Reactions:

Post a Comment

 1. మాకు కొత్త రాజధాని వద్దు, అసలు రాజధాని వద్దు

  ReplyDelete
 2. అవసరమే.
  ఎందుకు అవసరం?
  మేము కావాలనుకుంటున్నాం కాబట్టి అవసరం. ఇందులో మరో వాదనకి తావులేదు.

  దాన్ని సాధించడం మావల్ల అవుతుందా, కాదా?
  అవుతుందనే మేము అనుకుంటున్నాం. మాకు తెలుసు అది కష్టమైన పనే అని. కానీ, సాధించగలమన్న నమ్మకం మాకుంది.

  అభివృద్దిలో రాజధాని పాత్ర ఎంత?
  గొప్ప రాజధానులున్న రాష్ట్రాలు అభివృద్దిలో కూడా ముందనజలోనే ఉన్నాయి. పెట్టుబడులను సులభంగా ఆకర్శించగలవు. మంచి రాజధాని ఉండి, అభివృద్దిలో వెనుక బడిన రాష్ట్రాన్ని, పెట్టుబడులను అంతగా ఆకర్షించలేని రాష్ట్రాన్నీ చూపించండి?

  ReplyDelete
 3. గొప్ప రాజధాని వుండాలని అనుకోవడంలో తప్పులేదు. ఆశ పడడంలో అంతకన్నా తప్పు లేదు.

  కాని హైదరాబాదును ఎలా తలదన్నుతుంది అనేదే ప్రశ్న. చారిత్రక వైభవం లోనా అంటే అంతకన్నా గొప్ప చరిత్ర గల ప్రదేశం సీమాన్ధ్రలో ఎక్కడా లేదు. విస్తీర్ణంలోనా అంటే హైదరాబాదు ఇప్పటికే రెండులక్షల ఎకరాల్లో విస్తరించి వుంది, కొత్త రాజధాని కొరకు లక్ష ఎకరాలే సేకరింకాదానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పారిశ్రామికంగా ఐటీ రంగంలోనూ హైదరాబాదు ఎంతో ముందుకు వెళ్ళింది. కొత్త రాజధాని ఆ స్థాయికి చఎరాలన్తె కొన్ని దశాబ్దాలైనా పడుతుంది. ఆలోపు హైదరాబాదు మరింత ముందుకు వెళుతుంది.

  ఇక మిగిలింది ఆధునిక నగరంగా తీర్చి దిద్దడం. కొత్తగా కడుతున్నారు కాబట్టి ఎలాగైనా ఆధునిక హంగులతోనే వుంటుంది అని మనం ఆశించవచ్చు. కాని ఆ ఒక్క లక్షణంతో "హైదరాబాదును తలదన్నడం" సాధ్యం కాదనుకుంటా.

  ReplyDelete
  Replies
  1. 400 సంవత్సరాల వయస్సు ఉన్న హైదరాబాదు ఇప్పటికింకా 200 సంవత్సరాలున్న చెన్నైని ఎందుకు అధిగమించలేకపోతున్నది? కారణాలు ఎవ్వరము చెప్పలేము కాలమే సమాధానం చెపుతుంది.

   Delete
  2. 1. చరిత్ర ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన ప్రాంతం 2300 సంవత్సరాల క్రింతం శాతవాహన సామ్రాజ్యానికి ధరణికోట(గుంటూరు జిల్లా అమవరావతి దగ్గర) ఉన్న ప్రాంతం రాజధాని కాగా మళ్లీ ఇప్పుడు రాజధాని హోదా తిరిగి పొందుతోన్న దక్షణ భారతదేశం లోని ఒకానొక అతి పురాతన జనపదం. విచిత్రమేమంటే ఆ శాతవాహన సామ్రాజ్య పరిధిలో ప్రస్తుత తెలంగాణ ప్రాంతం మరియు మహారాష్ట్ర లోని కొంతభాగం ఉండేవి అప్పుడు ప్రస్తుత హైదరాబాదు నగరం ఆ కాలంలో నిర్జన అటవీ పీఠభూమి( 20 సంవత్సరాల క్రితం జూబ్లిహిల్ల్స్,మాదాపూర్ ప్రాంతం పరిస్తితి అందరికి తెలిసనదే). తెలంగాణాలోని కోటిలింగాల ప్రాంతం కూడా కొంత కాలం శాతవాహన సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నది.

   2. 35 లక్షలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించబడిన ప్రాంతం VGTM (విజయవాడ, గుంటూరు, మంగళగిరి తెనాలి) జనాభా సుమారుగా అంటే ఇంకా పునాది రాయి పడని రాజధాని నగర జనాభా ప్రస్తుత హైదరాబాదు నగర జనాభాలో దాదాపు సగం. ప్రభుత్వభవనలకు మాత్రం కేవలం 30 వేల ఎకరాలను మాత్రమే సేకరనిచాలని ప్రభుత్వం ప్రకటించింది. లక్ష ఎకరాల మాట గాలి వార్తలే.

   3. విజయవాడ విషయానికి వస్తే కనీసం జిల్లాకి కేంద్రం కాకపోయినా ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ లేకపోయిన తనంతతానుగా ఎదిగిన నగరం ఆసియాలోనే అతిపెద్ద బస్సు స్టాండ్ , దేశం లోనే అతిపెద్ద ఆటోమొబైల్ హబ్, దేశంలోనే ప్రముఖ రైల్వే కూడలి, బందరు పోర్టు, గన్నవరం ఎయిర్ పోర్ట్, రానున్న 180 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఇప్పుడు వచ్చిన రాజధాని హోదా మరింత అభివృద్దికి ఇంకేమి కావాలి?

   4. చివరిగా స్థాయి గురించి కొత్త రాజధాని 13 జిల్లాలకు రాజధాని అయితే హైదరాబాదు స్థాయి జూన్ నెల నుండి 23 జిల్లాలనుండి 10 జిల్లాలకి పడిపోయింది.

   ఏది ఏమైనా అందరు బాగుండాలని కోరుకొంటాను ఎందుకంటె సామెత చెప్పినట్టు మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందట ప్రక్కవాడికి ఉందని ఏడిస్తే రొండు కళ్ళు పోయాయట. సకారాత్మకంగా అలోచించటము /ఆశించటము లోను తప్పులేదు.

   Delete
 4. అవును మరి హైదరాబాద్ అనేది భూమి పుట్టినప్పుడు పుట్టింది. అది పుట్టినప్పుడు సీమాంధ్రలో ఎవ్వరూ లేరు. అసలు సీమాంధ్రే లేదు. ఎప్పుడో హైదరాబాదు అనే మహా గొప్ప నగరం పుట్టిన శాతాబ్దాల తరువాత సీమాంధ్రలో ఉన్న ప్రదేశాలు పుట్టాయి. ముందు చరిత్ర చదవండి, తరువాత చారిత్రాత్మిక ప్రదేశాల గురించి మాట్లాడండి.

  హైదరాబాదును రీసెంటుగా నిజాములు పాలించారు. వారు బ్రిటీషువారికి నమ్మిన తొత్తుల్ల ఉండడముతో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే వారికి కొన్ని ఎక్కువ అధికారాలు ఉండడము, బ్రిటీషు వారు కూడా నమ్మిన తొత్తే కదా అని కాస్త తక్కువ దోపిడీ చేయడముతో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ అనేది కొంచెం ఎక్కువ అభివృద్ది చెందింది స్వాతంత్రం నాటికి. (హైదరాబాద్ మాత్రమె, తెలంగాణాలోని మిగ్లిన ప్రాంతాలు కాదు).

  ఇక ఆంధ్రా చరిత్ర కావాలంటే, ముందు "అమరావతి" అనే ప్రాంతం గురించి తెలుసుకోండి. దాని చరిత్రేమిటో తెలుసుకోండి. అశోకుడు అమరావతిలో నిర్మించిన "బౌద్ద స్తూపం" గురించి తెలుసుకోండి. బౌద్ద మతానికి అమరావథికి ఉన్న సంబంధం తెలుసుకోండి. ఇంకో విషయం పనిలో పనిగా "కలింగ రాజ్యం" గురించి, అశోకుడు చేసిన కలింగ యుద్దం గురించి కూడా తెలుసుకోండి. కలింగ రాజ్యం పూర్తిగా అంధ్రా ప్రాంతానికి చెందింది కాకపోయినా, ఉత్తరాంధ్రలో కొంత భాగం కలింగ రాజ్యములో ఉండేది.

  మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత, ఏర్పడిన "శాతవాహణా సామ్రాజ్యం" గురించి తెలుసుకోండి. పరాయి దేశాలు ఆంధ్రావైపు కన్నెత్తి కూడా చూడకుండా ఎన్ని శాతాబ్దాలు వారు పాలించారో తెలుసుకోండి.

  ఇక హైదరాబాదుగురించి మాట్లాడే ముందు దాని చరిత్ర కూడా కాస్త తెలుసుకుని మాట్లాడాండి. శాతవాహనులకీ - హైదరాబాదుకీ గల సంబంధం, తరువాత ఆంధ్రా ఇక్ష్వాకులకీ - హైదరాబాదుకీ ఉందే సంబంధం తెలుసుకుని తర్వాతే, కాకతీయులు, బానిసల్ని పాలించినట్టూ పాలించిన "నిజాముల" దగ్గరికీ రండి.

  శాతవాహనులకీ - నిజాములకీ మధ్య అంతరం చాలా కాలం ఉండడం, అప్పటికి ప్రపంచం చాలా విధాల అభివృద్ది చెంది ఉండడముతో, నిజాములు పాలించిన హైదరాబాద్ ఈ తరానికి చెందినది అవ్వడముతో .. హైదరాబాద్ స్వాతంత్రం నాటికి గొప్పగా కనిపిస్తూ ఉంది. (అది మాత్రమే లెండి, తెలంగానాలోని మిగిలిన ప్రాంతాలు దారుణంగానే ఉన్నాయి). ఎంతైనా కొత్త పట్టనం కాస్త మోడెర్న్ గా ఉంటుందని చరిత్ర గురించి మాట్లాడే మేధావులే అంగీకరించారు కాబట్టి దీని గురించి కష్టపడక్కర్లేదు.

  ఇక హైదరాబాదును మించిన నగరం అంటారా? దాన్ని మించిన నగరం కావాల్సిన అవస్రం లేదు. మరో రెందు మూడు దశాబ్దాలకి ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగరాన్ని మించిన నగరం ఉంటే చాలు. అప్పటికి హైదరాబాద్ కూడా డేవలప్ అయ్యి ఉంటుంది అంటారా? అవనివ్వండి. అసలు హైదరాబాద్ డెవలప్ అవ్వకూడదని మేమెప్పుడూ కోరుకోలేదు. అదేమీ పాకిస్తానులోలేదు, ఇండియాలోనే ఉంది. అది డెవలప్ అయితే సంతోషమే. కాకపోతే మాక్కూడా ఒక మంచి నగరం కావాలి అంతే.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top