇస్తానన్న 50 లక్షలు ఎగ్గోట్టితే తెలంగాణా వచ్చాక ఇచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదీ "మాస్టర్ బాట్స్మన్" క్రీడలకు ఇచ్చిన ప్రోత్సాహం!

   సానియా మిర్జాకు ఇచ్చిన డబ్బుకు అభ్యంతరం చెప్పిన వారి ఉద్దేశ్యము అజెండా ఏమిటో ఎవరికీ తెలీదు. అదే పూలెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు అయిఉంటే కాషాయదారులు ఇంత రాద్దాంతం చేసేవారా?

   Delete
  15. మీరు తెలంగాణా ప్రజాధనం ఆంధ్రాకు ఇవ్వొద్దనకపోతే సంతోషం. మీ మాటలను నేనలాగే అర్ధం చేసుకున్నాను. మీ ఉద్దేశమది కాకుంటే క్షమించాలి జై గారు.

   కే.సీ.ఆర్ సొంత సొమ్ము కాదని చెప్పడం తప్పు కాదు. అది నిజమే కానీ మీరు చెప్పిన సందర్భం వల్ల ఆ మిసండర్స్టాండింగ్ జరిగి ఉంటుందనుకుంటాను.

   దయచేసి కాషాయదారుల ముస్లిం వ్యతిరేకతతో నా వ్యాఖ్యను జతచేయకండి. నా ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులలో ఆణిముత్యాలు చాలా ఉన్నాయి. పల్లెప్రపంచంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్నవారిని వెలికితీసేందుకు ఏ ప్రభుత్వాలు కనీస వసతులు కల్పించడం లేదు. గెలిచి పేరు ప్రఖ్యాతులు గాంచినవారికిచ్చే కంటే గెలిపించాల్సిన వీరులు టేలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు.

   నా అభిప్రాయంలో బీ.జే.పీ వారూ , కే.సీ.ఆర్ ఇద్దరూ ముస్లిం వ్యతిరేక - అనుకూల విధానాలతో ఎవరి లబ్ధి వారు పొందుదామనుకుంటున్నారు. బీ.జే.పీ వారి వ్యాఖ్యలను వారి అధిష్టానమే తప్పు పట్టాక కొంత వివరణ ఇచ్చుకున్నట్లున్నారు. నేను చెప్పేది సానియామీర్జాకు ఇచ్చినా అంతకంటే ముందు గ్రౌండ్ లెవెల్ లో మరుగునపడుతున్న ముత్యాలను ఏరి వెలికి తీయాలనే తపనతోనే. అది ఏలికలు చిత్త శుద్ధితో తలచుకుంటే అంత కష్టమైన పని కాదనుకుంటాను? కాదంటారా? ప్రభుత్వ పాఠశాలలూఅనూ ప్రతీ గ్రామంలోనూ క్రీడా వసతులు అదీ క్రికెట్ వంటి పిచ్చ గేం లకు తప్ప శారీరక మానసిక ఉల్లాసాన్నిచే మంచి ఆటలకు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలని.

   Delete
 9. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారు సహాయం కోరక పోవచ్చును. కాని అడక్కుండానే సహాయము చేశారు అన్నది అవాస్తవం. తుఫాను రాగానే తెలంగాణా నుండి కావలసిన సహాయపు వివరాలను తెలుసుఇకొవాలసిన్దిగా కెసిఆర్ గారు తెలంగాణా చీఫ్ సెక్రటరీని కోరడం, ఆయన ఆంధ్రా చీఫ్ సెక్రటరీని సంప్రదించడం జరిగింది. ఆంధ్రా చీఫ్ సెక్రటరీ సంబంధిత అధికారులనుండి వివరాలను సేకరించి తెలంగాణా చీఫ్ సెక్రటరీకి తెలిపిన తర్వాతనే సహాయ కార్యక్రమాలు అమలు జరపటం జరిగింది.

  ReplyDelete
 10. పెద్దలు అందుకే అంటారు -ద్వేషం యెవరిలో వుంటే వారినే కాల్చేస్తుందని?మేము మొదటి నుంచీ ఇప్పటి వరకూ ప్రశాంతంగా వుండటానికీ మీరు కోరుకున్నది సాధించినా ఇంకా అశాంతిగానే వుండటానికీ కారణం అదే!ముందు అది వొదుల్చుకోండి?!

  ReplyDelete
  Replies
  1. అశాంతిగా ఎవరున్నారో పైన కొందరి కామెంట్లు చూస్తే తెలియడం లేదూ!

   Delete
  2. పైన కొందరి కామెంట్ల లో వున్నది అశాంతి కాదని నేననుకుంటున్నాను? ప్రశ్న లోని స్వభావం గురించి చేసిన వ్యాఖ్యానాలు!అడిగితే చేసినా అడగకుండానే చేసినా సహాయం చెయ్యాలనుకోవడం మంచి పనే.దాని నెవరూ విమర్శించడం లేదు, గమనించారా?!

   Delete

 11. ఎ పి ప్రభుత్వ వినతి మేరకు ...
  చూ: http://goo.gl/1vls6n

  ReplyDelete
 12. http://www.t10live.com/view_news.php?id=412&title=KCR+helps+Andhra

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top