అభంశుభం తెలియని బాలిక.. ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల కళ్లల్లో సంతోషాన్ని నింపిందిఆ చిట్టితల్లి. కానీ.. విధి పగబట్టింది.. ఆ చిన్నారిపై విరుచుకుపడింది. అంతుచిక్కని వ్యాధితో ఉక్కిరిబిక్కిరి చేసింది.. ఆస్పత్రిలో మంచానికే పరిమితం చేసింది. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శిరీజ.. ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా.. ఆ చిట్టితల్లి పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది.. తనకేమవుతుందో తెలియక అల్లాడుతున్న ఆ చిన్నారి.. ఒకే ఒక్క కోరిక కోరింది.. అదే హీరో పవన్ కళ్యాణ్ ను చూడాలని ఉందంటోంది..
ఏడో తరగతి చదువుతున్న శిరీజకు.. కొంతకాలం క్రితం అస్వస్థత చేసింది. డాక్టర్లకు చూపిస్తే.. మెదడుకు సంబంధించిన వ్యాధన్నారు.. దీంతో.. ఆమెను కాపాడుకోవడానికి వీలైనన్ని ఆస్పత్రులు తిప్పారు ఆ తల్లిదండ్రులు. చివరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కూ తరలించారు. అయినా.. పెద్దగా ప్రయోజనం కలగలేదు. తనకు పవన్ -కళ్యాణ్ ను చూడాలని ఉందని.. ఒక్కసారి తీసుకువెళ్లమని ఆమె తండ్రి నాగయ్యను పదేపదే కోరింది.. వ్యాధి తగ్గాక వెళ్దామంటూ సర్దిచెప్పారు. హైదరాబాద్ లో పరిస్థితి మెరుగు కాకపోవడంతో… ఖమ్మంకు తరలించారు.. అప్పటికీ ఆమె అడిగిన మాట.. పవన్-ను చూడాలనే…

ఖమ్మం తీసుకువెళ్లాక శిరీజ పరిస్థితి మరింత దిగజారింది.. ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. కోమాలోకి వెళ్లేముందు కూడా శిరీజ … పవన్ ను చూడాలని ఉందనే చెప్పిందంటున్నారు ఆమె తల్లిదండ్రులు. ప్రస్తుతం కోమాలో ఉన్న తమ బిడ్డకు ఏమవుతుందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

తన బిడ్డ అడిగినప్పుడే.. పవన్ దగ్గరకు తీసుకువెళ్లుండే బాగుండేదని ఆవేదన చెందుతున్నాడు నాగయ్య. ఇప్పుడు శిరీజను కదిలించలేని పరిస్థితి. అందుకే.. హీరో పవన్ కళ్యాణ్ ఒక్కసారి తమ పాప దగ్గరకు రావాలని.. కోరుకుంటున్నారు. ఆయన వస్తే.. శిరీజకు నయమవుతుందేమోనని ఆశపడుతున్నారు..


శిరీజ పరిస్థితి తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ కూడా.. పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేస్తోంది. ఒక్కసారి వీలు చూసుకుని శిరీజను పరామర్శిస్తే.. ఆమె కోరిక తీరడంతో పాటు.. కోలుకునే అవకాశం ఉండొచ్చంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు.

సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు స్పందిచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అభిమాని శ్రీజ(13) ను కలవనున్నారు. శ్రీజ.., పవన్ ను కలవాలని కోరుకుంటున్నట్లు మేక్ ఏ విష్ ఫౌండేషన్ నిర్వాహకురాలు చెప్పారు. అయితే విషయం తెలుసుకున్న పవన్, ఆ చిన్నారిని కలవడానికి సుముఖత వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఆ బాలిక ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.


for original articles please click on below links :
Reactions:

Post a Comment

  1. సినిమా హీరోలపై అంతులేని అభిమానం ఏర్పడడానికి కారణం!?

    ముఖ్య కారణం నాకు తెలిసినంత వరకు సినీ హీరో హీరొయిన్ లంతా కారణ జన్ములు ! వారి వల్ల లోక కల్యాణం ఎంతో జరగ వలసి ఉన్నది . అందు కే దేశం లో అందరికి సినిమా హీరో హీరొయిన్ ల పై అంతు లేని అభిమానం అని ఈ టపా ద్వారా జిలేబి నివేదించు కుంటున్నది !

    జిలేబి

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రాజకీయం రాజ్యాంగం రాష్ట్ర విభజన రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వెంకట రాజారావు.లక్కాకుల వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top