ఈ ప్రశ్న పంపినవారు : N. Sathya Sri


 పరిశోధనా రంగంలో, పేటెంట్ తీసుకోవటంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం ఏ స్థానంలో ఉంది?


Reactions:

Post a Comment

 1. మన నిర్మాతలు దర్శకులూ నాలుగు సినిమాలను చూసి వాటి లోనుండి కావలసిన ముక్కలు ఏరుకొని ఐదవ సినిమా తీస్తారు.

  మన పరిశోధక విద్యార్థులు నాలుగు పరిశోధనాగ్రంథాలను చూసి వాటి లోనుండి కావలసిన ముక్కలు ఏరుకొని ఐదవ పరిశోధనాగ్రంథం వ్రాస్తారు.

  మన సినిమాల నాణ్యత ఎంత బాగా ఉందో మనకు తెలుసు.
  మన పరిశోధనల నాణ్యత అంతే బాగా ఉందని మనం తెలుసుకోవాలి.

  అంతర్జాతీయంగా ప్రచురితం అవ్తుతున్న పరిశోధనా పత్రాలలో అడపాదడపా భారతీయ నామధేయాలూ కనిపిస్తాయి. కాని సర్వేసర్వత్రా వారంతా ఇతర దేశాలలో స్థిరపడి అక్కడి నుండి పరిశోధనలు చేస్తున్న వాళ్ళు.

  ఒకప్పుడు హరగోవింద్ ఖొరానాకు నోబెల్ బహుమతి వచ్చిందని సంబరపడ్డాం కాని ఆయన పరిశోధనలు మనదేశంలో జరిగాయా?

  భారతీయసంతతివారు అని చెప్పుకుని మురవటం మానాలి. దానివలన మనదేశానికి ఒరిగేదేమీ లేదు. మన దేశంలో శాస్త్రసాంకేతికరంగాలలో మౌలికవసతులు అభివృధ్ధి చేయాలి. తమాషాల్లాంటి పరిశోధనలకు డాక్టరేట్లు ఇవ్వటం మానాలి. అంతర్జాతీయంగా పోటీ పడటానికి దారులు వేయాలి.

  మన దేశం అప్పుడే శాస్త్రరంగాల్లో మరింతగా మంచిస్థానాన్ని అందుకోగలదు.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారూ మీ వ్యాఖ్యలోని ప్రతి అక్షరంతోనూ ఏకీభవిస్తున్నాను.

   మన యూనివర్సిటీల్లో సమాజమ్మీద 'సూక్ష్మరుణ సంస్థల ప్రభావం' అన్న విషయమ్మీద పరిశొధన కొన్ని వందలమంది చేశారట. నేను lecturerగా ఉన్నప్పుడు మా H.O.D. పది లక్షలు పారేసి ఒక ప్రొఫెసర్ guidenceలో PHD కొనడాన్ని దగ్గరనుండి గమనించాను. అయ్యా... జర్మనీలాంటి దేశాల్లో ఒకరు PHD చేస్తే.. అది ఒక national event. దాన్ని వార్తల్లోకూడా ప్రస్తావిస్తారు. మా ఆఫీసులో ఒక జర్మన్ PHd చేస్తే రెండువారాలవరకూ కంగ్రాచ్యులేషన్ల మోత మోగింది. మనదేశంలో డబ్బున్న ఎవడైనా డాక్టరేట్ సంపాదించెయ్యవచ్చు. Infact, మనదేశంలోని Phd holders మీద, డాక్టరేట్లమీద నాకు చాలా తక్కువ అభిప్రాయముంది.

   ఖోరానా, బోస్ లాంటి వాళ్ళు మనవాళ్ళే కానీ వారి పరిశోధనలు గుర్తించే స్థాయికి మనం ఈనాటికీ ఎదగలేదు. అంతెందుకు రామానుజాన్ని ఆ ఇంగ్లీషు ప్రొఫెసరు గుర్తించకుంటే, కూలీగా బ్రతికి చనిపోయుండేవాడు. సిగ్గుండాలిసార్ ఖొరానానీ, బోస్‌నీ మనవాళ్ళని చెప్పుకొని జబ్బలు చరుచుకోడానికి.

   Delete
  2. ఈ విషయంలో నేను శ్యామలీయం గారితో విభేదించడంలేదు. నా దురుసుతనం, నా కోపం వారినుద్దేశ్యించినవి కావు. అవి మన వ్యవస్థనుద్దేశ్యించినవి.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top