బతుకమ్మ ను అధికారికపండగ చేయడం వల్ల తెలంగాణాకు జరిగే మేలు ఏంటి? • తెలంగాణాలో బతుకమ్మ పండగని గతంలో కంటే హుషారుగా గ్రామ గ్రామానా జరుపుకున్నారు. 
 • ప్రభుత్వం అధికారిక పండగగా ప్రకటించింది. 10 కోట్లు కేటాయించి సంబరాలను జరపడానికి ప్రోత్సాహం అందించింది.

 • సమైక్య రాష్ట్రంలో బతుకమ్మకెందుకు ప్రాధాన్యతనివ్వలేదు?

 • బతుకమ్మ పండగలోని విశిష్టత ఏంటి?


Reactions:

Post a Comment

 1. ఎందుకు మేలు లేదు? పర్యాటకరంగాభివృధ్ధికి ఆనుకూల్యతను పెంచుతుంది. సాంస్కృతికమైన ఏకీకరణకు తోడ్పడుతుంది.

  ReplyDelete

 2. సమైక్యరాష్ట్రంలో ఏ పండుగకీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.నా అభిప్రాయంలో ,ఏప్రభుత్వమైనా మతస్వేచ్చ,సహనం,సమానత్వం పాటిస్తూనే,అధికారికంగా నిర్వహించకపోవడమే మేలు.ఇలాంటి పండుగలకి జనం చాలా ఎక్కువ గ కూడుతారుకాబట్టి,శాంతిభద్రతలు,సక్రమంగా జరపడానికి తగిన బందొబస్తు ఏర్పాటు చెయ్యడం వరకే వారికర్తవ్యం.అధికరులు.మంత్రులు,నాయకులు, వారి వ్యక్తిగత హోదాలో పాల్గోవచ్చును.

  ReplyDelete
  Replies
  1. మీ అభిప్రాయం తో విభేదిస్తున్నాను. వందల కోట్ల డబ్బులున్న దేవాలయా నిర్వహణను తీసుకొనే ప్రభుత్వం, నాలుగు డబ్బులిచ్చి ఒక పండగను నిర్వహించటం లో తప్పు పట్టవలసిన అవసరం లేదు. గ్రామ గ్రామాన ఈ వేడులలు జరగటం వాలన, ఆ పండుగలలో పాల్గొనే వారు వారి స్వత ఊర్లకు వెళ్లి పాల్గోడం జరుగుతుంది. దీనివలన అర్.టి.సి.కి, పల్లెలు, మండలాలలో వ్యాపారం చేసుకొని చిన్న చిన్న వ్యాపారులు ఎంతో లబ్ది పొందే అవకాశం ఉంది. ఇటువంటివి ప్రోత్సహించకపోతే అందరు హైదరాబాద్ లోనో, వారి జిల్లా కేంద్రాలలోనో కూచొని అక్కడే పండగ జరుపుకొంటారు. ఎప్పటిలాగే అక్కడే వ్యాపారం జరుగుతుంది. డబ్బులు పల్లెల వరకు ప్రవహించవు. చేతనైతె అన్ని మతాల వారి ముఖ్యమైన ఒకతో రెండో పందుగలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మంచిదే!

   Delete
 3. పండగలు జరుపుకోవటం అంటే మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవటమే. అవి కాపాడటానికి ప్రభుత్వాలు కూడా ఒక చెయ్యి వేస్తె మంచిదే కదా.

  నేనున్న దేశంలో అనేక దేశాలకు చెందిన ప్రజలు స్థిర పడ్డారు. వారు ప్రతి సంవత్సరం వారి వారి పండగలను చాలా ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలా అనేక దేశాల కొన్ని పండగలు చూసే అవకాశం దక్కింది. అలానే ఆయా దేశాల సంప్రదాయాలు వారి తరువాతి తరానికి అందించబడుతున్నాయి.

  ReplyDelete
 4. అవుట్ డోర్ లో జరిగే సంస్కృతిక పండగలకు ప్రభుత్వం సహకారం అందించటం అవసరం. బోనాలు, సమ్మక్క సారక్క లాంటి ఈవెంట్స్కు ఆల్రెడీ ప్రభుత్వం కొద్దిగా సహకారం అందిస్తుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top