శాంతి - సహనం - అహింస ఏమయ్యాయి?


నేడు గాంధీ జయంతి. గాంధీని తిట్టినా పట్టించుకోకపోయినా నెహ్రూ కుటుంబాన్ని అంటే ఊగిపోతున్న వైనం. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ సూచనని తుంగలో తొక్కి కాంగ్రెస్ కు ఎన్నో తోకలు తగిలించి నేడు ఇందిరా కాంగ్రెస్ ను మాత్రమే ఉంచి నెహ్రూ కుటుంబానికి మాత్రమే ఊడిగం చేసే దుస్తితికి కాంగ్రెస్ రాజకీయం చేరింది. ఇది గాంధీని అవమానించడం కాదా?గాంధీగిరికి ఆయన వారసులమని చెప్పుకుంటున్న వారిస్తున్న విలువేమిటి?గాంధీని మనమెలా గౌరవిస్తున్నాం?
గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎటువెళుతోంది? దీనికి కారకులెవరు?

ఈ పాపం నేను చూడలేను .. ఇదా మనం కోరుకున్నదీ, నేను కలగన్నదీ? .. 


ఏనాడైతే స్త్రీలు అర్ధరాత్రి ఒంటరిగా స్వేచ్చగా తిరగగలుగుతుందో ఆనాడే మనదేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించినట్లు - మహాత్మా గాంధీ.

ఆడవారిపై అత్యాచారాల పర్వం ఎలా కొనసాగుతున్నదో, ఆడవారు కాదు మగవారు సైతం స్వేచ్చగా తిరగలేని అభద్రతా సమాజం కొనసాగుతున్నది.


మద్యపాన నిషేధాన్ని కోరిన గాంధీ జయంతి రోజున సైతం మద్యం షాపులు మూతపడవు. హాస్పిటళ్ల సంఖ్య పెరగడం అనాగరికం అని గాంధీ అంటే కార్పొరేట్ వైద్యం కోరలు సాచి వెక్కిరిస్తోంది. విదేశీ వస్త్ర బషిష్కరణ అని గాంధీ ఉద్యమం నడిపితే అమెరికాకు సామ్రాజ్యవాదులకు తొత్తులుగా నేటి పాలకులు విదేశీ మార్కెట్ కు తలుపులు తెరుస్తున్నారు. ప్రపంచీకరణ పేరుతో భారతీయ సంస్కృతినీ దిగజారుస్తున్నారు. గాంధీ కలలుగన్న రామరాజ్యం గ్రామ స్వరాజ్యం అడ్రెస్ మచ్చుకైనా కనిపించట్లేదు.

ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. గాంధీ గిరి అంటూ ఉపన్యాసాలు చెప్పే నేతలు ఎందరు ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు? ఎందుకు గాంధీ గిరి విఫలమవుతోంది? గాంధీ గిరిలో లోపాలున్నాయా? పాలకుల విధానాలలో లోపాలున్నాయా? ఎందుకు నేటి బారతం ఇలా తయారవుతోంది?


Reactions:

Post a Comment

 1. గాంధీగారు చెప్పినట్లుగా తొంభైలవరకూ విదేశీ వస్తువులనూ, కంపెనీలనూ అనుమానంగా చూశాం కాబట్టే (పాలనపరమైన విధానాల విషయంలో గాంధీగారి అభిప్రాయాలకి దగ్గరగా ఉండే నెహ్రూగారి సోషలిస్టువిధానాల ఫలితంగా) మన అభివృధ్ధి 3%కి అటూఇటూగా ఉండింది. ఆ తరువాత జరిగిన సంస్కరణల వలననే ఈనాటి అభివృధ్ధిరేటుగానీ, మధ్యతరగతి పరిమాణం పెరగటంగానీ జరిగింది. గాంధీగారి తరహా బహిష్కరణోద్యమాలు మనమున్న కాలానికి సరిపడవు.

  భారతీయ సంస్కృతిలోని విశిష్టగుణం దాని dynamism. బౌధ్ధానికి ముందు మన సంస్కృతి ఒకలా ఉంది. బౌధ్ధం తరువాత మన సంస్కృతి కొన్ని మార్పులు సంతరించుకొంది. ఇస్లాం ప్రభావంతో మన సంస్కృతి మరికొంచెం మారింది. క్రైస్తవంతో సంగమంవల్ల మళ్ళీమారింది. ఈ మూడు దశల్లోనూ విలువలు, నైతికత మారుతూ వచ్చాయి. బౌధ్ధం రాకతో అహింస పరమధర్మమై కూచుంటే, ఇస్లాం ప్రభావంతో architecture, literature ప్రభావితమయ్యాయి, క్రైస్తవం ప్రభావంతో ఒక్కసారిగా పవిత్రతకు ప్రాధాన్యత పెరిగింది. ఆయా కాలాల్లో సంస్కృతిరక్షకులమని చెప్పుకొనేవారు ఆమార్పులని 'దిగజారిపోవడంగానే' అభివర్ణించారు. ఇప్పుడు అలాంటి మార్పులే globalizationవల్ల కలుగుతున్నాయి. యధాప్రకారంగా మనం 'దిగజారుడు'తనంగా ఆమార్పులని అభివర్ణిస్తున్నాం.

  గాంధీగారు సత్యము, అహింస, కులనిర్మూలన వంటి గొప్పవిషయాలను బోధించి వాటికి మద్యపాన నిషేధాన్ని కూడా జతచేర్చారు. మిగిలివవాటిని గాలికొదిలేసినమనం చివరి అంశంపైనే concentrate చేస్తుంటాం :)

  గాంధీగారి గ్రామస్వరాజ్యం, అహింసాయుత ఉద్యమాలు మాత్రమే మన కాలానికి తగినవని నాఉద్దేశ్యం.

  ReplyDelete
 2. అహింసావాదం అంటే ఏమిటి? పేదవాళ్ళు ఆహారం, మందులు అందక చనిపోతే దాన్ని ఎవరూ హింస అనుకోరు కానీ మావోయిస్త్‌లు, అల్-ఖైదా లాంటివాళ్ళు చేసే దాన్నే హింస అనుకుంటారు. గాంధీ యొక్క అహింసా సిద్ధాంతంపై నాకు నమ్మకం లేదు. మనం అహింసని ఆచరించినంతమాత్రాన మన ప్రత్యర్ధులు మనల్ని చూసి మంచివాళ్ళుగా మారుతారనేది ఒక ఊహాజనిత ఆలోచన.

  జోన్ రాబిన్సన్ వ్రాసిన ఎకనామిక్ ఫిలాసఫీ చదివారా? వ్యాపారం వృద్ధి చెందాలంటే శాంతి ఉండాలి కానీ యుద్ధాలు ఉండకూడదు. అందుకే పెట్టుబడిదారులు యుద్ధాలని వ్యతిరేకిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే యుద్ధాలే రోజువారీ జీవితంలో భాగంగా ఉండేవి అని జోన్ రాబిన్సన్ అంటారు. Eternal wars పోయి ఈ పాటి నాగరీకత రావడానికి కారణం పెట్టుబడిదారీ వ్యవస్థే కానీ గాంధీగిరీ కాదు.

  ReplyDelete
  Replies
  1. నీ అభిప్రాయంతో పూర్తిగా యేకీభవిస్తున్నాను,శెభాష్ ప్రవీణ్!

   Delete
  2. అంగీకరిస్తున్నాను ప్రవీణ్. లాభదాయకంకాని యుధ్ధాలు నివారించబడతాయ్. ఇప్పుడు ఇరాక్ యుధ్ధం ఎందుకు జరిగిందో నాకు వివరిస్తారా? ఇరాక్ యుధ్ధానికీ హాలీబర్టన్ కంపెనీకీ, ఆయిల్ నిల్వలకూ గల సంబంధం వివరిస్తారా?


   గాంధీ శాంతివాదం గురించి నేనుదహరించింది internal situations గురించి. సరదాగా ఒక ప్రశ్న. మీ ఎమ్మార్వో/ఎమ్మెల్యే/ప్రభుత్యోగి లంచగొండితనాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఏంచేస్తారు? a)విప్లవాత్మక ధోరణిలో బాంబులతో దాడిచేస్తారు. b) ఒక ధర్ణాలో, ఘెరావో, దీక్షోచేసి మీ నిరసన తెలియజేస్తారు.

   ఇంకోప్రశ్న. అన్నా హజారే దీక్షబూనడమ్మ్మాని తుపాకీపట్టుంటే ఎంతమంది ఆయనని ఆదర్శంగా కొనియాడేవారు? మరోప్రశ్న మీనాన్నగారు పండక్కి కొత్తబట్టలు కొనివ్వకపోతే మీరేం చేస్తారు? a)లేపేస్తాం. b) అన్నం మానేసి అలుగుతాం.

   Delete
  3. ఇరాక్ యుద్ధం వల్ల చమురు కంపెనీలకి భద్రత ఖర్చు పెరిగి చమురు ధరలు పెరగడం తప్ప వచ్చే లాభం ఏమీ లేదు. ఇందియాతో పోలిస్తే అమెరికాలో ఆయిల్ వినియోగం చాలా ఎక్కువ కనుక అమెరికా ఆయిల్ కోసం యుద్ధాలకి తెగపడుతుంది. యుద్ధాలని మాటలు కంటే భౌతిక ప్రయోజనాలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి.

   Delete
  4. ఇరాక్ యుధ్ధంలో అమెరికా ఖర్చులను మిత్రదేశాల వధ్ద వసూలు చేసుకుంది. చివరకు అమెరికాకు ఆ యుధ్ధం జమాఖర్చుల్లో లాభం లెక్కతేలిందట.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top