మీరూ ప్రజ కు ప్రశ్నలు పంపాలనుకుంటే వివరాల కోసం ఇక్కడ నొక్కండి.
----------------------------------------------
అంశం : భావ ప్రకటన, మీడియా
ప్రశ్న పంపినవారు : Jai Gottimukkala
------------------------------------------------

Name:Jai Gottimukkala 
E-Mail:
deleted

Subject
:

వార్తా విశ్లేషణలు అందుట్లో కోణాలు 
Message:
ఆంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాం కంపనీ అధికారులను అరెస్ట్ చేస్తానని బెదిరించినట్టు ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాసంస్త కథనంలో చూడండి.

http://zeenews.india.com/news/andhra-pradesh/andhra-pradesh-cm-orders-arrest-of-telecom-officials-to-restore-services_1484342.html

ఒకే వార్తకు ఎలా స్పందించవచ్చో కాస్సేపు చూద్దాం:

1. చంద్రబాబు ప్రజల కష్టాలకు తల్లడిల్లి ప్రజలకు అన్యాయం చేస్తున్న కంపనీలపై కొరడా ఝుళిపించి తన పరిపాలనా దక్షత నిరూపించారు

2. అసలు ప్రైవేటు కంపనీల అధికారులను అరెస్ట్ చేసే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది?

3. నియంతలా అందరినీ బెదిరించి తిట్టడం లాంటి పిచ్చి చేష్టలతో చంద్రబాబు వ్యవహరించడం తుగ్లక్ పాలను గుర్తు చేస్తున్నాయి.

ఎవరెవరు ఎ స్పందన ఎంచుకుంటారో అన్నది ఆసక్తికరం. ఇక్కడ చర్చ అసలు వార్త గురించి కాదని దాని యొక్క విశ్లేషణల కోణం గురించని గమనించ మనవి. 
--------------------------------------------------
*Republished
Reactions:

Post a Comment

 1. నా ఉద్దేశం ప్రకారం జీ న్యూస్ లో వచ్చిన విధంగా నిస్పక్షపాతంగా రావడం సరియైన పధ్ధతి. పత్రిక తన ఎజెండాకు సంబంధించిన వ్యాఖ్యానాన్ని ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలుగా ప్రచురించుకోవచ్చు.

  కాని దురదృష్టవశాత్తు తెలుగు పత్రికల్లో అలాంటి వ్యవహారం లేదు. ఎంతసేపూ వార్తలను వదిలేసి వారి వారి ఎజెండాను వార్తల్లో చొప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి సాధారణ చదువరికి ఏది సరైన వార్తో, ఏది వ్యాఖ్యానమో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది.

  కొన్ని పత్రికల ఎజెండాలు మనకు ముందే తెలుసు. ఉదాహరణకు ప్రజాశక్తి మార్క్సిస్ట్ పాట పాడుతుంది, నమస్తే తెలంగాణా తెలంగాణా పాట పాడుతుంది అని చదివే వాడికి ముందే ఒక అభిప్రాయం వుంటుంది. కాబట్టి వాటిలో వచ్చే వార్తలు ఆ విధంగానే విశ్లేషించ బడతాయని ఊహించి అంతమేరకు వార్తను ఫిల్టర్ చేసుకోవచ్చును. అదే రహస్య ఎజెండా కలిగి బయటికి మాత్రం ఏ ఎజెండా లేనట్టు నటించే పత్రికల వార్తలను ఆ విధంగా ఫిల్టర్ చేయడం కష్టం.

  ఉదాహరణకు పై వార్తా ప్రజాశాక్తిలో ఇలా మారవచ్చు.

  పెట్టుబడి దారుడు స్వలాభాల గురించే ఆలోచిస్తాడు కాని ప్రజాక్షేమం గురించి కాదని ప్రపంచ బ్యాంకు చుట్టూ ప్రదక్షిణాలు చేసే చంద్రబాబుకు ఆలాస్యంగా నైనా అర్థమైనందుకు సంతోషం.

  నమస్తే తెలంగాణలో ఇలా రావచ్చు.

  మెట్రో పనులు ఆలస్యం అయినందుకు మందలిస్తేనే పరిశ్రమలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు టెలికాం అధికారులను అరెస్టు చేయమని ఆదేశించడం ద్వంద్వ నీతి కాదా?

  పైవి చూడగానే అందులోని అంతరార్థం తెలిసిపోతుంది.

  కాని కొన్ని పత్రికలు క్రింది విధంగా రాస్తాయి.

  ఆదేశించింది చంద్రబాబైతే:
  వాతావరణం సహకరించక పోయినా చంద్రబాబు తుఫాను ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మొబైల్ టవర్లు పనిచేయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించి వారిని సమీక్షకు రమ్మని కబురు చేశారు. ఎంతకూ వారు రాకపోవడంతో ఆగ్రహోదగ్రుడైన బాబు అరెస్టు చేసైనా సరే వారిని మీటింగుకి తీసుకు రావలసిందిగా అధికారులను ఆదేశించారు.

  ఆదేశించింది కెసిఆర్ ఐతే:
  సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్న అధికారులను జిల్లా కార్యాలయానికి వచ్చి తనతో చర్చించ వలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. పనుల్లో నిమగ్నమైన అధికారులు రావడానికి కొంత ఆలస్యమైంది. అరగంట వేచి చూసిన కెసిఆర్ "ఏందివయ్య, వాళ్ళను బొట్టుబెట్టి పిలువనంపాల్నా? రానంటే జబర్దస్త్ గ అరెస్టు జేసి గుంజుక రండ్రి" అని పక్కనున్న డిజిపితో దురుసుగా మాట్లాడారు.

  ReplyDelete
 2. వార్తలను వార్తలుగా వ్రాయాలి. విశ్లేషణలను ఎడిటోరియల్ పేజిలో వ్రాయాలి. ఈ తేడాని పాటిస్తే పాఠకులు వార్తలకు విశ్లేషణలకు తేడాను గ్రహించగలుగుతారు.

  ReplyDelete
 3. వార్తాపత్రికను వార్తలకోసమే చూడండి. వార్తలు లేకపోయినా తగినంత ప్రమాణంతో‌ లేకపోయినా ఆవార్తలనూ ఆ పత్రికనూ పట్టించుకోకండి. ఈ‌ రోజుల్లో విశ్లేషణలన్నీ‌ పార్టీల వారీ వ్యవహారాలూ భీకర దూషణభూషణలూ తప్ప నిజమైన సరుకు కాదు కాబట్టి వాటిని చదవకండి - మీ‌ ఆరోగ్యాలకే చాలా మంచిది, పత్రికామేథావులకు దూరంగా ఉండి వలన మీ‌ ఆలోచనలను వాళ్ళ కుళ్ళుతర్కాల కశ్మలం నుండి రక్షించుకోండి - అది కూడా మీ‌ ఆరోగ్యాలకే చాలా మంచిది, శుభం భూయాత్.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top