Name:Marxist-Leninist 
E-Mail:deleted
Subject:ఆంధ్రాలో తెలంగాణ నాయకుల విగ్రహాలని పెడతానని చంద్రబాబు చేసిన ప్రకటన మీరు నమ్ముతారా? 
Message:ఆంధ్రాలో తెలంగాణా నాయకుల విగ్రహాలు పెడితే అందరి కంటే ముందు చంద్రబాబు విగ్రహం పెట్టాలి. తెలంగాణ చచ్చినా రాదనుకుని తెలంగాణకి అనుకూలంగా పార్తీతో తీర్మానం చెయ్యించడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాసాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అలా లేఖ వ్రాయడం వల్లే సోనియా దిగ్విజయ్‌లు తెలంగాణా ఇచ్చారు కనుక తెలంగాణ ప్రజలు చంద్రబాబుని మెచ్చుకోవాలి. తెలంగాణ నిజంగా రాదనుకుని కె.సి.ఆర్. నాలుగు రోజులు దొంగ నిరాహార దీక్ష చేసి తప్పించుకుందామనుకుంటున్న సమయంలో \"అసెంబ్లీలో తెలంగాణ బిల్ పెడితే మద్దతు ఇస్తాను\" అని చంద్ర బాబు ప్రకటించాడు. చంద్రబాబు అలా ప్రకటించడం వల్ల నైరాశ్యంలో ఉన్న తెలంగాణావాదుల్లో ఆశలు చిగురించాయి కనుక చంద్రబాబు తెలంగాణ ప్రజలకి మార్గ నిర్దేశకుడే అనుకోవాలి. ఆంధ్రాలో కాళోజీ, సురవరం ప్రతాపరెడ్డిల విగ్రహాలు పెడితే వాళ్ళ కంటే ఎక్కువగా తెలంగాణకి మేలు చేసిన చంద్రబాబు విగ్రహాన్నే ముందు ప్రతిష్ఠించాలి. రాష్ట్ర విభజనకి ప్రధాన కారకుడైన చంద్రబాబు నాయుడు తెలంగాణా ప్రజలు మరచిపోలేని నాయకుడు కాదా?
Reactions:

Post a Comment

 1. కాలం చెల్లిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ పని ఎందుకో చేయలేదు? ఇప్పుడు ఎవన్కి కావాలె?

  ReplyDelete
  Replies
  1. "కాలం చెల్లిన ఆంద్ర ప్రదేశ్" అంటే ఏమిటండీ? ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఇంకా వుంది. ఒకప్పటి సంయుక్త ఆంద్ర ప్రదేశ్ అని గౌరవ ప్రదంగా రాయచ్చు కదా?

   Delete
 2. ట్యాంక్ బండ్‌పై ప‌నికి రాని విగ్ర‌హాల‌ను తొల‌గిస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టిస్తే గానీ.. ఆంధ్రాలో తెలంగాణ మ‌హ‌నీయుల విగ్ర‌హాలు పెడ‌తామ‌న్న మాట రాలేదంటే వీళ్ల‌ను ఏమ‌నాలి.. ఒక‌వేళ ట్యాంక్ బండ్ విగ్ర‌హాల గురించి కేసీఆర్ మాట్లాడ‌కుండా ఉంటే ఆంధ్రాలో తెలంగాణ మ‌హ‌నీయుల విగ్ర‌హాలు పెడ‌తామ‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చేదా?

  వీళ్ల వంచ‌న మాట‌ల‌ను మ‌నం న‌మ్మొచ్చా? మ‌ళ్లీ వంచ‌న‌కు గురైతే త‌ప్పు మ‌న‌దే కాదా?

  Source: http://telanganaassange.blogspot.in/2014/10/blog-post_57.html

  ReplyDelete
  Replies
  1. దొంగలు పడ్డ ముప్పయి ఏళ్లకు కుక్కలు మొరగడం ఇదే మొదటిసారి!

   Delete
 3. చంద్రబాబు, జగన్‌లు తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇచ్చారు కాబట్టే తాము తెలంగాణా ఇచ్చామని దిగ్విజయ్ సింగ్ బహిరంగంగా చెప్పుకున్నాడు. అయిన సమైక్యవాద TV చానెల్‌లు కాంగ్రెస్‌కి మాత్రమే వ్యతిరేకంగా ప్రచారం చేసాయి. అందుకే సీమాంధ్రలో కాంగ్రెస్ ఓడిపోయింది. పచ్చ చానెల్‌లు లేకపోతే సీమాంధ్రలో కూడా కాంగ్రెసే గెలిచేది.

  ReplyDelete
 4. పాలకుల అసలు రంగు కనపడుతోందిక్కడ. ఇన్నేళ్ల సమైక్య రాష్ట్రం లో ఆ పని ఎందుకు చేయలేదు? ఇప్పటిదాకా ఆ రాజనీతిజ్ఞుడికి కనువిప్పు ఎందుకు కలగలేదు? ఇప్పుడు కే.సీ.ఆర్ వార్నింగ్ కి జడిసి చేస్తున్నాడా? తప్పుకు పశ్చాత్తాపపడి చేస్తున్నాడా? రెండోదైతే ముందు ఇన్నాళ్ల పాపానికి క్షమాపణ చెప్పి ఆ పని చేయమనండి. ఇక కే.సీ.ఆర్ ఉన్న విగ్రహాలు తీస్తాననడం కంటే సమైక్య రాష్ట్రంలో పెట్టని తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఉంచితే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. భలేవారే. కేసీఆర్ గారు ఉన్న విగ్రహలు ఎందుకు తీయిస్తారు? అవి ఎలాగూ తీయబదతాయి. కాని ప్రజలు ఆవేశంతో చేసారు దానికి గవర్నమెంతు ఎంచేస్తుందీ? నేను తీసానా? టీఆర్‌ఎస్ పార్టీ తీసిందా? ఎందుకు దిమాక్ లేని మాతలు అని విరుచుకు పడతాడు ఆ పిమ్మట తప్పన్న వాళ్లందరి మీదా. పాత టెక్నిక్కే!

   Delete
  2. ఎవడి టెక్కునిక్కులు వారివి లెండి. ఎవరికీ ఎవరూ తీసిపోరు ఇద్దరు చంద్రులలో. ఎవడి టెక్కునిక్కులైనా ప్రజానుగ్రహం ఉన్నంతవరకే. ప్రజాగ్రహం వస్తే ఎంతవారలైనా ఏ టెక్నికులూ పని చేయవు.

   అప్పట్లో ఆ విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటీలో కే.సీ.ఆర్ కూడా సలహాదారుడిగానో సభ్యునిగానో ఉన్నాడని "" విగ్రహాల గోలపై ఓ పోస్టులో ఎక్కడో చదివినట్లు గుర్తు. అదే నిజమైతే కే.సీ.ఆర్ కూడా తెలంగాణా ప్రముఖులవిగ్రహాలకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాలి.

   ఇక్కడి అసలు ప్రశ్న బాబుకు బుద్ధి వచ్చిందా? అన్నది. తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఇప్పుడు ఆంధ్రాలో ఏర్పాటు చేస్తాననడం వెనుక ఆంతర్యమేమిటన్నదానికి బాబు ఎండ్ కంపెనీ సమాధానం చెప్పాలి.

   విగ్రహాలను రాజకీయం చేసి ప్రజా సమస్యలను పక్కదోవపట్టిద్దామనుకునే వారికి కొంతకాలమీ ఆట బాగానే ఉంటుంది.

   Delete
  3. @శ్యామలీయం:

   అక్కరలేదండీ, ప్రభుత్వమే బాజప్తా రాష్ట్రేతరుల విగ్రహాలు తొలగించాలి. అలా చెయ్యని పక్షంలో ప్రజలు కాళోజీ చెప్పినట్టు "ప్రాణంతోనే పాతరేస్తం" అన్న సూక్తి తెరాస/కెసిఆర్ మీద అమలు చేస్తారు.

   @Kondala Rao Palla:

   అసలు ఆ కమిటీలో ఎవరు ఉన్నారు? వాళ్ళ మార్గదర్శకాలు ఏమిటి? నివేదిక ఇచ్చిందా లేదా? ఇస్తే అందులో ఏముంది? ఇవేవీ తెలియకుండా ఎక్కడో ఏదో చదివినట్టు గుర్తుండి ఊహాగానాలు ఎందుకండీ?

   అయినా కమిటీలదేముంది? అశోక్ గజపతి రాజు, ఎర్రన్నాయుడు, యనమల ముగ్గురితో వేసిన టీడీపీ కమిటీ తెలంగాణా ఇవ్వాలని చెప్పింది. దీన్నే పాలిట్బ్యూరో ద్రువీకరించాక మానిఫెస్టోలో కూడా పెట్టారు. కేంద్రం తెలంగాణా ఇచ్చాక తగుదునమ్మా ఈ ముగ్గురు ఊసరవెల్లులు రంగులు మార్చారు. ఐవో కమిటీలు, వీల్లవో బతుకులు!

   Delete
  4. @ Jai Gottimukkala, నేను ప్రజ బ్లాగులోనే ఎవరి కామెంటులోనో చదివాను. అది చెప్పటం గూడా తప్పేనా జై గారు. అప్పటి కమిటీని నేనైతే మార్చలేను కదా? నేఊహిస్తే కమిటీ మారదు కదా? మీకేమైనా తెలిస్తే చెప్పండి లేదా తెలిసినవారు చెప్పినా ఫర్వాలేదు. విగ్రహాలు ఆగ్రహాలు ఇప్పటి చెత్త నేతల వైహరులతో ఎప్పటినుండో తెలుగువారిలో ప్రముఖులుగా ఉన్నవారిని అవమానించడం ఎందుకండీ. వారెవరూ ఫలానావారివే పెట్టండని చెప్పలేదు కదా? ఎవడిమీదనో ఉన్న అక్కసు విగ్రహాలపై ఎందుకు? అప్పటి పాలనలో కే.సీ.ఆర్ కూడా భాగస్వామ్యుడేనన్నది తుడిచేయలేని చరిత్ర. అందుకే అప్పట్లో జరిగిన తప్పులను సరిచేస్తే సరిపోతుందంటున్నాను. అయినా తొలగించాల్సిందే అంటే ఎవరిష్టం వారిది. నా అభిప్రాయం చెప్పాను.

   Delete
  5. కొండలరావు గారూ:

   కామెంటులలో రాసినవి అన్నీ నిజాలు కానక్కరలేదన్న విషయం మీకు విదితమే. ఒక అభిప్రాయానికి రాకముందు కొంత అధ్యయనం చేయాలి. ఏకపక్షంగానో పుకార్లనో ఆధారంగా చేసుకొని వెళితే బాగుండదని నా అభిప్రాయం. కాదంటారా మీ ఇష్టం.

   నాకు విగ్రహాల మీద అక్కసు లేదు. వాటి తాలూకా వ్యక్తులను నేను అవమానించలేదు. ఎవరి రాష్ట్రంలో వారి మహనీయులను సత్కరించడమే ఆనవాయితీ. ఇలా చెప్పడం అవమానం ఎలా అవుతుంది?

   Delete
  6. కామెంటులో వ్రాసినవన్నీ నిజాలు కానవసరం లేదనే మీ అభిప్రాయం సరయినదే. అదే సందర్భంలో నేను అది నిజమని నిర్ధారించలేదనేదీ గమనించాలి కదా? పుకారు కాదండీ ఎవరి కామెంటో గుర్తు లేదు. మీకు విగ్రహాలమీద అక్కసు ఉందని గానీ, ఆ వ్యక్తులను అవమానిస్తారనే అభిప్రాయం-అంచనా నాకు లేదు జై గారు. నేనన్నది రాజకీయ నేతలను తప్ప మిమ్ములను కాదు. నా అభిప్రాయమైతే విగ్రహాలను తరలించడం కంటే సమైక్య రాష్ట్రంలో మరచిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలను ప్రతిష్టిస్తే బాగుంటుంది. అన్ని రాష్ట్రాలలోనూ ఇతర రాష్ట్రాల ప్రముఖుల విగ్రహాలనూ ఉంచుతున్నారు. కాకపోతే టేంక్ బండ్ పై విగ్రహాల ఏర్పాటు ప్రాముఖ్యత వేరు. ఏమైనా దీనిపై నియమ నిబంధనల ఏర్పాటుతో చేస్తే భవిష్యత్తులో వివాదాలు రావేమో.

   Delete
  7. "పుకారు కాదండీ ఎవరి కామెంటో గుర్తు లేదు"

   ఇప్పుడే ఒక వ్యాఖ్యాత ఒకానొక బ్లాగు నుండి ఒక ఆంద్ర ఎమెల్యే మాటను "ఆధారం" ఇచ్చారు లెండి. ఇంత బలహీనంగా ఉన్న "ఆధారాన్ని" పుకారు అనడమే సబబు.

   "సమైక్య రాష్ట్రంలో మరచిన"

   ఉమ్మడి రాష్ట్రంలో చిన్నచూపు చూసిన!

   "అన్ని రాష్ట్రాలలోనూ ఇతర రాష్ట్రాల ప్రముఖుల విగ్రహాలనూ ఉంచుతున్నారు"

   ఇది వాస్తవం కాదేమో? జాతీయ స్థాయి నాయకుల స్మారకాలు ఉంచవచ్చు. అందులో కొన్నిటిని కొందరు "ఇతర రాష్ట్రాల ప్రముఖుల" అనుకుంటున్నామని నా అభిప్రాయం.

   "భవిష్యత్తులో వివాదాలు రావేమో"

   గత ఎన్నో ఏళ్లుగా తెలంగాణా రావొద్దని అయినదానికీ కానిదానికీ రాద్దాంతం చేసే బ్లాగోత్తములు ఉండగా వివాదాలు ఎందుకు రావండీ తప్పక వస్తాయి. తెలంగాణా వచ్చిందనే ఉక్రోషం ఇప్పట్లో తగ్గదని నా అనుమానం.

   మీరు అన్నారు కాబట్టి నాకు తోచిన కొన్ని విధానాలు "ప్రశ్న"గా పంపిస్తున్నాను. చూద్దాం ఎలాంటి స్పందన వస్తుందో?

   Delete
  8. "గత ఎన్నో ఏళ్లుగా తెలంగాణా రావొద్దని అయినదానికీ కానిదానికీ రాద్దాంతం చేసే బ్లాగోత్తములు"
   -----------------
   ప్రస్తుతం దొర గారిని నెత్తిన ఎక్కించుకొంటూ, నిరంతర ద్వేష ఘోష, కామెంట్స్ పెడుతునా బ్లాగోతాములు తక్కువా :)

   "తెలంగాణా వచ్చిందనే ఉక్రోషం ఇప్పట్లో తగ్గదని నా అనుమానం."
   ------
   తెలంగాణా వచ్చినా రక్తం లో ఉన్న నీ బాంచెన్ దొర అనే మెంటాలిటీ, ప్రతి దానికీ ప్రక్క వాళ్ల మీద పడి ఏడవటమనే mental disorder ఎప్పటికీ తగ్గదేమో ముందు చూసుకోండి సారూ "))

   Delete
  9. < తెలంగాణా వచ్చినా రక్తం లో ఉన్న నీ బాంచెన్ దొర అనే మెంటాలిటీ >

   రక్తంలో ఉన్న అంటే తెలంగాణా రక్తం అనా? ఇలాంటి మాటలు మంచివి కావండి. రక్తం శరీరంలో ఉంటుంది తెలంగాణాలో ఆంధ్రాలో అంటూ దానికి గుణాలు ఏర్పడవు. తెలంగాణా నిజం ప్రభువు క్రింద ఉంటే మరి ఆంధ్రా బ్రిటీష్ పాలన క్రిందనే కదా ఉన్నది. రెండు చోట్లా బానిసత్వమే ఉన్నది. రెండు చోట్లా వీరులు పోరాడారు. ప్రజలు మద్దతిచ్చారు. గుంటనక్కలు సహకరించాయి. ఇది ఎప్పుడయినా ఉండేదే.

   Delete
  10. కొండలరావ్ గారు,
   నేను 'ఇది ఎప్పుడయినా ఉండేదే' దానితో ఏకీభవిస్తున్నా, అలాగే దోపిడీ అనేది ఏ ప్రాంత రాజకీయనాయకుడయినా కలసి మెలసి చేసిందే, మరి దానికి ఎందుకండి ఒకరి మీద పడి ఏదవటం?, అలాగే, తెలంగాణా వచ్చినదన్న ఉక్రోషం ఎవరికయినా ఎందుకుంటుంది, ఉంటే గింటే విభజన ఏకపక్షం గా జరిగిందనో, తమ తమకి రావాల్సిన వాటా గురించో ఉంటుంది కాని.....

   అది reactive కామెంట్ కొందరికి ఉక్రోషం అవతలివాళ్లలో కనిపించటం, అది తగ్గదన్న ఏడుపు ఉండటం ఎంత సహజ న్యాయమో, అలాగే మరికొందరికి అవతలవారి రక్తం లో నీ బాంచెన్ (దొర గారు ఏమి చేసినా) కనిపించటం కూడా అంతే సహజ న్యాయం కాదా!!

   ఇప్పుడు చెప్పండి ఏవి మంచి మాటలో!!

   Delete
  11. నాటి దొరలకైనా నేటి పాలక దొరలకయినా ఏ రాష్ట్రం వారైనా జై కొడతానంటే బానిసత్వంగా ఉండి ఊగిపోతానంటే అది వారి ఖర్మ.

   reactive కామెంట్ అయినా భాష సరిగా ఉండడమే మంచిది. అలవాటుగానో ఎదుటివారిపై మీరన్న పద్ధతిలో reactive కామెంట్ అయినా తప్పును సరిచేసుకోవడమే సంస్కారం.

   తెలంగాణా వచ్చిందన్న ఉక్రోషం కొందరిలో ఉండవచ్చు. అందరికీ ఉండదు. అలాగే తెలంగాపై శృతిమించిన ప్రేమా అందరికీ ఉండదు. విభజన ఏకపక్షంగా దారుణంగా జరగడమనేది రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. దానికి తెలంగాణా వారు గానీ, తెలంగాణా బ్లాగర్లు కానీ కారణం కాదు. కాంగ్రెస్ అధిష్టానమే సమాధానం చెప్పాలి. విభజన ఏకపక్షంగా జరగడం వల్ల ఆంధ్రాకే కాదు తెలంగాణాకు అన్యాయం జరిగింది.

   దోపిడీ అనేది ప్రాంతాన్ని బట్టి ఉండదు. విధానాలను బట్టి ఉంటుంది. తెలంగాణాలోనూ దోపిడీ యదేచ్చగా కొనసాగుతూనే ఉంటుంది దోపిడీ విధానాలు మారేవరకూ. దోపిడీ అనేది విశ్వజనీనమైనది తప్ప ప్రాంతీయం కాదు.

   అవతలి వారి రక్తం అనేది తప్పు కొందరి రక్తంలో అవతలా ఇవతలా నేటికీ దొరల పూజ కొనసాగుతున్నది. ఎవరి గోల వారిది. ఎవరి గోల్ వారిది.

   మీరా వ్యాఖ్యను ఉపసమ్హరించుకోవాలే తప్ప ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి. అంతకు మించి నేను వాదించేదేమీ లేదండీ.

   Delete
  12. అది ఓ దూల కామెంట్ కు ఇంకో దూల కామెంట్ తప్ప, అంతకంటే ఎక్కువుగా తీసుకోకండి.

   కొందరిలో ఉక్రోషం ఉన్నది అంటూ ఎత్తిపొడవటం ఎంత తప్పో,రైటో, కొందరి రక్తం లో నీ బాంచెన్ అంటూ కాల్మొక్కటం ఉన్నది అంటూ ఎత్తిపొడవటం అంతే తప్పో, రైటో అన్నది నా ఉద్దేశ్యం.

   ఇక, దూల కామెంట్ లో మీకెంత సంస్కారం కనిపించిందో, అది ఎలా సమర్ధనీయమో మీకే వదిలేస్తున్నాను.

   ఒకటి మాత్రం గుర్తుకు చెయగలను, అవతిలివాడి వైపు ఒక వేలు చూపిస్తే, మనవేపు ఎన్నివేళ్ళు చూపిస్తాయో అన్నది అందరకీ వర్తించేదే (నాతో సహా).

   చివరిగా ఇది మీ బ్లాగు, మీ ఇష్టం, రిమోట్ మీ చేతిలోనే ఉన్నదని మాత్రం గుర్తు చేయగలను.

   ఇక దీనిమీద వాదోపవాదనలు చేయను, స్వస్తి.

   Delete
  13. @Venky:

   మీరు చెప్పిన "బాంచెన్ కాల్మొక్త" సంస్కృతి మానేసి దశాబ్దాలు అయ్యింది. ఇప్పుడంతా "ప్రాణంతోనే పాతరేస్తం" అనే స్థైర్యమే. నిజాము/దేశ్ముఖ్/రజాకార్ కూటమి అయినా, ఆంద్ర బడాబాబులయినా ఇదే జరిగింది. రేప్పొద్దున తెలంగాణా ప్రయోజనాలను అమ్ముకున్నా లేదా కాలరాసినా ఏలిన వారికి ఇదే శాస్తి.

   మాకు తెలంగాణా ముఖ్యం, ఫలానా పార్టీ/వ్యక్తీ కాదు.

   Delete
  14. "విభజన ఏకపక్షంగా దారుణంగా జరగడమనేది రాజకీయ ఎత్తుగడలతో జరిగింది"

   ఏమిటండీ దారుణం. ఒక్క ఉదాహరణ చెప్పండి చూద్దాం.

   Delete
  15. జై గారు, ఏకపక్షంగా అంటే తెలంగాణాకో, ఆంధ్రాకో ఏకపక్షంగా అని కాదు. ఆ విషయమూ నా కామెంటులో ఉన్నది. ఏకపక్షంగా అంటే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి తెలంగాణానుండి కే.సీ.ఆర్ ద్వారా, ఆంధ్రానుండి జగన్ ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ యమాస్పీడుగా ఆఘమేఘాలమీద ఇష్టమొచ్చినట్లు చేయడమని నా అభిప్రాయం.

   ఒక్క ఉదాహరణ చెప్పండి. మీకు తెలియకే అడుగుతున్నారా? విభజన బిల్లులో 2 రాష్ట్రాలకూ సమానంగా న్యాయం జరిగిందా? అసలు చర్చిందే పద్దతి విభజించే పద్దతీ అదేనా?

   Delete
  16. వెంకీ గారు, నేను ఎవరికామెంటునో సమర్ధించి మిమ్ములనడగలేదు. మీ కామెంట్లో నాకు అభ్యంతరమనిపించినది అడిగాను. నా బ్లాగు నా ఇష్టం ఇది నేను తెలంగాణా వారినుండీ ఎదుర్కున్నాను ఆంధ్రావారినుండీ ఎదుర్కున్నాను. ఇప్పుడు తాజాగా మీరు. నేనడిగినదానిలో తప్పు ఉందని నేననుకోవడం లేదు. నేనెవరి తప్పులనూ దూల కామెంటులనూ సమర్ధించలేదు. నేనడిగింది మొత్తం కామెంట్ గురించి కాదు మీరు మన ఇరువురి కామెంట్లు పరిశీలించి ఆలోచించ్కోవాలనేది మళ్లీ చెప్పగలిగేది తప్ప నా బ్లాగు నా ఇష్టం అనే ధోరణిలో ఉన్నానని మీరెలా చెప్పగలరు?

   Delete
  17. కొండలరావు గారూ, అఖిల పక్ష సదస్సులు జరిగాయి. శ్రీకృష్ణ కమిటీ ఊరూవాడా తిరిగింది & అప్పాయింటుమెంటు అడిగిన ప్రతి ఒక్కరినీ కలిసింది. సంప్రదింపులు జరపలేదన్న మాట అబద్దం. తమ కోరికను మన్నించలేదని అనడం వేరే, తమను సంప్రదించలేదనడం వేరే.

   తెలంగాణా ఆవిర్భావం చాలా జాప్యం జరిగితే మీకు ఆగమేఘాలు గుర్తు రావడం బాగుంది! 2009 డిసెంబర్ నుండి అవకాశం ఎవరూ వాడుకోలేదు.

   అసెంబ్లీ చర్చకు ఇంతకముందు ఎ రాష్ట్రానికీ ఇంత సమయం ఇవ్వలేదు. తెలంగాణా విరోధులు దాన్ని వాడుకోక డ్రామాలు చేస్తే అది వారి ఖర్మ.

   తెలంగాణా ఏర్పాటు చట్టంలో ఆంద్ర రాష్ట్రానికి (తెలంగాణకు కాదు) జరిగిన ఒక్కటంటే అన్యాయం చెప్పండి చూద్దాం.

   Delete
  18. విభజించిన పధ్ధతి వల్ల సీమాంధ్ర కన్నా తెలంగాణకే అన్యాయం జరిగింది. స్థానికుల ఆమోదం లేని పోలవరం ముంపు గ్రామాల ధారాదత్తం, హైదరాబాదుపై ఆంక్షలు కొన్ని ఉదాహరణలు. అయినప్పటికీ ప్రజలు "విభజన ఏకపక్షంగా దారుణంగా" జరిగినట్టు భావించలేదు. సాధారణ పరిస్థితుల్లో అలా భావించే వారేమో. కాని ఆవిధంగా ఆలోచించక పోవడానికి కారణం సీమాంధ్ర శక్తులు తమ కుయుక్తులతో అడుగడుగునా విభజనకు అడ్డు తగలడమే. బలీయమైన వారి ధనబలం, రాజకీయ బలానికి కాంగ్రెస్ తలొగ్గడం వల్లే విభజన పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. తమ ప్రభుత్వ చివరిక్షణాల్లో విభజించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత తమవైపు నిలిచినట్టే భావించారు తెలంగాణ ప్రజలు. అందుకనే ఆంధ్రలో ఒక్కసీటు కూడా దక్కక పోతే తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష హోదా దక్కింది ఆ పార్టీకి.

   Delete
  19. మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను శ్రీకాంత్ చారి గారు. కాంగ్రెస్ తెలంగాణాను ఇవ్వదలచుకుంటే ఇది సమయం కాదు. ఎప్పుడో ఇవ్వాలి. అప్పుడాపింది రాజకీయ ప్రయోజనాలకే. ఇప్పుడిచ్చిందీ రాజకీయ ప్రయోజనాలకే.

   సీమాంధ్ర నేతలు ధనబలం లాబీయింగులను నడపడం వల్లనే చాలాకాలం మేనేజ్ చేయగలిగారనేది నిజం. రాష్ట్రంలో ఎక్కడా సమైక్య ఉద్యమం జరగలేదని నేనింతకముందే చెప్పాను. కేవలం హైదరాబాద్ కోసమే పెట్టుబడిదారుల రెచ్చగొట్టుడు ఉద్యమమే జరిగింది కనుకనే వారు ఫెయిల్ అయ్యారు.

   విభజన - సమైక్యం ప్రజల ప్రయోజనాలనేవి ఎవరి వాదనలు వారివి. అవి ఆచరణలో రానున్న కాలంలో తేలతాయి. 2 రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి పరస్పరం సహకరించ్కుంటూ పోటీపడి ప్రజల పక్షాన పని చేయొచ్చు. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. 2 చోట్లా ఆర్భాటాలే తప్ప ఆచరణలో ప్రగతి కనపడడం లేదు. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.

   విభజనవల్ల తెలంగాణాకే ఎక్కువ అన్యాయం జరిగిందనేది నిజం. కొన్ని విషయాలలో ఆంధ్రాకు అన్యాయం జరిగింది. ఇప్పుడైనా ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు సమన్వయంతో పనిచేస్తే కొంత ఫలితం ఉంటుంది. కానీ అదై జరిగే పని కాదు. హైదరాబాద్ పై ఉమ్మడి పెత్తనం అనేది సరయినది కాదు.

   ప్రజలు విభజన జరిగింది కనుకనే TRS కు పట్టం కట్టారు. ఎందుకంటే విభజన్ జరిగాక తమ ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం ఉన్నవారిలో కే.సీ.ఆర్ నే చూశారు శక్తివంతుడిగా. వాస్తవమూ అంతకంటే సమర్ధుడూ లేడు ఉన్నంతలో.

   విభజనవల్ల కాంగ్రెస్ ఎక్కువగా నష్టపోయింది. టీ.ఆర్.ఎస్ టీ.డీ.పీ లు లాభపడ్డాయి. విభజన జరుగక పోతే టీ.డీ.పీ బాగా దెబ్బతినేది.

   Delete
  20. శ్రీ కృష్ణ కమిటీ ఊరూవాడా తిరిగి మంచి రిపోర్టే ఇచ్చింది. దానిని సీమాంధ్ర తొత్తులుగా ఇచ్చరాని విమర్శించినవారున్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుని బేస్ చేసుకుని తెలంగాణా ఇవ్వలేదు. కాంగ్రెస్ కాకిలెక్కలో కోసం ఇచ్చింది. కాంగ్రెస్ ఇవ్వదలచుకుంటే ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిందనేది జగమెరిగిన చర్వితచరణ సత్యమే.

   తెలంగాణా ఏర్పాటులో జాప్యానికి కారకులు ఎవరు? కాంగ్రెస్ బీజేపీలు కాదా? వీరిద్దరూ సీమాంధ్రా లాబీయింగుకు తలొగ్గలేదా? అప్పుడలా తలొగ్గి హడావిడిగా అహంకారంగా విభజన ప్రకరియ చేయాల్సిన అవసరం లేదు. 2009 తరువాత అందరినీ సంప్రదించి చేయొచ్చు.

   కాంగ్రెస్ సంప్రదింపులు సక్రమంగా చేసినా ఎవడికీ అర్ధం కాని చిత్ర విచిత్ర భాష మాట్లాడిన చంద్రబాబు ఎప్పటికైనా ఒక్క మంచి సలహా అయినా ఇవ్వలేడు. విడిపోవడం ఖాయమని తేలాక కూడా అప్పటికే అలవాటయిన లాబీయింగులే చేశారు తప్ప ఎవడూ విభజన సమస్యలపై దృష్టి పెట్టలేదు. సమన్యాయం అంటే ఏమిటో ఇప్పటికైనా చంద్రబాబు చెప్పగలిగితే ప్రపంచ వింతే అవుతుంది.

   అసెంబ్లీ చర్చకు సమయమిస్తే సీమాంధ్ర నేతలు సీ.ఎం కిరణూ అహంకారం పిచ్చి డ్రామాలే ప్రదర్శించారు. ఇక్కడ అసెంబ్లీలో పిచ్చ వేషాలే అక్కడ పార్లమెంటులోనూ వేశారు. ఇక్కడా అక్కడా సీమాంధ్రనేతలు బాధ్యతగా వ్యవహరించలేదు. దీనికి కారణం తరతరాలుగా అలవాటైన లాబీయింగు కల్చరే. ప్రజా పోరాటాలు చేతకాకపోవడమూ అలవాటు లేకపోవడమే.

   సీమాంధ్రకు ఒక్క అన్యాయమూ జరగలేదనేవారితో వాదించినా ప్రయోజనం ఉండదు లెండి. రాజధాని నిర్మాణానికి సీమాంధ్రకు ఏమి చేశారో చెప్పండి.

   Delete
  21. >>> శ్రీ కృష్ణ కమిటీ ఊరూవాడా తిరిగి మంచి రిపోర్టే ఇచ్చింది.

   శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చింది ఒక దిక్కుమాలిన రిపోర్టని తెలంగాణా వాదుల భావన. ఆ కమిటీ రిపోర్టు బాబు రెండుకళ్ళ సిద్ధాంతం కన్నా అధ్వాన్నం. ఆరు ఆప్షన్లు ఇవ్వడం ద్వారా అది తన క్రెడిబిలిటీ కోల్పోయి ప్రజలను మరింత సందిగ్ధంలోకి నెట్టింది. ఇక ఎనిమిదో చాప్టరు విషయం చెప్పనక్కరనే లేదు. మిగతా ఏడు చాప్టర్లు ఎందుకు ఆ విధంగా వున్నాయో, దానిపై తెలంగాణా వ్యతిరేక శక్తుల ప్రభావం ఎంతగా వుందో ఆ చాప్టరులో ఉద్యమాన్ని వంచించడానికి ఇచ్చిన సూచనలవల్ల తేటతెల్లం అవుతుంది.

   Delete
  22. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలాంటిదో అన్న విషయం అప్రస్తుతం. కమిటీ అడగందే పాపం అంటూ అందరికీ తమ బాధ చెప్పుకొనే అవకాశం ఇచ్చింది. అంచేత "ఏకపక్షం" అంటూ రాగం పాడడం భావ్యం కాదు.

   తెలంగాణా ఏర్పాటులో జాప్యానికి ఆంద్ర పార్టీలన్నీ భాగస్వాములే. డిసెంబర్ 9 ప్రకటన తరువాత చంద్రబాబు చిరంజీవులు తమ మానిఫెస్తోకు కట్టి బడి ఉంటె అప్పుడే తెలంగాణా వచ్చేది. ఈ వాస్తవాన్ని మనం మరువకూడదు.

   కాంగ్రెస్ తెలంగాణా ప్రజలతో ఆటలాడింది కాబట్టే ప్రజలు తిప్పికొట్టారు. కనీసం ఆఖరి నిముషంలో అయినా కొద్దిగా ప్రజల పక్షాన నిలబడింది కనుక రెండో స్థానంలో ఉంది.

   భాజపా పరిస్తితి ఇందుకు పూర్తిగా విరుద్దం. చివరి వరకూ బాగానే ఉన్నా, మోడీ పదవీ లాలస & ఆంధ్రా నాయకుల లాబీయింగ్ వల్ల ఆఖరి నిముషంలో తప్పటుడుగు వేసి బొక్కి బోర్లా పడ్డారు.

   Delete
  23. "సీమాంధ్రకు ఒక్క అన్యాయమూ జరగలేదనేవారితో వాదించినా ప్రయోజనం ఉండదు లెండి"

   అలా కొట్టి పారేసే బదులు ఒక్కటి చెప్పండి సార్!

   "రాజధాని నిర్మాణానికి సీమాంధ్రకు ఏమి చేశారో చెప్పండి"

   1953 మొదలుకొని ఇప్పటి దాకా చేసిన వాటి కంటే ఎక్కువే చేసారు కదండీ. ఆంద్ర అభివృద్ధి కోసం ఎంతయినా అడగొచ్చు కానీ ఏది హక్కో ఏది కాదో తెలుసుకోండి. నష్టానికి అన్యాయానికి తేడా గుర్తించడం అవసరం.

   Delete
 5. పనికిమాలిన విగ్రహాలట!
  పెద్దల నా విధంగానేనా దూషిచటం?
  భగవంతుడు కాలస్వరూపుడు. ఈ అవినయానికి ఫలితం తప్పక ప్రసాదిస్తాడు సుమా!

  పనికిమాలినవారు పనిబడి యన్న
  పనికిమాలినమాట పనిగొని తలచు
  పనికిమాలినవారి పాడుబుధ్ధులకు
  పనికిమాలినవారి వలె దోచి నంత
  పనికిమాలినవారె బయటి వారనెడు
  పనికిమాలిన బుధ్ధిభ్రష్టత్వరోగ
  మునజేసి యౌచిత్యమును తెగగోసి
  స్వర్గస్థులైయున్న సత్పూరుషులను
  దోషమెంచక మీరు దూషించినంత
  వారి ఘనతల కేల వాటిల్లు దొసగు
  వారి నామము లేల వాయును కీర్తి
  వారి చెయ్వుల కేల వచ్చును మచ్చ
  వారి మాటల మంచి వసివాడి పోదు
  వారి మాటలు దబ్బరలు గాబోవు
  వారి దార్శనికత వట్టిది కాదు
  వారి దారులు మూతబడి చెడిపోవు
  వారిని కాదని వాగినంతటనె
  వారిస్ఫూర్తికి లోటు వచ్చుట కల్ల
  వారిని పడతిట్టి పండ్లికిలించ
  వారికి వచ్చెడు బాధయు లేదు
  వారి విగ్రహములు పగుల నేయగనె
  వారి జ్ఞాపకములు వాడిపోబోవు
  వారిని కాదను పామరులైన
  వారిని కాలమే పట్టి గ్రసించు
  అన్నోదకంబుల కట్టివారల
  కన్నివిధంబుల నగచాట్లు గలగు
  దుమ్మైన పిదప నా తుళువల గూర్చి
  యిమ్మహి దలచబో రెవ్వరు గాని

  తథాస్తు.

  ReplyDelete
  Replies
  1. నిన్నటి తరం గొప్పవాళ్ళ విగ్రహాల పైన నీకు ఆగ్రహ మేలరా? వాళ్ళ వుసురు తగిలి - కుర్చీ పోయిన మరుక్షణం నువ్వు పనికిమాలిన వాడివి కాకురా!

   ref:http://harikaalam.blogspot.in/2014/10/blog-post.html

   Delete
  2. తిట్లూ శాపనార్థాలూ ఎందుకు గానీ, కానీ కర్చు లేకుండా ముందు మీ వాళ్ళ విగ్రహాలను పట్టుకెళ్ళి కొత్త రాజధానిలో పెట్టుకోండి. ఇంతకు ముందు పెట్టే మనసు లేకపోతే పెట్టక పోయారు గానీ, ఇప్పుడు ఎంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికుల విగ్రహాలు మీ రాజధానిలో పెట్టగలరో పెట్టి చూపండి. అప్పుడు మేం కూడా మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకుని మీరు పెట్టిన వాటికన్నా ఒకటి ఎక్కువ చేసి మీ వాళ్ళ విగ్రహాలు తిరిగి ప్రతిష్టించుకుంటాం. సరేనా?

   Delete
 6. ఇప్పుడీ విగ్రహాల గోల అనవసరం అనిపిస్తోంది. ఈయన ఈ రోజు ప్రతిష్టిస్తాడు. రేపు తెలంగాణలో సీమంద్రులకి ఏదైనా అవడం ఆలస్యం, ఇక్కడ ఈయన ప్రతిష్టించిన విగ్రహాలను ధ్వంసం చేయడానికి కాచుక్కూర్చునే వాళ్ళు చాలానే వుంటారు. ఇక్కడ అయ్యింది కాబట్టి అక్కడ ఇంకొంచెం ఎక్కువ రభస అవుతుంది. ఎందుకుట?

  వారి విగ్రహాల కంటే, వారి గురించి మన తెలుగు పాఠ్యపుస్తకాలలో పొందుపరిస్తే మంచిది.

  ReplyDelete
 7. కారే రాజులు,రాజ్యముల్ గలుగవే,గర్వోన్నతిం బొందరే?వారేరీ సిరి మూటగట్టుక పోవన్ జాలిరే!
  అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యములు!

  ReplyDelete
 8. శాసన సభలో జరిగిన చర్చ.ఇతరులు వ్యతిరేకించలేదు కాబట్టి యదార్ధం క్రిందే లెక్క. కాకపోతే ఈపాటికే అది సభా హక్కుల ఉల్లంఘన క్రింద భావించబడేది.

  ReplyDelete
 9. కారే రాజులు,రాజ్యముల్ గలుగవే,గర్వోన్నతిం బొందరే?వారేరీ సిరి మూటగట్టుక పోవన్ జాలిరే!
  అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యములు!

  ReplyDelete
 10. నేను పై Y Js గారి కామెంట్ తో ఎఖిభవిస్తాను.

  ప్రస్తుతం టాంక్ బండ్ పై ఉన్న 33 విగ్రహాలలో 24 విగ్రహాల చరిత్ర ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ కు చెందినది. తెలంగాణాలో దశాబ్దాలు గడిచినా కూడా అతివాదులు తప్పక ఉంటారు, ఎదో ఒక విషయంలో ఆ విగ్రహాలకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఒక వేల ఒక మామూలు తుంటరి వాడు చిలిపి తనం తో చేసినా కూడా అది రెండు రాష్ట్రాల మద్య మళ్ళి పెద్ద చిచ్చు పెట్ట గలదు.

  ఇప్పుడు నేను చెప్పేది అన్యాయంగా అనిపించవచ్చు కాని రాబోవు రోజుల్లో ఉద్రిక్తలకు స్తానం ఇవ్వొద్దు అంటే, ఆ విగ్రహాలను సగౌరవంగా ఆంధ్ర ప్రదేశ్ కు తరలించటమే మంచి పని నా అభిప్రాయం. రాబోవు రోజులల్ను కూడా ఊహించి నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను, కెసిఆర్ వాదిని అని ఎవరైనా నాకు లేబుల్ వేస్తె అది వారి ఇష్టం.

  ReplyDelete
 11. 2012 సంవత్సరం లో రాజమండ్రి గొదావరి గట్టుపై శ్రీ.పీ.వీ.నరశిం హా రావు గారి విగ్రహాన్ని పెట్టారు ఆయన పేరు మీద పార్క్ కూడా వుంది.
  http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pvs-statue-unveiled/article4233534.ece

  ReplyDelete
 12. పి.వి. ముల్కీ నిబంధనలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి అనే కారణంతో జై ఆంధ్ర ఉద్యమం నడిపి ఆయన్ని పదవి నుంచి దించేసారు. ఇప్పుడు ఆయనకి విగ్రహం పెడితే ఆయన మీద గౌరవం ఉన్నట్టా?

  ReplyDelete
  Replies
  1. లేకపోతే పెట్టలేదంతారు?పెట్టాం అని సాక్ష్యం చూపిస్తే యెప్పటిదో యెత్తి అప్పుడు అవమానించారుగా ఇప్పుదు విగ్రహం పెడితే గౌరవించినట్టా అని మెలిక వేస్తారు, ఇవేమి తంటాలు వొచ్చి పడ్డాయండి?యెందు కొచ్చిన తిప్పలు, అవును ఆంధ్రోళ్లకి తెలంగాణోళ్ళ గొప్పదనం అర్ధం కాలే!గొప్పదనాన్ని నిర్ణయించే స్కేలుబద్దలు తెలంగాణోళ్ల కాణ్ణె వుండె!!సరి పాయే,యెందుకీ తొండి మెలికలు పెట్టే గయ్యాళి మందతో వాదన అమాయక ఆంధ్రా బాబులూ?!

   Delete
  2. జై ఆంధ్ర ఉద్యమం చేసినదే ముల్కీ నిబంధనలు వేర్పాటువాదంతో సమానం అని సందేశమివ్వడానికి. ఆ ఉద్యమం చేసినవాళ్ళు పి.వి.కి విగ్రహం పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత?

   Delete
  3. ఆ తర్వాత యెంతోకాలానికి NTR మన తెలుగువాడు ప్రధాన మంత్రి అవుతున్నాడు, మనం పోటీ పెట్తగూదదు అని దానికి కట్టుబడి వున్నది నీకు యెక్కలేదు గానీ వుద్యమం చెయ్యడమే గుర్తుండి పోయింది నీ మట్టిబుర్రకి!ముందుకు పదవయ్యా ముకుందయ్యా అని మొత్తుకుంటున్నా యాభయ్యేళ్ల నాటి సంగతుల్నే కెలుక్కుంటూ యెనకటయ్యగా వుంటానంటే వుండు - మాకే మంచిది!

   అప్పట్లో NTR కి వున్న సత్తాకి పోటీ పెట్టి వోడిస్తే యెలా వుండేది?అదంతా చేసింది కృష్నా జిల్లా నుంచి వొచ్చిన కమ్మవాడేగా!మరి త్లంగాణా రాజకీయ నాయకులు తమ ప్రాంతం వాడయిన ఆ పీవీకి యేం సపోర్టిచ్చి వొరగబెట్టారు?

   చేతనయితే వున్న గొడవల్ని చల్లార్చే మంచి మాటలు చెప్పు, తెలిసీ తెలియని వాగుడుతో కొత్తగా పుల్లలు పెట్టకు, ఖబద్దార్!!!

   Delete
  4. >>> అప్పట్లో NTR కి వున్న సత్తాకి పోటీ పెట్టి వోడిస్తే యెలా వుండేది?

   అంతగా చెప్పుకోవడానికి ఏమీ లేదు లెండి. 1991 పార్లమెంటు ఎన్నికల్లో ఎపి లో 25 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే కేవలం 13 సీట్లు తెదేపా గెలిచింది. అప్పట్లో నంద్యాల పార్లమెంటు సీటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేసి పీవీని గెలిపించాడు. ప్రధానమంత్రిగా ఉన్న పీవీని మంచి చేసుకుంటే కలిగే లాభాలకు ఆయన లెక్కలు ఆయనవి. ఎలాగూ గెలవలేని సీట్లో పోటీ పెట్టకుండా మంచి చేసుకుంటే కలిగే లాభాలకు ఈయన లెక్కలు ఈయనవి.

   Delete
  5. >>> తర్వాత యెంతోకాలానికి NTR మన తెలుగువాడు ప్రధాన మంత్రి అవుతున్నాడు, మనం పోటీ పెట్తగూదదు

   "మన తెలుగువాడు ప్రధాన మంత్రి అవుతున్నాడు" అనడం సరికాదు. అప్పటికే పీవీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. అప్పట్లో ప్రధాని హోదాలో దేశం మొత్తంలో ఒక సేఫ్ సీటు వెతుక్కోవడం ఆయనకు కష్టమయ్యేది కాదు. కాకపొతే రాజ్యసభ ఎలానో ఉండనే వుంది. ఒకవిధంగా ఆ అవకాశం గంగులకు దక్కింది.

   Delete
  6. శ్రీకాంతాచారి గారు,

   N.T.R కు నిజంగా అంత రాజకీయ లెక్కలు తెలియవని ఆయన్ని దగ్గరగా చూసిన ప్రతివారికీ తెలుసు. ఆయనకు తన మనస్సు చెప్పిందే చేయటం తెలుసు. తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఔన్నత్యం కోసం పరితపించే వ్యక్తిగాబట్టి పి.వి. మీద పోటీ పెట్టలేదు. అంతే గాని ఆయన ప్రధాన మంత్రి గాబట్టి తనకేదో ఒరగబెడతాడని పోటీ పెట్టలేదని, మీరివాళ భావిస్తే ఆయన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారనుకుంటున్నాను. అత్యంత శక్తివంతురాలు, అపరకాళిగా వాజ్ బాయితో పిలవబడ్డ ఇందిరా గాందీ మీదనే మడమ తిప్పని పోరాటం చేసినవాడు, పి.వి.నరసింహారావు ను మంచి చేసుకుంటే కలిగే లాభాలకు లొంగి పోతాడా? ఒక్కసారి ప్రాంతీయ భేధాలు పక్కనబెట్టి మీ మనసు తో ఆలోచించండి, మీకే అర్ధమవుతుంది N.T.R వ్యాపారి లాగా లాభాల లెక్కలు వేసుకునేలాంటి వాడా కాదా అని.

   Delete
  7. @vkbabu

   నా అసలు పాయింటు మీరు అర్థం చేసుకోలేదు. పోటీ పెట్టినా గెలిచే ప్రసక్తి లేనప్పుడు పోటీ పెట్టినా పెట్టక పోయినా పెద్ద తేడా ఏమీ లేదు. స్వార్థం లేకపోయినా కూడా గొప్పదనం ఆపదిన్చాల్సిన అవసరం కూడా లేదు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top