ame:కిరణ్  
E-Mail:deleted 
Subject:తెరాసాలో తె.తెదేపా విలీనం అయ్యే అవకాశం, న్యాయపరమైన అంశాలు.  
Message:తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం తె.తెదేపా ఏంఎల్యేలు పదిహేను. అందులో ప్రస్తుతం నలుగురు జంపు. చట్టం ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలి కాని అదే చట్టంలో లొసుగులను ఉపయోగించి(నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్ లో పెట్టడం ద్వారా) వారిని అనర్హులుగా ప్రకటించటాన్ని కొంత కాలం వరకు వాయిదా వేయొచ్చు. ఈ లోగా ఒక వేల ఇంకో ఆరుగురు ఏంఎల్యేలు జంప్ అయితే, మొత్తం జంప్ అయిన ఏంఎల్యేలు పది మంది, అంటే శాసన సభలో మొత్తం తె.తెదేపా సభ్యులలో 2/3. ఈ పది మంది కలిసి తె.తెదేపా ను తెరాసాలో విలీనం చేస్తున్నాం అని ప్రకటించి చట్ట ప్రకారం విలీన ప్రక్రియను పూర్తీ చేసే అవకాశం ఉందా? జాతియా పార్టీలకు చెందిన రాష్ట్ర విభాగాలను రాష్ట్రంలో ఇంకో పార్టిలో ఇలా విలీనం చెయ్యలేరు కాని, ప్రస్తుతం తె.తెదేపా జాతీయ పార్టి కాదు కదా? 
Reactions:

Post a Comment

 1. ప్రశ్న: ఒక రాజకీయ పార్టీ జాతీయపార్టీ అనే సాంకేతిక నిర్వచనం పరిధిలోనికి రానంత మాత్రాన ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయకూడదా?
  జవాబు: ఇప్పుడు తెలుగుదేశంపార్టీ పోటీ చేయటానికి అడ్డు ఏదీ రాలేదు కాబట్టి ఈ‌ ప్రశ్నకు జవాబు మనకి తెలుసును.

  అనుబంధ ప్రశ్న:‌ ఈ తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణా విభాగం దానంతట అది ఒక రాజకీయ పార్టీగా లెక్కించబడుతున్నదా?

  మొదటి ప్రశ్న ప్రకారం ఒకే తెలుగుదేశం‌పార్టీ ఉన్నది. అది రెండు రాష్ట్రాల్లో పోటీ చేసింది. అంతే‌ కాని తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణా విభాగం దానంతట అది ఒక ప్రత్యేక రాజకీయపార్టీ కావటం‌ లేదు.

  అనుబంధ ప్రశ్న: తె.తెదేపా ను తెరాసాలో విలీనం చేస్తున్నాం అని ప్రకటించి చట్ట ప్రకారం విలీన ప్రక్రియను పూర్తీ చేసే అవకాశం ఉందా?
  జవాబు: తె., తెదాపా అనబడే తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణా విభాగం అనేది ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ యే కాదు కదా. వేరొక రాజకీయ పార్టీలో విలీనం కావటం కాకపోవటం అన్నది ఒక రాజకీయ పార్టీ ఇష్టా ఇష్టాలకు సంబంధించినది కాని విడి శాఖలకు సంబంధించినది కాదు. ఇకపోతే శాశనసభ వరకు సంబంధించి, అందులో ఉన్న ఒక పార్టీ తాలూకు సభ్యుల్లో 2/3వ వంతు జనాభా ఒకేగుంపుగా వేరే పార్టీలో చేరిపోతే అది తెలుగుదేశం‌ పార్టీ యొక్క తెలంగాణా విభాగపు శాశనసభా పక్షంలో చీలికక్రిందికి వస్తుంది. చీలి వెళ్ళిపోయిన సభ్యులు శాసనసభా సస్భ్యత్వాన్ని కోలోరు. అంతే. అది మొత్తం తెలుగుదేశం పార్టీలో చీలిక అని నిర్వచించటం కుదరదు. అలా గైతే, మాటవరసకు పది రాష్ట్రాల్లో అదికారంలో ఉన్నపార్టీలో ఒక చోట ఒకవ ర్గం చట్టబధ్ధంగా చీలిపోగానే ఆ పార్టీయే చీలిపోయిందని అనవలసి వస్తుంది - అది పొసగదు కదా.

  ReplyDelete
  Replies
  1. మాటవరసకు పది రాష్ట్రాల్లో అదికారంలో ఉన్నపార్టీలో

   నాకు తెలిసినంత వరకు పది రాష్ట్రాలలో కనీస అర్హత(ఓట్ల మరియు సీట్ల శాతం) కలిగి ఉన్న ఉన్న పార్టి ఒక జాతీయ పార్టిగా గుర్తింపు పొంద బడుతుంది. అటు వంటి జాతీయ పార్టి యొక్క ఏదేని రాష్ట్ర విభాగం ఆ రాష్ట్రంలో వారి పార్టి శాసన సభ్యులలో 2/3 మెజారిటి చూపించి చట్ట పరంగా వేరు పార్టీలోకి విలీనం కాజాలదు.

   కాని విడి శాఖలకు సంబంధించినది కాదు.

   చట్ట పరంగా ఈ శాఖలకు 'ఆ పార్టి యొక్క రాష్ట్ర శాఖ' అని గుర్తింపు ఉన్నదా, ఉంటె అది ఏ రకంగా? తెలుగు దేశం యొక్క తెలంగాణా రాష్ట్ర విభాగానికి ఒక అద్యక్షుడు కూడా ఉన్నట్లున్నాడు. జాతీయ పార్టి గుర్తింపు లేని పార్టిలోని ఆ రాష్ట్ర స్థాయి పార్టి నాయకులకు ఆ రాష్ట్రంలో ఆ పార్టీపై చట్ట పరంగా పూర్తీ హక్కులు ఉంటాయి కదా. అలా వారికి హక్కులు ఉండేది చట్టబద్దమైతే, వారితో పాటు 'తెలుగు దేశం' అనే పార్టిని తీసుకెళ్ళి పొతే చంద్ర బాబు తెలంగాణలో చట్ట బద్దంగా "తెలుగు దేశం" అనే పేరుతొ పార్టిని నిర్వహించ గలరా?

   Delete
  2. కిరణ్ కుమార్ గారు, మీ ధోరణి ప్రకారం ఇప్పుడు తె.తెదేపానుండి హెచ్చుమంది చీలిపోతే తె.తెదేపా రధ్దవుతుంది - ఇంక భవిష్యత్తులో ఎన్నడూ ఎవ్వరూ తెలుగుదేశం అనే పార్టీని తెలంగాణాలో నిర్వహించటానికి చట్టం ఒప్పుకోదు. అంత సులభం కాదేమో అనుకుంటాను. మీ ఆతృత అర్థం చేసుకోవచ్చును. కాని చట్టపరమైన నిబంధనలు ఎలా ఉన్నాయో నాకు పూర్తి అవగాహన లేదు. కాబట్టి ఇంకేమీ వ్యాఖ్యానించను.

   Delete
  3. ఆంగ్లంలో రాస్తున్నందుకు మన్నించగలరు.

   The unit is legislature party (e.g. T-YCPLP), not the registered party (YCP).

   Any other approach would clash with the principle of "supremacy of legislature". You may note the legislative speaker is the ultimate judge on the merger.

   "ఏదేని రాష్ట్ర విభాగం"

   ఏదేని శాసన సభా పక్షం

   Delete
  4. మీ ఆతృత అర్థం చేసుకోవచ్చును.

   శ్యామలీయం గారు, పై మీ వ్యాఖ్యలో మీ ఉద్దేశాన్ని సూటిగా చెప్పగలరా?

   Delete
  5. కిరణ్ కుమార్ గారు నేను ప్రస్తావించిన ఆతృత సాధ్యసాధ్యాలను త్వరగా, నిర్ద్వంద్వంగా తెలుసుకోవాలాన్న మీ కుతూహలాన్ని గురించి. నాకు చట్టం గురించి ఇక్కడ అవగాహన లేదని నేను అన్నాను.

   Delete
 2. తెలంగాణా రాష్ట్రీయ లోక్‌దళ్ (TRLD) BJPలో విలీనం కావడం మన కళ్ళముందే జరిగింది కదా. అనుమానమెందుకు?

  ReplyDelete
  Replies
  1. పోలిక సరి కాదండీ. మన దగ్గర లోక్దళ్ పార్టీకి ఒక్క విధాయకుడు కూడా లేదు. చర్చ జరుగుతున్న ఫిరాయింపు నిరోధక చట్టం ఇక్కడ వర్తించదు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top