Name:bonagiri 
E-Mail:deleted  
Subject:బుద్ధవిగ్రహాన్ని కూడ ఇచ్చేస్తారా? 
Message:
టాంక్‌బండ్‌మీద ఉన్న మహనీయుల విగ్రహాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందినవారి విగ్రహాలని తొలగించి భద్రంగా లారీలో ఆంధ్రప్రదేశ్‌కి పంపిస్తామంటున్నారు. మంచిదే! వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ రాజధాని, వాళ్ళ ఇష్టం. ఎవరి విగ్రహాలు ఉంచాలో, ఎవరి విగ్రహాలు తొలగించాలో నిర్ణయించే హక్కు, అధికారం వాళ్ళకి ఉంది. కాని ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను ఎవరో తెలియని వారివి, అక్కరలేనివి, పనికిమాలినవి అని వ్యాఖ్యానించడం, మొత్తం వ్యవహారాన్ని సభలో నవ్వులాటగా మార్చడం, ఉన్నతపదవులలో ఉన్నవాళ్ళ స్థాయికి తగ్గట్టుగా లేదు. ఆ మహనీయుల విగ్రహాలు ప్రస్తుతం పరాయి రాష్ట్రానికి చెందిన వారివైనా, మొన్నటివరకు ఒకే రాష్ట్రానికి చెందినవారివని, ఇప్పటికీ స్వంత దేశానికి చెందిన వారివే అని గుర్తుంచుకోకపోవడం దురదృష్టం. కొంతమంది ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు తెలంగాణాకి అన్యాయం చేసి ఉండవచ్చు, అంత మాత్రాన వారితో సంబంధం లేని మహనీయులని అవమానించడం అన్యాయం. కొన్ని విగ్రహాలని ఎంపిక చేసి తొలగించే బదులు, ఒకేసారి మొత్తం విగ్రహాలని తొలగించి, తరువాత వాళ్ళకి ఇష్టమయిన వ్యక్తుల విగ్రహాలను ఇష్టమయిన పద్ధతిలో మళ్ళీ ప్రతిష్టించుకుంటే ఇంకా బాగుంటుంది.

మరో మాట, ఈ విగ్రహాల్ని తొలగించి ఇచ్చేస్తామని అంటున్నారు కాబట్టి, హుస్సేన్‌సాగర్‌లో ఉన్న బుద్ధవిగ్రహాన్ని కూడ ఆంధ్రోల్లకి ఇచ్చేస్తారా? ఆ విగ్రహాన్ని స్థాపించింది కూడ ఆంధ్రోల్లే కదా! ఆ విగ్రహాన్ని కూడ ఆంధ్రోల్లకి ఇచ్చేస్తే విజయవాడలో కృష్ణానదిలోని భవానిద్వీపంలో ప్రతిష్టించుకుంటారు. ఒకప్పుడు బౌద్ధ సంస్కృతి వర్ధిల్లిన అమరావతికి సమీపంలోనే భవానీ ద్వీపం ఉంది కాబట్టి, బుద్ధ విగ్రహాన్ని అక్కడ స్థాపించడం సముచితమే అవుతుంది.
Reactions:

Post a Comment

 1. 1. కెసిఆర్ కేవలం కొన్ని "అనవసరమైన" వాటినే అన్నారు, అన్నీ అనలేదు.
  2. బుద్ధుడు ఆంధ్రుడు కాదు.
  3. ఆ విగ్రహం చెక్కిన రాయి నికార్సైన తెలంగాణా రాయి. యాదగిరిగుట్ట ప్రాంతంది.
  4. అది చెక్కిన గణపతి స్థపతి తమిళనాడుకు చెందిన వారు.
  5. ఆ విగ్రహాన్ని ఆంధ్రా వారేమీ వచ్చేటప్పుడు పట్టుకు రాలేదు. సమైక్య రాష్ట్ర నిధులతో తయారయింది.
  6. కేవలం అప్పుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి వుండడం వల్ల (మేం ఎన్టీఆర్ మావాడు కాదని అనుకోవడం లేదు) ఆ విగ్రహం అటువైపుది అయిపోదు. ఎన్టిఆర్ ఘాట్, ఆయన విగ్రహాలు చాలానే వున్నాయి మాదగ్గర.
  7. పంపకాల్లో ఆ విగ్రహాలన్నీ తెలంగాణాకి సొంతమయ్యాయి. వాటిలో ఏవి వుంచుకొవాలో, ఏవి మార్చాలో నిర్ణయించుకునే హక్కు పూర్తిగా తెలంగాణది మాత్రమే.
  8. తొలగించాలనుకున్న విగ్రహాలు ఆంధ్రులు కోరుకుంటే వారికి తరలించ బడతాయి.
  9. ఇది ఇవ్వు, ఇది వద్దు అని అడిగే హక్కు వారికి లేదు.

  ReplyDelete
 2. బుద్ధవిగ్రహాన్ని కూడ ఇచ్చేస్తారా?

  @ bonagiri గారు,
  ఎందుకివ్వాలి? ఎవరికివ్వాలి? సమైక్య ప్రభుత్వంలో తెలంగాణా వాటా లేదా? బుద్ధుడిపై ఆంధ్రాకు ఏ విధంగా హక్కు ఉందని వాదిస్తున్నారు మీరు? విడిపోయాక హైదరాబాద్ తెలంగాణాకు చెందుతుంది కాబట్టి అక్కడ ఏ విగ్రహాలుంచాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బుద్ధుడయినా మరెవరైనా మహనీయులనుండి వారిలోని మంచిని స్పూర్తిగా తీసుకోవాలి తప్ప పంతాలతో ప్రకటనలు చేసుకోవడం మంచిదంటారా?

  @ శ్రీకాంత్ చారి గారు,

  రాళ్లు ఎక్కడవైనా చెక్కినవారెవరైనా విగ్రహాలు పెట్టిన వ్యక్తి గొప్పతనం బట్టి నిర్ణయం ఉండాలి తప్ప ఏ ప్రాంతం వాడు, ఎవరు పెట్టారని చూడకూడదు.

  నా అభిప్రాయమైతే తెలంగాణా ప్రముఖులలో ఎవరెవరివి సమైక్య రాష్ట్రంలో విగ్రహాలను పెట్టకుండా ఉంచారో వాటిని ప్రతిష్టిస్తే సరిపోతుంది. మిగతావి యధాతధంగా ఉంచితే బెటర్.

  ఈ విగ్రాహాల ఆగ్రహాల కంటే ప్రజాసమస్యలపై దృష్టిపెడితే మంచిది. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 3. నేను ఇవ్వమని అడగడంలేదు. ఇచ్చేసే ఉద్దేశం ఉందా అని అడుగుతున్నాను. హక్కు, అధికారం వాళ్ళకే ఉన్నాయని ముందే వ్రాసాను. మొదటి పేరా మీద కూడ స్పందిస్తే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. బోనగిరి గారు, మొత్తం చదివి అవసరమని నేననుకున్న దానికి స్పందించానండీ. మీ ఉద్దేశం నాకర్ధం కావడం లేదు. బుద్ధుడిని మీరు చెప్పిన పద్ధతిలో భవానీ ద్వీపంలో స్మరించుకోవడం చేయడానికి ఈ విగ్రహమే కావాలా? కే.సీ.ఆర్ వ్యాఖ్యలలో ప్రతీదానికి ఆంధ్రోళ్లు అనేది ఒక వెకిలి పదం. ఆయన భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ఆ విగ్రహాలను ఏర్పాతు చేసిందనీ చెప్పాను వేరే సందర్భంలో. అప్పటి విగ్రహాల ఏర్పాటు కమిటీలో ఆయన కూడా సభ్యుడో సలహాదారు అని ఎక్కడో చదివిన గుర్తుంది. ఆధారాలు చూడాలి. ఆయన వెకిలిగా అన్నా, మీరు ఉక్రోషంతో అన్నా సమైక్య రాష్ట్రంలో ప్రజాధనంతో ఆ విగ్రహాలను నిర్మించారన్నదే సత్యం. మీరు ఈ విషయం తెలియక కోరుతున్నారా? కే.సీ.ఆర్ ఆంధ్రోళ్ళు అన్నాడు కాబట్టి అడుగుతున్నారా? అంటే కే.సీ.ఆర్ వ్యాఖ్యల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు చేయాలా? ఆ అవసరం లేదని నేను నా అభిప్రాయం చెప్పాను. బౌద్ధ సంస్కృతి తెలంగాణాలో వర్ధిల్లలేదా? కే.సీ.ఆర్ అనేది మాటల పదాల పొందికతో సహా బాగాలేనట్లే మీ ఉద్దేశం, భావమూ బాగాలేదన్నది నా అభిప్రాయం. అసలు విగ్రహాల ఏర్పాటే మంచి సంస్కృతి కాదనే వారూ ఉన్నారు. విగ్రహాలపై అనవసర రాధాంతం అనేది ప్రజా సమస్యలను పక్క దోవ పట్టించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

   Delete
 4. రాష్ట్ర రాజధాని లోని ప్రముఖమైన స్థలంలో కొందరిని వైతాళికులని చెప్పుకుంటూ వారి విగ్రహాలను పెట్టి వారికి ప్రముఖ స్థానం కల్పిస్తున్నప్పుడు, వారిలో ఎందరు నికార్సైన వైతాళికులు అని పునఃపరిశీలన చేసుకుంటే తప్పు లేదని నా అభిప్రాయం. అటువంటి పునఃపరిశీలన జరిగి సదరు విగ్రహాలలో కొన్ని మిగతా మహనీయుల స్థాయికి తగనివి వున్నాయని భావించినపుడు వాటిని స్థాన చలనం చేయడం కూడా తప్పు కాదు.

  కొన్ని అప్రాధాన్య విగ్రహాలు ఉన్నాయని ఇదివరకు జరిగిన చర్చలోనే అనుకోవడం జరిగింది. కాని ప్రభుత్వం తొలగించబోయే విగ్రహాలు ఏవో ప్రకటించకముందే వాటిపై వాదనలు చేయడం అనవసరమని నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. శ్రీకాంత్ చారి గారు. ప్రాంతీయ ద్వేషాలు లేకుండా మీరన్న పద్ధతిలో చేస్తే బాగానే ఉంటుంది. ఈ విషయమై శ్యామలీయం గారు, జై గారు గతంలో కొన్ని సూచనలు చేశారనుకుంటాను. నాకైతే విగ్రహాల అర్హతలపై అభిప్రాయం చెప్పేంత నాలెడ్జ్ లేదు. ప్రభుత్వం తొలగించబోయే విగ్రహాలేవో ప్రకటించకముందే రాద్ధాంతం చేయకూడదనే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఆరోగ్యకరమైన చర్చ అయితే చేయవచ్చు. విగ్రహాల ఏర్పాటనేది అన్ని ప్రాంతాలకూ సంబంధించినది కాబట్టి. అసలు మొత్తం విగ్రహాల ఏర్పాటుపైననే దేశవ్యాపితంగా ప్రభుత్వపరంగానే ఓ నిర్ణయం చేయాలన్న చర్చ చేసినా తప్పు లేదు.

   Delete
  2. కొండలరావు గారు,

   విగ్రహాల ప్రతిష్టాపన పైన కొన్ని గైడ్ లైన్స్ తయారు చేయాల్సిన అవసరం మాత్రం వుందని చెప్పగలను. తెలుగునాట ఒకప్పుడు గాంధీ, నెహ్రూల విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు అవి కనిపించడం లేదు కాని ఎక్కడ చూసినా వై.ఎస్.ఆర్, ఎన్.టి.ఆర్ ల విగ్రహాలు మాత్రం కనిపిస్తున్నాయి.

   Delete
  3. జగన్ రాజకీయ ప్రవేశం చేశాక విగ్రహాల గోల మరీ రోత పుట్టిస్తోంది. మీరన్నట్లుగా విగ్రహాల ఏర్పాటుకు నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ ఉన్నాయో లేదో తెలీదు. ఉంటే ఉన్నవాటినైనా అమలు జరపాలి.

   Delete
 5. KCR was a member in that committee. Pls follow the link.

  http://www.apchitchat.com/rama-rao-remarks-on-statues-creates-sensation/

  ReplyDelete
  Replies
  1. This is one andhra guy's claim, not evidence.

   Delete
  2. @ వజ్రం garu, ఇది ఆధారం చూపడం అవదు. ఆధారానికి సరిపడే మేటర్ ఇందులో లేదు.

   Delete
 6. శాసన సభలో జరిగిన చర్చ.ఇతరులు వ్యతిరేకించలేదు కాబట్టి యదార్ధం క్రిందే లెక్క. కాకపోతే ఈపాటికే అది సభా హక్కుల ఉల్లంఘన క్రింద భావించబడేది.

  ReplyDelete
  Replies
  1. కేసీఆర్ కూడా ఆ కమిటీలో సభ్యుదే అనేదాన్ని జీర్ణించుకోలేకనే దాన్ని వ్యతిరేకించలేకనే NTRనీ, వెన్నుపోటునీ NTR మీద చెప్పులు విసరదాన్నీ ప్రస్తావించి పక్కదారి పట్టాడు అనే విషయం తెలుస్తూనే వుందిగా!

   Delete
 7. సార్!అసలు కేసీఆర్ పనికిమాలిన వాళ్ళు అనదానికి క్రైటేరియా యేమిటో అర్ధం కాక మీరంతా ఇట్లా గోల చేస్తున్నారు!ఆయన్ దృష్టిలో నిన్నటి తరంలో యేవో మంచి పనులు చేసి వుండతం మాత్రమే టాంక్ బండ్ మీద కొలువు దీరటానికి పనికొచ్చే గొప్పతనం కాదు,తను రాజేసిన వేడి చల్లారకుండా యెన్నికల్లో తనకు వోట్లు రాల్చగలిగిన వాళ్ళు అని అర్ధం, అది మీకు అర్ధ మయితే ఇంత చర్చ జరిగి వుందేది కాదు!

  టాంక్ బండ్ మీద ఇప్ప్పుడు విగ్రహాలుగా వున్నవాళ్లలో యెవరయిన తెలంగాణా ప్రజలకు అపకారం చెయ్యటం గానీ తెలంగాణా సంస్కృతిని అవమానించటం గానీ చేశారా?తమ పరిధిలో తాము - కవులయితే కవిత్వం చెప్పదం ద్వారా దాత లయితే దానాలు చెయ్యదం ద్వారా సంస్కర్త లయితే దురాచారాల్ని పరదోలి ప్రజల్ని సంస్కార వంతుల్ని చెయ్యడం ద్వారా - ప్రజలకు సంతోషాన్ని కలిగించిన వారే తప్ప అన్యు లెవరయినా వున్నారా?అయినా సరే వాళ్లని వారి గొప్పదనంతో యేమాత్రమూ సరితూగలేని ఇవ్వళ్టి ఒక రాజకీఎయ నాయకుడు పనికిమాలిన వాళ్ళు అంటుంటే అది చెల్లిపోతున్నది!ఒకనాడు సాండర్స్ అనే ఒక పోలీసు తమకు అత్యంత గౌరవనీయుదయిన నిన్నటి తరం నేతను అవమానిస్తే సింహకిశోరాలై లేచిన భగత్ సింగుని గౌరవిస్తున్నాం.ఇక్కడ నిన్నటి తరంలో నిస్వార్ధంగా ప్రాంతాల కతీతంగా యేవో కొన్ని మంచి పనులు చేసిన వారిని కూడా మా ప్రాంతం వాళ్ళు కాకపోతే వాళ్లు పనికిమాలిన వాళ్ళే, వాళ్ళ పీఠాల్నించి వాళ్ళని తొలగించి తీరుతాం అంటూ యెవరు యే స్థానంలో వుండి యెలాంటి మాటలతో ఆ ప్రల్లదనాన్ని సమర్ధించుకుంటున్నారో చూస్తే తన పర భెదం తెలియకుండా పరోపకారం తో బతికిన వారి ఔన్నత్యం కూడా యెన్నికల్ల్లో వోట్లను విదిల్చే 200/- లేక్ 300/- రూపాయల కట్తల స్థితికి దిగజారి పోయింది కదా అని బెంగగా అంపిస్తున్నది!

  అందుకే "కారే రాజులు,రాజ్యముల్ గలుగవే,గర్వోన్నతిం బొందరే?వారేరీ?సిరి మూటగట్టుకు పోవన్ జాలిరే?" అనే పద్య పాదాన్నీ "అధికారాంత మందు జూదవలె గదా అయ్యల సౌభాగ్యములు!" అనే పద్య చరణాన్నీ జవాబుగా వేస్తే బహుశా కొందల రావు గారికి అసందర్భంగా తోచిందో యేమో పబ్లిష్ చెయ్యలేదు,ఇప్పుడు వ్యాఖ్యాన సహితంగా వున్న ఈ కామెంటును పబ్లిష్ చేస్తే నా భావం యెవరెవరికి యేయే విధంగా అర్ధం అవుతుందో మరి?!

  ReplyDelete
  Replies
  1. మీ కామెంట్లన్నీ పబ్లిష్ అయ్యాయండీ. మరోసారి చూసి చెప్పండి. మీరన్న కామెంటూ పబ్లిష్ చేశానే?

   Delete
  2. ఒక విషయం చెప్పాలండీ, ఇప్పుడు మీరు అవలంబిస్తున్న కామెంట్ మోదరేషన్ పధ్ధతి చాలా ఇబ్బందిగా వుంది నాకు.ఒక కామెంటు వేసిన తర్వాతా అద్ పబ్లిష్ అవ్వడానికీ మన కామెంటుకి అవతలి వాళ్ళ జవాబుని చూదటానికీ చాలా టైము పడుతున్నది!హీనపక్షం గంట!?

   ప్రవీణ్ ఒక్కడే ఇబ్బంది పెడుతున్నాడు తప్ప మిగిలిన యే వొక్కరూ పొరపాటు చెయ్యకపోయినా అందరికీ ఇదే ఇబ్బంది యెదురవుతున్నదనిపిస్తున్నది.చర్చల్లో మీరు కూడా పాల్గొంటున్నారు గనక మీరూ ఇలాగే ఫీలవుతూ వుంటే నాదొక సూచన!ఇదివరకటిలాగే వెంతనె పబ్లిష్ అయ్యేట్తు చెయ్యండి!

   ప్రవీణ్ సంగతి కొంతకాలం నాకొదిలెయ్యండి, నేను చూస్తాను.ఇప్పటికే గమనించి వుంటారు, తను మంచి కామెంటు వేస్తే శెభాష్ అనటం తింగరి కామెంటు వేస్తే అంత తింగరిగానే జవాబు చెప్తూ కొంత దారికి తీసుకొస్తున్నాను.ఇటీవలే కొంచెం వివరంగా కూడా నా వొపీనియన్ చెప్పి వున్నాను, ఆలోచించండి!మిగతా వాళ్ళ భావం కూడా తెలుసుకుందాం.కొన్నిసార్లు మంచి కామెంట్లే వేస్తున్నాడు,నాకూ అతని మీద ద్వేషం లేదు!

   నాకూ అలివి గాక విసుగొస్తే నేనూ ఇక లాభం లేదని చెప్తాను. ఇక ఫైనల్గా ఒకే ఒక పధ్ధతి - నిర్దాక్షిణ్యంగా తన పేరుతో వున్న కామెంట్లని మీరు అడ్మిన్ పానెల్ ద్వారా తొలగించి వెయ్యటం, యెలాగూ తొలగించబడతాయి గాబట్టి మిగతా వాళ్ళ్ళు యెవరూ అతనికి జవాబు చెప్పకపోవటం,అంతే!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top